#చలం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • గుడిపాటి వెంకటాచలం గారి కథ "ఒక పువ్వు పూసింది" కథ కు ఆడియో రూపం ఈ వీడియో.
    "ఓ పువ్వు పూసింది " రచయిత చలం గారు. తెలుగు సాహిత్యంలో ఒక ఉప్పెన. భావాలకు మాత్రమే కాదు..."ఓ పువ్వు పూసింది " కథ కాదు....కథలాంటి కవిత. భాషలోను భావంలోను కూడా కవితాత్మకత నిండిన కథ. వినిపించడానికి స్వరంలో ఒదిగే శైలి. భాషా...భావాలు కావు ఆ కథల్లో ఉన్న విషయాలు. కానీ విస్మరించ వీలు లేని...వీలు కానీ రచయిత. ఆయన అత్యంత సుప్రసిద్ధమైన ఈ కథ. పైగా ఆయన పుట్టినది... మరణించింది మే మాసం.(జననం మే 19 వ తేదీ... మరణం మే 4 వ తేదీ ) కాబట్టి నివాళి. ఓ పువ్వు పూసింది ప్రతీకాత్మక కథ. స్త్రీ ని ప్రకృతితో పోలుస్తూ.... తిరిగి ప్రకృతిలోని పుష్పాన్ని ఆమెకు ప్రతిరూపంగా చూపిస్తూ...స్త్రీ భావాలు...ఆలోచనలు....అనుభవాలు....అనుభూతులూ....మేళవించి రాసిన కథ. తనికెళ్ళ భరణి గారు అన్నట్టు...ఆడపిల్ల ఆవిర్భావం నుంచి అంతర్థానం వరకూ సంపూర్ణ స్త్రీత్వాన్ని పరిశీలించి , పరామర్శించి , వివరించి , విపులీకరించి , కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తాడు చలం. ఓ పువ్వు పూసింది కథ జీవన మాధుర్యం గుండెల్లో పూసినట్టుంటుంది. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీ శ్రీ అయితే....గుడిపాటి వెంకట చలం స్త్రీ స్త్రీ....

ความคิดเห็น • 19

  • @muralidharrao3933
    @muralidharrao3933 9 หลายเดือนก่อน +1

    🙏విశాల విశ్వం నుంచి వీక్షిస్తూ అందమైన ప్రకృతి లోని పువ్వు జీవితాన్ని దర్శిస్తున్న అనుభూతి .
    బంధాలు తేడాలు పరిమితులు మనిషికే గాని ప్రక్రృతి కి లేవని తెలిపిన సునిశిత హ్రృదయులు
    చలంగారు, అందుకే ఆయన చివరి
    మజిలీ అరుణాచలం అయింది.

  • @arunamanne8442
    @arunamanne8442 5 หลายเดือนก่อน +1

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 4 หลายเดือนก่อน

    శుభోదయం

  • @netsurfgreenfields7541
    @netsurfgreenfields7541 3 ปีที่แล้ว +3

    Rambabu garu మీ Expression చాలా బాగుంది

  • @mr.chandramaneni239
    @mr.chandramaneni239 2 หลายเดือนก่อน

    Chaala bagundhi

  • @luckyshanmukhtv8924
    @luckyshanmukhtv8924 3 ปีที่แล้ว +2

    Meevanti sahity abhilashulaku satakoti vandanalu

  • @suribabubobbili2392
    @suribabubobbili2392 ปีที่แล้ว +1

    Chalam gari oka swapnam katha gurinchi cheppagalaru

  • @raghuakkinapalli5562
    @raghuakkinapalli5562 ปีที่แล้ว

    చాలాబాగా మీరు కధను చదివి వినిపించిన జైలుకు ధన్యవాదములండీ

    • @raghuakkinapalli5562
      @raghuakkinapalli5562 ปีที่แล้ว

      చాలాబాగా కధను వినిపించినందులకు మీకు చాలా ధన్యవాదములు

  • @ganguraddysumitramma5717
    @ganguraddysumitramma5717 8 หลายเดือนก่อน

    😮

  • @sudhaprabhakar3307
    @sudhaprabhakar3307 3 ปีที่แล้ว +2

    చక్కటి స్వరంతో ఇంకా ఇంకా వినాలనిపించేలా వుందండీ మీరు చెప్పడం. థాంక్యూ.

  • @netsurfgreenfields7541
    @netsurfgreenfields7541 3 ปีที่แล้ว +2

    ఒక రోజు పుష్పం యొక్క జీవితం అంటే ఇదే

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 3 ปีที่แล้ว +2

    chalaa baagundi.

  • @sb-pv1kp
    @sb-pv1kp ปีที่แล้ว

    ఒక పువ్వు తుమ్మెద లోని అద్భుత సంబంధం.... ప్రాకృతిక వర్ణన...

  • @Girishmusings
    @Girishmusings 3 ปีที่แล้ว +1

    Chalam ❤️❤️ greatest writer
    Dheasam phatanantha maha kavi

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 ปีที่แล้ว +1

    చలం గారికి నేను కూడ అభిమానిని... కానీ ఆయన భావాలు కొన్ని నచ్చవు... ముఖ్యంగా తల్లితోను తర్వాత ఆమె కూతురుతోనూ ఒకడే సంభోగించినట్లు వ్రాయడం ఎబ్బెట్టుగా అనిపించింది

    • @sb-pv1kp
      @sb-pv1kp ปีที่แล้ว

      చివరి రోజుల్లో ఈశ్వరా అంటూ అంత మారి పోయాడు

    • @muralidharrao3933
      @muralidharrao3933 9 หลายเดือนก่อน

      🙏మానవ సమాజ కోణంలో అది ఎబ్బెట్టే కాని ప్రకృతి కోణం లో అది సహజం. ఈ విచచ్ఛణా వివేకమె మనిషి ని మిగిలిన జీవులనుండి వేరుచేసి దైవం వైపు తిరిగేలా
      చేసింది. అందుకేనేమో చలంగారు అరుణాచలం వైపు తిరిగి మౌనంగా
      నిష్క్రమించారు.