Idotanamu (ఐదోతనము) | Lyrical Song - 111 | Karthika Pournami & Rahu-Chandra Grahanam Special Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025
  • సర్వ జీవులకు జ్ఞానమును ప్రసాదించగల జగద్గురుదేవులైన శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారు ఆధ్యాత్మికములో సంచలనాత్మకంగా వంద ౧౦౦ గ్రంథములను రచియించి శతాధిక గ్రంథకర్తగా పేరుగడించారు. అట్టి ఏకైక గురువుచే వ్రాయబడిన 99 వ గ్రంథమే "భక్తిలో మీరు సంసారులా? వ్యభిచారులా?" అను గ్రంథము.
    గ్రంథ నామమును వినుటకు కఠినముగ ఉన్నా, ఆ గ్రంథములోని భావము గ్రహించిన యెడల జీవుడు జ్ఞానముగ్ధుడవక తప్పదు. ప్రతి జీవి అటు అజ్ఞాని గానీ, ఇటు జ్ఞాని కానీ ఏదో ఒక విధముగా భక్తిలో వ్యభిచారమును చేయుచున్నారు. అందరికీ "ఒక్కడే గురువు" ఆయనే సర్వులకు పతియైన జగద్భర్తయైన దేవుడని తెలియలేక, ఏదో ఒక విధముగా మనుషులనో, దేవతలనో, ప్రాకృతికమైన ఏదో ఒక అంశమునో ఆరాధిస్తూ వ్యభిచారములోనే ఉన్నారు. ఏకేశ్వరోపాసనలోయున్న మతము వారైనా, బహుదేవతారాధన గల్గిన మతమువారైనా ... ఎవ్వరైనా సరే ఈ మానసిక వ్యభిచారము వద్ద మాయకే చిక్కిపోతూ జ్ఞానభ్రష్టులై, గురుదూరులగుచున్నారు. కనుక తన శత గ్రంథములు గ్రహించుటకు మొదట సంసారి కావలసిందేనని ఆ గురువు తన 99 వ గ్రంథమును కొలమానంగా పెట్టినటుల తెలియుచున్నది.
    శ్రీ స్వామివారు "సుబోధ" అను తన గ్రంథములో "ఐదవతనము" అను అంశము రచియించి ఒక జీవికి నిజమైన భర్త ఎవరని బాహ్యముగా ప్రకటించియున్నారు. జ్ఞానము తెలియక వ్యభిచరించుట కొంత తప్పుకాగా, జ్ఞానమును తెలిసి కూడా వ్యభిచరించువారిది ఎంత పెద్ద తప్పు, అట్టి వారిని చూసి దేవుడు అసహ్యించుకొనడా? అతి రహస్యము బట్టబయలు అన్నటుల ఆయన తన గ్రంథముల ద్వారా అంతగా అందరిలోని వ్యభిచారమును ఖండించి చూపుచూ, సంసారులు కావలెనని హితవు పలికినా పట్టించుకోకున్న యెడల, అట్టి ప్రతి జీవి భక్తిలో నిత్యవ్యభిచారియై జన్మ జన్మకు అధోగతిపాలవక తప్పదు.
    ఇది నూట పదకొండవ పాట "౧౧౧", అనగా మూడు ఒకట్లు. కావున ఈ పాటకు ఎంతో ప్రత్యేకత కలదు. అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ లో 9 వ సురా 111 ఆయత్ లో "అల్లాహ్ తో వ్యాపారము" అను అంశము ఉన్నది. నీ సర్వమూ ఆ అల్లాహ్ కు అర్పించుకుంటేనే ఆయన నీకు ఐదోతనమును ప్రసాదించగలడు అనుటకు ఈ పాటే నిదర్శనము.
    ఈ కార్తీక పౌర్ణమి సందర్భముగా అందరమూ దేవాలయమైన మన దేహములో దీపమైన "ఆత్మ"ను "గురువు" అనే అగ్నిలో వెలిగించి ఆరాధించి, అట్టి ఆ పరమాత్మ స్వరూపుడైన గురుదేవునే బాహ్యములోనూ, భావములోనూ భర్తగా భావించి సంసారులై ఐదోవతనమును పొంది తరిద్దాము.
    www.thraithash...
    www.thraithash...
    TEAM:
    ---------
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Praveen Kumar Koppolu
    Music - N Nagesh
    Graphics - Subbu & Saleem
    Video Composition - Subbu
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel
    సాకీ :
    -----
    (12) శ్లో|| 11: మయి చానన్యయోగేన భక్తి రవ్యభిచారిణీ ।
    వివిక్త దేశసేవిత్వ మరతి ర్జనసం సది ||
    (12) శ్లో|| 12: ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్త్వజ్ఞానార్థ దర్శనమ్ ।
    ఏతద్జ్ఞానమితి ప్రోక్త మజ్ఞానం యదతోఽన్యథా ||
    పల్లవి :
    --------
    వినరా వినరా ప్రకృతి జీవా ఐదోతనమే భర్త కదా
    వినరా వినరా ప్రకృతి జీవా ఆ మగతనమే ముక్తి కదా
    వినరా వినరా ప్రకృతి జీవా ఐదోతనమే భర్త కదా
    వినరా వినరా ప్రకృతి జీవా ఆ మగతనమే ముక్తి కదా
    జగతిన పుట్టిన ప్రతిజీవునిలో దాగున్నదిలే స్త్రీతనము
    ఆ జగతిని భరియించే భర్తే అందరికి ఐదోతనము
    వినరా వినరా ప్రకృతి జీవా ఐదోతనమే భర్త కదా
    వినరా వినరా ప్రకృతి జీవా ఆ మగతనమే ముక్తి కదా
    చరణము 1 :
    ------
    బరువై తూగే నీ దేహమునే మోసేవాడివి నీవనుకుంటే //2
    కరువై దేహము వీడిన నాడు నలుగురికెందుకు మోసే తంటే//2
    సాత్త్విక రాజస తామసములలో మెలిగే నీవే స్త్రీవై ఉంటే//2
    సత్తుగ కూడె పురుషత్వముగా మిగిలేదే సౌభాగ్యము కంటే//2
    భరించువాడే అసలు భర్తరా భరింపబడు ఈ జగతి భార్యరా
    తెగించి త్రిగుణములన్ని దాటరా వరించి ఆత్మను యోగమందరా
    నాలుగు తరగతులంతున దొరికే పరమాత్మే ఐదోతనము
    వినరా వినరా గుణముల జీవా ఐదోతనమే భర్త కదా
    వినరా వినరా మాయల జీవా ఆ మగతనమే ముక్తి కదా
    చరణము 2 :
    -------
    శారీరకముగ ఒకరిని మించీ కూడేక్రియ వ్యభిచారము అంటే//2
    మానసికముగా అనేకమందిని ఆరాధిస్తే అదియూ అంతే//2
    ఒక సతి తన పతినే విడనాడి ఇతరుని కూడుట అక్రమమైతే//2
    జీవాత్మే పరమాత్మను వీడి అన్యుల మ్రొక్కుట అదియూ అంతే//2
    అనేక చింతలు మదిన వీడరా తదేకముగ నీ పతిని కూడరా
    స్వగ్రనరకముల శ్వాసనాపరా ఏకాగ్రములో ధ్యాసనుంచరా
    యోగములో యోగీశ్వరుడైతే ఉత్తమపురుషుడే ఐదోతనము
    వినరా వినరా కర్మల జీవా ఐదోతనమే భర్త కదా
    వినరా వినరా చింతల జీవా ఆ మగతనమే ముక్తి కదా
    చరణము 3 :
    -------
    బాహ్యములో దేహర్తిని తీర్చే పురుషత్వమునే పతి అనుకుంటే//2
    గ్రాహ్యములో జ్ఞానార్తిని తీర్చే గురువుది కాదా మగసిరి అంటే//2
    సిరిగలవాడే హరుడైతే మగసిరిగలవాడే గురుడౌనంతే//2
    జన్మను ఇచ్చునదే పితయైతే జ్ఞానమునిచ్చేదే పతి అంతే//2
    సర్వ ధర్మములు విడిచిపెట్టరా గుర్వు చరణములు ఒడిసిపట్టరా
    పూర్ణ మనసుతో పూర్ణ బుద్ధితో పూర్ణ ఆత్మతో పతిని పొందరా
    సతిపతిగా పరపతిగా మారే ఆనందమే ఐదోతనము
    వినరా వినరా ప్రకృతి జీవా ఐదోతనమే భర్త కదా
    వినరా వినరా ప్రకృతి జీవా ఆ మగతనమే ముక్తి కదా
    జగతిన పుట్టిన ప్రతిజీవుని సంసారిని చేసేదే త్రైతం
    ఆ త్రైతము బోధించే గురువే కాదా నీకు నిజ దైవం
    వినరా వినరా త్రైతము జీవా గురువును చేరే భక్తి కథ
    వినరా వినరా అంతము జీవా గురువును దాటే ముక్తి కథ ...
    గురువును దాటే ముక్తి కథ ... గురువును దాటే ముక్తి కథ !!!
    !

ความคิดเห็น •