Allaah tho Saavaasam (అల్లాహ్ తో సావాసం) | Song Promo | "Ramjaan" Special Trailer | Singer Shreedeep

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 เม.ย. 2024
  • జ్ఞానవాహిని శ్రోతలకు, వీక్షకులకు అందరికీ "రంజాన్" పండుగ సందర్భముగా శుభాకాంక్షలు.
    ఏప్రిల్ 5 న జగద్గురుదేవులైన "శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల జన్మదినము" జరిగిన తరువాత, నాలుగు రోజులకు (ఏప్రిల్ 9 న) "యోగాది" (ఉపనయనము) జరగడము, మరియు ఏడు రోజులకు (ఏప్రిల్ 11 న) "రంజాన్" (ఉపదేశము) కలగడము ... అన్నీ ఆ కాలస్వరూపుడైన దైవముయొక్క ప్రణాళికే అనుకుంటున్నాము.
    నేటి ఇస్లాం సమాజములో ముస్లింల వద్ద మాత్రమే వినబడుతున్న పదములైన "అల్లాహ్", "రంజాన్", "రోజా", "నమాజ్", "జకాత్", "హజ్" మొదలగునవి, అందరూ అరబ్బీ భాషలోని పదములు అనుకున్నప్పటికీ, అవి నిజానికి స్వచ్ఛమైన "తెలుగు" భాషలోని పదములనీ, అవి ఇప్పటి పదములు కాదనీ, ఎప్పుడో కృతయుగము నుండీ ఉన్నవేననీ, ఆ పదముల వెనుక ఎంతో గొప్ప ఆధ్యాత్మిక భావము దాగి ఉన్నదనీ ... త్రైత సిద్ధాంత గ్రంథముల ద్వారా శ్రీ గురుస్వామివారు తెలియచేసియున్నారు.
    యోగీశ్వరులవారు రచియించిన గీటురాయి, అంతిమదైవగ్రంథములో జ్ఞానవాక్యములు మరియు వజ్రవాక్యములు అను గ్రంథములలో ... పవిత్ర ఖురాన్ గ్రంథములోని ఎన్నో సూక్ష్మ వాక్యములకూ, ఎన్నో సూక్ష్మ పదములకూ ... సంచలనాత్మకమైన సమాచారమును పొందుపరచియున్నారు. ఆ వివరములను చదివిన ఎవ్వరైనా "ఖురాన్" అనునది ఒక మతగ్రంథము కాదనీ, అది సర్వ మానవాళికీ మోక్షమార్గమును చూపే గ్రంథమని తప్పక గ్రహించగలరు.
    ఆ గ్రంథముల ఆధారముగా, "రోజా" (ఉపవాసము) అనునది బాహ్యముగా తినే తిండికి సంబంధించిన విషయము కాదనీ, దైవికమైన యోగమునకు సంబంధించినదనీ, ప్రాపంచిక ధ్యాస లేకుండాపోయి దైవచింతనలో ఉండిపోవడమే ఉపవాసమగుననీ, దానికి కావలసిన జ్ఞానమును గురువువద్ద నుండి పొందడమునే "రంజాన్" (ఉపదేశము) అనీ తెలియుచున్నది.
    కావున, రంజాన్, రోజా అను పదములు ఖురాన్ గ్రంథముకంటే ముందే కృతయుగములోనే చెప్పబడినవనీ, ఉపవాసమనే జ్ఞానయోగమే "రోజా" అనీ, ఉపదేశమనే జ్ఞానశక్తియే "రంజాన్" అనీ తెలియడమే కాక... గురువు వద్దనుండి ఉపదేశమును ("రంజాన్" ను) పొందిన శిష్యుడు ...ఉపవాసము ("రోజా") ఉండవలసినదేనని గ్రాహ్యమగుచున్నది.
    ఈ నేపథ్యంలో, రంజాన్ అనునది బాహ్యముగాయున్న ఒక మాసము కాదనీ, అది అంతరముగా పొందదగినదైన ఉపదేశమనీ, అదే ధ్రువపరుచుటకే ఖురాన్ గ్రంథములోని ఆయత్ లలో "రంజాన్ ను పొందండి" అనీ, "రంజాన్ ని పొందినవాడు" అనీ "ఉపదేశము" అనే అర్ధము వచ్చేలా వ్రాసియున్నారు.
    కావున, నిజమైన ఆధ్యాత్మికత పై శ్రద్ధయున్న ప్రతి ఒక్కరూ, ఈ రంజాన్ సందర్భముగా యోగీశ్వరులవారు రచియించిన గీటురాయి, అంతిమదైవగ్రంథములో జ్ఞానవాక్యములు మరియు వజ్రవాక్యములు అను గ్రంథములను చదివి, నిజమైన ముస్లింలు (విశ్వాసులు) కావాలని తెలియచేస్తున్నాము.
    శ్రద్ధావాన్ లభతే జ్ఞానం !!!
    thraithashakam...
    thraithashakam...
    thraithashakam...
    గురువు ప్రబోధ చేసి వ్రాయునవి "వాక్యములు", శిష్యులు ప్రచారముకై చేయునవి "కావ్యములు". కాగా, ఆ కావ్యములలో భాగముగా ... "ధ్వని వాహిక కావ్యములు" (జ్ఞానవాహిని), "దృశ్య చిత్ర కావ్యములు" (జ్ఞానదర్శిని) ... త్రైతజ్ఞాన ప్రచారములో భాగముగా చేసుకొనుటకు మనకు అవకాశము ఇచ్చిన శ్రీ గురుదేవులకివే మా సాష్టాంగ దండ ప్రణామములు.
    విశేషము:
    ----------
    ఈ రోజు గురు (11వ తారీఖు) వార - శుక్ర (12వ తారీఖు) వారముల మధ్య "రంజాన్" ఏర్పడుట గొప్ప సూచక క్రియయే.
    TEAM:
    -----
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Shree Deep (Deepu)
    Music - Nagesh
    Promo Editing - Saleem
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel

ความคิดเห็น •