Viswadabhi rama (వినురా ఓ వేమా! వినగానే తొందరపడకయ్యో రామా!) | Lyrical Song-160 | Sai Charan | Vemana
ฝัง
- เผยแพร่เมื่อ 30 ม.ค. 2025
- జ్ఞానవాహిని శ్రోతలకు, వీక్షకులకు అందరికీ "శ్రీశ్రీశ్రీ యోగి వేమన" గారి "జన్మదిన పండుగ" సందర్భముగా శుభాకాంక్షలు.
thraithashakam...
thraithashakam...
TEAM:
-----
Lyricist - Siva Krishna Kogili
Singer - Sai Sri Charan
Music - Nagesh
Lyrical Video Editing - Saleem
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel
LYRICS:
-----------
సాకీ:
-----
వేదాంతమేనులే వేమన పద్యాలూ ... వెతకగా దొరుకులే వేమన హృద్యాలు
సిద్ధాంతమేనులే వేమన తత్త్వాలూ ... స్థిమితమైతె కుదురులే వేమన సత్త్వాలు
జీవాంతమేనులే వేమన భాష్యాలూ ... ఆ జగద్గురుని బోధలే వేమన భావాలూ...
అందుకే ... విశ్వదాభిరామ వినురా ఓ వేమా! వినగానే తొందరపడకయ్యో రామా!
పల్లవి:
-----
విశ్వదాభిరామ వినురా ఓ వేమా ! విశ్వదాభిరామ వినురా ఓ వేమా!
వినగానే తొందరపడకయ్యో రామా!
విశ్వదాభిరామ వినురా ఓ వేమా!
వినగానే తొందరపడకయ్యో రామా!
జలమునుండి పుట్టు జనులు లౌకిక ధర్మాన //2
గురు కలమునుండి పుట్టు ప్రజలు ప్రత్యేక జన్మాన
విశ్వదాభిరామ వినురా ఓ వేమా!
వినగానే తొందరపడకయ్యో రామా!
చరణం 1:
------
రామా అని అంటూనే దశరథరాముడు కాదు
దశఅశ్వారథమున దరికోరే జీవుడు వాడు
వేమా అని వింటూనే వేశ్యాలోలుడు కాదు
యోగీశ్వరుడై వెలిగిన గురువేలే ఆ వాడు
శివుడని తానంటే శంకరుడని కాదు
శివయోగమునందించే మధ్యాత్మే వాడు
భవుడనగా కంటే భవబంధుడు కాదు
బయలుకు బ్రతిగానున్న పరమాత్మే వాడు
విశ్వదా అభిరామలు వ్యక్తులు కాదు ...విశ్వమునే పాలించే శక్తులు వారు
వేమన పద మకుటమన్న నీతము కాదు ... నీ తనువున తత్వమైన త్రైతము వారు ... ఆ త్రైతమునే నీవు చేరు
విశ్వదాభిరామ వినురా ఓ వేమా ! విశ్వదాభిరామ వినురా ఓ వేమా!
వినగానే తొందరపడకయ్యో రామా! వినగానే తొందరపడకయ్యో రామా!
చరణం 2:
------
తలిదండ్రులు అంటూనే మోహబంధనము కాదు
సర్వులనూ సృజియించే ప్రకృతిపరమాత్మలు
ఆలూసుతులనగానే దేహబంధువులు కాదు
ప్రతి తలలో ప్రభవించే మాయాగుణకర్మలు
సతిపతులని యనగా సంసారులు కాదు
సృష్టికి కారణమైన దైవశక్తులే వారు
అనదమ్ములు అంటే దాయాదులు కాదు
ఆత్మాజీవాత్మలకే ఆనవాలు వారు
అత్తామామలు అంటే ఆప్తులుకాదు ... ఆత్మామాయల జంటకు మాటేవారు
తాతాతండ్రులు అనగా వ్యక్తులు కాదు ... పరమాత్మాఆత్మకు ప్రతిరూపము వారు ... ఆ ఆత్మలనే నీవు చేరు
విశ్వదాభిరామ వినురా ఓ వేమా !
వినగానే తొందరపడకయ్యో రామా! వినగానే తొందరపడకయ్యో రామా!
చరణం 3:
------
కామీ అని అంటూనే కామాంధుడుయే కాదు
కామమునే జయించేటి మోక్షగామి గావచ్చు
కాంతా యని యనగానే జారుకాంతయే గాదు
అంత్యములో సిద్దించే ముక్తికాంత కావచ్చు
త్రిమూర్తులని అంటే దేవతలే కాదు
త్రిగుణాలను తలపించే ఉపమానము జూడు
కుత్సితుడని అనగా కుటిలకాడు గాదు
ఆ గుణముల అణచేసే గురుమాన్యుడు వాడు
దేవాలయమంటూనే భవనము కాదు ... నీ దేహమె ఆత్మకు ఆలయమే చూడు
దేవుడు అని అంటూనే విగ్రహకాదు ... దేహగృహములో దాగిన తత్వము వాడు .. ఆ వేమత్త్వమునే నీవు కూడు
విశ్వదాభిరామ వినురా ఓ వేమా ! విశ్వదాభిరామ వినురా ఓ వేమా!
వినగానే తొందరపడకయ్యో రామా!
జలమునుండి పుట్టు జనులు లౌకిక ధర్మాన //2
గురు కలమునుండి పుట్టు ప్రజలు ప్రత్యేక జన్మాన
విశ్వదాభిరామ వినురా ఓ వేమా!
వినగానే తొందరపడకయ్యో రామా! వినగానే తొందరపడకయ్యో రామా!
వినగానే తొందరపడకు అయ్యో రామా!