వెన్నెల నీడ | తెలుగు కథ | భమిడిపాటి రామగోపాలం | మేలిమి బంగరు కథలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6 న పుట్టాడు.[1] నాన్న సూర్యనారాయణ ఎలిమెంటరీ స్కూల్‌ టీచర్‌. అమ్మ సూరమ్మ. ఇద్దరు తమ్ముళ్లు. నాన్న ఉద్యోగ రీత్యా వివిధ ఊళ్లు తిరిగాడు. విజయనగరంలో స్థిరపడ్డాడు. ఐదో తరగతి వరకు నాన్న ఇంటి దగ్గరే చదువు. అలమండ హయ్యర్‌ ఎలిమెంటరీ స్కూల్లో ఆరో తరగతి. 1951లో బీ.ఏ. భాగల్‌పూర్‌ యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. (ఇంగ్లిషు), ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఏ. (తెలుగు) చేశాడు. విజయనగరం సత్రంలో ఉచిత భోజనం చేస్తూ, పిల్లలకు ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించి, అది ఇంటికి ఇస్తూ చదువుకున్నాడు.
    1951లోనే విజయనగరంలోనే సెన్సస్‌ ఆఫీసులో చెకర్‌గా ఉద్యోగ జీవితం మొదలైంది. అప్పటి మద్రాసు సర్వే విభాగంలో గుమస్తాగా, సర్వేయర్‌గా, హెడ్‌ సర్వేయర్‌గా పనిచేశాడు. వివిధ ప్రదేశాలు తిరిగాడు. 1967లో నర్సరావుపేటలో ఉద్యోగం చేశాడు. అప్పటికే రచనా వ్యాసంగంలో ఉండటం, రేడియో స్టేషన్‌కు వెళుతుండటం వంటి వ్యాపకాల వల్ల తరచూ విజయవాడలో ఉండేవాడు.
    నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు బదిలీ అయ్యాడు. కాఫీ అన్నా, ఆంధ్రపత్రికన్నా, రేడియో అన్నా ప్రాణం. బోధన్‌లో అవి ఉండవని, ఉద్యోగానికి సెలవు పెట్టి బెజవాడ వీధుల్లో తిరుగుతూ నార్ల వెంకటేశ్వరరావుగారి కంటబడ్డాడు. ఆయన అక్కడిక్కడే ఉద్యోగం ఇచ్చి ఆంధ్రజ్యోతిలో ఎడిటర్‌ పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారికి అసిస్టెంట్‌గా నియమించాడు. 1967 నుంచి 68 వరకు అక్కడ పనిచేశాడు. 1985-86 మధ్య మద్రాసు నుంచి వెలువడే ఉదయ భారతి పత్రిక ఎడిటర్‌గా చేశాడు. 1974లో విశాఖ పోర్టులో చేరి, 1990లో ఉద్యోగ విరమణ చేశాడు. 1974-78 మధ్య 'ఈనాడు' కల్చరల్‌ రిపోర్టర్‌గా పనిచేశాడు. ఆంధ్రప్రభ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లకూ కొన్నాళ్లు పనిచేశాడు.
    78 ఏళ్ళ వయసులో రెండు కాళ్లు వేళ్లూ పడిపోయినా సహాయకులకు మౌఖికంగా చెబుతూ సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆస్టియో ఆర్థరైటిస్‌ వల్ల రెండు కాళ్లు పనిచేయడం లేదు. 2004 నుంచీ కాలివేళ్లు, చేతి వేళ్లకు తిమ్మిరి. ఇంటా, బయటా చక్రాల కుర్చీలోనే. అయినా సాహితీ వ్యాసంగాన్ని మానలేదు. ఆరు కథా సంపుటాలు, మూడు నవలలు వెలువరించాడు. తన ఆత్మకథను "ఆరామ గోపాలమ్" ‌పేరుతో సచిత్రంగా ప్రచురించాడు. ప్రముఖ వ్యక్తులు, సంస్థలపై 17 సావనీర్లు రూపొందించాడు. మిత్రుడి జ్ఞాపకార్థం నెలకొల్పిన జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్‌ తరపున అనేక పుస్తకాలు ప్రచురించాడు. 'ఇట్లు మీ విధేయుడు'కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నాడు.
    ఆయన భార్య సత్యభామ. వారికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. 49 ఏళ్లపాటు సహజీవనం చేసిన భార్య చనిపోయింది. అనారోగ్యం వల్ల శరీరం సహకరించక పోవడంతో రెండో పెళ్ళి చేసుకున్నాడు.
    పురస్కారాలు : వ్యాససంపుటికి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం[2] (అత్తలూరి నరసింహారావుతో కలిసి).
    1991 - ఇట్లు మీ విధేయుడు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
    2010 ఏప్రిల్ 7 న భమిడిపాటి రామగోపాలం (భరాగో) విశాఖ నగరంలో కృష్ణా కళాశాల సమీపంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందాడు.
    ఆయన భావాలు : నేను సున్నా నుంచో... మరీ చెప్పాలంటే మైనస్‌ నాలుగు నుంచో జీవితం మొదలు పెట్టాను.పేదరికం చాలా గొప్పది. అది పని చేసే ఉద్దేశం కలుగచేస్తుంది.
    నేను నా జీవితాన్ని సంపూర్ణంగా జీవించాను. సంతోషంగా బతికాను. బతికినంత కాలం పనిచేస్తూ ఉండటమే నా లక్ష్యం. సాహితీరంగంలో నాకంటే ఘనులు చాలా మందే ఉన్నాడు. కానీ నా ప్రత్యేకత నాకుంది. నాకు భోజనం, దుస్తులు, ధనం మీద ఆసక్తి తక్కువ. అందుకే ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాను. జీవితాన్ని తేలిగ్గా తీసుకోవాలి.

ความคิดเห็น • 15

  • @mallikarjunarao2664
    @mallikarjunarao2664 ปีที่แล้ว

  • @narasimhapathrudu8775
    @narasimhapathrudu8775 3 ปีที่แล้ว +1

    Super sir good story and also good naration.

  • @laxmidasari6172
    @laxmidasari6172 3 ปีที่แล้ว

    👌👌👌👌👌

  • @ramasastry528
    @ramasastry528 ปีที่แล้ว

    థాంక్యూ లక్ష్మణ శాస్త్రి గారు

  • @sudharanib.4401
    @sudharanib.4401 3 ปีที่แล้ว +2

    చాలా ఆనందంగా వుంది....ఇలాగే మరిన్ని కథలను వినిపించండి.., లక్ష్మణ శాస్త్రి గారు.మీకు ధన్యవాదాలు...మీ గళం అధ్బుతం...🙏

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 10 หลายเดือนก่อน

    Nice story and good narration. Thanq sir

  • @ANURADHA-jn8eb
    @ANURADHA-jn8eb 3 ปีที่แล้ว +3

    మంచికధ.డోలాయమాన స్త్రీ హృదయాంతరంగ భావన.స్వరవ్యక్తీకరణ బాగుంది.

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 3 ปีที่แล้ว +1

    కళ్ళకు కట్టినట్లు చదివారు.
    కథ బావుందండీ ❤️👌🏻👌🏻👌🏻👏👏👏💐

  • @sivesh14
    @sivesh14 2 ปีที่แล้ว +1

    నేను ఉదయమే కుప్పిలి పద్మ మసి గుడ్డ కథ విన్నాను.
    ఇప్పుడు ఇది.
    కథ బాగున్న 60 ఏళ్ళల్లో సమాజం జనం ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది.
    శ్యామల పాతివ్రత్యం ఏదో మానసిక వ్యభిచారం చేసినంతగా కుమిలి పోవడం ఇప్పటి పరిస్థితుల్లో ఎబ్బెట్టుగా ఉంటుంది.
    ఈ కథను ఆనందిచాలంటే గతం లోకి పోవాలి వర్తమాన వాస్తవ భావాలకి దూరంగా.

    • @kamalmanjarlapati
      @kamalmanjarlapati  2 ปีที่แล้ว

      కథ కూడా అప్పటిదే కదండీ. ఆనాటి ఆలోచనలతో చూడాలి.
      "కన్యాశుల్కాన్ని" ఇప్పటి పరిస్థితులు కు అనుగుణంగా చూస్తా అంటే ఎలా?

  • @jans8414
    @jans8414 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏 ఇంతకంటే చెప్పలేను..

  • @sundarib8346
    @sundarib8346 3 ปีที่แล้ว +3

    Ledanukunnadi, lendi badhira vaataa varanam srustinchukuni chalaa baagaa vrasaaru. Life lo prati okkariki edo okarakamgaa ilanti situation tappademo.

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 3 ปีที่แล้ว +2

    కథ చాలా బాగుంది. బాగా చదివారు.

  • @krishnakumari4875
    @krishnakumari4875 3 ปีที่แล้ว +2

    🕉💐👌machi saahityam Sri Bhamidipaatigaari old rachana chaala bagundi andi chakkaga chadivaaru Congratulations

    • @rajanich7176
      @rajanich7176 3 ปีที่แล้ว

      What a way of bringing out the complexity of conflict between body and soul! The story effectively captures Women's emotions. The way it was recited added luster. Excellent story excellently presented