Allah tho Savasam (అల్లాహ్ తో సావాసం) | Lyrical Song - 143 | Chaithra Amavasya Special Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • ముస్లిమ్ గా పుట్టిన ప్రతివ్యక్తికీ 8 సంవత్సరముల వయస్సు వచ్చేలోపే "నమాజ్" అను కార్యము పరిచయమై ఉంటుంది. అయితే ఆ నమాజ్ యొక్క నిజార్థమును మాత్రమూ ఆ వ్యక్తి మరణించేవరకూ కూడా తెలియలేకున్నాడు. ఇస్లామ్ ధర్మములో తమ దైవగ్రంథముగా చెప్పుకొను ఖురాన్ లో ఈ నమాజ్ అను కార్యము మూడు విధములుగా విస్తరించియున్నదని కూడా తెలియకపోయినది.
    ఈ సృష్టిలో పుట్టిన ఏ మనిషికైనా "కర్మ పత్రము" (సిజ్జీను) అనునది తప్పక ఉన్నది. ఆ కర్మను పోగొట్టుకొనుటకు చేయవలసిన ధర్మకార్యమే నమాజ్ (కర్మయోగము) అని తెలియవలెను. జన్మకు కారణమగు కర్మను నాశనము చేయగల కర్మయోగము చేయుటకు ప్రతి మనిషికీ (జీవాత్మకు), జ్ఞానము (ఆత్మజ్ఞానము) మరియు యోగము (జ్ఞానాగ్ని) అను రెండూ తప్పనిసరి.
    కొందరికి కర్మయోగమును (నమాజ్) గూర్చి తెలిసియున్నా, దానిని చేయుటలో అనుభవము లేనిదానివలన ఆతని కర్మయోగము నిదానముగా జరుగుచుండును. ఇలా కర్మయోగము పూర్తి సాఫల్యము లేనిదానివలన జ్ఞానాగ్ని కూడా అతనికి తక్కువగా లభించుచుండును.
    ఖురాన్ గ్రంథములోని ఖాఫ్ సూరాలో మూడు ఆత్మలను గూర్చి చెప్పిన దేవుడు, అదే గ్రంథములో ఆ ముగ్గురిలోని "మధ్యాత్మనే" సర్వులకూ ఆరాధ్యునిగా తేల్చి చెప్పియున్నాడు. శరీరములోనున్న ప్రతి జీవునికి సహచరుడు, సహాయకుడు, స్నేహితుడుగా "ఆత్మ" యున్నది.
    ఆత్మ సహకారములేనిదే ఏ జీవాత్మా నమాజ్ (కర్మయోగము) చేయలేడు. ఆధ్యాత్మికములో “మనిషి తనకర్మను తానే లేకుండా చేసుకోవాలి" అనునది ముఖ్యసూత్రము. అంతేకాక జీవాత్మ కర్మను ఆత్మ తొలగించదు అనుటకు "ఎవరి కర్మనూ ఆత్మ తీసివేయదు' అను సూత్రము కూడా కలదు. ఈ సూత్రములను అతిక్రమించకుండా, తాను ఏమాత్రము జీవుని కర్మను లేకుండా చేయక, జీవుని కర్మను జీవుని చేత వేగముగా ఆత్మ అనుభవింప జేయుచున్నది.
    జ్ఞానములో మనిషికున్న శ్రేష్టమైన ఉద్దేశ్యమునుబట్టి, వానికున్న పరమమైన శ్రద్ధనుబట్టి వానిలోని ఆత్మ ఆతని "స్వప్నము"లో గొప్ప గొప్ప కర్మలను సహితము సులభముగా అనుభవింపజేసి పూర్తిచేయుచున్నది. ఇలా జీవునికి ఆత్మ యోగములో ఎంతో మేలుచేసి, దేవునికి దగ్గరగునట్లు చేయుచున్నది.
    దేవుడు ఏమీ చేయడు చూస్తూ ఉంటాడు. ఆత్మ చేస్తూ ఉంటుంది. ఆ విధముగా కర్మను లేకుండా చేయడములో శ్రద్ధగల జీవునికి మంచి సహాయము చేయుట వలన, ఆత్మను స్నేహితుడు అని గ్రంథములలో వ్రాయడము జరిగినది.
    'హితుడు' అనగా మంచిని చేయువాడు. 'స్నే' అనగా దగ్గరగాయున్నవాడు అని అర్థము. స్నేహితుడు అనగా దగ్గరగా యుండి మంచి చేయువాడు అని అర్థము. మనిషికి అనగా జీవునికి ఒకడే స్నేహితుడు గలడు. వాడే నీలో ఉండే "ఆత్మ". అస్తు అనగా ఉండుట, ప అనగా పక్కనే. ఇలా పక్కనే స్నేహముగా ఉన్న ఆత్మ వద్ద ధ్యాస ఉంచుటయే పస్తు లేక ఉపవాసము.
    అందుకే ఈ గీతములో ఆ ఆత్మను స్నేహితుడు, మిత్రుడు, చెలికాడు, దోస్తు, సంగడీడు, సఖుడు, సహచరుడు వంటి ఎన్నో స్నేహత్త్వముతో కూడిన పదములతో వర్ణించడము జరిగినది.
    తన స్వహస్తములతో అంతిమ దైవగ్రంథములోని జ్ఞాన, వజ్ర వాక్యములను మాకొరకు రచియించి ఇచ్చి, ఇంతటి గొప్ప స్నేహితుడిని మాకు పరిచయము చేసిన మా గురుదేవునికివే మా సాష్టాంగ దండ ప్రణామములు.
    విశేషం : ఈ పాట '8' వ తేదీన చైత్ర అమావాస్య రోజున, మంత్రసిద్ధికై ముఖ్యమైన బుధవారమున విడుదల కావడం.
    TEAM:
    -----
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Shree Deep (Deepu)
    Music - Nagesh
    Promo Editing - Saleem
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel
    సాకీ:
    అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవము లేడనీ...
    సాక్ష్యమిచ్చెను చూడు స్వయముగా అల్లాహ్ యే...
    స్వయముగా అల్లాహ్ యే ... స్వయముగా అల్లాహ్ యే
    కో:
    లా ఇలాహా ఇల్లల్లాహ్ .. లా ఇలాహా ఇల్లల్లాహ్ ..
    లా ఇలాహా ఇల్లల్లాహ్ .. లా ఇలాహా ఇల్లల్లాహ్ !!!
    పల్లవి (తల) :
    అల్లాహ్ తో సావాసం ... నీలోనే ఉపవాసం
    ఆ ఏడో ఆకాశం ...అందేటి అవకాశం
    అల్లాహ్ దే సందేశం ... అది ఉందే నీకోసం
    ఆ అంతిమగ్రంథంలో ... దాగుందీ ఉపదేశం
    మనసంతా ఆహారం ... గుణమందించే భారం
    మరిచావో నీ సారం ... అల్లాహ్ కే నువు దూరం
    మితిమీరక నీ పానం ..తినితాగుము ఆ జ్ఞానం
    గతిమారక నీ పయనం ... చేరునులే అల్లాహ్ స్థానం
    అల్లాహ్ తో సావాసం ... నీలోనే ఉపవాసం
    ఆ ఏడో ఆకాశం ...అందేటి అవకాశం
    అల్లాహ్ దే సందేశం ... అది ఉందే నీకోసం
    ఆ అంతిమగ్రంథంలో ... దాగుందీ ఉపదేశం
    కో: లా ఇలాహా ఇల్లల్లాహ్ ... లా ఇలాహా ఇల్లల్లాహ్
    చరణము 1:
    దేహమే నీదంటే ద్రోహం ... నేటికైనా వీడై మోహం
    దేహితో కూడేటి ధ్యాసే ...ధ్యేయమై చేసైరా స్నేహం
    అహముతో సంగమమే దోషం ... మనసుతో సాగుటయే మోసం
    తత్త్వమే మరువక ఏ నిమిషం ... సత్తుతో చేసై సహవాసం
    గుణకారమే... నీ ఆహారము ...అది వీడుటేరా సన్న్యాసము
    ప్రతిజాములో నీ పతి జ్ఞానము ... తిని త్రాగుటే రోజా సారము
    జతగా ఉంటూ మతినే మార్చే మైత్రిని నీలో చూడు
    మతమే దాటే హితమే చూపే స్నేహితుడే వాడు
    కర్మలకే కలివాడు ... ధర్మానికి చెలికాడు
    కాడులలో కలిసాడు ... ఏడులకే పైవాడు
    నాడులలో సడివాడు ... గ్రంథులకే గుడివాడు
    రంగడిలా ప్రభవించి... సంగడినే పొందిస్తాడు
    అల్లాహ్ తో సావాసం ... నీలోనే ఉపవాసం
    ఆ ఏడో ఆకాశం ...అందేటి అవకాశం
    అల్లాహ్ దే సందేశం ... అది ఉందే నీకోసం
    ఆ అంతిమగ్రంథంలో ... దాగుందీ ఉపదేశం
    కో: లా ఇలాహా ఇల్లల్లాహ్ ... లా ఇలాహా ఇల్లల్లాహ్
    చరణము 2 :
    మనసులో వేదములే నాస్తి ..చేసేటి సాధన నీ ఆస్తి
    వదలగా మలినపు దుస్తులనే .. అందుకో అల్లాహ్ తో దోస్తీ
    బుద్ధి భావనలే నీ వస్త్రం... హృద్ధినే యోచించే హస్తం
    గుణభావమొదిలే పస్తులకే .. గురుతుగా గురువే నీ నేస్తం
    మస్జీదులోనికి ప్రవేశము ...రంజాను పొందేటి ప్రదేశము
    జీహాదుతో నీ గుణధ్వంశము ... జీవస్సమాధికి అది అంశము
    పగటికి పతిగా ...రాత్రిన రతిగా ... కూడే మిత్రుని చూడు
    ఖురానులో ఇది ఖరారు చేసిన సఖుడేలే వాడు
    సూరాలకు బడివాడు ... ఆయత్ లకు గుడివాడు
    గ్రంథములో ముడివేసి ... విడమరచే గ్రంథే వాడు
    ముల్లాలకు తలవాడు.. నల్లేటిన నడిపాడు
    తెల్లారిన సూరీడు ..అల్లాహ్ గా వెలిగే రేడు
    అల్లాహ్ తో సావాసం ... నీలోనే ఉపవాసం
    ఆ ఏడో ఆకాశం ...అందేటి అవకాశం
    అల్లాహ్ దే సందేశం ... అది ఉందే నీకోసం
    ఆ అంతిమగ్రంథంలో ... దాగుందీ ఉపదేశం
    దాగుందీ ఉపదేశం.. దాగుందీ ఉపదేశం

ความคิดเห็น •