శరణము కృష్ణా ... నీకై అరణమే తృష్ణ | Lyrical Song - 106 | Sri Krishnashtami spl | Krishna Devotional

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025
  • అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భముగా శుభాకాంక్షలు.
    ఈ చరాచర సృష్టికంతటికీ కర్తయైన, విశ్వమంతటికీ అధికర్తయైన "పరమాత్మ", భౌతికమైన గురువుగా మారి భూమిపై భగవంతునిగా జన్మించుటకు వెనుక ఒకే ఒక లక్ష్యము కలదు, అదేమనగా "ధర్మాన్ని సంస్థాపన చేయడం".
    ధర్మ సంస్థాపనము చేయడము అటు క్షరుడైన జీవునితరము కానీ, ఇటు అక్షరుడైన మధ్యాత్మ తరముకానీ కాదు. అత్యంత శ్రేష్టమైన ఆ పనిని ఉత్తమ పురుషుడైన పరమాత్మయే, "పురుషోత్తమునిగా" మారి, అద్వితీయుడైన ఆయనే "ద్వితీయునిగా" మారి చేయవలెను.
    పరమాత్మకు రూప, నామ, క్రియలు లేవు, ఆయన ధర్మములకు కూడా అతీతమైనవాడు. అట్టి స్థితిలోయుండు ఆయన సృష్టి ఆదిలోనే ధర్మములు లేని అతను తనకు కూడా ఎవరి అంచనాలకూ అందని, ఎవరి భావములకూ బద్ధము కానీ, ఎవరి యోచనలకూ చిక్కని... ఒక లక్ష్యమును ... ఒక ధర్మమును ... ఒక నియమమును ఏర్పరచుకున్నాడు. అదేమనగా, జన్మలేని తాను భగమునుండి సజీవంగా జన్మించి, రూపములేని అతను భౌతికమైన దేహమును ధరించి, అనంతమైన తన అంశలనుండి ఒక్క అమోఘమైన అంశగా పుట్టి, కార్యములు లేని అతను ధర్మసంస్థాపనమనే అద్భుత కార్యమును చేసి, నాశనములేని అతను దేహములోనే దివ్యముగా అణిగిపోవును.
    అలా పరమాత్మయే భౌతిక భగవంతునిగా ధర్మసంస్థాపన చేయుటకు వచ్చినప్పుడు, ఆయనను పూర్ణ గురువుగా గుర్తించి, ఆయనకొరకు మనోబుద్ధులను, ధన, మాన, ప్రాణ సర్వములనూ అర్పించి ఆయన కొరకే మరణించేంత భావముపొందిన వాడు, ఆయనకు పూర్ణ శిష్యుడు కాగలడు. అట్టివాడే ఆయనలోనికి చేరిపోవుటకు అర్హతను సంపాదించగలడు. అదియే ఈ సృష్టిలోకెల్లా అత్యంత అరుదైన, దుస్సాధ్యమైన, దుర్లభమైన అవకాశము.
    అట్టి ఆ అవకాశమును అదృష్టముగా ప్రసాదించమని ఆ దేవదేవుడైన శ్రీ కృష్ణుని ఈ పాటరూపములో శరణు వేడడము జరిగినది.
    కృష్ణం ౧౦౦ (వందే) జగద్గురుమ్ !!!
    TEAM:
    ----------
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Dinesh (Chennai)
    Music - N R Chaitanya Kumar
    Editing - Saleem
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel
    LYRICS:
    -----------
    సాకీ :
    -----
    ధర్మము నిలిపే దైవము నీవు ... కర్మల మునిగే జీవము నేను
    నాకై నీవు దిగివచ్చావు .... నీకే నేను మనసిస్తాను ... కృష్ణా... నీకై నేను మరణిస్తాను
    పల్లవి :
    -------
    ఒకే ఒక లక్ష్యం ధర్మస్థాపనం
    ఒకే ఒక సాక్ష్యం దివ్య దర్శనం
    ఒకే ఒక దీపం ఆత్మ ప్రబోధం
    ఒకే ఒక రూపం భగవదాత్మజం
    శరణము కృష్ణా నీవే శరణము కృష్ణా
    శరణము కృష్ణా నీకై మరణమే తృష్ణ
    ఒకే ఒక మార్గం జ్ఞానవాహనం
    ఒకే ఒక సత్యం ఆత్మదర్శనం
    ఒకే ఒక గమ్యం గురుప్రబోధనం
    ఒకే ఒక జీవం గురునిసాధనం
    శరణము కృష్ణా నీవే శరణము కృష్ణా
    శరణము కృష్ణా నీకై మరణమే తృష్ణ
    చరణము 1 :
    ----------
    జన్మ లేని నీవు జన్మమెత్తినావు
    జగతి మేలు కోరి జపరనిచ్చినావు
    గుణము లేని నీవు గుణము కూడినావు
    గురుని రూపు దాల్చి మా గుణములణచినావు
    రుణములేని నీవు రణము కేగినావు
    అవధి లేని నీవు అవని జేరినావు
    రుణములేని నీవు రణము కేగినావు
    అవధి లేని నీవు అవని జేరినావు
    అద్వితీయమైన పరమశక్తి నీవు
    ద్వితీయునిగ మారి పథము జూపినావు
    ప్రబోధామృతా నీవే శరణము కృష్ణా
    శరణము కృష్ణా నీవే శరణము కృష్ణా
    శరణము కృష్ణా నీకై మరణమే తృష్ణ
    ఒకే ఒక శాస్త్రం గీతామృతం
    ఒకే ఒక సూత్రం ఆత్మార్పణం
    ఒకే ఒక నేత్రం సర్వ దర్శనం
    ఒకే ఒక త్రైతం నీ నిదర్శనం
    శరణము కృష్ణా నీవే శరణము కృష్ణా
    శరణము కృష్ణా నీకై మరణమే తృష్ణ
    చరణము 2 :
    --------------
    జనులజేరి నేను పతిని విడచినాను
    జన్మలందు నే నా స్థితిని మరచినాను
    పథములేని నే నీ గతిని కోరినాను
    జగతి దాటవేసే జతను వేడినాను
    నా మనస్సు నీవై నా తపస్సు నీవై
    నా ఉషస్సు నీవై నా యశస్సు నీవై
    నా మనస్సు నీవై నా తపస్సు నీవై
    నా ఉషస్సు నీవై నా యశస్సు నీవై
    సర్వ కాలమందు నీదు స్మరణ నివ్వు
    నిర్వికారమొందే యోగక్షేమమివ్వు
    ప్రబోధామృతా నీవే శరణము కృష్ణా
    శరణము కృష్ణా నీవే శరణము కృష్ణా
    శరణము కృష్ణా నీకై మరణమే తృష్ణ
    ఒకే ఒక లక్ష్యం మోక్షసాధనం
    ఒకే ఒక సాక్ష్యం కర్మ నాశనం
    ఒకే ఒక మార్గం గురుని శాసనం
    ఒకే ఒక గమ్యం పరమ పావనం
    శరణము కృష్ణా నీవే శరణము కృష్ణా
    శరణము కృష్ణా నీకై మరణమే తృష్ణ
    శరణము కృష్ణా నీవే శరణము కృష్ణా
    శరణము కృష్ణా నీకై మరణమే తృష్ణ
    నీకై మరణమే తృష్ణ ... కృష్ణా ... కృష్ణా ... కృష్ణా ... నీకై అరణమే తృష్ణ

ความคิดเห็น •