Pandugaa Maarela (పండుగా మారేలా) | Lyrical Song - 138 | Singer: MM Sreelekha | Maagha Pournami Spl

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025
  • అందరికీ మాఘ పౌర్ణమి సందర్భముగా శుభాకాంక్షలు!
    ప్రతి వ్యక్తి తన శరీరాన్ని గమనించుకుంటే ఆ శరీరము ఎంతో జ్ఞానమును మనకు అందిస్తుంది. ఈ శరీరమునే కాయము అనుచు "కాయ"గా కూడా పెద్దలు పోల్చారు. కాయ గానే కాకుండా శరీరాన్ని అనేక సందర్భములలో "పండుగా" కూడా పోల్చడము జరుగుతుంది.
    ఉదాహరణకు గర్భవతియైన స్త్రీని చూచి ఆమె 'కడుపు పండినది' అంటారు, పుట్టిన బిడ్డను చూసి "పండు" వంటి బిడ్డ పుట్టాడు అంటారు, అలాగే పుష్పవతి అయ్యి యుక్త వయసుకు వచ్చిన స్త్రీని కూడా "పండు" వంటి అమ్మాయి అంటుంటారు, ముసలి వయసు వారిని చూచి కూడా "పండు" ముసలి అనడము వింటుంటాము. ఈ విధముగా శరీరమును అనేక దశలలో పండుగ పోల్చడము మనకు తెలియకుండానే జరుగుచున్న విషయము.
    ఎందుకు ఇలా అనేక విధములుగా మనిషి జీవితములో పండును దేవుడు గుర్తు చేయుచున్నాడు అనగా జీవాత్మ కాయగా ఉంటూ, పండుగా మారుచున్న కర్మ అనే కాయలను తింటూ అలాగే వున్నాడు. ప్రతి జన్మలోనూ జీవుడు ధరించుచున్న శరీరము మాత్రము తన స్థితిని తాను ఎరిగి, దేవుని ద్వారా నిర్ణయించబడిన కర్మలను కార్య రూపములో చేస్తూ అదే జన్మలోనే ఆ శరీరము మోక్షముగా మారిపోతుంది. కానీ, జీవుడు మాత్రం ఆ మార్పులను గమనించక, ఒకవేళ గమనించినా వాటిలోని జ్ఞానార్థమును గుర్తించక అజ్ఞానములోనే మిగిలిపోయాడు.
    కాబట్టి ప్రతి వ్యక్తి తన శరీరములో జరుగుచున్న విధానమును గమనిస్తూ తన శరీరములో ఒక భాగమైన తాను "జీవాత్మగా"నే ఉంటూ మిగతా శరీరమును అనుసరిస్తూ, ఆ శరీరమును నడుపు ఆత్మను ఎరుకలో ఉంచుకుని మిగతా శరీర భాగములతో పాటు సమన్వయమై బ్రతుక గలిగితే అది ఒక గొప్ప "యోగము"గా మారి, ఆ జీవి మోక్షము పొందుటకు ఉపయోగపడును.
    ఇంకా చెప్పాలంటే, పుట్టిన శిశువును పసి కందు అంటారు అంటే పిందె గా పుట్టినది ఈ దేహము. చెట్టులో పుట్టిన పువ్వు, కాయగా, పండుగ మారి ఒకనాటికి రాలిపోయినట్లు, శిశువు (పిందె) గా పుట్టిన దేహము బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్దాప్యము అను దశలలో మారుచూ మరణముతో నశించి ప్రకృతిలో కలిసిపోతుంది. దీని నుండి మనిషికి దేవుడు అందిస్తున్న సూచన ఏమనగా? జీవుడు పిందె లాగ పుట్టి ఎన్ని జన్మలు ఎత్తినా తనలో ఏ మార్పూ లేక పండుగ మారక కర్మలనే ఫలాలను భుజిస్తూ ఇలాగే ఉన్నాడు. తన దేహములోని మార్పులను గ్రహించుకొని తాను కూడా జ్ఞానమను ఆహారమును తీసుకో గలిగితే జీవునిలో యోగమను సాధన ద్వారా ఆత్మగా, పరమాత్మగా మారిపోగలిగే అవకాశము ఉంది.
    విత్తనము ఏసిన రైతు ఫలముల కోసము సంవత్సరము అంతా ఎదురు చూసి పంట చేతికి వస్తే ఏ విధముగా ఆనందిస్తాడో, అలాగే సృష్ట్యాదిలోనే జీవము(జీవాత్మ) అను బీజము నాటిన పరమాత్మ, జీవుడు తనను తాను తెలుసుకుని సంవత్సరుడై తన తండ్రియైన దేవున్ని చేరుకుంటాడని చూస్తున్నాడు. ఇటువంటి విధానము ఒకటి ఉన్నది అని కూడా గ్రహింపులేక, తానే దేహమనీ, జీవితమంటే కేవలము కష్టసుఖానుభవమేననీ భ్రమిస్తున్న జీవులకు, ఈ పండుగల జ్ఞానమును గుర్తుచేయుటకై ఆ పరమాత్మయే "శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు"గా ప్రభవించి, తన జ్ఞానామృతమును ప్రబోధించినారు.
    నా దేహమునే నైవేద్యముగా మలచి ...నన్నే "పత్రముగా, పుష్పముగా, ఫలముగా, తోయముగా" మార్చుకొని స్వీకరించి, ఆయన యొక్క దివ్య దేహమనే ప్రసాదమును ప్రబోధామృతముగా నాకు ఒసగిన ఆ జగద్గురు దేవులకివే మా సర్వాంగ దండ ప్రణామములు.
    TEAM:
    Lyricist - Siva Krishna Kogili
    Singer - MM Sreelekha
    Music - Nagesh
    Editing - Saleem
    Presented By - Gnanavaahini
    సాకీ
    పూత పూసిన నాడే కొమ్మ గతి సుగమం
    కాయ కాసిన నాడే పువ్వు గతి సుమయం
    పండుగ మాగి ఫలించిన నాడే ఆ కాయ గతి సుఫలం
    నీ మేను కొమ్మపై త్రైతజ్ఞాన పూతలో యోగమే కాయగా
    ఆ యోగ పంటలో మధ్యాత్మ పండుతూ గురువై నిండగా పూర్ణ గురువై ఉండగా
    అదో పండుగ అదే అసలైన పండుగ అదే నిజమైన పండుగ
    కో: అర్థములేని పర్థములేని దండుగ బ్రతుకు చాలులే
    త్రైతముతోనా కూడిన మన పండుగలు చేయాలిలే
    పల్లవి
    పండుగా మారేలా పండుగే రావాలా
    నిండుగా ఈవేళా జ్ఞానమే పండాలా
    చెట్టులో పుట్టే పూలే కాయలు కాయాలా
    గుట్టుగా కాసిన కాయే పండుగ మాగాలా
    వెన్నులో వేదాంతమే విత్తుగ నాటాలా
    వృక్షమై సిద్ధాంతమే ఫలించగా పంచేయ్యాలా
    పండుగా మారేలా పండుగే రావాలా
    నిండుగా ఈవేళా సందడే చేయాలా!
    కో: కాయములోన ధర్మము మరచే భోగ చింతలిక చాలులే
    యోగాదితోనా కర్మలుగాల్చే భోగిమంట వేయాలిలే
    చర1:
    జీవితం చాలా చిన్నదిరా దైవతం చేర్చే పెన్నిధిరా
    జ్ఞానమే నీలో ఉన్నదిరా శ్రద్ధజూపగా.. హద్దునుండరా
    కాయమే దేవుని రూపమురా కాడులే ఆయన దీపమురా
    కాలమే చేయక క్షేపమునే బుద్ధియోగివై సిద్ధినొందరా
    సారమౌ నేలను నాటిన విత్తుకు కాండము కొమ్మలు ఎదుగునులే
    శ్రద్ధయే కూడిన జీవుడు సత్తును చేరగ జ్ఞానమె పెరుగునులే
    వత్సరం వేచిన వృక్షము కాచిన కాయలు పండుగ మారునులే
    మత్సరం వీడిన శిష్యుడు గురువును చేరగ పండితుడవ్వునులే
    కాయ పండు కాలమదే పక్వదినమురా
    జీవి పండు జ్ఞానమదే జన్మదినమురా ..
    భోగిలా ఫలాలనే భుజించ మాని, యోగిలా యుగాదికై తపించు జ్ఞాని
    మారిన మనస్సుతో సంక్రాంతి కోరి, రాతిరి ఉషస్సుగా శివాత్మలో చేరై చని
    పండుగా /జ్ఞానమై పండాలా
    కో:అహముపొందే దేహములోనా పాపచింతలిక చాలులే
    త్రైతము చిందే జ్ఞానాగ్నితోనా దీపకాంతి వెలగాలిలే
    చర2:
    యవ్వనం మారితె కౌమారం జాప్యమై చేరును వృద్ధాప్యం
    కాలమే తీరితె నీ కాయం ఖచ్చితాంతమై మృత్యువొందురా
    చూసుకో నీ మేను పయనం చేసుకో జ్ఞానోప నయనం
    మార్చుకొని గుణాల గమనం సచ్చిదాత్మవై సత్తునొందరా
    ఆరు రుచులుండే కాయలు పండే నాటికి వేరై తోచునులే
    మారు మనసందే జీవులు పొందే భావమే జ్ఞానానందములే
    వర్ణమే మారుచు పండిన ఆకులు జీర్ణమై నేలకు రాలునులే
    పౌర్ణమౌ బుద్ధిన నిండే ఆత్మే పూర్ణిమ చందురుడాయెనులే
    భగము పండు వెన్నెలకై మాగుచుండగా
    భగవంతుడైన పున్నమిలో గురుని గాంచగా
    ఇంద్రియ దశారకై దేహాన గూడి, ఇరుదీపకాంతిలో దీపావళాడి
    అష్టమి గర్భానికై అహాన్ని వీడి, నవమిన ప్రభవించి ప్రభావళే దాటై వేడి
    పండుగా మారేలా పండుగే రావాలా
    నిండుగా ఈవేళా జ్ఞానమే పండాలా
    మానులో మాగిన కాయే పండుగ మారాలా
    మేనులో దాగిన ఆత్మే గురువై తీరాలా
    బోధిలో ప్రబోధుడే బోధలు చెయ్యాలా
    నందుడే ఆనందుడై హృదయాలన్నీ ఏలెయ్యాలా
    పండుగా మారేలా పండుగే రావాలా
    నిండుగా ఈవేళా త్రైతమే అందాలా!

ความคิดเห็น •