Prabhu Yesu Jananam (ప్రభు ఏసు జననం) | Lyrical Song - 135 | Christmas (Jesus Reincarnation) Spl Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2023
  • డిసెంబర్ 25 న క్రిస్మస్ వేడుకలు జరుగుచున్న సంగతి అందరికి తెలిసినదే. క్రిస్మస్ అనగా క్రీస్తు జన్మదినము అని కూడా సర్వ ప్రపంచమునకు తెలిసిన విషయమే. కానీ, చాలా మందికి ఉన్న ఒక సందిగ్దకరమైన ప్రశ్న ఏమంటే, నిజముగా ఏసు ప్రభువువారు డిసెంబర్ 25 నే జన్మించారా? లేదా? అని.
    అయితే, ప్రభువు వారి జన్మదినము, నిజముగా ఎప్పుడు? అని ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఆయన భగవద్గీతలో నాకు పుట్టుకా లేదు, నాశనమూ లేదు అని చెప్పారు. మరియు ఆయన జన్మ ఆయనకు తప్ప ఎవరికీ తెలియదని కూడా చెప్పారు. కానీ, ప్రభువు వారి జన్మదినమునకు ఒక కొలమానము వుంది. అది ఏమిటంటే, "తండ్రి కుమారుడు పరిశుద్దాత్మ" అను ("త్రైతమును") జ్ఞానమును ప్రజలకు తెలుపుటయే, ఆయన జన్మించుటకు కల ముఖ్య కారణము. కాబట్టి ప్రభువు ఫలానా సమయమున జన్మించాడా? లేదా? అను విషయము తెలుసుకోవడానికి ఒకే ఒక ఆధారము ఆయన చెప్పిన జ్ఞానమే.
    "ప్రభువు పుట్టినాడా! అక్కడే అప్పుడే జ్ఞానము పుట్టినది!" అని బుద్ధితో అర్థము చేసుకొనవలెను, "జ్ఞానము పుట్టినదా! అప్పుడే అక్కడే ప్రభువు పుట్టినాడు!" అని హృదయముతో గ్రహించుకొనవలెను.
    ఈ డిసెంబర్ 25 అనుదినము, అటు భౌతికముగానూ, ఇటు అభౌతికముగానూ ప్రభువు వారి జన్మదినమునే సూచిస్తుంది, ఆ జన్మనే యాచిస్తుంది. కాబట్టి, మన మానవీయకమైన సంశయములు ప్రక్కకు పెట్టి, దైవీకముగా ఈ డిసెంబర్ 25న ప్రభువు మాటలు అందరిలో వ్యాపించాలి, ప్రభువు నిజమైన దేవునిగా తెలియాలి, ఆయన సూచించిన జ్ఞానమే అందరికి వినపడాలి. అలా వినపడేందుకు, డిసెంబర్ 24 దివారాత్రి నుండే ప్రభువు వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడము ఎంతో శ్రేష్టమైన కార్యము అని తెలియుచున్నది.
    అటు బాహ్యముగానే కాక ఇటు శరీరాంతర్గతముగా కూడా, 24 భాగములుగా వున్న శరీరములో 25వ వానిగా "ఈసా ప్రభువు"గా జన్మించడము చాలా గొప్ప జ్ఞానసందేశము. కాబట్టి, ప్రభువు జన్మ దినము ఆద్యంతమూ ఎంతో జ్ఞానముతో కూడినదేననీ, ఆయన "జ్ఞానము ప్రజలకు పరిశుద్ధమైన త్రైతమును తెలుపుటకే" అనీ ఈ గీతము ద్వారా మరొక సారి ప్రభువు వారి జన్మదిన శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తున్నాము. అని ముగించక! మరికొంతగా ఆ "పరమ గురువు" యొక్క జన్మమును గూర్చి చెప్పుకుంటే...
    ప్రభువు వారి జన్మ ఎంత ప్రత్యేకమైనదో అది చెప్పుటకు వీలుకాని విషయము. ఆయన అందరిలాగా పుట్టిన సాధారణ మనిషి కాదు. బాహ్య కన్నులకు చూచుటకు సాధారణ మనిషి శరీరములా కనిపిస్తున్నప్పటికీ ఆ శరీరము "జ్ఞాన స్వరూపము", "ఆత్మ శరీరము" అని తిరగవేసి కూడా చెప్పవలసియుంటుంది. ఈ పాటను విన్న పిదప, వెనుతిరిగి ఈ మాటను విన్నవారికి కొంత ఆశ్చర్యము కలుగవచ్చును. కానీ ఈ విషయము ప్రభువు వారే స్వయముగా బైబిల్ గ్రంథమునందు ఎన్నిమార్లో చెప్పియున్నారు. ఉదాహరణకు కొన్ని వాక్యములలో ఈ విధముగా చెప్పుచున్నారు చూడండి.
    యోహాను సువార్త:
    1:14. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని (జనితైక కుమారుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.
    6:51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
    6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.
    6:55. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.
    6:56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.
    కాబట్టి ప్రభువు వారే స్వయముగా తన శరీరము కొద్దికాలము మాత్రమే వుండిపోయే భౌతిక శరీరము కాదని, ఎన్నటికీ నాశనము కానీ స్వచ్ఛమైన, సత్యమైన జ్ఞానమని చెప్పియున్నారు. కావున ప్రభువును విశ్వసించువారు ఎవరైనను ఆయన వాక్యమును ఆయన శరీరముగా, ఆయనను జీవాహారముగా తలచి, నిరంతరమూ ఆయననే భుజిస్తూ, ఆయననే భజిస్తూ... ఆయన కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము.
    ప్రత్యేకత:
    ఈ పాటను నేటిదినమైన డిసెంబర్ 24 "ఆదివారము తెల్లవారకమునుపే 2 గంటలకు" ఎందుకు విడుదల చేయుచున్నాము అనగా,
    ఏసు శుక్రవారము శిలువ వేయబడి సాయంకాలము చనిపోగా ఆయన ఒక్క శనివారము 24 గంటలు సమాధిలో ఉండడము జరిగినది. తర్వాత "ఆదివారము తెల్లవారుజామున రెండు గంటలకే సజీవమైన ఈసా మూడు గంటల సమయములో సమాధి బయటకు రావడము జరిగినది". దీనిప్రకారము శుక్రవారము, దాదాపు సాయంకాలము నాలుగు గంటలకు తాత్కాల మరణమును పొందిన ఏసు ఆదివారము తెల్లవారుజామున రెండు గంటలకు సజీవమై ఈసాగా వచ్చాడు.
    అయితే ఏసు తన భక్తులతో “నేను మీకు ఎవరూ ఎదురాడని జ్ఞానమును బోధిస్తానని”చెప్పియున్న రీతిగా నేడు ఈ "ప్రభు ఏసు జననం - పరిశుద్ధ జ్ఞానం" అను గీతము నేటి "ఆదివారము తెల్లవారుజామున రెండు గంటలకు" మన ముందుకు పుట్టి వచ్చినది.
    (యోహాను సువార్త 20 వ అధ్యయము (1 - 9) వచనములలో "1 ఆదివారము ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, ...8. శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. 9. ఆయన మృతులలోనుండి లేచుట అగత్యము".)
    TEAM:
    ---------
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Krupanandam
    Music - N R Chaitanya Kumar
    Video Composition - Saleem
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel
    సాకీ :
    స్వామి యేసుని శరీరం శిరములో దాగిన ఇంజీలు గ్రంథం
    గురు యేసుని రక్తం నరములో ప్రవహించు ఇందూ జ్ఞాన స్రావం
    ప్రభు యేసుని జీవం ధరలో వెలిగే త్రైతాత్మల భావం ధరలో వెలిగే త్రైతాత్మల భావం !
    పల్లవి :
    ప్రభు ఏసు జననం పరిశుద్ధ జ్ఞానం ప్రజలకు తెలుపుటకే /2
    తండ్రి కుమారుల పరిశుద్ధాత్మల వివరము తెలుపుటకే… వివరము తెలుపుటకే
    ప్రభు ఏసు జననం..
    చ1 :
    ఆత్మ స్వరూపం జ్ఞాన శరీరం ఆత్మ ప్రబోధం రక్త ప్రవాహం
    వాక్కును పంచి మాయను త్రుంచి రక్షణ కోసం శిక్షలకోర్చి
    జ్ఞానులకందరికాదర్శముగా నిలిచెను దేవునిగా నిలిచెను దేవునిగా
    ప్రభు ఏసు జననం /2
    చ2 :
    ధర్మ ప్రచారం తన సంకల్పం మోక్ష ప్రదాయం తన సందేశం
    ఎదురాడనిదే ఆ ఏసు జ్ఞానం ఎరిగితె ధన్యం ఆ గురు రూపం
    శిష్యుల కోసం మరలా వెలిసెను ఆదరణ కర్తగా ఆదరణ కర్తగా
    ప్రభు ఏసు జననం /2

ความคิดเห็น •