Gundrani Chandrudu (గుండ్రని చంద్రుడు వచ్చెనుగా...) | Lyrical Song - 126 | Guru Pournami Spl Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • కాలగమనములోని త్రైతశకమున 45వ సంవత్సరములో ప్రవేశించిన సుజ్ఞానులందరికీ "గురు పౌర్ణమి" పర్వదిన సందర్భముగా శుభాకాంక్షలు !!!
    నేటి దినము: మూడవ తారీఖు, ఏడవ నెల (ఆషాఢము - చతుర్థ మాసము) చంద్రుని దినము (సోమవారము) , పౌర్ణమి కలిసి రాగా.... ఇది మహా మహిమాన్వితమైన రోజు అని తెలియవలెను.
    మనుజుడు జరుపుకోవలసిన పండుగలన్నిటిలోనూ అత్యంత శ్రేష్టమైనది, ప్రత్యేకమైనది "గురు పౌర్ణమి"యే అని తెలియవలెను. దేవుడు భగవంతునిగా భువిపై ప్రభవించిన దినము (భగవద్ జన్మ దిన పండుగ) "గురు పూర్ణమునకు" ఆదియై నిలిచి నాంది పలుకగా, అట్టి ఆ భగవానునిలోని "గురుత్వమును" గుర్తించి శిష్యుడు జ్ఞానపూర్ణుడు కావడముతో ఆ "గురు పూర్ణమునకు" పరిపూర్ణత్వము చేకూరును. అప్పుడు ఏర్పడునదే "గురు పౌర్ణమి".
    పంచభూత తత్వములతో ఏర్పడిన త్రైయాత్మలలోని పరమాత్మ, ఆత్మలు రెండూ రెండు సున్నాలుగా (౦ , ౦) చుట్టుకోగా, జీవాత్మ ఒక్కటి మాత్రము అర సున్నాగా (౧) మిగిలిపోయాడు. గోళాకృతికి ఖాళీపడిన ఆ జీవమునకు నిండుతనమును చేకూర్చుటకై గురువు "గుండ్రముగా" (౦) ఉండుటకు నిర్ణయించుకున్నాడు.
    ఆధ్యాత్మిక మార్గమున ప్రయాణమును మొదలుపెట్టిన ఏ వ్యక్తియైనా పొందగలిగిన ఆఖరి గమ్యము "గురువే". అట్టి పథమును గుండ్రమైన ఆకృతిగా భావించిన యెడల, ఆ ఆకృతిని రెండు విధములుగా వివరించి ఈ విధముగా చెప్పవచ్చును,
    ౧. తయారైపోయిన "గుండ్రమునకు ఆది అంత్యములు లేనటుల", "గురువుకు" ఆది అంత్యములు ఉండవు.
    ౨. గీయబడుతున్న "గుండ్రమునకు ఆది అంత్యములు ఉన్నటుల", "శిష్యునకు" ఆది అంత్యములు గలవు.
    గురువు ఎప్పుడూ పరిపూర్ణుడే! కాగా, అసంపూర్ణుడైన శిష్యుడు పూర్ణుడుగా మారవలెను. అట్లు మారుటకు తాను గుండ్రని పథమైన ఆధ్యాత్మికములో ప్రవేశించవలసిందే. గుండ్రని ఆకృతిని గీయునపుడు ఒక చుక్కతో మొదలుపెట్టి గీయుచూపోయి, ఆఖరికి అదే చుక్కవద్దే ముగించవలెను. అలా చేసిన యెడల ఆ గీత పూర్ణమైన గుండ్రమగును. అలాగే ఆధ్యాత్మికమున పూర్ణాత్మను పొందవలెనని ప్రయాణమును మొదలుపెట్టిన జీవుడు, మొదట తనను తాను తెలుసుకొనుటతో ప్రారంభించి, తన శరీర బాహ్య జ్ఞానమునూ, శరీరాంతర్గత సాంఖ్య జ్ఞానమునూ, త్రిగుణాల జ్ఞానమునూ, సప్త కేంద్రములతో కూడిన ఆత్మజ్ఞానమునూ... ఇలా వరుసగా తెలుసుకుంటూ పోయి, ఆఖరికి తనలోనే "గురుత్వమును" దర్శించవలెను.
    అట్లు ప్రయాణమును మొదలుపెట్టిన జీవుడు తన స్థాయిలు మారుతూ జీవాత్మగా, ఆత్మగా పరిణితి చెంది, ఆఖరికి శూన్యమైన శిశుతత్వమును సంతరించుకొని, గురువు చేత శిష్యునిగా ఒప్పుదలను పొందుటచే తన ప్రయాణమును ముగించును. ఆ ప్రయాణము పూర్తి చేయు స్థానములోనికి చేరే సమయమునకు తాను తానుగా ఉండక, గురైక్యమైపోవును. అలా తనలో మొదలై, తనలోనే ముగించబడే ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణమే "గురు పౌర్ణమి" అని గురుగ్రాహ్యమున గుర్తింపబడుచున్నది.
    గురువైన ఆ శ్రీ కృష్ణుడు 126 సంవత్సరములకు, తన శిష్యుడైన మూసా లోనికి ప్రవేశించి ఆతని జీవనమును పూర్ణముగావించెను. దానికి సంకేతముగానే, ఆ గురుదేవుని కృపతో, ఈ 126 వ గీతము గుండ్రముగా మారి మన ముందరకు వచ్చినది. ఇట్టి "గురు జ్ఞాన" గీతమును మనకు ప్రసాదించిన మా గురుదేవులైన "శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల" వారికివే మా సాష్టాంగ దండ ప్రణామములు !!!
    TEAM:
    ----
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Nandhini Chaitanya
    Music - N R Chaitanya Kumar
    Editing - Sai Songa
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel
    LYRICS:
    -----
    సాకీ:
    ---
    నల్లని నింగే వేదికగా ... తెల్లని రంగే వెలిగెనుగా
    శూణ్యమై శిశువే నిశికాగా ... గురుపూర్ణమై జ్ఞానమె మెరిసెనుగా ...పరిపూర్ణుడై గురువే వెలిసెనుగా
    పల్లవి:
    ----
    గుండ్రని చంద్రుడు వచ్చెనుగా ... గురు పౌర్ణమై ఇల కనిపించెనుగా
    గుండ్రని వెన్నెల వెలిగెనుగా ... గురు పున్నమై మనతో మెలిగెనుగా //2
    అంతరంగమును బోధజేయగా ... ఆదిరంగడే అవతరించెగా
    పరంధామమును అందజేయగా.. పూర్ణపురుషుడే ప్రభవించెనుగా
    చంద్రబింబమే పెరుగురీతిగా ...ఇందుజ్ఞానమును వృద్ధిచేయగా..
    సాంద్రసింధు వేదాదికర్తగా .. ఆనందుడు ధర అడుగేసెనుగా ... ఆఆఆ
    గుండ్రని చంద్రుడు వచ్చెనుగా ... గురు పౌర్ణమై ఇల కనిపించెనుగా
    గుండ్రని వెన్నెల వెలిగెనుగా ... గురు పున్నమై మనతో మెలిగెనుగా
    చరణము 1 :
    -----
    నెలపొడుపులలో పుట్టిన పున్నమి వెన్నెల చందంగా
    ఇలకడుపులలో పుట్టిన పురుషుడు గురువై ఎదగంగా
    కృష్ణపక్షమే మారిన శశియే పరిణితి చెందంగా
    గురుపక్షమునే చేరిన శిశువే గురుగతి పొందంగా..
    నింగిన చంద్రకిరణాలే ఇలలో చలువను పంచెనుగా ...
    రంగని ఇందుజ్ఞానాలే తలలో సిలువను వంచెనుగా
    వనమున వృక్షజాలన్నీ వెన్నెల వైద్యమవ్వంగా
    తనువున తృష్ణ తీరేలా తనయుడు వేద్యుడయ్యెనుగా
    మారని ధర్మము చాటే ప్రభువై ... అక్షర మర్మము బోధించెనుగా
    తారల మధ్యన చంద్రుని గురుతై ..
    క్షరునికి మధ్యన గురువై వెలిగెనుగా ... వెలిగెనుగా ..ఆఆఆ
    గుండ్రని చంద్రుడు వచ్చెనుగా ... గురు పౌర్ణమై ఇల కనిపించెనుగా
    గుండ్రని వెన్నెల వెలిగెనుగా ... గురు పున్నమై మనతో మెలిగెనుగా
    చరణము 2 :
    -------
    పూర్ణచంద్రమె పగలూరాత్రులు మారుచు పెరుగంగా
    జ్ఞానకేంద్రమె నాడీగ్రంథులు దాటెను పూర్ణంగా
    మాసవరుడే తామసహరుడై వెలుగును కురియంగా
    మూసధరుడే మానసహరుడై గురువును చేరంగా
    గురువందించు గుప్తాలే పాత్రలుమార్చుకొమ్మనగా
    త్రైతములోని తత్వాలే రాత్రిన కాంతి చిమ్మెనుగా
    శ్వాసల అదిమంత్రాలే నాడుల దారము చేకొనగా
    యాసగ సోమసూత్రాలే గ్రంథుల దారిని చూపెనుగా
    ఇందుత్వముగా చూపే కలిగి ...అంధత్వమునే బాపెను వెలుగై
    యోగాంతముగా గురువే వెలిసి
    సిద్ధాంతముగా శిష్యుని కలిసెనుగా ... కలిసెనుగా ...ఆఆఆ
    గుండ్రని చంద్రుడు వచ్చెనుగా ... గురు పౌర్ణమై ఇల కనిపించెనుగా
    గుండ్రని వెన్నెల వెలిగెనుగా ... గురు పున్నమై మనతో మెలిగెనుగా
    అంతరంగమును బోధజేయగా ... ఆదిరంగడే అవతరించెగా
    పరంధామమును అందజేయగా.. పూర్ణపురుషుడే ప్రభవించెనుగా
    చంద్రబింబమే పెరుగురీతిగా ...ఇందుజ్ఞానమును వృద్ధిచేయగా..
    సాంద్రసింధు వేదాదికర్తగా .. ఆనందుడు ధర అడుగేసెనుగా ...
    గుండ్రని చంద్రుడు వచ్చెనుగా ... గురు పౌర్ణమై ఇల కనిపించెనుగా
    గుండ్రని వెన్నెల వెలిగెనుగా ... గురు పున్నమై మనతో మెలిగెనుగా

ความคิดเห็น •