Deepavali (జ్ఞాన దీపావళి) | Song Promo | Asweeyuja Pournami Spl | Singer : Nadapriya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • జ్ఞానవాహిని శ్రోతలకూ, వీక్షకులకూ అందరికీ అస్వీయుజ పౌర్ణమి మరియు "దీపావళి" పండుగ సందర్భముగా శుభాకాంక్షలు!
    దీపమునకు-జ్ఞానమునకు మరియు దీపాగ్నికి-జ్ఞానాగ్నికి అవినాభావ సంబంధము కలదు. యోగమునకు గుర్తు కనుకనే పెద్దలు దైవ పూజా విధానములో "దీపారాధన"కు ముఖ్య ప్రాధాన్యతను ఇచ్చారు.
    "సృష్టిలో ఏ లోపమూ లేదు, నీ దృష్టిలోనే లోపము ఉన్నది" అని గురుదేవుని వాక్కు. బాహ్యముగా దృష్టికల్గిన జనులకు అజ్ఞాన చీకటే లోలకముగా మారి, లోపములే దృశ్యములుగా కనిపిస్తుంటాయి. కనుకనే “ఎదుటివానిలో లోపము ఎంచకు, నీ లోపమునే ఎంచుకో!”అని భగవానుడు అన్నాడు. ఇక్కడ నీ "లోపము" ఎంచుకో అనగా "లోపలి పని"నే ఎన్నుకో అని అర్థము వచ్చుచున్నది. దానినే స్వపనము అనగా స్వంత పని అని కూడా చెప్పవచ్చును. నిరంతర ఆత్మచింతయనే ఈ లోపలి పనిని చేయుటకు, దీపము కావలెను. "ధీ" అనగా బుద్ధి, బుద్ధి దగ్గర జ్ఞానభావమును కల్గియుండు విచక్షణయే దీపము.
    కనుకనే భగవానుడు గీతలోని విభూతియోగం 11 వ శ్లోకమున తన భక్తులకు బుద్ధియోగమునిచ్చి వారి తలలో "జ్ఞాన దీపమును" వెలుగజేస్తాను అన్నాడు.
    జ్ఞానయోగము మొదటి శ్లోకములో ఈ అవ్యయమైన యోగమును మొదట వివస్వుడైన సూర్యునికి తెల్పియున్నాను అని పల్కి, ఆ సూర్యుని అక్షరపరబ్రహ్మయోగములోని 24 వ శ్లోకములో అగ్నిజ్యోతి గా పోల్చారు. అట్టి ఆ సూర్యుడే అచరప్రకృతిలో నిత్యమూ ప్రకాశించే అవ్యయమైన దీపమైన ప్రకృతిశక్తికి (పరమాత్మ ఉనికికి) గుర్తు.
    అదే ఉనికే చరప్రకృతియైన జీవదేహములో ఆత్మగా ప్రకాశిస్తున్నది. బ్రహ్మనాడిపై వెలుగొందే ఆ అంతరాత్మదీపమునకు ఆవల ఏడు దీపస్తంభములుగా ఆత్మశక్తి విస్తరించియున్నది. అదే దీపమునకు ఈవల మహాజ్యోతియైన గురుశక్తి యున్నది. ఈ ఆవళి లోనికి అజ్ఞానములను ప్రవేశించనీయని, సుజ్ఞానములను ప్రవేశింపజేయునదైన "ప్రభావళి" కూడా అచటనే ఉన్నది.
    కనుకనే శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారు "దీపం-కిరణం-వెలుగు" అను గొప్ప ప్రసంగములో దీప సామీప్యులగు శిష్టులకు గురువు దాపు అని, దీప దూరులగు దుష్టులకు గురువు దవ్వు అని తెలియచేసియున్నారు. దేహ ఆవరణలోకి ప్రవేశించుటకు, దేహమునకు వెలుపలి దీపము పరమాత్మయనీ, దేహమునకు లోపలి దీపము ఆత్మయనే వివరణ తెలిసియుండాలి.
    అందుకే పెద్దలు తమ గృహమును దేహముగా భావించి, ఇంటి బయట ఒక దీపమును, ఇంటి లోపల ఒక దీపమును పెట్టి జ్ఞానర్థముతో దీపావళి పండుగగా జరుపుకొనెడివారు. దీనినే "కాంతిపై కాంతియున్నది" అనీ, "ఆత్మాత్మ కాంతియే కాంతు ఆనందగురు అన్యధా !" అని తత్త్వ రూపములో అన్నారు.
    నేటికైనా జ్ఞాన జిజ్ఞాసులు, "శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల"వారిచే రచియింపబడిన "మన పండుగలు" అను గ్రంథమునుండి "దీపావళి" అను అంశమును చదివి తలలో జ్ఞానదీపమును, జ్ఞానాగ్నిని వెలిగింపచేసుకొనగలరని ఆశిస్తున్నాము.
    శ్రద్ధావాన్ లభతే జ్ఞానం !
    www.thraithash...
    నేటి కాల విశేషము:
    ------------------
    అస్వీయుజ పౌర్ణమి
    తేదీ : ౧౭ (17) జీవ దీపమునకు ఈవలియున్న (౧) ఒక కాంతికి, ఆవలి యున్న (౭ ) ఏడు కాంతులకు గుర్తు
    బుద్ధియోగమునకు గుర్తైన బుధవారము తరువాత వచ్చు జ్ఞానదీపమునకు గుర్తైన గురువారము
    మరొక ముఖ్యమైన విశేషము ఏమనగా, నేడు "మీరా బాయి జయంతి". ఆమె అసలు పేరు "మిహిరా బాయి" అనగా సూర్యముఖి అని అర్థము.
    TEAM:
    ------
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Nadapriya
    Music - Nagesh
    Promo Editing - Saleem
    Production & Presented By - Gnanavaahini Channel
    క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము
    (12) శ్లో|| 16: బహి రన్తశ్చ భూతానా మచరం చర మేవ చ ।
    సూక్ష్మత్వాత్త దవిజ్ఞేయం దూరస్థం చాన్తి కే చ తత్ || (పరమాత్మ)
    భావము : చర అచర ప్రపంచముగ జీవరాసుల లోపల బయట పరమాత్మ ఉన్నది. అది సూక్ష్మమగుటచే తెలియబడునది కాదు. దూరముగ మరియు దగ్గరగనున్నదని తెలియుము.
    వివరము : కంటికి కనిపించు ప్రపంచమునంతటిని ప్రకృతి అంటాము. కదలెడి ప్రకృతియని, కదలని ప్రకృతియని రెండు రకములుగ ప్రకృతివున్నది. సమస్త జీవరాసుల శరీరములు కదలెడి ప్రకృతియని (చర ప్రకృతియని) పిలువబడుచున్నది. జీవరాసుల శరీరములు మినహాగల సమస్తముయైన గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కదలని లేక మార్పుచెందని ప్రకృతియని (అచర ప్రకృతియని) పిలువబడుచున్నది. జీవరాసులలోపల మార్పుచెందుచు కదలుచున్న చర ప్రకృతియు, జీవరాసుల బయట మార్పుచెందక కదలని అచర ప్రకృతియు రెండు పరమాత్మయేనని చెప్పబడుచున్నది. ఎందుకనగ అణువణువున వ్యాపించినది పరమాత్మయే, కనుక చరాచర ప్రపంచమంతయు పరమాత్మయేనని తెలియాలి.
    పరమాత్మ ఇంద్రియములకు తెలియని సూక్ష్మము కావున అది చూపుకు తెలియునది కాదు. జ్ఞానము వలన కూడ సులభముగ తెలియునది కాదు. ధర్మములు తెలిసినవారికి పరమాత్మ చాలా దగ్గరగ గలదు. ధర్మములు తెలియని వారికి చాలా దూరముగనున్నదని చెప్పవచ్చును. ఎందుకనగ ధర్మములు తెలిసినవాడు తొందరలో పరమాత్మను చేరగలడు. కనుక వానికి చాలా దగ్గరగ ఉన్నదని చెప్పవచ్చును. అట్లే ధర్మములు తెలియనివాడు పరమాత్మను ఎప్పటికి చేరలేడు. కనుక వానికి చాలా దూరముగ ఉన్నదని చెప్పవచ్చును.

ความคิดเห็น •