Ammammaku Thatayyaku
ฝัง
- เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024
- రచన..శ్రీమతి మాణిక్యాంబ
స్వర రచన శ్రీమతి శోభ
చతుర్వేదుల
రాగం.. కల్యాణి
తాళం..ఆది
గానం..శోభ గారి శిష్యుబృందం.
అమ్మమ్మ,నానమ్మ తాతయ్యలకు మనవలంటే ఎంత ముద్దో..
మరి ..అసలుకన్నా వడ్డీ ముద్దు కదా..ఆ విశేషాన్ని
ఈ పాటలో చక్కగా వివరించారు.చిన్నారులు.
మీరూ చిన్నారులతో గళం కలిపి పాడాలంటే..ఆడాలంటే..ఇదిగో మీ అందరికోసం..శ్రీమతి శోభగారి బృందం సిద్ధంగా ఉన్నారు .పాట విందాం..చూద్దాం..రండి రారండి
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
అమ్మమ్మకుతాతయ్యకు
శ్రీరస్తు శుభమస్తు
నానమ్మకు తాతయ్యకు
జయమస్తు శుభమస్తు
మీ కంటి పాపలము
మీ ఇంటి వెలుగులము
మీ ముద్దు మురిపాలకు
సదా మేమే వారసులం
అమ్మమ్మా..తాతయ్యా..
నానమ్మా..తాతయ్యా..
ఓర్పు సహనం మీ ఆయుధాలే
మా అల్లరికి మీకు కోపమే రాదులే
ఆటపాటలతో తీర్చిదిద్దేటి నేర్పు
తప్పులను మన్నించ మీకుంది ఓర్పు..
అమ్మమ్మా....
అమ్మమ్మ ఆనాటి ముచ్చట్లు చెప్పేను
తాతయ చిననాటి ఆటలాడించేను
మీరున్న లోగిళ్ళు సందళ్ళు సంబరాలు
మాకేమో మరి గారాలు భోగాలు
అమ్మమ్మా..
శ్రీరస్తూ ..శుభమస్తూ..
జయమస్తూ..శుభమస్తూ..