Aa Challani Samudra Garbam Song | Daruvu Telangana Folk Songs | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 1.3K

  • @vamsiKrishna-tk1vz
    @vamsiKrishna-tk1vz 2 ปีที่แล้ว +161

    ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
    ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో .... ఓ ఓ ఓ
    ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
    దాచిన బడబానలమెంతో..
    భూగోళం పుట్టుక కోసం, రాలిన సురగోళాలెన్నో
    భూగోళం పుట్టుక కోసం, రాలిన సురగోళాలెన్నో
    ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో........ఆఆఆఆ..... ఆఆఆఆఆ
    ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
    ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో
    కులమతాల సుడిగుండాలకు బలిఐన పవిత్రులెందరో
    ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
    ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో .... ఓ ఓ ఓ
    మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో
    రణ రక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో.......... ఓ ఆఆఆ.. ఆఆఆఆ... ఆఆఆఆఆ
    రణ రక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో
    కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాధమెంతొ
    కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాధమెంతొ
    దనవంతుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో
    ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
    ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో .... ఓ ఓ ఓ
    ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
    అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగ మదెంత దూరమో
    కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో.............................. ఓ ఆఆఆఆ... ఆఆఆఆఆ...ఆఆఆఆఆఆ
    కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
    పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
    గాయపడిన కవి గుండెలలో .
    గాయపడిన కవి గుండెలలో
    రాయబడని కావ్యాలెన్నో
    ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
    ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో .... ఓ ఓ ఓ

  • @mallelasainath5231
    @mallelasainath5231 4 ปีที่แล้ว +118

    గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో........ ఈ అద్భుత సృష్టి కి దాశరథి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి పాట మరొకటి సృష్టించ లేరు

  • @VenkayammaSadhu
    @VenkayammaSadhu 6 หลายเดือนก่อน +14

    నందన్ రాజు గారికి
    ఆ జన్మాతం రుణపడి ఉంటాము. అంత చక్కగా పాడారు ఈ పాట. ఈ పాటలో ఉన్న ప్రతి అక్షరం కార్మిక వర్గాన్ని చైతన్యం చేసేదే. రచయిత దాశరధికారికి నా రెడ్ సెల్యూట్

  • @balakrishnareddygovula9651
    @balakrishnareddygovula9651 4 ปีที่แล้ว +108

    తెలుగు భాష ఉన్నన్ని రోజులు ఈ పాట సజీవంగా ఉంటుంది చాలా బాగా పాడావ్ సోదరా👌👍🙏

    • @srinivasp9624
      @srinivasp9624 3 ปีที่แล้ว +1

      Super song Anna

    • @balakrishnareddygovula9651
      @balakrishnareddygovula9651 3 ปีที่แล้ว +1

      @@srinivasp9624 ఎన్ని సార్లు విన్నా ఈ పాట మల్ల మల్ల వినాలనిపిస్తుంది తమ్ముడు

  • @seepanaramamohanrao3144
    @seepanaramamohanrao3144 3 ปีที่แล้ว +27

    ఒక గేయెం వినిపించడం లో
    గాయకుడు ప్రతిభ తెలుస్తుంది అది ఇ పాట ద్వారా నిరూపించారు గాయకుడు గ్రేట్

  • @venkatkoduru55
    @venkatkoduru55 3 ปีที่แล้ว +81

    చాలా అద్భుతంగా పాడారు బ్రదర్ నేను కూడా ఒక కళాకారుడినే ఈ పాట నేను గత 25 సంవత్సరాలుగా ఎంతో మంది పడగావిన్నాను కానీ మీలాగా ఇంత చక్కగా ఇంత కాన్ఫిడెంట్ గా పాడింది మీరే.. హ్యాట్సాఫ్ 👍👍👍🙏🙏🙏🙏

  • @CHANDRASEKHAR-et3zw
    @CHANDRASEKHAR-et3zw 4 ปีที่แล้ว +186

    మనసుకు భాద గా ఉన్న ప్రతీ సమయం లో నేను ఈ పాట వింటాను...చరిత్రలో నేను ఎంత నాకు ఉన్న కన్నీరు ఎంత అనేది తెలియ చేస్తుంది....

    • @Andari-vadu
      @Andari-vadu 4 ปีที่แล้ว +1

      S bro 💯

    • @manivaranasi9881
      @manivaranasi9881 4 ปีที่แล้ว +1

      verynicesinging

    • @bolligarlamalli3777
      @bolligarlamalli3777 4 ปีที่แล้ว +1

      S me also

    • @victordpo2024
      @victordpo2024 3 ปีที่แล้ว +2

      మనసును సేదదీర్చే పాట..
      దాశరధిగారి అధ్భుత రచన

    • @Vchannel38
      @Vchannel38 3 ปีที่แล้ว +2

      Nenu kuda andi meelage vinta

  • @usshyamala4030
    @usshyamala4030 4 ปีที่แล้ว +118

    దాశరధి గారి రచయిత లో పాట అధిరింది గాయకుడు అద్భుతంగా స్వరాన్ని వినిపించారు ధన్యవాదములు

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782 3 ปีที่แล้ว +54

    ఇంతవరకు ఇంత బాగా ఈ పాట పాడిన వాళ్ళను చూడలేదు సార్ సూపర్ 👍👍👍👌👌👌🙏🙏🙏

  • @nrmusicnarsareddygajula3494
    @nrmusicnarsareddygajula3494 3 ปีที่แล้ว +146

    అద్భుతం, అమోఘం,అపూర్వం,అనంతం
    ఎంత చక్కగా వినసొంపుగా ఉంది. మీ గానం
    ఎంత విన్న ఇంకా వినాలనిపిస్తుంది . సూపర్ అన్నా ..... మీకు పాదాభివందనాలు చేస్తున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 4 ปีที่แล้ว +45

    అన్న..నీ.గొంతు... సూపర్. ..గాయ పడ్డ. కవి గుండెల్లో. రాయబడనికవ్వలేన్నో....💐💐💐💐

  • @gudesreenivasurao8761
    @gudesreenivasurao8761 ปีที่แล้ว +15

    పాట వింటుంటే గొప్ప కళాకారులు నిలయం మాత్రమే కాదు,గొప్ప కవులు ,గొప్ప గాయకులు కు పుట్టినిల్లు మన దేశం. ధాశరది గారి గొప్ప సాహితీ సంపద తెలుస్తుంది.🙏

  • @pbnlyrics8921
    @pbnlyrics8921 4 ปีที่แล้ว +358

    అన్న ఇంతవరకు నీ అంత అద్భుతంగా ఈ పాటను ఎవరు పాడిఉండరు అనిపిస్తుందన్న అంత అద్భుతంగా పాడినవ్ అన్న నీకు పాదాభివందనం

  • @mahaantushankar5950
    @mahaantushankar5950 4 ปีที่แล้ว +66

    అద్భుతంగా పాడారు సోదర మాట‌లతో చెప్పలేం గాత్రం బాగుంది

    • @ailonikumaraswamia2579
      @ailonikumaraswamia2579 4 ปีที่แล้ว

      Ailoni.kumaraswamy.warangal.girmajipet

    • @ravindrareddy1612
      @ravindrareddy1612 4 ปีที่แล้ว

      @@ailonikumaraswamia2579 f,ucuuuzuurzuuufr see fuzuuuzuzuuuuiuzu ss assiduous yu you uzuuu see SS is szuzuuo and w as zuzu regards so zx CSS zzuuuzuue du us on, and x ss

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 3 ปีที่แล้ว

      @@ravindrareddy1612 🤣🤣బబఠటపఝజజజజఃడఢభసనధధజఝఠ

  • @laxman.reddy.buvvalaoffici512
    @laxman.reddy.buvvalaoffici512 4 ปีที่แล้ว +74

    ఆహా ఏమి.. ఇంత మధురమైన పాట.. ఎంత అద్భుతంగా ఉన్నది.. అహో దాశరధి గారు.. మీ కలం లో నుంచి జాలువారిన అద్భుతమైన గీతాము.. సంవత్సరములు గడిచినా.. దాశరధి మీ కలం లో నుంచి జాలువారిన... మధుర గీతాలు అద్భుతం.. నా తెలంగాణ ముద్దుబిడ్డ. దాశరధి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

    • @kumarani9714
      @kumarani9714 3 ปีที่แล้ว +1

      Supper

    • @gogulamatamramanamurthy8112
      @gogulamatamramanamurthy8112 7 หลายเดือนก่อน +1

      సర్ దాసరధి గాు కనవి మీకు మాత్రమే సొంతం
      చేసుకొకండి సారు.
      తెలుగు బిడ్డ మన తెలుగు బిడ్డ కాదు కాదు
      మన భారత దేశం మొత్తం గర్వించి బిడ్డ.
      మన తెలుగుజాతి మొత్తానికి కీర్తిప్తతిష్టలు
      సాధించి పెట్టిన మన మహాకవి మన కవి.
      ఏదో రాసాను మీరేమి అనుకోకుండా సార్.
      ❤❤❤❤❤❤❤❤❤❤❤😂

  • @bhagavanbabji980
    @bhagavanbabji980 2 ปีที่แล้ว +46

    ఈ పాటను ఇంత అద్భుతంగా పాడిన వారు మీరే సోదరా!పాట వింటుంటే రోమాలు నిక్క బొడుచు కుంటున్నాయి.

  • @venkatb6059
    @venkatb6059 4 ปีที่แล้ว +90

    అన్నా ఇంత మంచి పాట వినిపించినందుకు నీకు దండమే

  • @chitika.narasimharao1645
    @chitika.narasimharao1645 ปีที่แล้ว +17

    అభ్యుదయ కవి రచయిత దాశరథి గారి కలం నుండి జాలువారిన ఈ పాట మీగాత్రం ద్వారా విని ఎంతో పరవశించిపోయాను,అద్భుతం అనిర్వచనీయం,కళాభివందనాలు❤🎉

  • @Vicky..Chicky..
    @Vicky..Chicky.. 4 ปีที่แล้ว +85

    పాట వింటుంటే ఏదో తెలియని అనుభూతి అన్న...గ్రేట్ వాయిస్ సూపర్

  • @abdulrouf4524
    @abdulrouf4524 ปีที่แล้ว +13

    అద్భుతమైన పాట... పాట రాసిన కవి గొప్ప వారో... కవి భావాన్ని స్వస్టంగా వినిపించిన గాయకుడు గాయకుడు గొప్ప వారో.... నిజం both r great🙏🏻🙏🏻

  • @bhanuvideos2759
    @bhanuvideos2759 4 ปีที่แล้ว +22

    అన్నా దేశపతి శ్రీనివాస్ గారు కొంచెం కొంచెం పడుతూ ఉంటే ఈ పాట ఇంకా ఉండదా అని అనిపించేది నీ ద్వారా ఈ పాట విని చాలా ఆనందపడ్డాను

  • @nestham1638
    @nestham1638 3 ปีที่แล้ว +93

    ఈ పాటలో నా మనసుకు నచ్చినది .ఒక రాజుని గెలిపిచుటకు ఒరిగి ప్రాణాలెన్నో .అంటే ఈ రాజకియ్యనాయకులు కోసం ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో

  • @venkatthumu8240
    @venkatthumu8240 2 ปีที่แล้ว +18

    దాశరథి కృష్ణమాచార్యులు గారు రాసిన ఈ పాటకు మీ గొంతుతో ప్రాణం పోశారు. హ్యండ్సప్.

  • @shekarshivakoti7397
    @shekarshivakoti7397 3 ปีที่แล้ว +11

    చెక్కు చెదరని సాహిత్యం. చెక్కు చెదరని. గానము..పాడిన. మన మాస్టర్ గార్కి శతకోటి వంద నాలు.

  • @gopalkrishna5376
    @gopalkrishna5376 4 ปีที่แล้ว +50

    నా తెలంగాణ కోటి రతనాల వీణ... అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్య గారు.

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 3 ปีที่แล้ว +26

    దాశరథి ఎక్కడున్నవయ్య ఇంత మంచి పాటని మాకు మిగిల్చి చిరంజీవి గా ఉన్నావ్...🌹💐🙏.

  • @venkatthumu8240
    @venkatthumu8240 2 ปีที่แล้ว +15

    మీ గొంతుతో ఈ పాటకు ప్రాణం పోసి ఇంకో 100సఃవత్సరాల వరకు బతికిఃచారు

  • @wewantfullepisodetullarame2085
    @wewantfullepisodetullarame2085 2 ปีที่แล้ว +28

    అద్భుతం ఇప్పటివరకు ఈ పాటను ఎంతోమంది పాడి ఉంటారు కానీ మీరు పాడిన పాట మీ గొంతు మీ గాత్రం అద్భుతం అన్న నీకు పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @kasulapeddulu2887
    @kasulapeddulu2887 4 ปีที่แล้ว +21

    అన్న ఇంతవరకు నీ అంత అద్భుతంగా ఈ పాటను ఎవరు పాడిఉండరు

  • @bhanupbn9089
    @bhanupbn9089 3 ปีที่แล้ว +39

    మరువలేని మరుపు రాణి ఈ పాటని ఇంత అధ్బుతంగా రాసిన దాశరథి గారికి నా పాదాభివందనం

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia2181 2 ปีที่แล้ว +15

    దాశరధి గారు అద్భుతంగా వ్రాస్తే
    దానిని మీరు అద్భుతంగా పాడారు అన్నయ్య..

  • @VenkayammaSadhu
    @VenkayammaSadhu 6 หลายเดือนก่อน +2

    ఈపాట పాడటానకె నీవు పుట్టవా అన్నట్టుంటుంది. ఎంతో మంది పాడితే విన్నాను. కానీ నీతో సరి కాలేదు.
    ఈ పాటవ్రాసిన దాశరధి గారికి కార్మికవర్గం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 3 ปีที่แล้ว +22

    చాలా బాగా పాడారు బ్రదర్...మీలాగా ఈ పాట పాడిన వాళ్ళు... ఎవరూ లేరు 💯👌👍🙏💐

    • @lingaiahmadupu1180
      @lingaiahmadupu1180 2 ปีที่แล้ว

      చాలా అద్భుతంగా పాడారు

    • @RoyalPraveen9133
      @RoyalPraveen9133 3 หลายเดือนก่อน

      Annaa nunu
      Naaa puthrarathnalaki
      Anteey Naku ok bauu oka papaa nunu prathiroju me song vinipinchadadiki na chinna prayathnam ann jai pdso student organisation

  • @shankarp3173
    @shankarp3173 3 หลายเดือนก่อน +1

    చాలా మంచి పాట.మా పాఠ శాలలో మా మాష్టారు ప్రతీ జాతీయ పండుగ లో ఈ పాట పాడేవారు. పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. Vijaya Laxmi Pervaram.

  • @rammohankothakota9536
    @rammohankothakota9536 4 ปีที่แล้ว +62

    ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
    ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ||ఆ చల్లని||
    భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
    ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
    ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో
    కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో ||ఆ చల్లని||
    మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో
    రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో
    కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
    భూస్వాముల దౌర్జన్యాలకు
    ధనవంతుల దుర్మార్గాలకు
    దగ్ధమైన బతుకులు ఎన్నో ||ఆ చల్లని||
    అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
    కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
    పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
    గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ||ఆ చల్లని ||
    దాశరది క్రిష్ణమాచార్య
    Tags: Dhasharadhi Krishnamaacharya
    facebook twitter google+
    TelanganaPaata
    ఒక తెలంగాణా పాట ప్రియుడు

  • @bandarisaikrishna9998
    @bandarisaikrishna9998 3 ปีที่แล้ว +12

    అన్నా మీకు పదాభి వందనాలే 🙏🏻🙏🏻 పదాలలోని మాధుర్యాన్ని మీ గొంతుతో చక్కగా పాడినందుకు దాశరథి గారి కల భావాన్ని ఈ రూపకంగ వ్యక్తం చేసిన మీకు వందనాలు అభివందనాలు💐💐💐💐.🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఈ పాట ఎప్పటికి చరితార్థమే 👍👍

  • @shobanbabuboini364
    @shobanbabuboini364 2 ปีที่แล้ว +13

    తమ్ముడు గారు మీకు శుభాకాంక్షలు.. మానుకోట ఆణిముత్యం మీరు..గానామృతం తో అందరినీ మంత్ర ముగ్ధులను చేశావు.. ఎన్ని సార్లు విన్న తనవి తీరదు..

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 7 หลายเดือนก่อน +1

    Thammudu! అద్భుతంగా పాడావు.sukhi bhava తండ్రీ!god bless you. Sarve janasukhi nobhavanthu. Satya meva jayathe.

  • @NaveenKumar-zi3ng
    @NaveenKumar-zi3ng 4 ปีที่แล้ว +52

    దాశరథి గారికి🙏🙏 గానం చేసిన మీకు🙏🙏

  • @rajeshkesupaka8002
    @rajeshkesupaka8002 หลายเดือนก่อน +1

    ఏమని చెప్పాలి ఇంత అబ్దూతంగా పాడితే
    చాలా చాలా సంతోషం గా విన్న అన్నా

  • @rajkumar-qh5ql
    @rajkumar-qh5ql 4 ปีที่แล้ว +146

    గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో......

  • @khajavalishaiknoorbashaped4021
    @khajavalishaiknoorbashaped4021 18 วันที่ผ่านมา

    ఈ పాట పాడటానికే మీరు జన్మించారు సోదారా పైనున్న దాశరధి గారు ఎంతో సంతోషించి వుంటారు ఈ పాట మీ గళం నుండి జాలువారినందుకు

  • @venkatthumu8240
    @venkatthumu8240 2 ปีที่แล้ว +7

    సూపర్, నీ గొంతుతో ఈ పాటకు ప్రాణం పోసినవు 💟మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది 👌

    • @venkatthumu8240
      @venkatthumu8240 2 ปีที่แล้ว +1

      మళ్లీ వినాలిపిస్తుంది

    • @potpireddyvenkataramana9060
      @potpireddyvenkataramana9060 ปีที่แล้ว +1

      ఈ పాట నీది నీకు అంకితం అన్న 🙏🙏🙏

  • @bittysrinivasulu5867
    @bittysrinivasulu5867 10 หลายเดือนก่อน +2

    అద్భుతమైన గాణమృతం మీకు దేవుడు చక్కని ఆరోగ్యo ఇవ్వాలని మరిన్నీ పాటలు మీ గానం రావాలని ఆశిస్తున్నా

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 4 ปีที่แล้ว +14

    అద్భుత గళం మీరు పడినట్లు ఎవరూ ఈ పాట పాలేరు మీకు కలాభినందనలు

    • @pradeept4234
      @pradeept4234 4 ปีที่แล้ว

      Anna singer name please 🙏🙏🙏

  • @allampratap6371
    @allampratap6371 11 หลายเดือนก่อน +2

    అన్న నీ పాటకు అభివందనం,, మిమ్మల్ని కలవాలని అనిపిస్తుంది అన్న,, అడ్రస్ పంపిస్తే

  • @Harikrishna-uh8eu
    @Harikrishna-uh8eu 4 ปีที่แล้ว +34

    నిత్య యవ్వనం అంటే ఈ పాట ను చూస్తే అర్థం అవుతుంది .....నమస్కారం ...

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu8502 ปีที่แล้ว +5

    జైభీమ్ జై ఇన్సాన్
    సూపర్ సింగర్ అన్న గొంతూ వావ్ ✊💪🙏🌱📘🎤💐💐

  • @mnaresh1450
    @mnaresh1450 5 ปีที่แล้ว +11

    Nenu vesina modati natakam and nenu stage pai paadina modati paata. b.tech chaduvutunna kuda ippatiki manasulo pettukunnanu.8 years tarvata vintunna thanks for the video and singer too..🤗🤗

  • @gogulamatamramanamurthy8112
    @gogulamatamramanamurthy8112 7 หลายเดือนก่อน

    ఆహా......
    ఏమి గాత్రం నాయనా. చాలా బాగా పాడారు. కీర్తిశేషులు దాసరధి కృష్ణమార్యులు ఇంతటి మహా ఆబ్దుతమైన పాటను రచించి, సమాజానికి గొప్ప సందేశాన్ని ఈ చిన్న పాటలో నిఘడీకృతం
    చేసారు.
    భూమి పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
    ఈ మానవజాతి రూపము కోసం జరిగిన పరిణామాలెన్నో
    అంటూ మహా కవి ఈ రెండు లైన్ల మాటలలో, మొత్తం ఖగోళ శాస్త్రాన్ని, జీవ పరిణామ క్రమాన్ని మనందరికీ చాలా గొప్పగా చెప్పారు.
    రాజులు, రాజ్యాలు కాలక్రమంలో అంతరించి పోవచ్చును.
    కానీ
    సుకవి జీవించును తరతరాల జనుల గుండెల్లో
    చరిత్ర పుటలలో.
    భూగోళం వున్నంత వరకూ దాసరధి గారు
    వ్రాసిన ఈ పాట వుంటుంది.
    ❤❤😂😂😢😮😅❤❤

  • @baggamvidyasagar5712
    @baggamvidyasagar5712 2 ปีที่แล้ว +11

    అబ్యుదయ బావాలున్న మహాకవి మన దాశరథి గారు ఎవరు పాడినా బావావేశం ఉరకలు వేస్తుంది. ధన్యవాదాలు దాశరథి గారు.

  • @PetaGangulappa
    @PetaGangulappa 11 หลายเดือนก่อน +4

    చాలా అద్భుతంగా ఉన్నది మీనింగ్ voice is very melody

  • @RDM069
    @RDM069 4 ปีที่แล้ว +17

    నన్ను ఎంతో ... ఉద్వేగానికి లోను చేసే అద్భుతమైన lyrics...🙏🙏🙏

  • @vishnuvardhanmuniganti7150
    @vishnuvardhanmuniganti7150 2 หลายเดือนก่อน +2

    అన్న మీరు పాడిన పాట ఒక గేయం కాదన్నా అద్భుత సృష్టి మాకు మీ పాటలోని జీవితమనగాడు మరియు సృష్టి యొక్క విలువలు మాకు మీ పాట ద్వారా తెలుస్తున్నాయి అన్న థాంక్యూ అన్న

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 4 ปีที่แล้ว +33

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శతకోటి వందనాలు మహానుభావుడ దాశరథి గారికి

  • @raghuramulupadala8864
    @raghuramulupadala8864 2 หลายเดือนก่อน

    ఆచార్య వర్యులు... అభ్యుదయ కవి-రచయిత దశరథి గారి కలం జాలువారిన విప్లవ గీతం... కనివిని ఎరుగని రీతిలో గుండెకు హత్తుకుపోయే అంత.. శ్రీసరస్వతీ మాత అనుగ్రహం చేత నువ్వు గానం చేయడమూ మాకు అనుభూతి నిండిపోయింది.

  • @krishnashiga7168
    @krishnashiga7168 4 ปีที่แล้ว +206

    ఇంకో 100 ఏండ్లయిన నిత్యా యవ్వనం ఈ పాట...

  • @dhyavamadhusudanreddy8918
    @dhyavamadhusudanreddy8918 2 หลายเดือนก่อน +1

    నీ సృష్టి ఉన్నన్ని రోజులు ఈ పాట పదిలంగా ఉంటుంది

  • @nestham1638
    @nestham1638 3 ปีที่แล้ว +6

    కులమతల సుడిగుండాలకు బలైన పవిత్రులు ఎందరో .ఈ పాట లోకంలో జరిగిన తీరు అనుభవించిన అనుభవం ప్రస్తుతం జరుగుచున్న ప్రక్రియ గుర్తుకుతెస్తున్నాయి .super సాంగ్ super వాయిస్. ఈ పాట కు చావు లేదు

  • @narasimhamnittur3841
    @narasimhamnittur3841 12 วันที่ผ่านมา

    A Wonderful and Energetic Rendition of the Song by Late Dr Dasarathi Garu which is highly Emotional serves as an inspiration and Eye-opener of the Listeners. Pranaams!

  • @muppuraju8623
    @muppuraju8623 3 ปีที่แล้ว +6

    తెలుగు భాష తెలుగు భాష ఉన్నన్ని రోజులు ఈ పాట బావుంటుంది చాలా బాగా పాడారు సోదరా

  • @kaspagangareddy3419
    @kaspagangareddy3419 8 หลายเดือนก่อน +8

    తెలుగు భాష ఉన్నంత వరకు.... ఈ పాట బ్రతికి వుంటుంది...

  • @mastumazamadhukar
    @mastumazamadhukar 2 หลายเดือนก่อน +1

    అన్నయ్య నువ్వు పాడిన ఈ పాటకు నేను బానిసను అయ్యాను.

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 ปีที่แล้ว +4

    Very nice & meaningful song, hat's off to DASARATHI gariki & Singer ku for his excellent voice - JAI BHEEM 🙏🙏🙏

  • @sudhakarakinepally3233
    @sudhakarakinepally3233 ปีที่แล้ว +2

    అన్నా చాలా అద్భుతంగా గేయం పాడారు తెలంగాణ పౌరుషాన్ని ఇనుమడింప చేస్తూ మోటివేషన్ చేశారు

  • @mahendher1834
    @mahendher1834 4 ปีที่แล้ว +32

    మాటలు లేవు....🙏🙏🙏🙏🙏🙏

  • @pillatirupatiraojanaki5968
    @pillatirupatiraojanaki5968 4 หลายเดือนก่อน

    అద్భుతమైన గీతాన్ని మీ అద్భుతమైన గాత్రంతో అంతే అద్భుతంగా ఆలపించారు సార్...మీకు అభినందనలు 🙏

  • @RajuYadav-wf4jj
    @RajuYadav-wf4jj ปีที่แล้ว +7

    అద్భుతమైన గానమృతం...శతకోటి వందనాలు రచయితకు , గాయకులకు

  • @bshanker972
    @bshanker972 7 หลายเดือนก่อน +1

    Super song Bro,Dhanyavadamulu Bro👍🙏

  • @narasimhareddy3236
    @narasimhareddy3236 4 ปีที่แล้ว +4

    ఆహా ఏమి... పాట.. ఎంత అద్భుతంగా ఉన్నది.పాట వింటుంటే ఏదో తెలియని అనుభూతి అన్న...గ్రేట్ వాయిస్ సూపర్

  • @gbrindia
    @gbrindia 4 หลายเดือนก่อน +2

    Wonderful Lyrics… tireless singing 🙏🙏🙏

  • @nestham1638
    @nestham1638 3 ปีที่แล้ว +18

    వ్రాయ బడని కవి గుండెలలో రాయబడని కావ్య లేనో వ్రాసిన వారికి వందనము అభివందనం.

    • @sravanbathoju6210
      @sravanbathoju6210 3 ปีที่แล้ว

      గాయపడిన కవిగుండెలలో రాయబడని కావ్యాలెన్నో .తెలంగాణ యాస దాశరథి కళం నుండి వచ్చిన గొప్ప పాట

    • @ganapathimangu9330
      @ganapathimangu9330 2 ปีที่แล้ว

      Chala adbthamgugaa paaderu 🙏🙏

  • @Saroja1970
    @Saroja1970 ปีที่แล้ว +2

    అద్భుతంగా పాడారు. ఈ పాట రాసిన వారికి పాడిన మీకు ధన్యవాదాలు

  • @ranganayakulupoludasu2799
    @ranganayakulupoludasu2799 4 ปีที่แล้ว +21

    మంచి పాట చాలా బాగా పాడారు. అభినందనలు బ్రదర్👏👏👏👏👏🥗🥗🥗🥗

  • @sriharineerutineeruti9071
    @sriharineerutineeruti9071 2 ปีที่แล้ว +2

    ఎందరో మహానుభావులు పుట్టిన గడ్డ మన తెలంగాణా అందరికి వందనాలు 🌹🌹🌹🌹🌹🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👌

  • @poojithaboda8309
    @poojithaboda8309 4 ปีที่แล้ว +18

    సూపర్ వాయిస్ అన్న

    • @saiduluy788
      @saiduluy788 4 ปีที่แล้ว

      అవును సూపర్ సాంగ్

  • @Prabhakar-j3p
    @Prabhakar-j3p 3 วันที่ผ่านมา

    సూపర్ బ్రో 👌

  • @naveenchary1825
    @naveenchary1825 4 ปีที่แล้ว +6

    చాలా అద్భుతంగా పాడారు అన్నా
    మీరు పడేది వింటుంటే gazboom s vastunnai

  • @jithendarm5537
    @jithendarm5537 ปีที่แล้ว

    ANNA superga padav

  • @railikoteshwarlu649
    @railikoteshwarlu649 2 ปีที่แล้ว +4

    అద్భుతమైన పాట గంభీరమైన స్వరం అద్భుతం బ్రదర్

  • @VenkayammaSadhu
    @VenkayammaSadhu 3 หลายเดือนก่อน +1

    ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో..
    ఇప్పుడు జరుగుతున్న
    ఈ బూటకపు ప్రజాస్వామిక ఎన్నికల్లో ఒరిగిన ఒరుగుతున్న నరకంఠాలెన్నో?

  • @PradeepKumar-sq3cm
    @PradeepKumar-sq3cm 4 ปีที่แล้ว +3

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివితీరడం లేదు సోదరా దాసరి గారు అక్షరాలకు ప్రాణంపోస్తే మీరు పాటకు ప్రాణము పోసారు...

    • @bodigavenkateshamgoud2747
      @bodigavenkateshamgoud2747 3 ปีที่แล้ว

      Dasrigaru kadu dasharadhigaru wrasaru we patani.

    • @PradeepKumar-sq3cm
      @PradeepKumar-sq3cm 3 ปีที่แล้ว

      ఆ విషయం నాకు తెలుసు సోదరా షార్ట్ కట్ లో అలా రాసాను కానీ మీనింగ్ మారిపోయింది

  • @8380billa
    @8380billa 4 ปีที่แล้ว +10

    వందేమాతరం పాడాడు భయ్యా ఆ సాంగ్ కోసం వెతుకుతున్న

    • @Parameshwar7730
      @Parameshwar7730 4 ปีที่แล้ว

      th-cam.com/video/zKTyajt_oA8/w-d-xo.html

    • @nageswararao667
      @nageswararao667 3 ปีที่แล้ว

      S p Balu Garu padaru. Cinema release kaledu vinandi.
      Hero bhanuchandar
      Picture name comrade.

  • @adepukodandapani3175
    @adepukodandapani3175 9 หลายเดือนก่อน +2

    Super song 😊

  • @SVVreddy
    @SVVreddy 3 ปีที่แล้ว +4

    చాలా చాలా బాగా పాడారు. మీరు పడుతుంటే దాశరథి గారి పాటకు ప్రాణం పోసినట్లు గా అనిపించింది. ఇంత మంచి రచన చేసిన దాశరథి గారికి, ఉత్తేజబరితంగా అలపించించిన మీకు జోహార్లు.

  • @rajurampuram9328
    @rajurampuram9328 10 หลายเดือนก่อน

    నరణరాల్లో విప్లవ స్ఫూర్తిని నింపే మీ గాత్రా0, చితికిపోయిన పేద బతుకులపై భూస్వాములు, ధనవంతుల, కుల వర్గాల చేసిన పెత్తనన్ని పదాల అల్లికలో వివరించిన మీ పాటకు వందనం 🙏🏾🙏🏾మీ రాంపురం రాజ

  • @nagendrakumargandham8371
    @nagendrakumargandham8371 2 ปีที่แล้ว +3

    రోజులో ఒక్కసారి ఐనా వింటాను....బాగా పాడారు....

  • @tennetimurty1848
    @tennetimurty1848 7 หลายเดือนก่อน

    What a confidence !! With great emotional expressions he presented this song as never before never again !! Excellent ❤

  • @MaheshKurma573
    @MaheshKurma573 4 ปีที่แล้ว +16

    దాశరథి కృష్ణమాచార్య నీకు వందనాలు

  • @saleemmohammad5603
    @saleemmohammad5603 4 ปีที่แล้ว +11

    అద్భుతంగా పాడారు. Hatsup సోదరా

  • @kumarsravan4602
    @kumarsravan4602 3 ปีที่แล้ว +2

    అమోగం అద్బుతం చాలా బాగా పాడారు బ్రదర్ జై భీం .....

  • @saiduluy788
    @saiduluy788 4 ปีที่แล้ว +18

    సూపర్ సాంగ్ అన్న బాగా పాడావు నేను కూడా ట్రై చేస్తాను

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +2

    భూమి సమస్త జీవాజాతులకు గ్రహాలకు దేవతలకు ఆధారం
    భూమికి గ్యాస్ ఖనిజ ఇంధనమే ఆధారం
    కుల సంఘాలలో కట్టెలమంట వంట పనికితిండితోనే సాధ్యమే
    దానిని కాపాడు పాడుచేయుట మనుష్యులకొరకే మనుష్యులతోనే సాధ్యం

  • @harilal8385
    @harilal8385 ปีที่แล้ว +5

    ఈ పాట అద్భుతం సార్.
    మీ గాత్రానికి పాదాభివందనం చేస్తున్నాను 👏👏👏👏👏👏

  • @tunetoculture
    @tunetoculture 11 หลายเดือนก่อน

    Ragas... in middle...really awesome... pronounciation...flat ga velpotondi... especially in pavvavi.......I'm just sharing my openion.... 👍👍👍🎉

  • @gracegopireddy6896
    @gracegopireddy6896 4 ปีที่แล้ว +10

    Dasharadhi is my (Chinnagudr) villege. so glad to hear this song. When I am small, that time I know this song .thank you ones again

  • @rameshb6805
    @rameshb6805 3 ปีที่แล้ว +2

    ఈ పాట రాసిన కవిగారికి,అద్బుతంగా గానం చేసిన మీకు పాదాభివందనం.

  • @patnamyellam2097
    @patnamyellam2097 4 ปีที่แล้ว +7

    దాశరథి గారు రచించి ఈ పాటకు ఎంత వన్నె తెచ్చారో మీరు పాటను పాడి అంత వన్నె తెచ్చారు.

  • @viswanathamekala488
    @viswanathamekala488 ปีที่แล้ว

    దార్శనిక కవి *దాశరథి* ఆద్భుతమైన తన కలంతో మనసు లోతుల్లోనుంచి ఉబికి వచ్చిన భావజాలానికి అక్షర రూపమిస్తే గళమెత్తిన కంఠ స్వరం రాగయుక్తంగా గానం చేసిన అద్భుత గాయకుడు మది పులకరించి పరవశించేలా న్యాయం చేసి వీనుల విందు చేసారు 🙏👏👍👌🌹

  • @yramgopalreddy
    @yramgopalreddy 4 ปีที่แล้ว +4

    తెలంగాణ గడ్డకే వజ్రం లాంటిది ఈ పాట.చాలా బాగా పాడారు సర్.