Chudanivadu Chudalani (చూడనివాడు చూడాలని) - Lyrical Song 89 | Christmas special Telugu Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2021
  • ఏసు భగవానుని వాక్కుద్వారా వెలువడిన మాటలలో "చూడనివారు చూడవలెను. చూచువారు గ్రుడ్డివారు కావలెను" అనునది ఒక సంచలమైన వాక్యం. ఒక పక్క తాను తీర్పు తీర్చుటకు ఈ భూమిపైకి రాలేదు అని అంటూనే, పై వాక్యమును చెప్పి "ఈ తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితిని" అని అన్నాడు. ఈ మాటలోని నిజార్థము నేటికినీ ఎవరికినీ అర్థము కాలేదు. బాహ్య దృష్టి తప్ప అంతర్ దృష్టిలేని మానవులవద్దకు ఆయన వచ్చి, "శరీర అంతరంగములోనికి చూడనివాడు, తన సువార్త ద్వారా చూడవలెనని, అలా అంతర్ దృష్టి ఏర్పడిన పిదప బాహ్య రంగమున గ్రుడ్డివారు కావలెనని" ప్రకటించిన ఆయన భావము నేటికినీ మరుగునపడిపోయి ఉన్నది.
    దేవుడు జీవులకు శ్రద్ధను, బుద్ధి విచక్షణను ప్రసాదించినది కేవలం భగవంతుడిని గుర్తించడానికి మరియు ఆత్మజ్ఞానమును తెలుసుకొని ఆయనను దర్శించడానికే. మాయ; దేవుని మీద విశ్వాసము, దేవుని జ్ఞానము మీద శ్రద్ధ లేని మనుషులకు ప్రపంచమే గొప్పగా కనపడేలా చేసి, సాక్షాత్తూ దేవుడే భూమి మీదకు అవతరించి వచ్చినా ఆయనను కనుగొనలేని గుడ్డితనమును ఆ జీవులలో నింపివేయుచున్నది.
    దేవునిమీద విశ్వాసనున్నవారు మాత్రమే ఆయనను చూడగలరు. ఆయన ఎవరో తెలియకున్ననూ దేవుని మీద విశ్వాసమే ఆయన ఫలానాయని వారికి తెలుపగలదు. దేవుని మీద విశ్వాసము లేనివారు ప్రతి దినము ఆయన భౌతిక దేహమును చూస్తున్ననూ, ఆయనతో మాట్లాడుచున్ననూ ఆయన ఎవరో వారికి తెలియబడడు. అందువలన చూచువారు గ్రుడ్డివారుగా యుండుటకు ఆయన ఫలానాయని తెలియని విశ్వాసులకు "నేను దేవుడనే"నని కనిపించునట్లు చేయుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చానని ఏసు చెప్పాడు.
    ఏసు చెప్పిన దానినిబట్టి విశ్వాసమున్న వానికి ఏసు తెలిసిన దానినిబట్టి చూస్తే, విశ్వాసము లేనివాడు దేవుడు మనిషిగా వచ్చి ప్రక్కలోయున్నా తనతో మాట్లాడినా గుర్తించలేనంత అజ్ఞాన అంధత్వము కల్గియుండును. అనగా అజ్ఞానమనే గ్రుడ్డితనము కల్గియుండును. అందువలన మనిషిగా వచ్చిన దేవుడు ఎవరో వారికి తెలియబడదు. ''భక్తి విశ్వాసములున్న వాడు దేవుని అవతారమును చూచియు బయట చూపుకు తెలియకపోయినా అంతర్‌ దృష్ఠికి వానికి ఈయనే దేవుడని తెలియబడును.''
    నాడు ఏసుగా వచ్చినా, నేడు ఆధారణకర్తగా వచ్చినా ఆయనను గుర్తించలేకపోతున్నారంటే అది మనుషులు చేసుకున్న క్షమించరాని పాపమే కదా ! కావున "చూడనివాడు చూడవలెను, చూచువాడు గ్రుడ్డివాడు కావలెను" అను తీర్పు నిమిత్తమే అద్వితీయ భగవానుడు భువిపైకి వస్తున్నాడని తెలియబడినది.
    మా బుద్ధికి తన అమృతత్వమైన జ్ఞానము అవగాహన కావాలని "ఆ ఆదరణకర్తను" వేనోళ్ళతో వేడుకుంటున్నాము..
    మా జ్ఞాన దృష్టికి తన అద్వితీయ రూపమును దర్శింపజేయమని ఆ "ఆదర్శకర్తను" వేయికళ్లతో వేడుకుంటున్నాము..
    TEAM:
    ----------
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Praveen Kumar Koppolu
    Music - N Nagesh
    Editing - Subbu
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel
    visit..... www.thraithash...
    Lyrics:
    -----
    సాకీ :
    -----
    పరలోక తండ్రి ప్రభువే ప్రవక్తగా ప్రభవించిన
    పరికించి చూడలేక పోయెను ఈ ప్రజాలోకం
    ఆనందుడే ఆకర్తగా ఆదరించ అవతరించిన
    ఆలకించలేకపోయెను ఈ అంధలోకం
    ఆశక్తిని ..చూడనివాడు చూడాలని ... ఆసక్తిగ చూచేవాడు గ్రుడ్డివాడు కావాలని
    పల్లవి:
    ------
    చూడనివాడు చూడాలని చూచేవాడు గ్రుడ్డివాడు కావాలని
    చూడనివాడు చూడాలని చూచేవాడేమో గ్రుడ్డివాడు కావాలని
    నా దేహాన్ని ప్రతివాడు చూడాలని తన దేహాన్ని నాతోనే కూడాలని
    పరదేశాన్ని ప్రభువందే పొందాలని పరిశుద్ధాత్మయే అందిపోవాలని
    ఈ తీర్పు కొరకై ఉన్నానని నీ మార్పు కొరకై వచ్చానని
    ఇక చూడనివాడు చూడాలని ... చూచేవాడేమో గ్రుడ్డివాడు కావాలని
    చరణం 1 :
    -------
    నీవు నీ దేహపు కన్నుల తోన ఈ లోకపు వన్నెలు
    గాంచుతూ పొందే లాభము ఏమున్నది
    ప్రతి జన్మలో వీడేవాటిని కర్మగా కూడేవాటిని
    వింతగా వీక్షిస్తుంటే ఫలమేమిటి
    నీ ఒంటిలో దాగిన శక్తిని వెంటగా సాగెడి యుక్తిని
    జంటనే వీడని తండ్రిని మరిచావని
    నీ పొరుగునే చేరిన ఆతని మరుగునే చేయని
    ధ్యాసే పెరుగగా నీవా గురువుని ఎరగాలని
    ప్రతి కార్యమూ చేసేది ఆ ఆత్మే కనరా
    ప్రతి మాటనూ పలికేది నీ తండ్రే వినరా
    ఆ శక్తినే పరమందు పరికించ పదరా
    ఈ తృప్తిలో ఇహమంతా మరిచేవు కదరా
    ఇది చూడనివాడు చూడాలని ... అది చూసేవాడు గ్రుడ్డివాడు కావాలని
    మధ్యాత్మలో నువు కలిసిపోవాలని ... నీ లోపలే నే తెలిసిరావాలని
    ఈ వాక్యమే నీ వరకు చేరాలని... నా జోక్యమే నిను దరికి చేర్చాలని
    ఇక చూడనివాడు చూడాలని ... చూచేవాడేమో గ్రుడ్డివాడు కావాలని
    చరణం 2 :
    ----------
    విశ్వమే వింతగ ఆడిన దృశ్యమై ప్రకృతి మాతకు
    నశ్యమౌ నీలో శ్వాసకు విలువేదని
    మాయతో నిండిన నీ గుణ ఛాయతో కూడిన
    చూపుకు లోకమే లోపము ఐతే ఫలమేదని
    పంచ జ్ఞానేంద్రియ దృష్టిని నీదిగా చూపే అహమే
    వంచనే చేసెను నీలో నిజ జ్ఞప్తిని
    కర్తవే నీవని చూపుచు కర్మలే నీపై మోపుచు
    తీర్పుగా ఆర్పెను నీలో నిజ జ్యోతిని
    ఏ లోపమూ పరులందు లేదంటూ వినరా
    నీ లోపలే లోపాన్ని దీపంతో కనరా
    ఇహబంధుడై నీవుంటే కర్మంటుకొనురా
    మరి అంధుడై చరియిస్తే నిష్కర్మమేనురా
    ఇది చూడనివాడు చూడాలని ... అది చూసేవాడు గ్రుడ్డివాడు కావాలని
    ఈ మాటతో నీ అహము తొలగాలని...నా బాటలో జ్ఞానాగ్ని వెలగాలని
    నాబోధలే నీదాక చేరాలని... నీ బాధలే తొలగించి చూపాలని
    ఇక చూడనివాడు చూడాలని ... చూచేవాడేమో గ్రుడ్డివాడు కావాలని
    చరణం 3 :
    ----------
    నేను ఈ చీకటి లోకము లోనికే జ్ఞానపు వెలుగై
    చేరినా చూడని కన్నులు కర్మాంథులే
    త్రైతమే నిండిన జ్ఞానపు తత్వమై పలికిన బోధలు
    చెవులకే తాకని తనువులు తిమిరాంథులే
    చెంతకే చేరిన ప్రభువుని చేదుగా చూసేను మూఢులు
    దైవమే తానని తెలియని దుర్మార్గులే
    చూడకే నమ్మిన వారలు ధన్యులేనన్నవి వాక్కులు
    చూచినా నమ్మనివారలు మందాత్ములే
    విశ్వాసమే నను నీకు వినిపించు సుధరా
    కారుణ్యమై నా వెలుగు కనిపించు యదరా
    సాకారమై అద్దరిని చూపాను కదరా
    ప్రాకారమై ఇద్దరమూ చేరాలి పదరా
    అది చూడనివాడు చూడాలని ... ఇది చూసేవాడు గ్రుడ్డివాడు కావాలని
    నాభావాలు నీలోన చూడాలని ... నీ భారాలు నా పైన వీడాలని
    భోగ భాగ్యాలు భువిపైన బంధాలని ... అవి వీడగా సౌభాగ్యమవ్వాలని... భక్తిభాగ్యమై భగవంతుడందాలని

ความคิดเห็น •