Rangare Ranga Ranga (రంగరే రంగా రంగా) | Lyrical Song 150 | Singer: Mallikarjun | Gokulashtami Spl
ฝัง
- เผยแพร่เมื่อ 7 ม.ค. 2025
- జ్ఞానవాహిని శ్రోతలకు, వీక్షకులకు అందరికీ శ్రీ గోకులాష్టమి సందర్భముగా శుభాకాంక్షలు!
రంగడు అంటే గతులు లేనివాడు అని ... గతులు లేకుండా చేయువాడు అని ముందే తెలిసియున్నాము.
"ఆదికర్త"యైన గురువు తన, త్రైత సిద్ధాంత గీతలో ప్రప్రథమ శ్లోకములోనే "గతులు కల్గిన చరప్రకృతి గూర్చియు, గతులు లేని అచరప్రకృతి గూర్చియు" ఏ మాత్రమూ చింతలేని పరమాత్మ స్థితిని సుబోధజేసి .. ఆ పరమస్థితిని పొందుటకు ప్రజ్ఞగల్గిన యోగి ఏ కాలములో మరణించాలో ప్రబోధజేయుచూ కాలములో సూక్ష్మ గతులను కూడా తెలియజేయుట జరిగినది.
కాలములో కృష్ణ శుక్ల-పక్ష గతులను, వాటి అనుసంధానమైన సూర్య-మేఘ స్థితులను ఆత్మయోగి తెలిసియుండవలెను. కృష్ణ శుక్ల గతులతో ఏర్పడినవి ద్వాదశ మూసములు కాగా, మూసజతలకు అనుసంధానమై ఏర్పడు వాతావరణములే షష్ఠ ఋతువులు.
మూస (ము): మూ అనగా 'జ్ఞాన నేను', స అనగా 'సాకార ఆత్మ'. ఆత్మ జ్ఞానార్ధియైన నేను సాకారముగా మారుటకు గల జ్ఞానమును తమలో నింపుకొని మూస (ముద్ర) వేయబడినవి మూసములు కాగా ...
ఋతు (వు): ఋ అనగా 'యోగ నేను', తు అనగా 'నిరాకార ఆత్మ'. ఆత్మయోగియైన నేను నిరాకారముగా మారుటకు గల విజ్ఞానమును అందించునవి ఋతువులు.
కావుననే శ్రీ స్వామివారు కాలగతులైన సంవత్సరములలోని ఈ మూసముల మరియు ఋతువుల పేర్లన్నీ ఆత్మజ్ఞానముతోనే ముడివడియున్నవనీ, ప్రసవింపబడిన శిశువులకు వీటిని నామధ్యేయములుగా పెట్టుకోవచ్చునని తెలియజేసియున్నారు.
తనలో ఆత్మజ్ఞానము "వసంత"మైన పిదప, శిష్యుడు మహర్షమైన ఋషిగా మారి, తనలో రెండు రెండు జతలుగానున్న మూసములకు ఒక ఋతువు ఎలా వచ్చినదో అలా, తనలో ఇంకా ద్వంద్వాలుగా గోచరిస్తున్న గుణకర్మ చక్రాలలోని గుణకర్మలను, కాలచక్రమువద్ద ఏకపరచుకొని, తాను ఒక బ్రహ్మచక్రముగా మారిపోవాలి. అప్పుడే అతను ఇక శిష్యునిగా రహితుడైన "శిశిరం"లో గతులులేని పూర్ణ రంగుడై విరాజిల్లగలడు.
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం !!!
శ్రీ రంగ నామం రమతాం మనో మే... శ్రీ రంగ ధ్యానం రమతాం బుధో మే...
శ్రీ రంగ కార్యం రమతాం చిత్తో మే... శ్రీ రంగ రూపం రమతాం అహో మే...
నమో నమస్తే శ్రీ రంగ స్వరూప ... శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ నమః !!!
విశేషము: ఈ గీతముతో జ్ఞానవాహినిలో 150 జ్ఞాన గీతములు ప్రసారము చేయడము జరిగినది. ఇంతటి అదృష్టము మనకు ప్రసాదించిన గురుదేవునికి పాదాభివందనాలు.
TEAM:
-------
Lyricist - Siva Krishna Kogili
Singer - Mallikarjun
Music - NR Chaithanya Kumar
Promo Composition - Sai Songa
Production & Presented By - Gnanavaahini Channel
సాకీ:
----
రంగలో రంగా శ్వాస చేరంగా కృష్ణుడే భగవానుడై వెలిసెను వరంగా
రంగడే రంగా మూస పోయంగా శ్రీకృష్ణ పరమాత్మే ఇల చేరి శిలవోలె మారే స్థిరంగా
స్థిరంగా...స్థిరంగా...స్థిరంగా...స్థిరంగా..
Chorus :
------
రంగ రంగరే రంగా రంగా... రంగ రంగరే రంగా
రంగ రంగరే రంగా రంగా... రంగ రంగ రంగా
పల్లవి:
------
రంగరే రంగా రంగా ... గుణముల్నే సంధించంగా... హరివిల్లే వంచే తారంగా
రంగరే రంగా రంగా ... రణముల్నే జయించంగా ... గురువల్లే వచ్చే తీరంగా
చైత్రమందే చరంగా .. వైశాఖం వరంగా
జ్యేష్ఠగ్రంథం ఘనంగా ... ఆషాఢం అవంగా...!
మాసాలను మూసపోయ జనియించావా ... నవమాసాలే మోసి నన్ను కనిపెంచావా ... నాలో కనిపించావా ...
రంగరే రంగా రంగా ... గుణముల్నే సంధించంగా... హరివిల్లే వంచే తారంగా.. ఆఆఆ...
రంగరే రంగా రంగా ... రణముల్నే జయించంగా ... గురువల్లే వచ్చే తీరంగా
చరణం 1:
------
శరణంటూ నా కర్ణము గురునే వినగా ...ఆ గీతా శ్రావణమై వినిపించావు
మరుచింతే లేదని నీ పథమున చనగా ... భద్రముగా నా పదమును నడిపించావు
నశ్వరమైన నా మనసంతా నీకర్పించంగా ... ఆస్వైజంగా ఆత్మలో నన్ను అణిచి వేశావు
కాకమువంటి నా అహమంతా ఏకము చేయంగా ... కర్మను కాల్చి కార్తీక దీపం వెలిగించి వేశావు
శ్రావణంలో వినంగా ... భద్రపదమై చనంగా
ఆశ్వయుజమే కనంగా... కారుతీకం లోనే నీ కారణజన్మం కనపడగా ... ఓఓఓ
రంగరే రంగా రంగా ... గుణముల్నే సంధించంగా... హరివిల్లే వంచే తారంగా ...ఆఆఆ...
రంగరే రంగా రంగా ... రణముల్నే జయించంగా ... గురువల్లే వచ్చే తీరంగా
చరణం 2:
------
శిరమందున నా సోహము ఏకాగ్రముగా ... స్థిరపరచే మార్గశిరము నందించావు
పురుషత్వము నాలోనే పుష్పించంగా... పుష్యముగా పురుషోత్తముడై కలిసావు
రంగనితోన సంభోగమే సంభవమేనంటూ.. నా భగమందే మాఘము నీవై ప్రభవించావు
లింగములోన సంగుణమయ్యే శంభువునేనంటూ ... ఫాల్గుణమొందే అంగము నాకే అర్పించి వేశావు
మార్గశీర్షం మార్గంగా ... పుష్యమించే సత్యంగా
మాఘమాసం గమ్యంగా ... ఫాలుగుణమాసానే నీ మూసగ జీవం వెలియంగా ... ఓఓఓ
రంగరే రంగా రంగా ... గుణముల్నే సంధించంగా... హరివిల్లే వంచే తారంగా ...ఆఆఆ...
రంగరే రంగా రంగా ... రణముల్నే జయించంగా ... గురువల్లే వచ్చే తీరంగా
జ్ఞానమాయె వసంతం.. అగ్నిచేరె సుగ్రీష్మం
వర్షమాయె మహర్షం ... శరతుల్లో సుహర్షం
హేమంతమె శ్రీమతముగ జరిపించావా ... పసి శిశువోలె శిశిరములో జలయించావా ... నాలో జనియించావా
రంగరే రంగా రంగా ... గుణముల్నే సంధించంగా... హరివిల్లే వంచే తారంగా ..ఆఆఆ..
రంగరే రంగా రంగా ... రణముల్నే జయించంగా ... గురువల్లే వచ్చే తీరంగా
Finishing on chorus:
రంగరే రంగా ... త్రైత గీతంగా ... శ్రీ క్రిష్ణ ప్రబోధమే ప్రతినిధిగా ప్రభవించెను త్రైతశకంగా