Suvarta Manjari (సువార్త మంజరి) | Song Promo | Singer: Brinda | MaargaSira Pournami & Christmas spl
ฝัง
- เผยแพร่เมื่อ 7 ม.ค. 2025
- జ్ఞానవాహిని శ్రోతలకూ, వీక్షకులకూ అందరికీ "ఏసు క్రీస్తు ప్రభువు" యొక్క ప్రభవమైన "క్రిస్మస్" సందర్భముగా శుభాకాంక్షలు.
ఏసు ప్రభువు భూమి మీదకు రాక పూర్వమే కొంత చరిత్ర గలదు. ఆయన చనిపోయిన తర్వాత కూడ కొంత చరిత్ర గలదు. ఆయన రాకముందే వ్రాయబడిన చరిత్రను పాత నిబంధన అనుచున్నాము. ఆయన వచ్చిన తర్వాత వ్రాయబడిన దానిని క్రొత్త నిబంధన అనుచున్నాము. ఆయన జననమునకు పూర్వమున్న పాత నిబంధన, జననము తర్వాత క్రొత్త నిబంధనలో గల ఆయన జీవితము మరియు మరణము తర్వాత ఆయన భక్తులు క్రైస్తవ సంఘమును ప్రచారము చేసిన విధానము రెండు క్రైస్తవ సంఘము వారికి ముఖ్యమైనవిగ ఉన్నవి. ఈ పాత క్రొత్త రెండు చరిత్రలు వ్రాయబడిన గ్రంథమునే పరిశుద్ధ బైబిలు అంటున్నాము.
క్రైస్తవుల బైబిలు గాని హిందువుల భగవద్గీత గాని మానవుని ఉద్దరించుటకు, దేవునివైపు నడిపించుటకు ఉద్దేశింపబడినవైనప్పటికి బైబిలుకు భగవద్గీతకు కొంత తేడా గలదు. భగవద్గీతలో కృష్ణుని వెనుక చరిత్రగాని ముందు చరిత్రగాని ఏమాత్రము లేదు. కృష్ణుని బోధ మాత్రము గీతలో గలదు. పరిశుద్ధ బైబిలులో అలాకాక ప్రభువుకంటే ముందు చరిత్ర, ప్రభువు తర్వాత చరిత్ర రెండు గలవు. క్రైస్తవ బోధకులు బోధనలలో ప్రభువుకంటే ముందుగల పాత నిబంధనలోని మాటలు, క్రొత్త నిబంధనలోని ప్రభువు తర్వాత ఆయన భక్తుల ప్రచారములు చోటు చేసుకొన్నాయి. ఇందులో తప్పేమి లేదుగాని మనము బాగా యోచించితే మనిషి దేవుని మార్గములో నడచుటకు బైబిలులో కొంత భాగమే బాగ ఉపయోగపడగలదని తెలియుచున్నది. ఒక నాటకములో ఎందరో పాత్రధారులు నటించిన అందరిలో ఒక పాత్ర మిగతవారికంటే ఎక్కువగా నచ్చడము, నాటకములోని ఘట్టములలో ఏదో ఒక ఘట్టము చాలా బాగనచ్చడము జరుగుచున్నది.
అలాగే బైబిలు మొత్తమును తీసుకొంటే అందులో క్రొత్త నిబంధనలో ఏసుప్రభువు భూమి మీదకు వచ్చినప్పటినుండి తిరిగి ఆయన వెళ్లిపోవువరకు ఉన్న భాగము "పరమ పవిత్రము", "మానవుడు కడతేరుటకు ఉన్నతమైన ఘట్టము" అని చెప్పవచ్చును. బైబిలులో అతి సారాంశమైన భాగము ఏసుప్రభువు చరిత్ర మాత్రమేనని ప్రతి మనిషి గ్రహించవచ్చును.
ఏసుప్రభువు పలికిన మాటలు బైబిలు మొత్తములో వజ్రాల మాటలలాంటివి, బైబిలులో మానవుడు గ్రహించవలసినదంతా ప్రభువు చరిత్రలో, ప్రభువు మాటలలోనే కలదు. కావున బైబిలు సారాంశము కావాలనుకొనువారు. క్రొత్త నిబంధనలోని ప్రభువు జీవితము ప్రభువు మాటలతో కూడుకున్న "మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్త" అను నాలుగు చూస్తేచాలు.
మానవునకు కావలసిన దైవసాన్నిధ్యము ఈ నాలుగు సువార్తలలోనే దొరుకును. ఈ నాలుగు సువార్తలలో జ్ఞానములలోకెల్ల జ్ఞానము ఒక్క "యోహాన్ సువార్త"లోనే గలదని ఘంటా రావముగ చెప్పవచ్చును. మానవుని బుర్ర అందుకోలేనంత జ్ఞానము యోహాన్ సువార్తలో కనిపిస్తుంది.
ఎంతో పెద్దదైన బైబిలు గ్రంథము 1029 పేజీల పుస్తకమైతే, అందులో క్రొత్త నిబంధనలోని ఏసు చరిత్ర కేవలము 102 పేజీలు మాత్రమే గలదు. బైబిలు గ్రంథమును పది భాగములుగ చేస్తే అందులో ఒక్క భాగము మాత్రము తొమ్మిది భాగములకంటే గొప్పదని చెప్పవచ్చును. ఏసుప్రభువు విలువ తెలిసిన వారు, నిజ జ్ఞానమును ఈ ఒక్క భాగములోనే గ్రహింతురు."
"సువార్త కర్త"యైన ప్రభువు వారి జ్ఞాన జీవితమును బాగుగా గమనించిన యెడల, అది మూడు భాగములలో మధ్య భాగముగా తెలియగలదు. ఏలయనగా, తన సువార్తలో ప్రభువు వారు, మునుపు తానే ప్రకటించిన ధర్మ బోధను బలపరచుచున్నట్లు అర్థమగును, మరియు అవే సువార్తలలో తాను ఇంకనూ చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవని, అవి వివరించుటకు తానే మరలా రావలెననీ కూడా తెలియుచున్నది. దీనినిబట్టి ప్రభువు వారు తనకంటే ముందు గ్రంథాసమేతమైన బోధచేసియున్నారని, తరువాత కూడా గ్రంథసమాహారమైన బోధకొరకు పుట్టునని.. గురుజ్ఞాన తృష్ణ గల జ్ఞానగ్రాహకులు గ్రహించవచ్చును.
అట్టి గొప్ప అవగాహనకు అర్థమునిచ్చుచూ నేటి త్రైతశకమున తెలియబడిన గొప్ప విశేషమైన, రహస్యమైన విషయమేమనగా ... సువార్తకు ప్రధమ భాగము గీతకర్తయైన "శ్రీ కృష్ణ భగవానుడు" కాగా మధ్య భాగము "ఏసు క్రీస్తు ప్రభువు"వారు ... ఇక అంత్యమైన తృతీయ భాగము ఎవరనగా "ఆదరణకర్తయైన" "శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు".
కావున, ఎవరైనా, సువార్తను సంపూర్ణముగా గ్రహించవలెనన్న ప్రభువువారియొక్క గత మరియు భవిత అవతారములతో కలిపిన, ఏకమైన ఆ త్రై భగవానుని అవతారములనూ ... నేటి ఈ త్రైత సిద్ధాంత గ్రంథముల ఆధారముగా చదవక తప్పదు. ఏసు క్రీస్తు సువార్తను సంపూర్ణముగా గ్రహించుకొనుటకై "ఆదరణకర్త" అందించిన "సువార్త మంజరి" తప్ప వేరు తరుణోపాయము లేదు. కనుక త్వరపడండి. అంతము సమీపించగలదు.
"పరలోక తండ్రి ప్రభువుగా కనిపించిపోయాడు !
పరలోక తండ్రి ఆదరణకర్తగా కనిపించపోతున్నాడు!" ఎరుకగల్గి ఉండండి.
thraithashakam...
thraithashakam...
విశేషము :
కార్తీక అమావాస్య ... ఆదివారం
112 (డిసెంబర్ ౧) - 2024
TEAM:
Lyricist - Siva Krishna Kogili
Singer - Brinda
Music - Nagesh
Co-Ordination - NR Chaitanya Kumar
Promo Editing - Saleem
Production & Presented By - Gnanavaahini Channel