Gnanavaahini channel
Gnanavaahini channel
  • 179
  • 14 087 039
Deepavali (జ్ఞాన దీపావళి) | Song Promo | Asweeyuja Pournami Spl | Singer : Nadapriya
జ్ఞానవాహిని శ్రోతలకూ, వీక్షకులకూ అందరికీ అస్వీయుజ పౌర్ణమి మరియు "దీపావళి" పండుగ సందర్భముగా శుభాకాంక్షలు!
దీపమునకు-జ్ఞానమునకు మరియు దీపాగ్నికి-జ్ఞానాగ్నికి అవినాభావ సంబంధము కలదు. యోగమునకు గుర్తు కనుకనే పెద్దలు దైవ పూజా విధానములో "దీపారాధన"కు ముఖ్య ప్రాధాన్యతను ఇచ్చారు.
"సృష్టిలో ఏ లోపమూ లేదు, నీ దృష్టిలోనే లోపము ఉన్నది" అని గురుదేవుని వాక్కు. బాహ్యముగా దృష్టికల్గిన జనులకు అజ్ఞాన చీకటే లోలకముగా మారి, లోపములే దృశ్యములుగా కనిపిస్తుంటాయి. కనుకనే “ఎదుటివానిలో లోపము ఎంచకు, నీ లోపమునే ఎంచుకో!”అని భగవానుడు అన్నాడు. ఇక్కడ నీ "లోపము" ఎంచుకో అనగా "లోపలి పని"నే ఎన్నుకో అని అర్థము వచ్చుచున్నది. దానినే స్వపనము అనగా స్వంత పని అని కూడా చెప్పవచ్చును. నిరంతర ఆత్మచింతయనే ఈ లోపలి పనిని చేయుటకు, దీపము కావలెను. "ధీ" అనగా బుద్ధి, బుద్ధి దగ్గర జ్ఞానభావమును కల్గియుండు విచక్షణయే దీపము.
కనుకనే భగవానుడు గీతలోని విభూతియోగం 11 వ శ్లోకమున తన భక్తులకు బుద్ధియోగమునిచ్చి వారి తలలో "జ్ఞాన దీపమును" వెలుగజేస్తాను అన్నాడు.
జ్ఞానయోగము మొదటి శ్లోకములో ఈ అవ్యయమైన యోగమును మొదట వివస్వుడైన సూర్యునికి తెల్పియున్నాను అని పల్కి, ఆ సూర్యుని అక్షరపరబ్రహ్మయోగములోని 24 వ శ్లోకములో అగ్నిజ్యోతి గా పోల్చారు. అట్టి ఆ సూర్యుడే అచరప్రకృతిలో నిత్యమూ ప్రకాశించే అవ్యయమైన దీపమైన ప్రకృతిశక్తికి (పరమాత్మ ఉనికికి) గుర్తు.
అదే ఉనికే చరప్రకృతియైన జీవదేహములో ఆత్మగా ప్రకాశిస్తున్నది. బ్రహ్మనాడిపై వెలుగొందే ఆ అంతరాత్మదీపమునకు ఆవల ఏడు దీపస్తంభములుగా ఆత్మశక్తి విస్తరించియున్నది. అదే దీపమునకు ఈవల మహాజ్యోతియైన గురుశక్తి యున్నది. ఈ ఆవళి లోనికి అజ్ఞానములను ప్రవేశించనీయని, సుజ్ఞానములను ప్రవేశింపజేయునదైన "ప్రభావళి" కూడా అచటనే ఉన్నది.
కనుకనే శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారు "దీపం-కిరణం-వెలుగు" అను గొప్ప ప్రసంగములో దీప సామీప్యులగు శిష్టులకు గురువు దాపు అని, దీప దూరులగు దుష్టులకు గురువు దవ్వు అని తెలియచేసియున్నారు. దేహ ఆవరణలోకి ప్రవేశించుటకు, దేహమునకు వెలుపలి దీపము పరమాత్మయనీ, దేహమునకు లోపలి దీపము ఆత్మయనే వివరణ తెలిసియుండాలి.
అందుకే పెద్దలు తమ గృహమును దేహముగా భావించి, ఇంటి బయట ఒక దీపమును, ఇంటి లోపల ఒక దీపమును పెట్టి జ్ఞానర్థముతో దీపావళి పండుగగా జరుపుకొనెడివారు. దీనినే "కాంతిపై కాంతియున్నది" అనీ, "ఆత్మాత్మ కాంతియే కాంతు ఆనందగురు అన్యధా !" అని తత్త్వ రూపములో అన్నారు.
నేటికైనా జ్ఞాన జిజ్ఞాసులు, "శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల"వారిచే రచియింపబడిన "మన పండుగలు" అను గ్రంథమునుండి "దీపావళి" అను అంశమును చదివి తలలో జ్ఞానదీపమును, జ్ఞానాగ్నిని వెలిగింపచేసుకొనగలరని ఆశిస్తున్నాము.
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం !
www.thraithashakam.org/publications/telugu/pdf/Mana-Pandugalu.pdf
నేటి కాల విశేషము:
------------------
- అస్వీయుజ పౌర్ణమి
- తేదీ : ౧౭ (17) జీవ దీపమునకు ఈవలియున్న (౧) ఒక కాంతికి, ఆవలి యున్న (౭ ) ఏడు కాంతులకు గుర్తు
- బుద్ధియోగమునకు గుర్తైన బుధవారము తరువాత వచ్చు జ్ఞానదీపమునకు గుర్తైన గురువారము
మరొక ముఖ్యమైన విశేషము ఏమనగా, నేడు "మీరా బాయి జయంతి". ఆమె అసలు పేరు "మిహిరా బాయి" అనగా సూర్యముఖి అని అర్థము.
TEAM:
------
Lyricist - Siva Krishna Kogili
Singer - Nadapriya
Music - Nagesh
Promo Editing - Saleem
Production & Presented By - Gnanavaahini Channel
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము
(12) శ్లో|| 16: బహి రన్తశ్చ భూతానా మచరం చర మేవ చ ।
సూక్ష్మత్వాత్త దవిజ్ఞేయం దూరస్థం చాన్తి కే చ తత్ || (పరమాత్మ)
భావము : చర అచర ప్రపంచముగ జీవరాసుల లోపల బయట పరమాత్మ ఉన్నది. అది సూక్ష్మమగుటచే తెలియబడునది కాదు. దూరముగ మరియు దగ్గరగనున్నదని తెలియుము.
వివరము : కంటికి కనిపించు ప్రపంచమునంతటిని ప్రకృతి అంటాము. కదలెడి ప్రకృతియని, కదలని ప్రకృతియని రెండు రకములుగ ప్రకృతివున్నది. సమస్త జీవరాసుల శరీరములు కదలెడి ప్రకృతియని (చర ప్రకృతియని) పిలువబడుచున్నది. జీవరాసుల శరీరములు మినహాగల సమస్తముయైన గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కదలని లేక మార్పుచెందని ప్రకృతియని (అచర ప్రకృతియని) పిలువబడుచున్నది. జీవరాసులలోపల మార్పుచెందుచు కదలుచున్న చర ప్రకృతియు, జీవరాసుల బయట మార్పుచెందక కదలని అచర ప్రకృతియు రెండు పరమాత్మయేనని చెప్పబడుచున్నది. ఎందుకనగ అణువణువున వ్యాపించినది పరమాత్మయే, కనుక చరాచర ప్రపంచమంతయు పరమాత్మయేనని తెలియాలి.
పరమాత్మ ఇంద్రియములకు తెలియని సూక్ష్మము కావున అది చూపుకు తెలియునది కాదు. జ్ఞానము వలన కూడ సులభముగ తెలియునది కాదు. ధర్మములు తెలిసినవారికి పరమాత్మ చాలా దగ్గరగ గలదు. ధర్మములు తెలియని వారికి చాలా దూరముగనున్నదని చెప్పవచ్చును. ఎందుకనగ ధర్మములు తెలిసినవాడు తొందరలో పరమాత్మను చేరగలడు. కనుక వానికి చాలా దగ్గరగ ఉన్నదని చెప్పవచ్చును. అట్లే ధర్మములు తెలియనివాడు పరమాత్మను ఎప్పటికి చేరలేడు. కనుక వానికి చాలా దూరముగ ఉన్నదని చెప్పవచ్చును.
มุมมอง: 2 662

วีดีโอ

Bhajami .. Guru Lankesaa (భజామి.. గురు లంకేశా) | Video Song - 153 | Dasara Special Song
มุมมอง 24K14 วันที่ผ่านมา
జ్ఞానవాహిని శ్రోతలకు వీక్షకులకు అందరికీ "దశర" పండుగ సందర్భముగా శుభాకాంక్షలు. జ్ఞాన గమ్యమైన "శ్రీలంక"కు ఈశ్వరుడైన ఆ భగవాన్ రావణబ్రహ్మ వారు నాటి త్రైతా యోగములో, శ్రీలంకను ముఖ్య రాజధానిగా ఎన్నుకొని, జ్ఞాన కేంద్రమైన ఇందూదేశములోని (భారత దేశములోని) దక్షిణ ద్రావిడ ప్రాంతమును సుజ్ఞానముతో పరిపాలించడము జరిగింది. ఆ కాలములో భరతదేశ వాసులైన జ్ఞానులు, ఆ లంకేశ్వర చక్రవర్తియొక్క జ్ఞానతేజమును భక్తితో భజించేవారు....
Naa Guru Lankesa.. Bhajami (నా గురు లంకేశా ... భజామి) | Video Song Promo | Dasara Special Promo
มุมมอง 5K21 วันที่ผ่านมา
జ్ఞానవాహిని శ్రోతలకు వీక్షకులకు అందరికీ ముందస్తుగా "దశర" పండుగ సందర్భముగా శుభాకాంక్షలు. దశర పండుగకు దశహరుడైన రావణ బ్రహ్మకు అవినాభావసంబంధము కలదు. దశ ఇంద్రియమయమైన గుణ విషయములను వనమును తన జ్ఞానముతో హరించివేయగల గురుస్వరూపమే శ్రీ రావణ బ్రహ్మ. అట్టి త్రికాల జ్ఞాని, బ్రహ్మ జ్ఞాని, శక్తి నిలయ, జ్ఞానాగ్ని స్వరూపమైన ఆ శ్రీ లంకేశ్వరుడైన దశహరునిపై, ఆయన శ్రేష్ఠత్వమును చాటే జ్ఞాన గీతమును, భరతనాట్య నృత్య రూపక...
Yadbhavam Tadbhavati (యద్భావం తద్భవతి) | Lyrical Song - 152 | Bhadrapada Pournami Spl
มุมมอง 15K21 วันที่ผ่านมา
"భావము" అను ఈ పదము ఈ సృష్టికే బీజమై, తేజమై, రాజమై కొనసాగుతున్న మహా ఆభాస. ఆధ్యాత్మికములో ప్రయాణిస్తున్న జీవునికి శ్రద్ధ, భావము అనునవి రెండు కళ్ళ (లేక కాళ్ళ) వంటివి. రెండు కళ్ళ సమన్వయమే చూపు, రెండు కాళ్ళ సమన్వయమే నడక. ఒక వాహనంలో ప్రయాణము మొదలుపెట్టున వ్యక్తి శీఘ్రముగా సరైన గమ్యమును చేరాలంటే, ప్రయాణించే వేగముతో పాటూ ప్రయాణించే దిశ కూడా సరిగా ఉండాలి. ఇక్కడ జ్ఞానప్రయాణములో వేగము 'శ్రద్ధ' కాగా, దిశ '...
Vandanam Sri Krishna (వందనం శ్రీకృష్ణ మోహనా !) | Lyrical Song - 151 | Sravana Maasa Amavasya Spl
มุมมอง 10K28 วันที่ผ่านมา
జ్ఞానవాహిని శ్రోతలకు, వీక్షకులకూ అందరికీ శ్రావణ అమావాస్య సందర్భముగా శుభాకాంక్షలు! వినయముతో కూడి చేయు వందనము మరియు శ్రీకృష్ణునికి చేయు సాష్టాంగ వందనమును గురించిన సమాచారమును ముందు వచ్చిన వందనము పాట description లో కొంత వరకు చెప్పుకున్నాము. అయితే ఈ గీతంలో మరొక ప్రత్యేకత ఏమి అంటే! "సర్వాంగ వందనము" అను మరొక పదము రావడమే. ఇక్కడ సర్వాంగ వందనమును గమనిస్తే, జీవాత్మ తన శరీర గీత హద్దులోని జ్ఞాన ప్రయాణములో భ...
Rangare Ranga Ranga (రంగరే రంగా రంగా) | Lyrical Song 150 | Singer: Mallikarjun | Gokulashtami Spl
มุมมอง 16Kหลายเดือนก่อน
జ్ఞానవాహిని శ్రోతలకు, వీక్షకులకు అందరికీ శ్రీ గోకులాష్టమి సందర్భముగా శుభాకాంక్షలు! రంగడు అంటే గతులు లేనివాడు అని ... గతులు లేకుండా చేయువాడు అని ముందే తెలిసియున్నాము. "ఆదికర్త"యైన గురువు తన, త్రైత సిద్ధాంత గీతలో ప్రప్రథమ శ్లోకములోనే "గతులు కల్గిన చరప్రకృతి గూర్చియు, గతులు లేని అచరప్రకృతి గూర్చియు" ఏ మాత్రమూ చింతలేని పరమాత్మ స్థితిని సుబోధజేసి .. ఆ పరమస్థితిని పొందుటకు ప్రజ్ఞగల్గిన యోగి ఏ కాలములో...
Vandanam Sri Krishna (వందనం శ్రీకృష్ణ మోహనా !) | Lyrical Video Song - 149 | Singer: Geetha Madhuri
มุมมอง 39Kหลายเดือนก่อน
జ్ఞానవాహిని శ్రోతలకు, వీక్షకులకు అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భముగా శుభాకాంక్షలు! త్రైతసిద్ధాంత భగవద్గీతయందు "3"వ అధ్యాయము జ్ఞానయోగము కాగా, "6"వ అధ్యాయము విజ్ఞానయోగము. ఈ వందనం.. పాట సందర్భానుసారమును చెప్పుకున్న యెడల, "వినయము"తో కూడిన "జ్ఞానమే" విజ్ఞానమగును. ఆత్మకు వంగి చేయునది వందనము, గురువువద్ద వంగి ఉండునది వినయము. వందనము అను పదమును "వన్ ధనము" అని విడదీసిన యెడల, వినయముతో చేకూరు జ్ఞాన ధనమ...
Rangare Rangaa Rangaa! (రంగరే రంగా రంగా!) | Promo | Sravana Moosa Pournami Spl | Singer: Mallikarjun
มุมมอง 8K2 หลายเดือนก่อน
జ్ఞానవాహిని శ్రోతలకూ, వీక్షకులకూ అందరికీ "శ్రావణ మూస పౌర్ణమి" సందర్భముగా శుభాకాంక్షలు ! మరియూ ఆ "శ్రీరంగ" ని ప్రభవమైన "శ్రావణ బహుళ అష్టమి" సందర్భముగా ముందస్తు శుభాకాంక్షలు ! మోక్ష తిథియైన అష్టమికి ... అక్షరాత్మయైన కృష్ణునికి ఎంతో గొప్ప అవినాభావ సంబంధము ఉన్నది. ఆయన పుట్టుక అష్టమి, గర్భము అష్టమి ... అలాగే శ్రీరంగడైన ఆ శ్రీకృష్ణుని ...శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం అనుటలో కూడా నిగూఢ జ్ఞానమున్నదని...
Vandanam Sri Krishna (వందనం శ్రీకృష్ణ మోహనా) | Promo | Singer: Geetha Madhuri | Krishna Ashtami Spl
มุมมอง 9K2 หลายเดือนก่อน
జ్ఞానవాహిని శ్రోతలకు వీక్షకులకు అందరికీ "శ్రీ కృష్ణ జన్మాష్టమి" సందర్భముగా శుభాకాంక్షలు. శ్రీ కృష్ణ పరమాత్ముని యొక్క కలియుగాంశమైన "శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల" వారి దివ్య ఆశీస్సులతో, భగవద్గీతకు త్రైతమనే నిజ సిద్ధాంతము జతపడి నేడు అది "త్రైతశకము"గా ఏర్పడియున్నది. ఈ త్రైత శకమున పూర్వమునుండి భగవానుడు భువికి అందించిన జ్ఞానమంతా పునఃప్రచారమవడమే కాక, మధ్యాత్మ యోగ పురుషుని మహాత్తువలన ఎంతో ...
Guru Naamam !!! (గురు నామమే నా చెంతనుంటే) | Lyrical Song-148 | Aadivaara Guru Pournami Spl Song
มุมมอง 30K2 หลายเดือนก่อน
"ఆనంద గురు" పౌర్ణమి శుభాకాంక్షలు ! మునుపు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భముగా వచ్చిన గీతములో పంచాక్షరిని పఠించమని, ఇపుడు గురు పౌర్ణమికి వచ్చిన గీతములో గురు నామమును జపించమని చెప్పుచున్నట్లు కనిపించుచున్న ఈ గీతములను విని, నిజ జ్ఞానమును తెలుసుకోవాలి అనుకొనుచున్న వారికి కొంత సంశయము ఏర్పడవచ్చును. అది ఏమనగా! వేమన యోగి గారు ఒక పద్యములో.. "కార్యము చెప్పువాడు కడగురువు, మంత్రము చెప్పువాడు మధ్యముండు, ఊరకుండు మనువా...
Thraitham lone (త్రైతంలోనే ఉంది జ్ఞానామృతం) | Lyrical Song-147 | Ashadha Pournami Guruvaram Spl Song
มุมมอง 16K3 หลายเดือนก่อน
పరాత్పరుడైన ఆ అపరబ్రహ్మ యొక్క బ్రహ్మ సంకల్ప బలము చేత యోగ స్థితిలో ఏర్పడిన ఈ సృష్టి, జీవభ్రాంతి చేత వియోగ స్థితిలో ప్రతిబింబిస్తున్నది. నేడు ఈ సృష్టిలో ప్రతి జీవి వియోగమునే అనుభవించుచున్నాడు. వియోగము అనగా దుఃఖము లేక యడబాటు. వియోగము మూడు భాగములుగా గలదు. 1. వియోగము పొందిన వ్యక్తి, 2. దేనినుండైతే విడిపోయాడో ఆ శక్తి, 3. వియోగమునకు కారణమైన కుయుక్తి. వియోగమునకు వ్యతిరిక్తమైనది "యోగము" అనగా కలయిక. ఈ యో...
Panchakshari Mantram (పంచాక్షరీ మంత్ర పఠనమ్ము) | Lyrical Song - 146 | Jyeshta Pournami Spl Song
มุมมอง 15K3 หลายเดือนก่อน
భువిపై జీవిస్తున్న సర్వ భూతములకూ "జ్యేష్ఠ పౌర్ణమి" సందర్భముగా శుభాకాంక్షలు! నేడు ఈ త్రైతశకమున మహాజ్ఞానశక్తి సంధాయకమైన "పంచాక్షరీ మంత్రము" జ్ఞానవాహినిలో గీత రూపమున మనముందుకు రావడము ఎంతో అదృష్టమని చెప్పవచ్చును. ఎన్నో జన్మల సుకృతముంటేనే తప్ప ఈ పంచాక్షరిని ఎవరూ పఠించలేరు. ఆధ్యాత్మిక ప్రయాణము జేసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మము గారి ఆత్మజ్ఞాన జీవితమును పరిశీలించిన యెడల, ఆయన జీవితములో అధిక శాతము అజపమంత్ర...
Guru Namame (గురు నామమే!) | Song Promo | Mangala varam (Guru Pournami) Spl Promo | Singer: Dhanunjay
มุมมอง 9K4 หลายเดือนก่อน
జ్ఞానవాహిని శ్రోతలకూ, వీక్షకులకూ అందరికీ "గురు పౌర్ణమి" సందర్భముగా ముందస్తుగానే శుభాకాంక్షలు. గురు నామాలంకృతమైన ఈ "గురు పౌర్ణమికి", నేటి ఈ త్రైతశకంలో ఎంతో ప్రాధాన్యత చేకూర్చబడినది. దానికి కారణము ఆదినుండి అణిగియున్న అత్యంత అద్భుతమైన "గురు" గుహ్యములన్నియూ నేటి ఈ త్రైతమున సిద్ధాంత వరముగా మనకు అందజేయబడ్డాయి. జగద్గురువే సద్గురుమూర్తిగా వెలిసి బోధించిన ఈ "గురు జ్ఞానము" మహా శక్తివంతమైనది. అట్టి ఆ "గుర...
Aham Brahmasmi (అహం బ్రహ్మాస్మి) | Lyrical Song - 145 | Om Sri Ravana Brahma | Sunday special Song
มุมมอง 19K4 หลายเดือนก่อน
ఓం శ్రీశ్రీశ్రీ రావణ బ్రహ్మాయ నమః ఆదిపురుషుడైన శ్రీ రావణబ్రహ్మ వారి నుండి ప్రసరింపబడిన జ్ఞానాగ్నితో రచియించిన ఈ గీతము ద్వారా సృష్టికే మూలమైన నాలుగు మహావాక్యములను ప్రస్తావించడము జరిగినది. ఒక విధముగా చెప్తే ఆ వాక్యములను ప్రస్థాపించడము కూడా జరిగినది అని చెప్పవచ్చును. అయమాత్మా బ్రహ్మ, తత్త్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ... అను ఈ నాలుగు మహావాక్యములను యోగీశ్వరులవారు తన ప్రవచనములలోనూ తన ప్రరచ...
Sunna (సున్నాలో సూక్ష్మం-మోక్షం) | Lyrical Song - 144 | Vaishakha Buddha Poornima Spl Song
มุมมอง 19K4 หลายเดือนก่อน
మానవునియొక్క మనో జ్ఞప్తికి గోచరాగోచరమై నిలిచియున్న ఈ సమస్త విశ్వము, జగతి మరియు ప్రపంచ రూపములో ఒకనాడు సృష్టింపబడినదియని చెప్పవచ్చును. ఈ సమస్త సృష్టి లేని కాలములో ఏమి లేని ఆ విధానమును సున్నా లేక సూన్యము అని అనుకొనుట సహజమే కానీ అలా చెప్పుటకు కూడా వీలు లేకుండా అక్కడ ఈ సృష్టిని ఏర్పరిచిన శక్తి ఏదో నిలిచియున్నది అని ఆధ్యాత్మిక విధానములో అర్థమగుచున్నది. అది ఏదో వున్నా లేనట్లే కావున, నేడు సృష్టిలో వున్...
Allah tho Savasam (అల్లాహ్ తో సావాసం) | Lyrical Song - 143 | Chaithra Amavasya Special Song
มุมมอง 18K5 หลายเดือนก่อน
Allah tho Savasam (అల్లాహ్ తో సావాసం) | Lyrical Song - 143 | Chaithra Amavasya Special Song
Allaah tho Saavaasam (అల్లాహ్ తో సావాసం) | Song Promo | "Ramjaan" Special Trailer | Singer Shreedeep
มุมมอง 6K6 หลายเดือนก่อน
Allaah tho Saavaasam (అల్లాహ్ తో సావాసం) | Song Promo | "Ramjaan" Special Trailer | Singer Shreedeep
Idele Devuni Pratirupam (కృతయోగములో...) | Lyrical Song - 142 | శ్రీ గురుస్వామి జన్మదినం | యోగాది
มุมมอง 32K6 หลายเดือนก่อน
Idele Devuni Pratirupam (కృతయోగములో...) | Lyrical Song - 142 | శ్రీ గురుస్వామి జన్మదినం | యోగాది
Jagadaananda Kaaraka (శ్రీ ప్రబోధానంద నాయకా) | Lyrical Song - 141 | Swami Birthday Spl Song
มุมมอง 29K6 หลายเดือนก่อน
Jagadaananda Kaaraka (శ్రీ ప్రబోధానంద నాయకా) | Lyrical Song - 141 | Swami Birthday Spl Song
Ee Geetalone (ఈ గీతలోనే ఆ గీత సారం) | Lyrical Video Song - 140 | Phalguna Pournami and Holi Spl Song
มุมมอง 29K6 หลายเดือนก่อน
Ee Geetalone (ఈ గీతలోనే ఆ గీత సారం) | Lyrical Video Song - 140 | Phalguna Pournami and Holi Spl Song
ee Geetalone .aa Geeta Saaram (ఈ గీతలోనే .ఆ గీత సారం) | Song Promo | Thraitha Siddhanta BhagavadGita
มุมมอง 6K7 หลายเดือนก่อน
ee Geetalone .aa Geeta Saaram (ఈ గీతలోనే .ఆ గీత సారం) | Song Promo | Thraitha Siddhanta BhagavadGita
Sivanandalahari (శివానందలహరి) | Lyrical Video - 139 | Singer: Vagdevi | Mahaa Siva Raathri Spl Song
มุมมอง 29K7 หลายเดือนก่อน
Sivanandalahari (శివానందలహరి) | Lyrical Video - 139 | Singer: Vagdevi | Mahaa Siva Raathri Spl Song
Pandugaa Maarela (పండుగా మారేలా) | Lyrical Song - 138 | Singer: MM Sreelekha | Maagha Pournami Spl
มุมมอง 23K7 หลายเดือนก่อน
Pandugaa Maarela (పండుగా మారేలా) | Lyrical Song - 138 | Singer: MM Sreelekha | Maagha Pournami Spl
Sivaananda Lahari (శివానందలహరి) | Song Promo | Singer: Vagdevi | Sivaraatri Spl Promo
มุมมอง 8K8 หลายเดือนก่อน
Sivaananda Lahari (శివానందలహరి) | Song Promo | Singer: Vagdevi | Sivaraatri Spl Promo
Panduga Marela (పండుగా మారేలా..) Song Promo | Singer : MM Sreelekha | Maagha maasam Spl Promo
มุมมอง 5K8 หลายเดือนก่อน
Panduga Marela (పండుగా మారేలా..) Song Promo | Singer : MM Sreelekha | Maagha maasam Spl Promo
Vemanna Padyalu Vivarinchamante (వేమన్న పద్యాలు వివరించమంటే) | Lyrical Song - 137 | Vemana Jayanti
มุมมอง 38K8 หลายเดือนก่อน
Vemanna Padyalu Vivarinchamante (వేమన్న పద్యాలు వివరించమంటే) | Lyrical Song - 137 | Vemana Jayanti
Vemana Jayanti Promo | Bhogi-Sankranti Spl Trailer | Jan-19 Spl | Singer - Sri Krishna
มุมมอง 5K9 หลายเดือนก่อน
Vemana Jayanti Promo | Bhogi-Sankranti Spl Trailer | Jan-19 Spl | Singer - Sri Krishna
Yededu Deepa Sthambalapai (ఏడేడు దీప స్తంభాలపై) | Lyrical Song - 136 | Chrismas Spl Song | Dhanunjay
มุมมอง 58K9 หลายเดือนก่อน
Yededu Deepa Sthambalapai (ఏడేడు దీప స్తంభాలపై) | Lyrical Song - 136 | Chrismas Spl Song | Dhanunjay
Prabhu Yesu Jananam (ప్రభు ఏసు జననం) | Lyrical Song - 135 | Christmas (Jesus Reincarnation) Spl Song
มุมมอง 19K9 หลายเดือนก่อน
Prabhu Yesu Jananam (ప్రభు ఏసు జననం) | Lyrical Song - 135 | Christmas (Jesus Reincarnation) Spl Song
Yededu Deepasthabalapai (ఏడేడు దీపస్థంబాలపై..) | Promo | Singer : Dhanunjay | Christmas SPL
มุมมอง 9K10 หลายเดือนก่อน
Yededu Deepasthabalapai (ఏడేడు దీపస్థంబాలపై..) | Promo | Singer : Dhanunjay | Christmas SPL