Tandri Kumara Parishuddhatma (తండ్రి కుమార పరిశుద్ధాత్మ) | Lyrical Song-113 | Christmas Special song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ธ.ค. 2022
  • ప్రభువు అనగా ప్రత్యేకముగా పుట్టినవాడు అని అర్థము. ప్రత్యేకముగా పుట్టువాడైన ప్రభువు, అందరి బోధకులవలె సాధారనబోధచేయక, ప్రత్యేకమైన బోధనే చేయును. ఆ బోధయే "త్రైత సిద్ధాంతము". ఈ త్రైత సిద్ధాంత బోధను సంపూర్ణముగా బోధించునతడే "ప్రబోధ గురువు" ఆయనే "ఆదరణకర్త".
    బ్రహ్మవిద్యాశాస్త్రమునకు గణితశాస్త్రము అవినాభావసాంబంధము కలిగియున్నది. గణితములోని ఏక సంఖ్యలలో పెద్దదైన 9 (౯) పరమాత్మను, 6 (౬) ఆత్మను, 3 (౩) జీవాత్మను సూచించుననునది మనకు తెలిసిన విషయమే. ఎందుకనగా జీవాత్మయైన ౩, ఆత్మయైన ౬ తో కలిస్తే, పరమాత్మయైన ౯ గా మారిపోగలడు. (3 + 6 = 9 ). దీనినే మరొక సూత్రముగా చెప్పితే!
    ఒకటి అనబడు జీవాత్మ, మరియొకటి అనబడు ఆత్మతో కలిసినప్పుడు, రెండు అనబడు పరమాత్మ అగునని చెప్పవచ్చును. దీనినే 1 + 1 = 2 అని, గుర్తులన్నీ తీసేసి చెప్పిన 112 అని చెప్పవచ్చును. ఇలా త్రైత సిద్ధాంతములోని మూడు ఆత్మలను 112 అను ప్రత్యేక సంఖ్య సూచించుచున్నది.
    సృష్ట్యాదిలోనే త్రైతముగా విభజింపబడిన దేవుడు, తన జ్ఞానమును ఎప్పుడు భూమిమీద చెప్పినా, త్రైతముగాయున్న జీవాత్మ, ఆత్మ, పరమాత్మలను గురించిన సిద్ధాంతముగానే బోధించును. కనుకనే మూడు దైవ గ్రంథములకూ ఈ త్రైత సిద్ధాంతమే ఆధారమై ఉన్నది.
    ఇక ఆ 112 అనే త్రైతమును తెలిపిన గురువును కూడా మరొకనిగా కలిపితే వచ్చినదే ఈ 113 వ పాట. త్రైతమును తెలిస్తే సరిపోదు త్రైతమును తెలిపినవాడిని తెలియుటయే నిజమైన సాఫల్యము.
    ఎనలేని త్రైత జ్ఞాన సంపదను నాకు ప్రసాదించిన ... నా ప్రభువు (సాకారుడు) .. నా గురువు (నిరాకారుడు) ఐన "శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల"వారికివే మా సాష్టంగాదండ ప్రణామములు.
    L I K E | S H A R E | S U B S C R I B E
    ---------------------------------------
    TEAM :
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Dinesh (Malayalam)
    Chorus - Nandini & team
    Music - N R Chaitanya Kumar
    Video Composition - Saleem
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel
    LYRICS:
    -----------
    సాకీ :
    ---
    తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు
    నామములోనికి బాప్తిస్మమునే ఇయ్యమనీ ఆజ్ఞాపించెను ఆ గురువు
    ఆజ్ఞాపించెను ఆ గురువు నా గురువు ....
    పల్లవి :
    ----
    తండ్రి కుమారా పరిశుద్ధాత్మల వివరముయే త్రైతమ్
    ఆ త్రైతమ్ మనకు నేర్పినవాడు కాదా నిజ దైవం
    తండ్రి కుమారా పరిశుద్ధాత్మల జ్ఞానముయే త్రైతమ్
    ఆ జ్ఞానము మనకు అందిచేటి గురువే నా దైవమ్
    జీవాత్మ ఆత్మ పరమాత్మల వివరమునే తెలిపీ
    ఉపదేశముగా తన దేహమునే చూపించెను సాక్ష్యం... ఇది తెలియుటయే మోక్షం
    తండ్రి కుమారా పరిశుద్ధాత్మల భావములే త్రైతమ్
    ఆ భావమునే బాప్తిస్మముగా బోధించునదే దైవం
    తండ్రి కుమారా పరిశుద్ధాత్మల సారములే త్రైతమ్
    ఆ సారము తలలో నింపేందుకు కదిలొచ్చెనులే దైవమ్
    కోరస్ : ఆ దైవం ప్రభువేలే... ప్రభువేలే ఆ దైవం… ఆ దైవం గురువేలే... గురువేలే ఆ దైవం
    చరణము 1:
    --------
    ఆదిలో దేవుని రూపుగ దైవము దాపుగ శబ్దము చేసిన
    జ్ఞానమే భగవంతునిగా దాల్చెనులే రూపం
    యేసుగా దేవుని మాటను దేహము మాటుగ వార్తగ చాటే
    ఆత్మగా పరిశుద్ధాత్ముడు ప్రకటించిన పాఠం
    లోకమే ఎన్నడు ఎరుగని కన్నుల కానని వీనుల చేరని
    వాక్యమై పరలోకమునే అందించిన సారం
    దేశమే ఎప్పుడు చెప్పని ఎవ్వరు చూపని ముగ్గురు పురుషుల
    సూత్రమై ఉపదేశముగా బోధించిన త్రైతం
    జీవాత్మే నీవైతే ... నీ తండ్రే మధ్యాత్మ
    మీకంటే పరమైన వాడేలే పరమాత్మ ... ఆ దైవం బోధించే ఈ త్రైతమ్
    ఈ త్రైతమ్ బోధించేదే దైవం
    కోరస్ : ఆ దైవం ప్రభువేలే... ప్రభువేలే ఆ దైవం… ఆ దైవం గురువేలే... గురువేలే ఆ దైవం
    తండ్రి కుమారా పరిశుద్ధాత్మల వివరముయే త్రైతమ్
    ఆ త్రైతమ్ మనకు నేర్పినవాడు కాదా నిజ దైవం
    తండ్రి కుమారా పరిశుద్ధాత్మల జ్ఞానముయే త్రైతమ్
    ఆ జ్ఞానము మనకు అందిచేటి గురువే నా దైవమ్
    చరణము 2:
    ----------------
    తనువులో అణిగిన ఆత్మే తండ్రిగ తానే పొరుగున ఉండగ
    గుణములో మునిగిన జీవుడు తనయుడిగా మారి
    శిరములో నాడుల మధ్యన వెలిగే ఆత్మను గురువుగనెంచి
    శిశువుగా జీవుడు మనసును పూర్ణము చేయాలి
    దైవమై దేహములోపల నిండిన ఆత్మకు అహమును వీడే
    భావమై బుద్ధిని పూర్తిగ అర్పణచేయాలి
    అన్యమే ఎరుగక జీవుడు పొరుగున ఆత్మనే పూర్తిగనెఱిగి
    సూన్యమై హృదయములో సంపూర్ణుడు కావలి
    పూర్ణాత్మే నీవైతే... నీ దైవం ప్రభువేలే
    ఈ ఆజ్ఞే పాటిస్తే... పరలోకం నీదేలే...
    ఆ దైవం బోధించే ఈ ధర్మం… ఈ ధర్మం బోధించేదే దైవం
    కోరస్ : ఆ దైవం ప్రభువేలే... ప్రభువేలే ఆ దైవం… ఆ దైవం గురువేలే... గురువేలే ఆ దైవం
    ముగింపు :
    -------
    తండ్రి కుమారా పరిశుద్ధాత్మల వివరముయే త్రైతమ్
    ఆ త్రైతమ్ మనకు నేర్పినవాడు కాదా నిజ దైవం
    తండ్రి కుమారా పరిశుద్ధాత్మల జ్ఞానముయే త్రైతమ్
    ఆ జ్ఞానము మనకు అందిచేటి గురువే నా దైవమ్
    ఈ త్రైతమునే ఉపదేశముగా చాటే శిష్యునికి
    యోగము సమాప్తి అయ్యేవరకు తోడుండును దైవం .. ఇది గురుదేవుని వాగ్దానం
    తండ్రి కుమారా పరిశుద్ధాత్మల భావములే త్రైతమ్
    ఆ భావమునే బాప్తిస్మముగా బోధించునదే దైవం
    తండ్రి కుమారా పరిశుద్ధాత్మల సారములే త్రైతమ్
    ఆ సారము తలలో నింపేందుకు కదిలొచ్చెనులే దైవమ్
    కోరస్ : ఆ దైవం ప్రభువేలే... ప్రభువేలే ఆ దైవం… ఆ దైవం గురువేలే... గురువేలే ఆ దైవం

ความคิดเห็น •