Cheppaledantanaka poyyeru (చెప్పలేదంటనక పొయ్యేరు) | Lyrical Song - 102 | Guru Pournami | 9-7-22 Spl

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025
  • శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారు "ప్రబోధ" అను గ్రంథముతో తన "సంచలనాత్మక రచనలను" మొదలు పెట్టి శతగ్రంథముల వరకు తన కలమును ఆగనీయక వ్రాసి "శతాధిక గ్రంథకర్త"యైనాడు. ఆయన ఆధ్యాత్మికములో ఒకే సిద్ధాంతము మీద శతగ్రంథములకు పైగా రచనలు చేసిన "ఇందుజ్ఞాన ధర్మ ప్రదాత" ఆయనే. భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథములను త్రైతసిద్ధాంత ఆధారముగా అన్ని మతముల వారు అర్థము చేసుకోగల వివరములతో అందజేసిన "త్రిమత ఏకైక గురువు" ఆయనే.
    త్రైత సిద్ధాంత ఆదికర్తయైన ఆ గురుస్వామిని గూర్చి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కొన్ని వందల సంవత్సరములకు పూర్వమే తన కాలజ్ఞానంలో అద్భుతమైన పంతవాక్యములను రచియించి, తనకు గురువు "శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారే" అని ప్రకటించారు.
    అట్టి అద్భుతమైన వాక్యములను సర్వ మానవాళికీ పునః ప్రకటించి, నిజగురువును తిరిగి గుర్తుచేయుటకే ఈ గీతము శ్రీ గురుస్వామివారి ఆశీస్సులతో రచియింపబడినది. ఇప్పటికైనా ఆ మహోన్నతుడు, వివేకవంతుడు, "ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి"యైన "ఆనంద గురువు"ను గుర్తించండి !!! ఆత్మజ్ఞానులై తరించండి !!!
    TEAM:
    -----------
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Ramu (Chennai)
    Music - N Nagesh
    Editing - Saleem
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel
    సాకీ:
    -----
    కనులు తెరువని రెప్పబడగా ... గురుని గాంచని గుడ్డివారు
    చెవులు వినకనె కప్పబడగా ... గురుని చేరని చెవిటివారు
    బుద్ధి భ్రమచే త్రిప్పబడగా ... గురుని అందని అవిటివారు
    ఎంత చెప్పినా ... గురువేమి చెప్పినా ... చెప్పలేదంటనకపొయ్యేరు ... ఇల మూఢజనులు చెప్పలేదంటనకపొయ్యేరు... చెప్పలేదంటనకపొయ్యేరు
    పల్లవి:
    ----
    చెప్పలేదంటనక పొయ్యేరు .. నరులార మీరు చెప్పలేదంటనకపొయ్యేరు//2
    జననమరణము ప్రళయప్రభవము నిదురమెళుకువ మరుపు ఎరుకల
    గుట్టురట్టుగ జేసినట్టి గురుని బోధలు గానకా మరి
    చెప్పలేదంటనక పొయ్యేరు నరులార మీరు చెప్పలేదంటనకపొయ్యేరు
    ప్రశ్న మిగలని జ్ఞానవాక్కులు విశ్వజనులకు అందజేసి
    కలియుగమ్మున కడకు దొరికిన కల్ప వృక్షము పంచ జేరక
    చెప్పలేదంటనక పొయ్యేరు నరులార మీరు చెప్పలేదంటనకపొయ్యేరు
    చెప్పలేదంటనక పొయ్యేరు అని తెలిసి గురుడు ముందుగానే చెప్పియున్నాడు
    చరణము 1:
    ------
    ఆదిలోన ప్రబోధచేసి సమాధిలోన సుబోధచేసి
    ఆంతరంగిక జ్ఞానమంతా అంతుచూపి రచించినా
    దేహహద్దును గీత గీసి అందులో ఇంజీలు పోసి
    దైవగ్రంథములోని అంతిమ గ్రంథినే ప్రవచించినా
    స్థూల సూక్ష్మపు దేహములనే స్థానభ్రంశము లేక దెలిపి
    సాంఖ్యమును దరిశింపజేసి శంఖమే పూరించినా
    చక్షువులతో చూడలేని క్షరాక్షరములకు సాక్ష్యమిచ్చి
    రక్షకుడిగా రూపుదాల్చి కర్మక్షేపము చేసినా
    సృష్టికే ఆధారమైన దైవ ముద్రను చేసినా
    నిజ దృష్టిలోనే తెలియమంటూ దైవ చిహ్నము చూపినా
    చెప్పలేదంటనక పొయ్యేరు .. నరులార మీరు చెప్పియున్నా వినకపొయ్యేరు
    కడుపునంతా చీల్చి చూపిన గారడీ విద్యనుచు భ్రమచి
    జడుపులేకనె ముడుపులందే కూడుతూ కాలేటి జనులు
    చెప్పలేదంటనక పొయ్యేరు జనులార మీరు చెప్పలేదంటనకపొయ్యేరు
    చెప్పలేదంటనక పొయ్యేరు అని తెలిసి గురుడు ముందుగానే చెప్పియున్నాడు
    చరణం 2:
    ------
    కర్మ శ్రమలే కూల్చగా ఆశ్రముమునే నిర్మించి తాను
    సర్వ మతములు విశ్రమించే స్థానమే సృష్టించినా
    మాయ భ్రమలే వీడగా ఆ బ్రహ్మవిద్యను నేర్పి తాను
    గుణములణచే గురువుగా నిజ పీఠమే ప్రకటించినా
    యజ్ఞదానతపాల కుటిలం, వేదమతముల కపటపాషం
    విజ్ఞుడై వివరించి ధర్మగ్లానినే ఛేదించినా
    బ్రహ్మకర్మభక్తియోగం శ్రద్ధా విశ్వాసాల జ్ఞానం
    వృద్ధినే గావించి ధర్మములోనికే నడిపించినా
    శాస్త్రమే శయనాధిపతిగా సర్వసృష్టికి చాటినా
    ఉపదేశమే తన దేహమై యోగీశ్వరునిగా వెలిసినా
    చెప్పలేదంటనక పొయ్యేరు .. నరులార మీరు కన్నులున్నా కనకపొయ్యేరు
    ఉదరమంతా చీల్చి ఆదరణంత తను కురిపించినాను
    సహోదరునిగ ఎంచపోక బురదజల్లే బుద్ధి హీనులు
    చెప్పలేదంటనక పొయ్యేరు జనులార మీరు చెప్పలేదంటనకపొయ్యేరు
    చెప్పలేదంటనక పొయ్యేరు అని తెలిసి గురుడు ముందుగానే చెప్పియున్నాడు
    చరణము 3:
    ------
    ఆత్మనాత్మల కాంతినే తను అన్యదా గ్రహియింపజేసి
    ఆత్మత్రయమే బోధగా సిద్ధాంతమే స్థాపించినా
    బ్రహ్మకున్నూ దెలియనట్టి సాంద్రసింధూ వేదగుహ్యము
    కమ్మ కులమునబుట్టి వందా గ్రంథములుగా వ్రాసినా
    ఆదిలోని త్రైతసిద్ధాంతమునకే తను శిరోమణిగా
    ఆదికులమౌ ఆదిగుణమై బ్రహ్మసూక్ష్మము జాటినా
    సప్తమే ఇక నిశ్చయముగా సర్వదా ఇక సప్తమవగా
    సర్వ సత్యములోకి నడిపే వాక్కునే వినిపించినా
    జాతులన్నీ ఏకమైయ్యే జ్యోతినే తను చూపినా
    పోతులూరి వీరబ్రహ్మమే పుట్టి వచ్చి పట్టి చెప్పిన
    చెప్పలేదంటనక పొయ్యేరు ఆ వీర గురుని పట్టలేక వదరిపొయ్యేరు .. ఆ వీర గురుని పట్టలేక వదిలిపొయ్యేరు
    చెప్పలేదంటనక పొయ్యేరు నరులారా గురుని చేరి మ్రొక్కితే బ్రతుక నేర్తూరు
    నేటికైనా ఆనంద గురుని చరణమంటి శరణుజొచ్చి
    తప్పు ఒప్పుకు తలలు బాదుచూ బ్రోచమంటూ వేడుకొమ్మని
    చెప్పలేదంటనక పొయ్యేరు నరులారా గురుని చేరి మ్రొక్కితే బ్రతుక నేర్తూరు ... ప్రబోధ గురుని చేరి మ్రొక్కితే బ్రతుక నేర్తూరు ... ఆనంద గురుని చేరి మ్రొక్కితే బ్రతుక నేర్తూరు

ความคิดเห็น •