Jagadaananda Kaaraka (శ్రీ ప్రబోధానంద నాయకా) | Lyrical Song - 141 | Swami Birthday Spl Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • ఈ సృష్టిలోని సర్వ జగతికి తన త్రైత జ్ఞానామృతముతో ఆనందమును కలుగ జేయుటకు జన్మ తీసుకున్న, "జగదానంద కారకుడైన"... "శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల" వారి జన్మదిన సందర్భముగా సర్వ మానవాళికి మా శుభాకాంక్షలు.
    "ఆనందము" అనునది మూడు విషయములతో సంబంధపడి వున్నది. అవి, ఒకటి ఆనందమును పొందేవాడు, రెండు ఆ ఆనందమును ఇచ్చేవాడు, మూడు వారిద్దరి మధ్య ఏర్పడే "ఆనందము". ఈ మూడు అంశములను తనలో నింపుకున్న "తత్త్వము"నే "ఆనంద గురువు" అని అంటున్నాము. కావున, ఆనందము అను దానిని ఆస్వాదించుటకు తత్త్వము తప్పని సరిగా అవసరము అని కూడా అనుచున్నాము.
    తత్త్వము అనగా ఇరువురి మధ్య సంబంధము తెలియజేయునది మరియు తత్త్వమసి అనగా ఆ సంబంధమును కలుగజేయునది. దీనినే ద్వైతము అని కూడా అనవచ్చు. ఈ తత్త్వము అను మాటలో తత్ అనగా "అది" అని, త్త్వం అనగా "నేను" అని అర్థము. దేనిని పొందితే ఆనందము కలుగునో దానిని తత్ అని, ఎవరైతే ఆ ఆనందము పొందగలరో దానిని త్త్వం అని చెప్పిన యెడల, తత్త్వం అనగా "అది నేను" అని తెలిసినప్పుడు పుట్టే ఆనందమే, ఆ సిద్ధాంతము. కాబట్టి తత్త్వము ద్వైతము కాగా తత్త్వం నుంచి కలిగే ఆనందము త్రైతము అదే అద్వైతానందము అని చెప్పాలి. ఇలా తత్త్వము, తత్త్వమసి అను రెండుగా ఉన్నకారణమున తత్త్వముల వివరములో, తత్త్వములు అనునది బహువచనముగా ఉన్నది.
    ఆ త్రైతాత్మ సిద్ధాంతమును ఎవరూ గుర్తించని కారణమున తత్ అనబడునది రెండవ ఆత్మనో, మూడవ ఆత్మనో తెలియకుండా పోయినది. కొందరికి ఆత్మల వివరమే అర్థముకాక తాను మొదటి ఆత్మనైన జీవాత్మననే తెలియదు. మరికొందరికేమో మూడవ ఆత్మను అటుంచితే రెండవ ఆత్మ వివరము కూడా తెలియదు. జ్ఞానులు ఆత్మతో కలియకముందు “తత్త్వం" అన్నవారు ఆత్మతో కలిసిన తర్వాత “తత్త్వమసి" అన్నారు. దీనిని విడదీసి చూచితే తత్+త్వం+అసి= తత్త్వమసి అనిగలదు. తత్ అనగ ఆత్మ అని, త్వం అనగ నేను అని, అసి అనగ కలసిపోయాము అని అర్థము. ఆత్మతో కలసినవాడు భూమి మీద శరీరముతో ఉండి బ్రహ్మయోగిగా ఉండును. అందువలన శరీరముతో బ్రతికివున్నవాడు "తత్త్వమసి" అనగలిగాడు. అదే పరమాత్మతో కలసిపోతే వానికి శరీరముండదు కావున వాడు ఏమియు అనే దానికుండదు. అందువలన ఆత్మను అనగ తత్ ను తెలుసుకొన్న జీవుడు త్వం అన్నవాడు, తత్ కలసిపోయి తత్త్వమసి కాగలడు.
    ఈ త్రైతశకమున తత్ (గురువును)ను, త్వం (నేను) తెలుసుకొని, తత్త్వమసి (ఆనందమును) పొందుటకు కావలసిన పూర్తి జ్ఞానముతో ఆదరించిన "ఆనంద గురువు"కివే మా సాదరాభి వందనాలు.
    అలాగే, ఈ వసంత ఋతువున "వీ" అనే అక్షర ఆత్మను, "ర" అనే క్షరాత్మనూ కలిపి, "భోగ"మనే ఆత్మానందమును ప్రసాదించిన వీరభోగ వసంతరాయడైన "శ్రీ ప్రబోధానంద నాయకుని"కివే మా సుహృదయ నమస్సుమాంజలులు.
    TEAM:
    -----
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Nandini Chaitanya
    Music - NR Chaithanya Kumar
    Video Composition - Kishore P
    Thumbnail - Subbu
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel
    సాకీ:
    ----
    సర్వ జీవులకు వర్తించే... జ్ఞాన జ్ఞప్తియే గురువు...
    సమస్త జగతీ గుర్తించే... యోగవిద్యయే గురువు...
    సజీవ దేహమై ప్రభవించే... త్రైత ఆత్మయే గురువు
    స్వాత్మ రూపమును ప్రకటించే... శిష్య దీపమే గురువు
    ఆ గురువే ఆనంద గురువు... ఆనంద గురువు.. ప్రబోధానంద గురువు...
    పల్లవి:
    -----
    జగదానంద కారక శ్రీ ప్రబోధానంద నాయకా ధర్మాలకు నీవే ఏలిక
    జగదానంద కారక నిజ సిద్ధాంత ప్రతిపాదకా నీ జన్మకే లేదే పోలిక .. ఆ. ..ఆ ..ఆ
    జగదానంద కారక శ్రీ ప్రబోధానంద నాయకా ధర్మాలకు నీవే ఏలిక
    జగదానంద కారక నిజ సిద్ధాంత ప్రతిపాదకా నీ జన్మకే లేదే పోలిక
    ధర్మము దెలిపెడి నీ రాక గుర్తించిన కర్మలు విడుగాక
    మా జన్మ పరంపర అంతము అవుగాక
    మత మాయే తొలగును గాక నీ త్రైతమె ధర వెలుగును గాక
    నిజ ధర్మము మరలా గెలుపొందును గాక
    జగదానంద కారక శ్రీ ప్రబోధానంద నాయకా .. నీ జన్మకే లేదే పోలిక
    చరణం 1:
    ------
    ఇందు జ్ఞానమే నీదు జన్మతో చంద్ర బింబమాయే
    పూర్వ వైభవము సంతరించుకొని కొత్త కాంతులీనే
    నాల్గు వేదములు మాయ అంటు ప్రజలంత వీడ సాగే
    మూడు యోగములు ఆచరించగా జ్ఞాన జ్యోతి వెలిగే
    త్రైత జ్ఞానమే తెలియంగా త్రిమతాలు చేసె నీరాజనం
    దైవ అంశవని తెలియంగా దేవతలే చేసె అభివందనం
    త్రైత సారమే తెలియంగా ప్రతి మతము చేసె నీరాజనం
    దైవ అంశవని తెలియంగా ప్రతి గ్రహము చేసె అభివందనం
    అధర్మ మాయ నీ జ్ఞాన బోధతో అంతరించి పోయె… అంతరించి పోయె .. అంతరించి పోయె ... అంతరించి పోయె
    జగదానంద కారక శ్రీ ప్రబోధానంద నాయకా ధర్మాలకు నీవే ఏలిక
    జగదానంద కారక నిజ సిద్ధాంత ప్రతిపాదకా నీ జన్మకే లేదే పోలిక
    చరణం 2:
    ------
    త్రైత జ్ఞానమే మననమందున మనసు మాకు చాటే
    త్రైత జ్ఞానమే తిరుగులేనిదని బుద్ధి బోధ చేసే
    త్రైత పథములో జన్మ ధన్యమని అహము కూడ తెలిపే
    త్రైత బోధతో మూడు గ్రంథముల మహిమ నేడు తెలిసే
    త్రైత జ్ఞానమో అమృతం అది జ్ఞాన శక్తి సంధాయకం
    త్రైత పథములో చేరటం పూర్వ జన్మాల సుకృతం
    త్రైత జ్ఞానమే అమృతం అది జ్ఞాన శక్తి సంధాయకం
    త్రైత పథములో చేరటం అది పూర్వ జన్మ సుకృతం
    త్రైత ప్రచారమే భక్తియోగమని అంతరాత్మ పలికే .. అంతరాత్మ పలికే .. అంతరాత్మ పలికే ... అంతరాత్మ పలికే
    జగదానంద కారక శ్రీ ప్రబోధానంద నాయకా ధర్మాలకు నీవే ఏలిక
    జగదానంద కారక నిజ సిద్ధాంత ప్రతిపాదకా నీ జన్మకే లేదే పోలిక
    ధర్మము దెలిపెడి నీ రాక ... గుర్తించిన కర్మలు విడుగాక
    మా జన్మ పరంపర అంతము అవుగాక
    మత మాయే తొలగును గాక... నీ త్రైతమె ధర వెలుగును గాక
    నిజ ధర్మము మరలా గెలుపొందును గాక
    జగదానంద కారక శ్రీ ప్రబోధానంద నాయకా ధర్మాలకు నీవే ఏలిక
    జగదానంద కారక నిజ సిద్ధాంత ప్రతిపాదకా నీ ధర్మమే భువిలో ఏలిక !!!

ความคิดเห็น •