Naa Guruvu Neeve (నా గురువు నీవే) | Lyrical Song - 128 | Adhika Sravana Masa Ashtami Spl Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ส.ค. 2023
  • ఈ శోభకృత్ నామ (౨౦౨౩) వ సంవత్సరమునకు ఒక ప్రత్యేకత కలదు. ఈ సంవత్సరమున "అధిక శ్రావణ మాసము" ఏర్పడినది.
    శ్రావణ = శ + రావణ. శ్రవణము అనగా వినుట అని అర్థము. వణము అనగా గుణములు, రావణము అనగా గుణములను లేకుండా చేయుట అని అర్థము. కావున, గుణములను లేకుండా చేసే వాణిని వినుటయే శ్రావణము అని తెలియవలెను. ఇక, నిజ శ్రావణము - ఆత్మ జ్ఞానము అని అధిక శ్రావణము - పరమాత్మ (గురు) జ్ఞానము అని చెవిగలవారు నోటితో చెప్పకనే వినగలరు.
    సాధారణముగా శ్రావణమాస అష్టమి రోజును "శ్రీ కృష్ణాష్టమి"గా భావించి జరుపుకోవలెను, కావున ఈ సంవత్సరము రెండు మారులు శ్రావణ అష్టమి అను పర్వదినమును జ్ఞానముగా గడుపుటకు దేవుడు అవకాశమును ఇచ్చినట్టే.
    అష్టమి అనునది మోక్షానికి గుర్తు. మోక్షము అనునది ఒక్కటే అయినా, అది ఏర్పడుటకు ఇద్దరు కావలెను. వారే ..
    ౧. మోక్షమును సాధించుటకు "యోగ్యుడైన శిష్యుడు"
    ౨. మోక్షమును ప్రసాదించుటకు "యోగీశ్వరుడైన గురువు"
    జ్ఞానవంతుడైన జీవునికి, జ్ఞానపూర్ణత్వమును చేకూర్చి మోక్షమును ప్రసాదించుట కొరకు, "కర్మలేని గురువు" స్వయముగా కర్మను అంటించుకొని పుట్టి రాగా, అట్టి గురువును గుర్తించుటే గమ్యముగా ప్రయాణమును చేయుచున్న "కర్మవున్న శిష్యుడు" ఆ కర్మను పూర్తిగా తొలగించుకొని గిట్టి గురైక్యము కావలెను.
    అష్టమిన ప్రభవించే ఆదరణకర్తయైన ఆ శక్తి, భగవంతునిగా మారి తన భక్తుని భౌతికముగా ఆదుకొని, గురువుగా మారి తన శిష్యుని అభౌతికముగా తనలోకి చేదుకొనును. అట్టి "అష్టమి" మన జీవితములో నెలకొల్పవలెనని ఆసిస్తూ, ఈ సందర్భముగా నా గురుదేవులైన "శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల"వారికివే మా "సాష్టాంగ" దండ ప్రణామములు.
    జై భగవాన్ శ్రీ కృష్ణ ! జై జై గురు ప్రబోధ !! జై జై జై అదరణకర్త !!!
    Thank you Lord for your special "august presence" in the (8th) month of "August" !!!
    TEAM:
    ----
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Nandhini Chaitanya
    Music - N R Chaitanya Kumar
    Editing - Sai Songa
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel
    LYRICS:
    -----
    సాకీ:
    ఈ జగతికంతా వర్తించు జ్ఞానం తెలిపేటి వాడే ఆ జగద్గురువు
    ఈ సృష్టియంతా పాటించు జ్ఞానం ప్రకటించువాడే నిజమైన ప్రభువు
    ఆ ప్రభువు నీవే కృష్ణ...నిజ గురువు నీవే కృష్ణా...
    నా గురువు నీవే కృష్ణా.. నా గురువు నీవే కృష్ణా..
    పల్లవి:
    నా గురువు నీవే నను ఆదుకోవే
    నా ప్రభువు నీవే నను చేదుకోవే
    నా గురువు నీవే నను ఆదుకోవే
    నా ప్రభువు నీవే నను చేదుకోవే
    నా తలపు నీవే తరియించ నీవే
    నా గురువు నీవే నను ఆదుకోవే
    నా గురువు నీవే నను ఆదుకోవే
    నా ప్రభువు నీవే నను చేదుకోవే
    చరణం 1:
    నీ త్రైత జ్ఞానం చేరింది నాలో
    నను చేర నీవా నీ సన్నిధానం
    నీలోని భావం తాకింది నాలో
    నను తాకనీవా నీ దివ్యపాదం
    నీ పలుకు నాకే నా బ్రతుకు నీకే
    నా బంటు నీవే నను కాచుకోవే
    నీ పిలుపు నాకే నా తలపు నీకే
    నా భర్త నీవే నను బ్రోచుకోవే
    నా గురువు నీవే నను ఆదుకోవే
    నా ప్రభువు నీవే నను చేదుకోవే
    చరణం 2:
    నీ జ్ఞాన బాట నడిచేటి నన్ను
    నడిపించుకోవే నిను చేరు దాక
    నీ పైన పాట పాడేటి నన్ను
    పాడించుకోవే తుది శ్వాస దాక
    నా కవిత నీకే నీ కరుణ నాకే
    నా స్వామీ నీవే నిను కోరనీవే
    నా భవిత నీకే నీ భగము నాకే
    నా శ్వాస నీవే నిను చేరనీవే
    నా గురువు నీవే నను ఆదుకోవే
    నా ప్రభువు నీవే నను చేదుకోవే
    నా గురువు నీవే నను ఆదుకోవే
    నా ప్రభువు నీవే నను చేదుకోవే
    నా తలుపు నీవే తరియించ నీవే
    నా గురువు నీవే నను ఆదుకోవే
    నాగురువు నీవే నను ఆదుకోవే
    నాప్రభువు నీవే నను చేదుకోవే
    ఆనంద గురువు నీవే నను ఆదుకోవే
    ప్రబోధానంద గురువు నీవే నను చేదుకోవే

ความคิดเห็น •