Ksharaatmane (క్షరాత్మనే అక్షర ఆత్మగా...) | Lyrical Song - 131 | Krishnashtami 11th day spl song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ก.ย. 2023
  • శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగముగా 11 వ రోజైన నేటి శనివార దినమున ఈ జ్ఞాన గీతమును విడుదల చేయడము ఆ "గురు" సంకల్పంగా భావిస్తున్నాము. ఈ పాట ఇప్పటికే ఒకసారి శ్రవణమునకు అనుకూలముగా విడుదల కాగా, నేడు మరొకసారి దృశ్యముతో కూడి కూలంకషముగా విడుదల కావడము గమనార్హమే.
    ఎలాగైతే శ్రీ కృష్ణుని జననము జరిగిన "అష్టమి" తిథికి ప్రత్యేకత కల్గియున్నదో, అలాగే 11 రోజులుగా జరుగు ఆయన జన్మాష్టమి వేడుకలు ముగియు దినమైన, చివరి 11 వ రోజు అనగా "చవితి" రోజుకు కూడా చాలా ప్రత్యేకత కలదు. ఎందుకనగా ఆ దినమునే పందిరిలోని కృష్ణ ప్రతిమను ఊరు ఎరిగించి, ఆ ప్రతిమను తిరిగి ఇంటిలోనికి తెచ్చి పెట్టుకొని ఉత్సవమును ముగించవలెను. కావున, శ్రీ కృష్ణాష్టమి పండుగకు కల ఆది, అంత్య తిథులకు మరియు మధ్యలోగల 11 రోజుల తతంగమునకు ఎంతో విశేషమైన "జ్ఞానర్ధము" కలిగియున్నది. నిశిత దృష్టితో, శరీరాంతర్గత ప్రయాణము చేయపూనుకున్న సత్యాన్వేషకుడైన సాధకునకు మాత్రమే ఈ 11 రోజుల వీధి ఉత్సవముయొక్క పూర్తి జ్ఞానప్రయోజము అర్థమై, అందులోని పరమార్థము తన శరీర హద్దులోనే గోచరించగలదు.
    శ్రీ కృష్ణ అవతారమునకు వెనుక గల రెండు ప్రత్యేక కారణములను తెలుసుకుంటే, అవి:
    ౧. క్షరాత్మలైన (అశుద్ధాత్మలైన) సర్వజీవులకు ఆత్మజ్ఞానబోధచే, అక్షరాత్మను (శుద్దాత్మను) పరిచయము చేయుట!
    ౨. అక్షర యోగముచే అక్షరాత్మగా (శుద్ధాత్మగా) మారిన యోగిని, గురుప్రబోధచే పరమాత్మగా (పరిశుద్ధాత్మగా) చేయుట!
    అష్టమి మోక్షమునకు, చవితి యోగమునకు గుర్తుగాయన్నవి. చవితినాడైన, ఈ 11 వ రోజునే ఊరు ఎరిగించిన ఉత్సవ ప్రతిమను, ఇంటిలోనికి పెట్టుట జరుగుచున్నది. ఊరు ఎరిగించుటయేమో 11 రోజులుగా ఉండి, ఇంటిలోనికి పెట్టుట మాత్రము ఒక్క పూటలో ముగిసిపోయినట్టు మనకు కనపడుతున్నా, ఆది కూడా అంతర్గతముగా 11 రోజుల సమాన పనియని తెలియుచున్నది.
    మోక్ష (అష్టమి) స్వరూపుడైన దేవుడు భగవానునిగా భువిపైకి వచ్చి, యోగిగా (చవితిగా) ప్రవర్తించుచూ మనకు జ్ఞానమును తెలిపిపోవుట, ఊరెరిగింపు కాగా. ఆ జ్ఞానమును విని యోగిగా (చవితిగా) మారిన జీవుడు, ఆ గురుమూర్తిని తన ఇంట స్థాపించు అసలైన దినముయే ఆ జీవునికి మోక్ష (గురు పౌర్ణమి) దినమైయున్నది.
    ఊరు ఎరిగింపునకు వచ్చిన భగవంతుడు తన పాంచభౌతిక దేహమునే పల్లకిగా (వాహనముగా) ఏర్పరచుకొని జ్ఞానబోధచేయుచూ రాగా, ఊరు ఎరిగింపు ముగించి వెనుకకు ఇంటిలోనికి ప్రతిమను చేర్చుటకు, భగవంతుని జ్ఞానము విని పల్లకిగా (వాహినిగా) మారిన దేహముగల శిష్యుడు తన ఇంటిలోనికి ఆ ప్రతిమను తెచ్చిపెట్టుకొనవలెను.
    కావున, ఈ 11 రోజుల కృష్ణాష్టమి వేడుకను అంగరంగ వైభవముగా జరుపుకోబోతున్న ప్రతి త్రైతికీ మా శుభాకాంక్షలు.
    www.thraithash...
    TEAM:
    ---------
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Sunita
    Music - N R Chaitanya Kumar
    Video Composition - Subbu
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel
    LYRICS:
    ---------
    సాకీ:
    గురుగీతలో గలత్రైతమే గ్రహియించుటే తత్వం
    గురుబోధతో ఇలధర్మమే స్థాపించుటే తథ్యం ... సంస్థాపించుటే తథ్యం ...
    పల్లవి :
    క్షరాత్మనే అక్షర ఆత్మగా చేసేదే కృష్ణ తత్త్వం
    ప్రబోధతో పరిశుద్ధాత్మగా మార్చేదే కృష్ణ త్రైతమ్
    క్షరాత్మనే అక్షరాత్మగా చేసేదే కృష్ణ తత్త్వం
    ప్రబోధతో పరిశుద్ధాత్మగా మార్చేదే కృష్ణ త్రైతమ్
    త్రిగుణాల గరళాన్ని తొలగించగా శ్రీగురుడు పంచెను గీతామృతం
    త్రైలోకములు దాటి తరియించగా ఆ త్రైత జ్ఞానమే నిజ వాహనం
    క్షరాత్మనే అక్షరాత్మగా చేసేను కృష్ణ తత్త్వం
    ప్రబోధతో పరిశుద్ధాత్మగా మార్చేను కృష్ణ త్రైతమ్
    చరణము 1:
    మనసందు మలినం మదిలోన చలనం గుణకర్మలే నీ రణం
    అహమందు జననం ఇహమందు మరణం పతనానికే కారణం
    గుణములతో కలనం గురిలేని గమనం భావాలతో బంధనం
    కర్మలలో ఫలనం దరిలేని పయనం బాహ్యన నీ వీక్షణం
    నీ దేహమందే ..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    నీ దేహమందే దైవాన్ని చూపే దీపాన్ని వెలిగించగా
    ఆ దైవ అంశే దేహాన్ని దాల్చి త్రైతాన్ని స్థాపించగా ... భగవద్గీత భాష్యాన్ని రచియించెగా
    క్షరాత్మనే అక్షరాత్మగా చేసేదే కృష్ణ తత్త్వం
    ప్రబోధతో పరిశుద్ధాత్మగా మార్చేదే కృష్ణ త్రైతమ్
    చరణము 2:
    వేదాలగణనం ... వేదనలనిలయం ... తనువంత దుఃఖాలయం
    తమకాన కామం .. తపనేమో అధికం .. తృప్తన్నదే సూన్యం
    అన్యులపై ధ్యానం ... ఆయువంత దానం.. ఆనందమే నాశనం
    భోగాల యాగం .. భగవద్ వియోగం ... భయమందు నీ జీవనం
    పరధర్మమందే ..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    పరధర్మమందే పడియున్న నీకే పరమార్థమే చూపగా
    పరమాత్మ తానే ప్రభవించి గీతా ధర్మాలు ప్రకటించగా ... ప్రబోధాత్మజాలన్ని ప్రవచించెగా
    క్షరాత్మనే అక్షర ఆత్మగా చేసేదే కృష్ణ తత్త్వం
    ప్రబోధతో పరిశుద్ధాత్మగా మార్చేదే కృష్ణ త్రైతమ్
    అద్వైత ద్వైతాలు మరిపించగా ... సిద్ధాంతమిచ్చెను ఆత్మల త్రయం
    హృద్యాన గురుగీతి గురిపించగా ... ఆధ్యాయుడే అవతరించిన శకం
    క్షరాత్మనే అక్షరాత్మగా చేసేను కృష్ణ తత్త్వం
    ప్రబోధతో పరిశుద్ధాత్మగా మార్చేను కృష్ణ త్రైతమ్ ... బరిమార్చేను కృష్ణ త్రైతమ్ .. పరిమార్చేను కృష్ణ త్రైతమ్

ความคิดเห็น •