శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి | గులాబీ అత్తరు | మేలిమి బంగరు కథ | తెలుగు ఆడియో కథలు |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2021
  • 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి (ఏప్రిల్ 23, 1891 - ఫిబ్రవరి 25, 1961). భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఈయన పేరెన్నిక గన్నవారు. ఆయన జీవితం ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించేడీయన.
    వేదవేదాంగాలు తరతరాలుగా అధ్యయనం చేసే కర్మిష్టులూ, పండితులూ అయిన కుటుంబంలో పుట్టి, సంస్కృతానికి స్వస్తి చెప్పి, తెలుగులో చిన్న కథలని రాయటం ప్రవృత్తిగా ఎన్నుకుని ఆ చిన్న కథకి కావ్యప్రతిపత్తి కలిగించిన సాహిత్య శిల్పి, సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన ఆత్మకథ పేరు అనుభవాలూ-జ్ఞాపకాలూనూ.
    సుబ్రహ్మణ్యశాస్త్రి 1891 ఏప్రిల్ 23 న తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మహలక్ష్మీ సోదెమ్మ, లక్ష్మీపతి సోమయాజులు. వేదం, జ్యోతిష్యం, ధర్మ శాస్త్రాలను చదివారు.
    ఈయన గాంధీ, ఖద్దరు, హిందీ - ఈ మూడింటినీ వ్యతిరేకించారు.
    సుబ్రహ్మణ్యశాస్త్రి 1961 ఫిబ్రవరి 25 న రాజమహేంద్రవరం లో మరణించారు.
    సుబ్రహ్మణ్య శాస్రి 75 కథలు రాసారు. ఈయన కథలలో విషయాన్ని ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబజీవితం, అపరాధ పరిశోధనం, భాషావివాదాత్మకం, అవహేళనాత్మకం, చారిత్రకం అనే విషయాలుగా విభజించచ్చు. ఇవేకాక శ్రీపాద అనేక పద్య రచనలు, నవలలు,నాటకాలు,అనువాదాలు, వైద్య గ్రంథాలు కూడా రాసారు. వాటిలో కొన్ని: ఆత్మబలి, రక్షాబంధనం, రాజరాజూ, కలంపోటు, వీరపూజ, వీరాంగనలు, మహాభక్త విజయము, ఆయుర్వేద యోగ ముక్తావళి, వైద్యక పరిభాష వగైరా. శాస్త్రి తన ఆత్మకథ - అనుభవాలూ-జ్ఞాపకాలూనూ ని ఎనిమిది సంపుటాలుగా ప్రచురించదలిచారు. కానీ శాస్త్రి అకాలమరణంతో అది మూడు సంపుటాల దగ్గర నిలిచిపోయింది. ఈయన రచనలు ఆంధ్రప్రదేశ్ పాఠశాల, కళాశాలలలో పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. శాస్త్రి తొమ్మిదేళ్ళ పాటు ప్రబుద్ధాంధ్ర పత్రిక నిర్వహించారు. గిడుగు రామమూర్తి లాగా ప్రముఖ వ్యావహారిక భాషావాది. కలం పేర్లతో శతాధిక వ్యాసాలు రాసారు. అనేక అష్టావధానాలు కుడా చేసారు. 1956 లో కనకాభిషేకం అందుకున్నారు.
    వీరి మొదటి కధ "ఇరువరము ఒక్కచోటికే పోదాము"అన్నది 1915లో ప్రచురితమైనది."మిధునానురాగము" అన్నది వీరు మొదటి నవల. 1923 వరకు గ్రాంధికముగా రచనలు చేసి తదుపతి రెండు సంవత్సరములలో సంపూర్ణముగా వ్యావహారిక భాషకు దిగిపోయినారు. 1938నుండి వీరు పద్యరచనను పరిపూర్ణముగా నిషేధించారు. శాస్త్రిగారు హింది-గాంధీ-ఖద్దరు ఈ మూడింటిని గిట్టని వ్యక్తి. తమ వ్యక్తిత్వమును చివరివరకు అట్లే నిలదొక్కుకున్నారు. శాస్త్రిగారు ఒక యుగసంధిలో పెరిగిన వ్యక్తి. శుద్ధ శోత్రియకుటుంబములో పుట్టి ఆ కుటుంబ వ్యవస్థ తాలూకు ఆచారవ్యవహారలనుండి బయటపడటానికి నానా యాతనలు పడి గడిచి గట్టెక్కినవారు. ఈ ప్రశ్నలకు సరియిన సమాధానాలు ఆయన ఆత్మకధలో అనుభవాలూ-జ్ఞాపకాలు చదవాలి. ఈ గ్రంధం మొదటి ప్రచురణ 1955 జూన్లో కూర్పు వెలువడింది. కలాభివర్దినీ పరిషత్తు, రాజమండ్రి దీని ప్రచురణ కర్తలు. తరువాతది 1958లో, మూడవది 1966లో అటుపై శాస్త్రిగారి అకాల మరణం వలన మూడవ సంపుటంతో ఆఖరు.ఈ సంపుటాన్ని అద్దేపల్లి అండ్ కోవారు ప్రచురించారు.కాగా శాస్త్రిగారికి మొదట్లో ఆత్మకధ వ్రాసుకోవాలన్న ఉద్దేశ్యం లేదు. నవోదయపత్రికవారికోసం దాని సంపాదకులు నీలంరాజు వెంకటశేషయ్య గారు వారిచేత బలవంతంగా వ్రాయించారు. అంతకుపూర్వం శాస్త్రిగారు ఆనందవాణి వార్షికపత్రికలో నాదీపావళి ముచ్చట్లు అన్నశీర్షికతో ఇటువంటి రచనలే చేశారట.
    శాస్త్రిగారు విద్యార్ధిదశలో వల్లూరుగ్రామంలో వుండగా ఒక డెబ్బయి యేళ్ల వితంతువు వొకావిడ కావాలని పరిచయం చేసుకొని, శాస్త్రిగారి చేత మదనకామరాజు కధలు యేకాంతంగా నాలుగుసార్లు చదివివినుపించుకొందట.ఈపుస్తకమే శాస్త్రిగారికి వచన రచనలో ఆప్యాయత కుదిర్చింది. తరువాత వారు మేడపాడు గ్రామంలో అరేబియన్ నైట్స్ కధలూ, చార్ దర్వీష్ కధలు, శుక సప్తతి కధలు, రేచుక్క పగటిచుక్క కధలు చదివారు. వాటి భాష ఆయనకి నచ్చక మళ్ళీ సులభమైన వచనంమీద అభిమానం ఏర్పడినది. రామకృష్ణ కవుల దగ్గర చేరిన ఆరుమాసాలకే తమలో ఏదో కొత్తదనం ఏర్పడినట్లు అనిపించిందట అక్కడే వీరపూజ రచించినారు.
    శాస్త్రిగారు ప్రకటించిన చిన్న కధల సంపుటాలే 27 ఉన్నాయి. అద్దేపల్లి వారికి వీటితాలూకు సంపూర్ణ అధికారం ఉన్నాయి. ఇవికాక శాస్త్రిగారు వ్రాసిన ఇతరగ్రంధాలు అనేకం ఉన్నాయి. నాటకాలు 'వారకంత', 'ప్రేమపాశం', 'నిగళబంధం', 'రాజరాజు' ఇంకా అనేక ఏకాంకికలు (కలంపోటు అనేది ఒకటి). అలాగే అత్తా-అల్లుడు, అలంకృతి, అభిసారిక, బాలిక-తాత మొదలయిన ఖండకావ్యాలు,రేడియో ప్రసంగాలు, స్మశానవాటిక, రక్షాబంధనము నవలలు ఉన్నాయి.దాదాపు 10సం. ప్రబుద్దాంధ్రలో వారు వివిధములయిన రచనలు చేసినారు. నన్నయ శ్రీనాధ జయంతులు నడిపినారట. వారి కవిత్వము గురుంచి ఎన్నో విపుల వ్యాసములు వ్రాసినారు.
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 22

  • @sridevitanikella6807
    @sridevitanikella6807 10 หลายเดือนก่อน +1

    మంచి కథ వినిపించారు. ధన్యవాదాలు

  • @peddintiganeswaraorao1375
    @peddintiganeswaraorao1375 ปีที่แล้ว +2

    Last Golden words of this story

  • @umadevi8931
    @umadevi8931 9 หลายเดือนก่อน +1

    ఎన్నో సార్లు చదివిన ఈ కథ ను మీ గళం ద్వారా ఇప్పుడు విన్నాను ‌సుమధురం గా ఉంది
    5:01

  • @satyakiranputtamraju
    @satyakiranputtamraju ปีที่แล้ว +2

    Thanks for the story

  • @avnraju
    @avnraju ปีที่แล้ว +3

    చాలా మంచి ప్రయత్నం సర్ ఇది
    తెలుగు కథకు, తెలుగు రచయితలకు,తెలుగు సాహిత్యానికి మళ్ళీ జీవం పోస్తున్నారు.
    ఇలాంటి ప్రయత్నం నేను చేయాలని అనుకున్నాను, కానీ ఆచరణ కాలేదు. మీలాగే కొంతమంది ప్రారంభించారు శిరీష వారణాసి మొదలగు వారు. మీరు అందరూ చేస్తున్న కృషికి వందనాలు.
    ఇక నేను కూడా తెలుగు కథ ఇష్టపడే వాళ్లల్లో ఒకడిని.
    శ్రీ పాద వారివి అనుభవాలు జ్ఞాపకాలు, గులాబీ అత్తరు, కలుపు మొక్కలు,వడ్లగింజలు, పుల్లంపేట జరీ చీర పుస్తకాలు చదువుచున్నాను. మార్గదర్శి లభించలేదు.
    మీరు ఇలాగే మిగిలిన కవుల కథలు కూడా వినిపించాలని కోరుకుంటున్నాను.
    నేను చదువుతున్న మరికొన్ని
    ముళ్ళపూడి వారివి
    వంశీ
    శ్రీ రమణ
    బాపు
    గురజాడ
    బారిష్టర్ పార్వతీశం
    తెన్నేటి సూరి మొదలగు వారు
    మరొక్కసారి మీ ప్రయత్నానికి వందనాలు

  • @pradeepkumarkondapaka9319
    @pradeepkumarkondapaka9319 4 หลายเดือนก่อน

    అద్భుతమైన కథ అండి...నాకు స్వచ్చమైన తెలుగు కథలు అంటే చాలా ఇష్టం...ఆ తెలుగు పదాలలోని మాధుర్యం మరి ఎక్కడ రాదు...మీలాంటి వారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నందునే ఇంకా మంచి తెలుగు వినబడుతోంది..చదవబడుతోంది కుడా .... చాలా ధాన్యవాదాలు అంది...

  • @peddintiganeswaraorao1375
    @peddintiganeswaraorao1375 ปีที่แล้ว +2

    దివాన్ గారి అతి లౌక్యంతో కన్నుమూసిన మహారాజు గారి స్వచ్ఛ కీర్తి నా గులాబీ ....

    • @peddintiganeswaraorao1375
      @peddintiganeswaraorao1375 ปีที่แล้ว +1

      సౌరభంలో కలకాలం నిలిచి ఉంటుంది

  • @netsurfgreenfields7541
    @netsurfgreenfields7541 3 ปีที่แล้ว +4

    ఎందుకంటే ఎప్పుడో నా చిన్నపుడు ఈ పుస్తకాలను అద్దెకి తెచ్చుకొని లేదా ఎవ్వరూ దగ్గర ఉంటాయా అని వాకబు చేసి మరీ చదివిన ప్రదేశం గుర్తుకు తెచ్చారు

  • @thumulalitha7187
    @thumulalitha7187 3 ปีที่แล้ว +6

    బాగుంది కథ. థాంక్స్. ఎక్కడా దొరకని పాత రచయిత ల కథలు చదువుతున్నారు. అట్లనే ప్రసిద్ధ రచయితల అనువాద కథలు కూడా చదవాలని కోరుకుంటున్నాను. మాంటో కథ చదివారు ఇంతకు మునుపు.

    • @kamalmanjarlapati
      @kamalmanjarlapati  3 ปีที่แล้ว

      మీరు మీకు నచ్చిన కథ ఏదో తెలియచేస్తే అవి చదివేందుకు ప్రయత్నం చేస్తాము

    • @netsurfgreenfields7541
      @netsurfgreenfields7541 3 ปีที่แล้ว

      బాగా చెప్పారు

    • @netsurfgreenfields7541
      @netsurfgreenfields7541 3 ปีที่แล้ว

      కథలు విందాం

  • @lakshmib2700
    @lakshmib2700 2 ปีที่แล้ว +3

    మీ పఠనం తో కథను మళ్లీ చైతన్యమంతం చేస్తారు🎉👏🏼

  • @hiranyam
    @hiranyam ปีที่แล้ว +3

    అద్భుతంగా చదివారు.

  • @RaviPrakash-rg5zl
    @RaviPrakash-rg5zl ปีที่แล้ว +3

    E stori 80 lo durdarshion lo prasaram ayindi meeru chaduvutu untekuda chala gaagundi

  • @netsurfgreenfields7541
    @netsurfgreenfields7541 3 ปีที่แล้ว +2

    గురువు గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు మరియు namaskram

  • @kusumapothabathula4718
    @kusumapothabathula4718 3 ปีที่แล้ว +4

    Me tone vini chala rojulundhi. Story super. Me narration inka super.

  • @upenmr1126
    @upenmr1126 2 ปีที่แล้ว +3

    Today 15-june-2022 listening 🎧 thank you sir

  • @bharathkumar4692
    @bharathkumar4692 2 ปีที่แล้ว +4

    Your reading is too good sir👏👍

  • @ssrinivasareddy2645
    @ssrinivasareddy2645 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏👌👌👌👌👌👌