Yededu Deepa Sthambalapai (ఏడేడు దీప స్తంభాలపై) | Lyrical Song - 136 | Chrismas Spl Song | Dhanunjay
ฝัง
- เผยแพร่เมื่อ 23 ม.ค. 2025
- సమస్త ప్రపంచమునూ సూర్యుడు వెలిగింప జేసినట్లుగా, సంపూర్ణ శరీరమును వెలిగింపజేయువాడు "ఆత్మ" అని ప్రథమ దైవగ్రంథమైన భగవద్గీత (తౌరాత్) లో తెలిపియున్నారు. ఆత్మ శరీరములో అణువణువున ధాతుకణములలో శక్తిగా నిండి శరీరానికి కాంతిని, శక్తిని ఇస్తుంది. శరీరములో ఆత్మశక్తి ఉన్నంతకాలము ఎంతో తేజోవంతముగా కనిపించిన శరీరము, ఆత్మలేకుండా పోయిన వెంటనే తనలో అప్పటివరకు నిక్షిప్తమై వున్న శక్తిని, కాంతిని కోల్పోయి నిర్జీవమైపోతుంది.
అలాగే, ఆత్మ శరీరమునకు దీపముగా ఏవిధముగా వున్నదో, అదే విధముగా గురువు జ్ఞానమునకు వెలుగు (జ్యోతి) గా వున్నాడు. దీపము వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమని పెద్దలు చెప్పినట్లుగా, ఆత్మ శరీరములో వున్నప్పుడే అనగా మనోబుద్ధులకు తన శక్తిని ప్రసరింప జేస్తున్నప్పుడే, ఆత్మజ్ఞానమును అనగా ఆత్మ శరీరములో ఏవిధముగా వున్నది, ఏ పనిచేయున్నది అను సంపూర్ణ జ్ఞానమును తెలుసుకోవలెను. అదే విధముగా గురువు నీ ఎరుకలో వున్నప్పుడే గురువు జ్ఞానమును కూడా తెలుసుకోవలెను. ఈ విషయమును ప్రభువు వారు "హెచ్చరిస్తూ" ఈ విధముగా చెప్పుచున్నారు చూడండి,
యోహాను సువార్త 12:35. అందుకు యేసు ― ఇంక కొంత కాలము వెలుగు మీ మధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడువుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు.
యోహాను సువార్త 12:36. మీరు వెలుగు సంబంధులగునట్లు (వెలుగు కుమారులగునట్లు) మీకు వెలుగుండగనే వెలుగు నందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.
"భగవంతుడే నిజ గురువు కావున, ఆయన కొంతకాలము భౌతికంగా, కొంతకాలము అభౌతికముగా ఉంటాడు", అని శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారు ప్రబోధ తరంగములు అను గ్రంథములో చెప్పియున్నట్లుగానే, గురువు ఎప్పటికి వుండే వ్యక్తే అయినప్పటికీ ఆయన భౌతికముగ కొంతకాలమే వుంటారు. ఏలననగా! భౌతిక శరీరము ఎప్పటికైనా లేకుండా పోవడమనేది దేహ ధర్మము. కావున గురువు భౌతికముగ వున్న ఆ కాలము ఎరుకలో వున్నవారు, వారి ఎరుక కోల్పోక ముందే గురువు జ్ఞానమును తెలుసుకుని, ఇతరులకు కూడా తెలియజేయవలెను. ఇదే విషయమునే ప్రభువు వారు ఇలా "ఎరుకపరుస్తూ" చెప్పియున్నారు చూడండి.
యోహాన్ సువార్త, 1:9 నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు అది ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.
యోహాన్ సువార్త, 8:12 నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను.
మత్తయి సువార్త 10:27. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి.
లూకా సువార్త 8:16. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభము మీద దానిని పెట్టును.
కాబట్టి ఉన్న కొద్ది కాలములో జ్ఞానమును సంపూర్ణముగా తెలుసుకుని జ్ఞానజీవితమును గడుపవలెను. అలా సంపూర్ణ ఆత్మ జ్ఞానమును తెలుసుకొనగోరువారు, ఆ ఆత్మను రెండు విధములుగా అధ్యయనము చేయవలెను:
౧. పూర్ణాత్మ స్వరూపమైన - మధ్యాత్మగా (౬) | అధ్యయనము చేయువాడు జీవాత్మ (౩)
౨. స్వాత్మ సోహమైన - గురాత్మగా (౬) | అధ్యయనము చేయువాడు శిష్యాత్మ (౩)
ఒక సజీవ దేహములోనే ఈ రెండు అధ్యయనములూ జరుగవలెను. అందుకొరకే, దేహములోని ఈ 66 కు ప్రాముఖ్యతను కలుగజేయుచూ, తౌరాత్ గ్రంథము 66 వ శ్లోకంతో ముగియగా, ఇంజీలు గ్రంథము 66 వ పాఠముతో ముగుస్తుంది. అలాగే ఆ సజీవుని రెండు అధ్యయనములకూ గుర్తైన 33 కు కూడా ప్రభువువారు తన జీవితములో ఎంతో ప్రాముఖ్యతను కల్గుజేసియున్నారు.
ఈ గీతములో ఎవరికీ అంతుబట్టని "ఆధ్యాత్మిక దేహ సామ్రాజ్యములో" గల రహస్య స్థావరములను, వాటిని చేర్చగల రహస్య మార్గములను, రహస్య గురువునే దీపముతో దర్శించి వ్రాయుట జరిగినది. "ఎప్పుడైతే అంతరంగమున అదృశ్యమైన "గ్రంథి ప్రకటన" జరుగుతుందో, అప్పుడే బహిరంగమున "ప్రకటన గ్రంథము" దృశ్యరూపమై ప్రకటింపబడుతుంది" అను గురువాక్కుకు సజీవము పోయుచూ, నేడు ఈ గీతము శిష్యదర్పణమై మన ముందుకు వచ్చినది.
ఇంతటి అదృష్టమును మనకు ప్రసాదించిన "జగత్ గురుదేవులైన" శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి మా హృదయపూర్వక సాష్టాంగ ప్రణామములు.
TEAM:
---------
Lyricist - Siva Krishna Kogili
Singer - Dhanunjay
Music - Nagesh
Video Composition - Sai Songa
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel