Rahasya Prarthana (రహస్య ప్రార్థన) | Video Song - 133 | Sireesha Bhagavatula | Karthika Pournami Spl

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025
  • ప్రజలను ధర్మమువైపు ప్రభావితము చేయటకు ప్రభువువారు ఈ పుడమిపై పుట్టి తన ప్రబోధను చేయగా, ఆ జ్ఞానమును విన్నవారు ఈ మూడు విధములుగా కలరు:
    ఆ బోధను అసూయతో చూచినవారు : నాస్తికులు
    ఆ బోధను అవహేళన చేసిన వారు : హేతువాదులు
    ఆ బోధను అనుసరించినవారు : సత్యవాదులు
    ఆయన బోధనలను బాహ్యములో అపహాస్యము చేయువారు నష్టాత్ములగుదురు, కాగా.. ఆ బోధలను పరిశుద్ధముగా తలచి తమ హృదయముతో గైకొని, ఆ క్రీస్తును రహస్యముగా ప్రార్థించువారు పూర్ణాత్ములగుదురు.
    ప్రార్థన అనగా "ప్రత్యేక అర్థన" అని, రహస్య ప్రార్థన అనునది శరీరములోని గురువుకు, అదే శరీరములో ఏర్పడిన శిష్యుని చేత రహస్యముగా చేయబడునది అని మునుపు తెలుసుకున్నాము.
    శ్రీ ఏసు క్రీస్తు ప్రభువు వారు తన శిష్యులకు ఈ రహస్య ప్రార్థనను గురించి (మత్తయి సువార్త 6 వ అధ్యాయములో) ప్రబోధించుటకు మునుపే, ఆయన (మత్తయి సువార్త 5 వ అధ్యాయములో) ఇట్టి ప్రార్థనను చేయుటకు శిష్యుడు, "దేనిని అనుసరించవలెనో, ఏమి ఆచరించవలెనో, ఏ విధముగా ప్రవర్తించవలెనో" క్షుణ్ణముగానూ, నిగూఢముగానూ తెలియచేసియున్నారు.
    గురువునే ప్రార్థించుటకు సిద్ధపడు శిష్యుడు:
    దేనిని "అనుసరించ"వలెను? అనగా : పాంచభౌతికదేహములోనే అభౌతికమైన ఆత్మదేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించవలెను. అందుకు స్థూలదృష్టిని దాటు సూక్ష్మదృష్టి అవసరమగును. అలా ఆత్మదేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించువానికి ఆయన తండ్రియొక్క "అనుగ్రహము" దొరుకును. - ఆత్మైక్య ప్రాప్తి
    ఏమి "ఆచరించ"వలెను? అనగా : కారణదేహములోని కర్మగుణములకు అతీతముగా చరించు పరమాత్మదేవుని యొక్క సంజ్ఞలను ఆచరించవలెను. అందుకు సూక్ష్మదృష్టిని దాటు జ్ఞానదృష్టి అవసరమగును. అలా పరమాత్మదేవుని యొక్క సంజ్ఞలను శిరసావహించువానికి ఆయన అంశయొక్క "ఆదర్శము" దొరుకును. - ఆదర్శకర్త ప్రాప్తి
    ఏ విధముగా "ప్రవర్తించ"వలెను? అనగా : జీవదేహములోని శిష్యునికి అధిపతియైన గురుదేవుని యొక్క జ్ఞప్తి గల్గి ప్రవర్తించవలెను. అందుకు జ్ఞానదృష్టిని దాటు యోగదృష్టి అవసరమగును. అలా గురుదేవుని యొక్క జ్ఞప్తిగల్గి ప్రవర్తించువానికి ఆయన అంశయొక్క "ఆదరణ" దొరుకును. - ఆదరణకర్త ప్రాప్తి
    ఈ విధముగా అంధకారమైన మాయాలోకమును దాటుజీవునకు దీపకాంతితో కూడిన ఆత్మ అను అలోకము దొరకును. ఆ దీపముకూడా గాలిలేక ఆరిపోగా కటికచీకటివంటి పరలోకము ఆ శిష్యునికి తప్పక ప్రాప్తించును.
    నేడు భూమిపైగల సత్యాన్వేషకులకందరికీ, ఈ త్రైతశకమున అట్టి "రహస్య ప్రార్థన"ను చేయు అవకాశము ఏర్పడియుండుట ఎంతో హర్షించదగ్గ సమయము.
    ఇంతటి నిగూఢమైన రహస్యమైన ప్రార్థన చేయుటకు నాకు అవకాశము కల్పించిన నా గురుదేవులైన "శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులవారి"కివే మా రహస్యమైన సాష్టాంగములు !!!
    గీతము ప్రత్యేకత:
    ------------
    ఎలాగైతే రహస్య ప్రార్థనకు దీపమునకు సంబంధము ఉన్నదో, అలాగే ఆ పాటయొక్క ప్రోమో దీపావళినాడు బయటకు రాగా, ఈ పూర్ణ గీతము "కార్తీక పౌర్ణమి" నాడు విడుదల అగుట దైవ నిర్ణయమే. కార్తీక ను విడదీసిన కారు+తి+క అనగా నల్లనైన గురు శిష్యులు అను అర్థము వచ్చుచున్నది.
    ఇంకా, కారు అనగా చీకటి అని, తిక అనగా తిక్కనైన కటిక అని అర్థము. కార్తీక అనగా కటిక చీకటి. ఘనమైన రాత్రి.
    మరియు కా + రతి + క = ఇక్కడ కా అనగా ఆత్మ అను నల్లని కాకి, క అనగా జీవాత్మ అను నల్లని కాకి, మధ్య రతి అనగా యోగము అని తెలియవలెను. దీనినే ఏకాకి రహసి స్థితః అని గీతలో అన్నారు. అట్టి ఆ చీకటిలో పుట్టు పౌర్ణమియైన వెలుగే "రహస్య గురువు". ఇదే కార్తీక పౌర్ణమి.
    కావున ఈ రహస్య ప్రార్థనకు కార్తీక పౌర్ణమికంటే గొప్ప సందర్భము ఏమి ఉండును! సర్వం శ్రీ ప్రబోధార్పణం !!!
    TEAM:
    ---------
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Sireesha Bhagavatula
    Music - N R Chaitanya Kumar
    Video Composition - Subbu
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel
    సాకీ:
    ----
    ఏసు ప్రభువును ప్రార్ధించే ఊరే ఒక రహస్యం
    ఏసు దేవుని ధ్యానించే దారే అతి నిగూఢం
    ఏసు గురువుని గుర్తించే తీరే పరమ గుప్తం ... ఆ దారే పరమ గుహ్యం ... ఆ ఊరే పరమ గోప్యం !
    రహస్య ప్రార్థన... అదివో త్రైతారాధన.... రహస్య ప్రార్థన. ... ఇదియే ఆత్మోపాసన. .. ఇదియే ఏకేశ్వర ఉపాసన ....
    పల్లవి :
    రహస్యమందున చేయరా ... ప్రభు ఏసు రాజుకు ప్రార్థనం
    స్వదేహమందున చేయరా ... గురు ఏసుతో సహజీవనం //2
    నీ దేహము దాగిన దేవునికే ... నీ ధ్యానము చేయుము దాసునిగా
    నీ శిరమున గురు దరి చేరుటకై ... నీ శిలువను దాటుము శిష్యునిగా ..
    ఆ గురువును కూడుము గుప్తముగా...
    రహస్యమందున చేయరా ... ప్రభు ఏసు రాజుకు ప్రార్థనం
    స్వదేహమందున చేయరా ... గురు ఏసుతో సహజీవనం
    చరణము 1 :
    మనుషులకే కనబడులా సాగిల పడితే ఏమి ఫలం
    బాహ్యములోనే భ్రమియిస్తూ చూపే భక్తికి లేదు బలం
    వీధులలో వేషముతో వేదన చూపగ రాదు వరం
    వ్యర్థమాటలను వచియిస్తూ వృద్ధిగాంచగా కాదు తరం
    హృదిమదిలో గలగదిలో ప్రార్థన చేయుచు హర్షించు
    తలపులనే తలుపులని మూయగ తండ్రిని దర్శించు ... ఆ తండ్రినే నువ్వు కీర్తించు
    రహస్యమందున చేయరా ... ప్రభు ఏసు రాజుకు ప్రార్థనం
    స్వదేహమందున చేయరా ... గురు ఏసుతో సహజీవనం
    చరణం 2 :
    ఉదరముకై ఆహారం మానుట కాదుర ఉపవాసం
    ముఖములలో కువికారం చూపగ లేదుర ఉపయోగం
    దేహమునే కడుగుటచే దేహికి వదలదు గుణమలినం
    మాటలతో ఘనపరచి .. ప్రభు బాటను మరచుట అవివేకం
    అహమను ముఖమును కడుగుకొని... అంతర్ముఖుడై చరియించు
    తలలో ఆత్మను అంటుకొని ... నీ గురుదేవుని వరియించు .. రహస్య గురువుని గుర్తించు !!!
    రహస్యమందున చేయరా ... ప్రభు ఏసు రాజుకు ప్రార్థనం
    స్వదేహమందున చేయరా ... గురు ఏసుతో సహజీవనం
    నీ దేహము దాగిన దేవునికే ... నీ ధ్యానము చేయుము దాసునిగా
    నీ శిరమున గురు దరి చేరుటకై ... నీ శిలువను దాటుము శిష్యునిగా
    ఆ గురువును కూడుము గుప్తముగా...
    రహస్యమందున చేయరా ... ప్రభు ఏసు రాజుకు ప్రార్థనం
    స్వదేహమందున చేయరా ... గురు ఏసుతో సహజీవనం

ความคิดเห็น •