'వంశీ' కథ || రాజహంసలు వెళ్ళిపోయాయి || పున్నమరాజు గళంలో

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • గోదారి అందాల్ని అక్షరాల్లో ఆరబోస్తూనే , గుండె లోతుల్లోంచి చొచ్చుకొచ్చిన ఆవేదనతో వంశీ వ్రాసిన కథ. గోదారి రేవుల్లో నిత్యం వినిపించే ఆత్మీయా నురాగాల కోలాహలం అకస్మాత్తుగా అదృశ్యమైతే ..మనసున్న మనుషులు పడే మూగ బాధని వంశీ తో పాటు మనమూ అనుభవిస్తాం ఈ కథ వింటే ..

ความคิดเห็น • 52

  • @sannipallisrinivas9068
    @sannipallisrinivas9068 3 หลายเดือนก่อน +1

    Super listening experience.
    Thank you punnamarajugaru and Vamsi Sir

    • @anchorpunnamaraju
      @anchorpunnamaraju  26 วันที่ผ่านมา

      ధన్యవాదాలండీ

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 3 หลายเดือนก่อน +1

    కథ రాసిన vamsy గారికి, వ్యాఖ్యాత raju గారికి ధన్యవాదాలు,vamsy గారి ప్రకృతి వర్ణన రాజు గారి వ్యాఖ్యానం అద్భుతమైన అనుభూతి, ఏవైన మీ గోదారోళ్ళు అదృష్టవంతులు.

    • @anchorpunnamaraju
      @anchorpunnamaraju  หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ

  • @lathadadala2596
    @lathadadala2596 หลายเดือนก่อน

    కథ చాలా బాగుంది అండి
    ఎంత చక్కగా చదివారు మీరు
    వంశీ గారి
    మా పసలపూడి కథలు
    అన్ని ఒక పుస్తక రూపం లో
    దొరుకుతాయా

    • @anchorpunnamaraju
      @anchorpunnamaraju  หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ.మా పసలపూడి కథలు పుస్తకరూపంలో దొరుకుతాయి

  • @sarojapunnamaraju4757
    @sarojapunnamaraju4757 ปีที่แล้ว +1

    కధ అద్భుతంగా ఉంది . చదివిన విధానం చాలాబావుంది. వంశీ. రామచంద్రపురం కాకేజీలో చదివిన కుర్రాడు. చదువుకునే రోజులనుండే నవలారచన మొదలు పెట్టాడు. అలా అలా ఇంతై‌ ఇంతింతై పెద్ద సినిమా డైరక్టర్ అయ్యాడు. కానీ, తన రచనలలో పాత్రలన్నీ సజీవ పాత్రలే. పల్లెటూరు, ఆ జీవన విధానం, ఆ మాట తీరు, ఆ పాత్రలు అన్ని తన కథల్లో సజీవంగా మన ముందు తిరిగాడు తున్నట్టే ఉంటుంది.. అవి మీ గళం లో మరింత సజీవంగా కళ్ళకు కట్టినట్టు పలికించారు..

  • @swarnalathach7288
    @swarnalathach7288 5 หลายเดือนก่อน +1

    😢😢😢

    • @anchorpunnamaraju
      @anchorpunnamaraju  26 วันที่ผ่านมา

      ధన్యవాదాలండీ

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 2 ปีที่แล้ว +3

    వంశీది చాలా ప్రత్యేక శైలి. ఇంటిపేర్లతో సహా ప్రత్యక్షమయే పాత్రలు సజీవంగా మన ముందు తిరిగే మనుషుల్లాగే ఉంటాయి. నాకు అందుకే ఈ నల్లమిల్లి భామిరెడ్డిగారి(వంశీ) కథలు చాలా ఇష్టం. మన తూగోజీ అంతా కళ్ళముందు పరుచుకుంటూ ఉంటుంది, ఆ గోదావరితో సహా! నాకు బాగా పరిచయం ఉన్న యానాం, ఎదుర్లంక రేవులు, పోలవరం ప్రాంతాలు ఈ కథలో ప్రధానంగా నిలవడం సంతోషాన్ని కలిగించింది.
    మీరు చదివిన తీరూ అంత బాగానే ఉంది. అభినందనలు.

  • @lotus205
    @lotus205 9 หลายเดือนก่อน

    వంశీ గారు ఒక కళాత్మకమైన హృదయం కలిగిన ఒక గొప్ప కవి

  • @bujji30
    @bujji30 8 หลายเดือนก่อน +1

    నాకు మీ మరియు ఇళయరాజా గారి కాంబినేషన్ లో సినిమా లన్ని ఇష్టం ,సీతాకోకచిలుక ట్రయిలర్ చాలా బాగుంది 😊

  • @suryavamsy1755
    @suryavamsy1755 9 หลายเดือนก่อน

    ❤❤❤

  • @padmasingarayakonda2395
    @padmasingarayakonda2395 6 หลายเดือนก่อน +1

    పున్నమరాజు గారు కధ చెప్పిన విధానం చాలా బాగుంది

    • @anchorpunnamaraju
      @anchorpunnamaraju  26 วันที่ผ่านมา

      ధన్యవాదాలండీ

  • @సాలగ్రామశ్రీకామేశ్వరి

    చాలా బాగా కళ్ళకు కట్టినట్టు చదివి వినిపిం చావు నిజమే ఆ రోజు లు చాలా అద్భత మైనవి కథలలో తప్ప వినలేము , కనలేము 👌👏👏👏👏👏🙏🙏🙂

  • @krishnamohang3059
    @krishnamohang3059 4 หลายเดือนก่อน +1

    వంశీ గారికి డిటైల్స్ చాలా ఇష్టం. ఇంటి పేర్లతో సహా రాస్తొరు.

    • @anchorpunnamaraju
      @anchorpunnamaraju  4 หลายเดือนก่อน

      అవునండీ..ఆయన శైలి విభిన్నం

  • @chinaraj4973
    @chinaraj4973 5 หลายเดือนก่อน +1

    వంశీ గారి కథలో చివరి లో ఒక ఆర్ద్రత ఉంటుంది.గుండె బరువెక్కి ఏడుపొస్తుంది

    • @anchorpunnamaraju
      @anchorpunnamaraju  5 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు

  • @sivaveeraprasadmogali5241
    @sivaveeraprasadmogali5241 ปีที่แล้ว +1

    1992 లో నేను, నా మిత్రుడు తాళ్ళరేవులోనిమరో మిత్రునితో కలసి యానాం రేవులో పంటి లో ప్రయాణించాము. ఆ అనుభూతి ఎప్పటికీ మరువలేను. కానీ ఎప్పుడైనా అమలాపురం వెళ్లినప్పుడు బ్రిడ్జి పై నుండి రేవు చూస్తుంటే చాలా వెలితిగా అనిపిస్తుంది. వంశీ గారు అప్పటి రోజులను మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదములు.

  • @rajeshthudi23
    @rajeshthudi23 8 หลายเดือนก่อน +1

    Very nice excellent story.

  • @sharmaa.s.s.k3076
    @sharmaa.s.s.k3076 6 หลายเดือนก่อน +1

    Vamsi garu tq sir aa
    revutho naaku chala anubandham undi. Andari perlu gurtunchukunna meru chala great.naku goppa jnapakam.
    .

    • @anchorpunnamaraju
      @anchorpunnamaraju  26 วันที่ผ่านมา

      ధన్యవాదాలండీ

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 ปีที่แล้ว +1

    Hello nenu chinapatinundi vamsi gari cinemalu istamga chusedaanini Godavari andaalskosam epudu vaari rachanalu vintunnanu

  • @narasimharajupunnam
    @narasimharajupunnam ปีที่แล้ว +2

    ' అనుభూతి దూరమయ్యింది అని ' మీ కంఠం పలికిన తీరుకి మనస్సు ఎందుకనో శూన్యమయి పోయింది. ఆ ఒక్క మాట మీ నోట విన్నాక మీ గళం లో అన్ని రసాలు ఇంత గొప్ప గా ఎలా పలుకుతాయి ? భగవంతుడు ఇచ్చిన వరమా?

    • @anchorpunnamaraju
      @anchorpunnamaraju  ปีที่แล้ว

      అంతేనండీ..అమ్మ దయ అంతే..

  • @ramachandrarao873
    @ramachandrarao873 ปีที่แล้ว +1

    Old memories. Narrated very well. Thanks

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 ปีที่แล้ว +1

    Heart touching.....

  • @sudhakarmajety
    @sudhakarmajety 9 หลายเดือนก่อน +1

    పిండేసారు వంశీ గారూ !
    చల్ల గాలిలా సాయంత్రం పూట సంపెంగ పూల గుబాళింపులా సాంబ్రాణి పొగలా బాగుంది కథ హాయిగా. ఇందులో భయపెట్టే విలన్లూ, స్నానం చేసి టవల్సు కట్టుకుని బయటకి వచ్చే హీరోయిన్లూ, కిర్రెక్కించే రొమాన్సులూ లేవు. అంత పెద్ద మలుపులూ లేవు. కానీ వింటుంటే హాయిగా ఉంది. మన ఎదురుగానే జరుగుతుందా ఇదంతానూ అనిపించేలా రాయడంలో బాగా చెయ్యి తిరిగిన వంశీ గారి సంభాషణల్ని ఆయనతో కలిసి తనే అక్కడ ఉండి యాక్టింగ్ చేస్తున్నంత సహజంగా ఆ మాటల్ని అలవోకగా గోదారి యాసలో అనేసి పున్నమ్రాజు గారూ రక్తి కట్టించారు కథని.
    రాజహంసలు ఎగిరిపోయినట్లే వాటి సందడిని లాగేస్కున్న ఈ కొత్తగా వచ్చిన బ్రిడ్జీల కిందా, పక్కలా కొత్తగా తెరుచుకున్న కొట్లు, ఆ వైపంతా నడుచుకుంటూ ఈ మజ్జెల్లో జ్ఞాపకాలు ఎర్పరుచుకుంటున్న మనుషులు కొన్నేళ్ళ తర్వాత ఏ ఫ్లైవోవర్లో వచ్చి అవి మరుగున పడిపోయాక ఆ వైపుల, పక్కలా పోగేసుకున్న గుర్తుల గురించి మన లాగే మాట్లాడుకుంటారు.
    కొత్త నీరు కదూ... పాత నీటిని గెంటేసుకుంటూ పోతుంది.
    ఎవరో అన్నట్లూ...
    ఈ ప్రపంచంలో శాశ్వతం అంటూ ఉందంటే అది మార్పు మాత్రమే వంశీ గారూ !
    ఇద్దరికీ ధన్యవాదాలు ఇంత మంచి అనుభవాన్ని ఇచ్చినందుకు !
    అభినందనలు, కథల్ని ఇలాగ వినిపించే కొత్త ప్రక్రియ మొదలెడుతూ పుస్తకాలు చదవకుండా ఫోన్లల్లో మగ్గిపోతున్న జనాలకి మరో అవకాశం ఇచ్చే ప్రయత్నం సఫలం ఔతున్నందుకు..:)

    • @anchorpunnamaraju
      @anchorpunnamaraju  9 หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ

  • @sarojapunnamaraju4757
    @sarojapunnamaraju4757 2 ปีที่แล้ว +1

    చివరికి వచ్చేసరికి గుండెలు పిండేసి నట్టయ్యింది. కొత్తను స్వాగతించ వచ్చు .కానీ పాతకు చిరునామా లేకుండా పోవడం, బాధాకరం ..
    వంశీ కథలో మీరు చదివిన వన్నీ, మా మనసుల్లో ఉన్న, మరుపు రాని మధుర స్మృతులు ..
    కధ, మీ కథనం అద్భుతం.🙏

  • @trinadhchinna5358
    @trinadhchinna5358 ปีที่แล้ว +1

    Naku teliyakunda Naa kallaventa nellu karuthunnai. Endukante Naa patha jnapakalu gurthuku vacchi

  • @SuniNethala
    @SuniNethala ปีที่แล้ว +2

    Love u sir

  • @ramareddykarri1
    @ramareddykarri1 ปีที่แล้ว +1

    🙏😊👍

  • @manjulathas244
    @manjulathas244 ปีที่แล้ว +1

    DHANYAVADALU

  • @tarunsampara9827
    @tarunsampara9827 2 ปีที่แล้ว +1

    గోదావరి ప్రయాణం పేరుతో
    జనజీవన కథనాలు
    వినిపించారు….
    మనుష్యుల జీవితాలను
    మనసుతో పరిశీలించే వంశీగారు
    హృదయాన్ని ఆహ్లాదపరుస్తారూ,
    ఆవేదనతో తుడుపుతారు…..
    ఆత్రేయగారన్నట్లు మనసున్న
    మనిషికి సుఖము లేదేమో…
    ఆయన మనస్సు నిత్య స్పందనభరితమై
    మరిన్ని జీవితాలు కథలై,
    గోదారి అలలై వినిపించాలని కోరుతూ ……
    సంపర శ్రీనివాసరావు.

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 ปีที่แล้ว +1

    RAJA HAMSALO PRAYANAM CHALABAVUNDHI

  • @benarjeeks2552
    @benarjeeks2552 2 ปีที่แล้ว +1

    👌👌👌

  • @acharyulukhandavilli1750
    @acharyulukhandavilli1750 2 ปีที่แล้ว

    Super umaajee, Intaku mundu e kadha chadivaa, ippudu vinadam inkaa baagundi,vamsini baaga gurtuchesaaru..🙏🙏

  • @prasadksdsv8533
    @prasadksdsv8533 2 ปีที่แล้ว +1

    Kadhanam, kadhanika maa Gopapaga revu datuthu Punnami re Rajula sagindhi

  • @gopinath7331
    @gopinath7331 2 ปีที่แล้ว +1

    👌🏼👌🏼👌🏼🌷🌷🌷🌷🙏

  • @ramanapolepeddi1440
    @ramanapolepeddi1440 2 ปีที่แล้ว +1

    ఏందో గురువు గారు! ఎక్కడికో వెళ్లిపోయింది మనసు. వాటి స్పర్శ చవిచూసిన నాకు ఏవో పోగొట్టుకున్న తీపి జ్ఞాపకాలు. గుండెలను పిండేసింది. వంశీ గారికే ఈ రచన చెయ్యడం సాధ్యం. మరి అపై పున్నమ రాజు గారి గొంతు అనితరసాధ్యం.

  • @sravankumar7212
    @sravankumar7212 2 ปีที่แล้ว

    Bagundi sir

  • @nallamillisatyasri6328
    @nallamillisatyasri6328 2 หลายเดือนก่อน +1

    Sir ఫంటు కాదు పంటు

    • @anchorpunnamaraju
      @anchorpunnamaraju  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ

  • @venkatasuryadhanvantaridwi277
    @venkatasuryadhanvantaridwi277 2 ปีที่แล้ว

    Sooper sir

  • @srinivasgannavarapu5008
    @srinivasgannavarapu5008 2 ปีที่แล้ว +1

    Katha chaalaa baagundi..
    Kaani ilaanti katha konchem nemmadigaa chadivitey baagunDedemo...
    Meeru chadivina speed ki ee katha lo vunna feel mee narration lo raaledu..
    GamaninchanDi...
    This is not a negative feed back. Just a suggestion so that you consider in your future presentations..

  • @satyapadmavathikhandavilli1178
    @satyapadmavathikhandavilli1178 2 ปีที่แล้ว +1

    Vamsi raasina bhaavaanni, Mee galam lo swatchamga palikinchaaru

  • @rangaadigitals7985
    @rangaadigitals7985 2 ปีที่แล้ว

    👌