ee Geetalone .aa Geeta Saaram (ఈ గీతలోనే .ఆ గీత సారం) | Song Promo | Thraitha Siddhanta BhagavadGita

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 มี.ค. 2024
  • “గీత" అనే పేరు వినగానే, భగవద్గీత గ్రంథము తప్పక గుర్తుకు వస్తుంది. కానీ, ఆ గీతలో తెలుపబడిన జ్ఞానము, ధర్మమూ మాత్రం గుర్తువచ్చుటకు అవకాశం తక్కువేనని చెప్పాలి. ఇప్పటికి దాదాపు 5150 సంవత్సరములకు పూర్వము ఆ శ్రీ కృష్ణ భగవానుడు ద్వాపరయోగములో అందించిన గీతను, నేటికి భూమిపై ఎందరో మనుషులు తమ భాషలోనికి అనువదించే క్రమములో, తమ భావములనే గీతా భాష్యముగా చేసి చెప్పియున్నారు. కనుకనే, అట్టి గీతలలో వేదముల యొక్క, పురాణముల యొక్క, మతాభిమానము యొక్క భావములు ఇమిడిపోయి, దేవుని భావము సన్నగిల్లిపోయి, అవసానదశకు వచ్చియున్నది. ఈ నేపధ్యములో భూమిపై "నిజ గురువు" మళ్ళీ పుట్టి పూర్తి "శాస్త్రబద్ధము"గా భగవద్గీతను వ్రాయడము జరిగినది. అదియే "త్రైత సిద్ధాంత భగవద్గీత".
    "గీత" అంటే ఎందరో పెద్దలు ఎన్నో అర్థములు చెప్పివున్నారు. కాని మనందరికి సులభముగ తెలిసిన పద్ధతిలో "గీత" అంటే "హద్దు" అని తెలుసు. రామాయణములో ఒకనాడు లక్ష్మణుడు కూడ ఈ గీతను దాటవద్దని ఒక హద్దును ఏర్పరచి అడవిలోకి పోయాడని అందరికి తెలుసు. అలాగే ఈ గీతలో ఉంటే జీవత్వమునకు అర్థముందని, ఈ గీత దాటితే మానవత్వమునకే అర్థములేదని భగవంతుడు ఏర్పరచిన హద్దునే "భగవద్గీత" అంటున్నాము. లక్ష్మణుడు ఆనాడు పుల్లతో భూమి మీద గీచి దీని లోపలుంటే రక్షణ ఉంటుందని, ప్రమాదము ఉండదని, దీనిని దాటకూడదని సీతకు చెప్పాడని చరిత్రలో ఉన్నది. అలాగే భగవంతునిగ ఉద్భవించిన పరమాత్మ మాటలతో జీవత్వమునకు హద్దు ఏర్పరచి ఈ హద్దు మీరితే మానవత్వమునకు అర్థమే లేకుండ పోవునని, ఈ హద్దులో ఉన్నంతవరకు జీవత్వమునకు అర్థముంటుందని, ఈ గీతలోపలుండు వానికి దైవత్వము ప్రాప్తించునని తెలుపుచు క్రమపద్ధతిగ గీచిన గీతయే "భగవద్గీత".
    సరిహద్దును పరిశీలిస్తే అది ఏ దేశమైనది, అందులోని చట్టము ఏమిటి అన్నది తెలియును. అట్లే శరీరహద్దును పరిశీలిస్తే అది ఏ దేహమైనది, దానిలోని ధర్మమేమిటన్నది తెలియును. చట్టమేమిటన్నది దేశ హద్దును చూస్తే తెలియునట్లు, ధర్మమేమిటన్నది దేహ హద్దును చూస్తే తెలియును. నీ శరీరములోపలి ధర్మములేమిటో తెలియాలంటే శరీర గీతలోపలే తెలియాలి. దేహము లోపల గల స్థూల సూక్ష్మ వివరములను తెలుపునదే గీత, అదియే భగవద్గీత. భగవద్గీతలోని ప్రతి శ్లోకము శరీరపరిధిలోని ధర్మములనే తెలియజేశాయి తప్ప ఏ శ్లోకము శరీర పరిధి దాటి చెప్పలేదు. శరీరపరిదియే ధర్మములకు నిలయమైనది, కావున పరిధిలోపలనే చెప్పబడిన దానిని గీత అన్నారు. దేవుడు భగవంతుని రూపములో చెప్పినది కావున దీనిని భగవద్గీత అన్నారు.
    కావున, నా శరీర గీతలోనే, ఆ దైవ గీతా సారమును పూర్తిగా తెలిసి తరించేలా... నా కొరకు ఆ పరమాత్మయే ఆనంద గురువుగా జనియించి, తన త్రైతమును ప్రబోధ గీతగా నాకు అందించినందుకు ... ఆ జగద్గురువుకివే నా సాష్టాంగ దండ ప్రణామములు !!!
    thraithashakam...
    thraithashakam...
    TEAM:
    ----------
    Lyrics : Srinath Shresty , Janagam, T.S.
    Singer : S.P Radhika , Jammi kunta, T.S.
    Music : R.Wilson (Vigna Studios) Warangal.
    Editing : DreamWorks Vfx WARANAGAL
    Thumbnail Design - Kishore P
    Review & Coordination - Gnanavaahini Team
    Production - Gnanavaahini
    Presented By - Gnanavaahini Channel

ความคิดเห็น •