Vandanam Sri Krishna (వందనం శ్రీకృష్ణ మోహనా) | Promo | Singer: Geetha Madhuri | Krishna Ashtami Spl

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ส.ค. 2024
  • జ్ఞానవాహిని శ్రోతలకు వీక్షకులకు అందరికీ "శ్రీ కృష్ణ జన్మాష్టమి" సందర్భముగా శుభాకాంక్షలు.
    శ్రీ కృష్ణ పరమాత్ముని యొక్క కలియుగాంశమైన "శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల" వారి దివ్య ఆశీస్సులతో, భగవద్గీతకు త్రైతమనే నిజ సిద్ధాంతము జతపడి నేడు అది "త్రైతశకము"గా ఏర్పడియున్నది. ఈ త్రైత శకమున పూర్వమునుండి భగవానుడు భువికి అందించిన జ్ఞానమంతా పునఃప్రచారమవడమే కాక, మధ్యాత్మ యోగ పురుషుని మహాత్తువలన ఎంతో ఉత్తమ జ్ఞానము జ్ఞానతత్పరులకు అందించబడుచున్నది.
    ఈ నేపథ్యంలో భాగముగా, ప్రబోధాశ్రమము వారి అనుబంధ సంస్థలైన 'ప్రబోధ సేవా సమితి' మరియు 'ఇందూ జ్ఞాన వేదిక' వారి ఆధ్వర్యములో, ఒక్క భారతదేశమే కాక వివిధ దేశములలో... జగద్గురువైన శ్రీ కృష్ణ భగవానుని యొక్క జన్మాష్టమి వేడుకలు ఘనముగా నిర్వహించబడబోతున్నాయి... ఈ పండుగలో పాల్గొనబోతున్న సర్వ ప్రజలకు ఇవే మా శుభాకాంక్షలు !!!
    thraithashakam...
    thraithashakam...
    thraithashakam...
    TEAM:
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Geetha Madhuri
    Music - Nagesh
    Co-ordination - NR Chaitanya Kumar, Nandini
    Video Composition - Saleem
    Production & Presented By - Gnanavaahini Channel
    జ్ఞానవంతుడు ఎన్నో జ్ఞాన జన్మలెత్తిన పిదప, తుదకు పురుషోత్తముడైన ఆ వాసుదేవుడే సర్వమని తెలిసే అత్యున్నతమైన జ్ఞానము లభించును. అట్టి జ్ఞానమే శ్రీ "ప్రబోధ గీత", ఈ గీత కొరకే కళ్యాణ కృతులైన జ్ఞానులు వేచిచూస్తుంటారు ... దీనికొరకే జ్ఞానసుకృతులైన యోగులు పరితపిస్తుంటారు... ఈ భాగ్యము కొరకే సర్వ సంకల్ప పరిత్యాగులైన శిష్యులు ... ప్రయత్నిస్తుంటారు ... ! అట్టి ఈ మహోన్నతమైన భగవంతుని రాత ... ప్రబోధగీతగా మారి... గురుగీతగా మన హృదయాన చేరియున్నది.
    దీనిని అందుకొనుటకు సత్వరపడండి ... సత్త్వముగొనండి ... సత్తుగా మారండి !!!
    శ్రీ కృష్ణం "వందే" జగద్గురుమ్ !!!
    గమనిక: అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన గల ఎనిమిదవ నామం అని అర్థం. తిథులలో అష్టమి అనునది మోక్షమునకు గుర్తు. అదే విధముగా ఈ అష్టమి అనునది శ్రీ కృష్ణునికి ఎంత ప్రాముఖ్యమో మనకి తెలుసు, అలాగే ఈ అష్టోత్తర శత నామం కూడా ఆ జగద్గురువుకే వర్తించవలెను. అప్పుడే అది నిజమైన గురునామం కాగలదు.
    విశేషము : ఈ సంవత్సర శ్రీ కృష్ణష్టామి పండుగ 26 - 08 - 2024 న రానున్నది. ఈ వార, మాస, వత్సరములలోని సంఖ్యలను ఏక సంఖ్యగా కూడితే 8 - 8 - 8 గా ఏర్పడుతున్నది. ఇది ఆధ్యాత్మికముగా ఎంతో నిగూఢముగానూ... విశేషముగానూ అగుపిస్తున్నది. (ఈ రోజు కూడా 11 వ తారీఖు (మహర్షయ సప్త చతుర్ మనవః కి గుర్తు)... అదివారము .. తిథి శ్రావణమాస శుక్లపక్ష భాను సప్తమి ముగియనున్న అష్టమి.).

ความคิดเห็น •