Devalaya Rahasyamulu (దేవాలయ రహస్యములు) | Lyrical Song 117 | Singer: Priya Himesh | Magha Pornami
ฝัง
- เผยแพร่เมื่อ 7 ม.ค. 2025
- "మాఘ పూర్ణిమ - ఆదివారము" సందర్భముగా ప్రత్యేక పాట:
దేవాలయమనగా దేవుని యొక్క నివాస స్థలమని అందరికి అర్థమగును. దేవాలయములో దేవుని ప్రతిమను మనము అందరము దేవునిగ నమ్మి పూజించి నమస్కరించుచున్నాము. కంటికి కనిపించు రూపము లేనివాడు దేవుడను శాస్త్రవచన మున్నపుడు, కంటికి స్పష్టముగ తెలియు ప్రతిమయేనా దేవుడను అనుమానము రాకమానదు.
దేవాలయములు పూర్వకాలమందు నిర్మించినవే అయితే ఆనాటి బ్రహ్మవేత్తలు (దేవుని తెలిసినవారు) ఎందుకు దేవాలయము నిర్మించారు? దేవునికి ఆకారము లేదని ఉద్భోదించిన వారే ఆకార సహితముగా నిర్మించడము. కారణమేమిటి? సర్వ ప్రపంచమునకు సర్వ జీవరాసులకు అధిపతి (దేవుడు) ఒక్కడే అని తెలిసినవారు వివిధ దేవాలయములు సృష్టించి అందు విభూతి రేఖల దేవుడని, నామముగల దేవుడని వేరుపరచి చూపడము దేనికి? దేవుడు నిర్గునుడు, నిరాకారుడైనపుడు సాకార ప్రతిమలెందుకు? సగుణోపాసన ఎందుకు? ఈ విధముగా మానవుని బుద్దికి ఎన్నో ప్రశ్నలు ఉద్భవించినపుడు వాటికి సరైన సమాధానము లభించడము లేదు. సమాధానము లభించనపుడు మానవుడు నాస్తికునిగా మారుటకు అవకాశమున్నది. చాలా మంది జ్ఞానమనునది ఏ మాత్రము తెలియని స్థితిలో ఉండి ఒకరు ఏ విధముగ చేయుచు ఉంటే అదే విధముగా చేయుచుపోవు వారున్నారు.
అందువలననే ధర్మములు అధర్మములుగ మారుచున్నవి. అర్ధము అనర్థమగుచున్నది. ధర్మములు అధర్మములుగ మారినప్పుడు అవి తిరిగి ధర్మములుగ మార్చడము ఒక కర్తవ్యము. అర్ధము అపార్ధముగ మారినపుడు వివరించి అర్ధము చెప్పడము రెండవ కర్తవ్యము. అధర్మములను ధర్మములుగ మార్చడము భగవంతుని పనియైనపుడు అనర్ధములుగ నున్న వాటికి అర్ధములు చెప్పుకోవడము మన కర్తవ్యము.
భగవద్గీత భక్తి యోగమును అధ్యాయము 10 వ శ్లోకము "మత్కర్మ పరమో భవ, మదర్థ మపి కర్మణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి " నా కొరకు పనులు చేయుము. నా పని చేయడము వలన నీకు నా సాన్నిధ్యము (మోక్షము) లభించునని భగవంతుడు చెప్పాడు. విశ్వవ్యాపియైన పరమాత్మ, సర్వ జీవులకు అధిపతియైన పరమాత్మ అదేపనిగా మానవావతారముగ వచ్చి ధర్మములివి అని తెలియబరచినపుడు, మానవులలో నేనొక మానవుడనైన ప్రబోధానందగ "గురుప్రసాదము" పొందిన నేను, మారిపోయిన అర్థములను తిరిగి వివరించడము నా కర్తవ్యమనుకొన్నాను. జ్ఞానప్రబోధమే నా జీవిత ధ్యేయమైనపుడు దేవాలయ రహస్యములను వివరించడము. నా ధ్యేయములో ఒక భాగము.
--- ఇట్లు ఆదికర్త !
"దేవాలయ రహస్యములు" అను ఈ గ్రంథమును ఆత్మ జ్ఞాన జిజ్ఞాసులు తప్పక చదివవలెను.
www.thraithash...
TEAM:
----
Lyricist - Siva Krishna Kogili
Singer - Priya Himesh
Music - N R Chaitanya Kumar
Video Composition - Subbu
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel
సాకీ:
---
గుడి వెలుపల ఈశ్వర లింగం
గుడిలోపల ఆ శ్రీ రంగం
కలగలిపినదే నీ అంగం
మరి నీలో వెతికై ఆ భాగం
అది కనుగొంటే కరుగును భవరోగం
ఇది జీవుడు ఆత్మను కలిసి పరమాత్మగ మారే శివయోగం ... శివయోగం ... శివయోగం
పల్లవి :
-----
దేవాలయమందు దాగి వున్న రహస్యాలు తెలుపగా
ఆ దేవుడే భగవంతునిగా వెలిసెనుగా...ఆ
దేవాలయమందు దాగి వున్న రహస్యాలు తెలుపగా
ఆ దేవుడే గురువుగా దిగివచ్చెనుగా
దేహమె దేవాలయమని భువికి చాటి చెప్పగా
దేహములోనికి దారిని జీవికి చూపించగా
ఆ దారిన పయనిస్తే దైవఆత్మ దొరుకునని
అతనిని ఆరాతీస్తే గుప్త గురువు అందుతాడని... ఆ జీవి ముక్తి పొందుతాడని
దేవాలయమందు దాగి వున్న రహస్యాలు తెలుపగా
ఆ దేవుడే భగవంతునిగా వెలిసెనుగా...ఆ
దేవాలయమందు దాగి వున్న రహస్యాలు తెలుపగా
ఆ దైవమే గురువుగా ఇల చేరెనుగా
చరణము 1:
-------
ప్రణవమైన పంచాక్షరి తత్త్వమైన పరమాత్మయె అధిష్టించి సృష్టినేలు విధి చూపంగా
ప్రథమముగా ఆదిలోన పరమేశ్వర లింగమునే ప్రతిష్ఠించినాడు దైవ ప్రతిరూపముగా
నిరాకార పరమాత్మే ఆకారము దాల్చి ధర్మ స్థాపన గావిస్తాడని గతి తెలుపంగా
శంఖు చక్ర నామాలతో శ్రీరంగని ప్రతిమజేసి స్థాపించెను గర్భగుడిన అతి పదిలంగా
మానవ జీవిత దృశ్యం గోపురాన బొమ్మలుగా
మానస చలనం వీడి లోపలికే పొమ్మనగా
కాడులు దాటని ఏడూ ద్వారములే దారవగా
వీడైగుణములనంటూ ధ్వజస్థంబ చేరువగా
గంటను మ్రోగించి గురుని ప్రభావళిలో గాంచగా
గుడిలోపల దాగియున్న గుప్తాలను ప్రకటించంగా
ఆ దేవుడే గురువుగా ప్రభవించెనుగా ఆ...
శివలింగని శ్రీరంగని శ్రేష్ఠత్వమునే తెలుపంగా
ఆ లింగడే రంగుడై దిగివచ్చెనుగా
గుడి వెలుపల పరమాత్మయె నిరాకార గుర్తుయని
గుడిలోపల మధ్యాత్మే సాకారపు మూర్తియని
ఆలయమంటే ఆత్మకు నిలయమైన స్థానమని
కాయములోనే దైవము కొలువుతీరి ఉన్నాడని... జీవికి కైవల్యమునిస్తాడని
దేవాలయమందు దాగి వున్న రహస్యాలు తెలుపగా
ఆ దేవుడే భగవంతునిగా వెలిసెనుగా...ఆ
దేవాలయమందు దాగి వున్న రహస్యాలు తెలుపగా
ఆ దైవమే గురువుగా ఇల చేరెనుగా
చరణము 2:
-------
ఆదిలోన ఆత్మనుండి జీవాత్మే విడివడుటను టెంకాయను కొట్టి రెండుగా చీల్చంగా
ఇకనైనా యోగముతో ఆత్మైక్యము కావాలని హస్తములే నమస్సుతో జోడించంగా
మనోవాంఛలన్నిటినీ తలభారముగానే పోల్చి తలనీలాలను పూర్తిగా తొలగించంగా
కర్మరంగునంటించే తమోరజస్సత్వములను తాంబూలముగా దైవముకర్పించంగా
ప్రకృతి బంధము వీడగా ప్రదక్షిణలు చేయాలని
ఊరెరిగించగ గురువుకి పూలమాల వేయాలని
తలలో శట్ గుణద్వయమే శఠగోప్యము కావాలని
తైలములో జతవత్తులు దీపముగా కలపాలని
హారతిగా జీవాత్మే పరమాత్మను చేరాలని
గోపురమున దాగియున్న గోపనములనే తెలుపంగా
ఆ గోవిందుడే ఆనందునిగా వెలిసెనుగా
కోవెలలో కార్యములను జీవులకే వివరించంగా
కొండల కోనేటిరాయడే కదిలొచ్చెనుగా
ఆరాధనలెన్నున్నా అంతరాత్మకొరకేనని
దైవగ్రంథ సారమంత దేహమునే చూపునని
మహర్షకై ఏడుకొండలంటి కాడులెక్కాలని
మనోబుద్ధులందు ధ్యాస ఆత్మకే మరి దక్కాలని
అక్షర పురుషునికొరకై ఉపవాసము చేయాలని...
అపుడే ఉపదేశములో పురుషోత్తముడే ప్రాప్తించుననీ ... ఆ పురుషోత్తముడే ప్రాప్తించుననీ
దేవాలయమందు దాగి వున్న రహస్యాలు తెలుపగా
ఆ దేవుడే భగవంతునిగా వెలిసెనుగా...ఆ
దేవాలయమందు దాగి వున్న రహస్యాలు తెలుపగా
ఆ దేవుడే గురువుగా దిగివచ్చెనుగా ...
ఆనందుడే ఆచార్యునిగా వెలిసెనుగా ... పరమాత్ముడే ప్రబోధుడై ఇల చేరెనుగా ...