Krishna Thathvam - Thraitham (క్షరాత్మనే అక్షర ఆత్మగా) | Video Making Song - 129 | Singer : Sunita

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2023
  • ఈ అనంత సృష్టిలో నిరంతరాయముగా జరుగుచున్న ఈ త్రైతాత్మల ప్రయాణానికి ఆదిలోనే.. అనగా సృష్ట్యాదిలోనే, జీవాత్మ పరమాత్మ తత్వముతోనే ఆవిర్భవించాడు. కానీ, ప్రభవించిన మరుక్షణమునుండి జీవములోని భావము ప్రాకృతిక చింతనపై లగ్నముకావడము వలన, తనలోని పరమాత్మతత్వమును కోల్పోవుచూవచ్చి, ఆఖరికి ప్రకృతి తత్వములో మమేకమైపోయినది.
    కాగా! అటు దైవ తత్వానికీ, ఇటు దేహ తత్వానికీ వారధివంటి మధ్యాత్మ, జీవమతమే తనకు కూడా సమ్మతమని తలచి, జీవుడు ఏ మతములో ఉంటే ఆ మతములోనే ఆతని నడిపించుటను చేయుటవలన, జీవాత్మ తనలోని ఆత్మతత్వమును పూర్తిగా మరచిపోయి, ఉత్త "జీవుడు" గా మిగిలిపోయాడు.
    ఈ నేపథ్యంలో పరమాత్మలోని ఒకానొక అంశ "ఆత్మ" అను ప్రత్యేక పేరును తగిలించుకొని, జీవాత్మకు పరమాత్మకు మధ్య వారధియైన మధ్యాత్మనే, సారధిగా మార్చి జీవమతమును అంతమొందించి, దైవపథమును పునఃప్రతిష్ఠ చేయనారంభించింది. అలా, సృష్టిలోనికి వచ్చి చేరినదే "కృష్ణ త్రైతం" అనే "కృష్ణ తత్త్వం".
    ఇలా సృష్టిలో పాంచభౌతిక ప్రకృతిని మరియు త్రిగుణాత్మకమైన మాయను ఆధారము చేసుకొని పరిభ్రమిస్తున్న త్రైతాత్మల యొక్క గుట్టును, అదే ప్రకృతిని అధిష్టించి, అదే మాయతోనే సంభవించి వచ్చి పుట్టిన ఆ దైవము, "త్రైతాత్మ బోధగా" గీతను తెలిపి రట్టు చేసాడు. అలా గురు గీతలో గుప్తముగా చెప్పబడియున్న మూడు ఆత్మల సిద్ధాంతవరమైన జ్ఞానమే "కృష్ణ తత్త్వం".
    ఎపుడెపుడు మానవుడు ఈ కృష్ణ తత్వమైన త్రైతమును మరిచిపోతాడో, అప్పుడప్పుడంతా ఆ కృష్ణుడే గురువుగా అవతారము దాల్చి వచ్చి పుట్టి తిరిగి తనదైన ఆ కృష్ణ తత్వమును సృష్టిలో సంస్థాపించిపోతాడు. ఇది యుగములు మారినా జగములు గడచినా, మారని "దైవ నిర్ణయం".
    అలా గురువు భగవంతునిగా అవనిపై ఆవిర్భవించిన అద్భుత సమయమైన ఈ "త్రైత శకమున" త్రైత సిద్ధాంత జ్ఞానమును తెలుసుకొంటూ, తదనుగుణముగా శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకను జరుపుకుంటున్న సర్వ ఇందు జ్ఞానులకూ ఇవే మా శుభాకాంక్షలు !!!
    జై శ్రీ కృష్ణ | జై జై శ్రీ కృష్ణ !!
    TEAM:
    ---------
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Sunita
    Music - N R Chaitanya Kumar
    Video Composition - Subbu
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel
    LYRICS:
    ---------
    సాకీ:
    గురుగీతలో గలత్రైతమే గ్రహియించుటే తత్వం
    గురుబోధతో ఇలధర్మమే స్థాపించుటే తథ్యం ... సంస్థాపించుటే తథ్యం ...
    పల్లవి :
    క్షరాత్మనే అక్షర ఆత్మగా చేసేదే కృష్ణ తత్త్వం
    ప్రబోధతో పరిశుద్ధాత్మగా మార్చేదే కృష్ణ త్రైతమ్
    క్షరాత్మనే అక్షరాత్మగా చేసేదే కృష్ణ తత్త్వం
    ప్రబోధతో పరిశుద్ధాత్మగా మార్చేదే కృష్ణ త్రైతమ్
    త్రిగుణాల గరళాన్ని తొలగించగా శ్రీగురుడు పంచెను గీతామృతం
    త్రైలోకములు దాటి తరియించగా ఆ త్రైత జ్ఞానమే నిజ వాహనం
    క్షరాత్మనే అక్షరాత్మగా చేసేను కృష్ణ తత్త్వం
    ప్రబోధతో పరిశుద్ధాత్మగా మార్చేను కృష్ణ త్రైతమ్
    చరణము 1:
    మనసందు మలినం మదిలోన చలనం గుణకర్మలే నీ రణం
    అహమందు జననం ఇహమందు మరణం పతనానికే కారణం
    గుణములతో కలనం గురిలేని గమనం భావాలతో బంధనం
    కర్మలలో ఫలనం దరిలేని పయనం బాహ్యన నీ వీక్షణం
    నీ దేహమందే ..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    నీ దేహమందే దైవాన్ని చూపే దీపాన్ని వెలిగించగా
    ఆ దైవ అంశే దేహాన్ని దాల్చి త్రైతాన్ని స్థాపించగా ... భగవద్గీత భాష్యాన్ని రచియించెగా
    క్షరాత్మనే అక్షరాత్మగా చేసేదే కృష్ణ తత్త్వం
    ప్రబోధతో పరిశుద్ధాత్మగా మార్చేదే కృష్ణ త్రైతమ్
    చరణము 2:
    వేదాలగణనం ... వేదనలనిలయం ... తనువంత దుఃఖాలయం
    తమకాన కామం .. తపనేమో అధికం .. తృప్తన్నదే సూన్యం
    అన్యులపై ధ్యానం ... ఆయువంత దానం.. ఆనందమే నాశనం
    భోగాల యాగం .. భగవద్ వియోగం ... భయమందు నీ జీవనం
    పరధర్మమందే ..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    పరధర్మమందే పడియున్న నీకే పరమార్థమే చూపగా
    పరమాత్మ తానే ప్రభవించి గీతా ధర్మాలు ప్రకటించగా ... ప్రబోధాత్మజాలన్ని ప్రవచించెగా
    క్షరాత్మనే అక్షర ఆత్మగా చేసేదే కృష్ణ తత్త్వం
    ప్రబోధతో పరిశుద్ధాత్మగా మార్చేదే కృష్ణ త్రైతమ్
    అద్వైత ద్వైతాలు మరిపించగా ... సిద్ధాంతమిచ్చెను ఆత్మల త్రయం
    హృద్యాన గురుగీతి గురిపించగా ... ఆధ్యాయుడే అవతరించిన శకం
    క్షరాత్మనే అక్షరాత్మగా చేసేను కృష్ణ తత్త్వం
    ప్రబోధతో పరిశుద్ధాత్మగా మార్చేను కృష్ణ త్రైతమ్ ... బరిమార్చేను కృష్ణ త్రైతమ్ .. పరిమార్చేను కృష్ణ త్రైతమ్
    Singer Notes:
    -------------------
    ఈ పాటను "సునీత"గారు చాలా అద్భుతంగా పాడారు. తను ఈ పాటను బాగా ఇష్టపడటమే కాక, ఈ పాటలోని గొప్ప సాహిత్యముతో కూడిన శృతి, లయల వలన ... పాడుతున్నప్పుడు తనకి గొప్ప అనుభూతి కలిగింది అని చెప్పారు. ముఖ్యంగా "ప్రబోధతో పరిశుద్ధాత్మగా.." అనే పదము పాడుతున్నప్పుడు ఒళ్ళు పులకించింది అని చెప్పారు.
    www.thraithash...

ความคิดเห็น •