కన్యాశుల్కం నాటకం 3వ భాగము - Kanyasulkam Natakam Part 3

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 เม.ย. 2021
  • కడుపుబ్బా నవ్వించే, సాంఘిక దురాచారాలను నిరసించే గొప్ప నాటకం.
    దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని ప్రబోధించిన మహాకవి మన గురజాడ అప్పారావు గారు. అప్పటికాలంలో వేళ్ళూనుకు పోయిన బాల్యవివాహాలవంటి సాంఘిక దురాచారాలను చూసిన ఆ కవిహృదయం ద్రవించిపోయింది. అయిదారేళ్ళ ఆడపిల్లల్ని డబ్బు కక్కూర్తితో యాభై అరవై ఏళ్ళ ముసలాడికిచ్చి పెళ్ళి చేసే, దుర్మార్గమైన ఒక ఆచారాన్ని రూపుమాపడానికీ ఆయన కంకణం కట్టుకున్నారు. అంతేగాక పుస్తకభాషను గ్రాంథికం నుండి వాడుకభాషకు మార్చడానికి గిడుగు రామ్మూర్తి పంతులుగారితో కలసి ఆయన చేసిన కృషి అంతా ఇంతాకాదు. సమాజం విజ్ఞానవంతంగా మారడానికి వాడుకభాషే పుస్తకభాషగా ఉండాలని ఆయన బలంగా నమ్మారు. అటువంటి వాడుకభాషనే ఆయుధంగా చేసుకుని బాల్యవివాహాలనే ఒక సాంఘిక దురాచారాన్ని నిర్మూలించడానికి ఆయన చేసిన ప్రయత్నమే కన్యాశుల్కం నాటకం. హాస్యరస ప్రధానంగా కనిపించే ఈ నాటకం అంతర్లీనంగా ముక్కుపచ్చలారని ఆడపిల్లలు బాల్యవివాహాల పేరుతో ఎలా బలైపోతున్నారో మనకు చూపిస్తుంది. కేవలం ఈ ఒక్క దురాచారమేగాక, ఆనాటి సమాజనికి పట్టిన మరెన్నో రుగ్మతలను కూడా మన కళ్ళకు కట్టిస్తుంది, సుమారు 130 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ప్రదర్శింపబడిన ఈ కన్యాశుల్కం నాటకం ఇప్పటికీ తెలుగువారిని అలరిస్తూనే ఉంది. ఈ నాటకం పుస్తక రూపంగా వచ్చి కూడా సుమారు 125 సంవత్సరాలు కావస్తోంది. ఇటువంటి ఓ గొప్ప రచనను మన అజగవ ఛానల్‌ ద్వారా మీకు వినిపించడానికి ప్రయత్నిస్తున్నాను. నిడివి పెద్దదైన ఈ నాటకానికి, ఎటువంటి మార్పులూ చేర్పులూ చేయకుండా, కొన్ని భాగాలుగా చేసి మీకు అందించబోతున్నాను. మీ అభిమానాన్నీ, ఆశీర్వచనాన్నీ ఆకాంక్షిస్తున్నాను. ఇక నాటకంలో ప్రవేశిద్దాం.
    క్రితం భాగంలో మనం గిరీశం వెంకటేశంతో కలసి వాళ్ళ అగ్రహారం వెళ్ళడం, మెల్లగా వాళ్ళింట్లో పాగా వేయడం, అగ్నిహోత్రావధాన్లు తన చిన్న కూతురు సుబ్బిని 1800 కన్యాశుల్కం తీసుకుని ముసలివాడైన లుబ్ధావధానులకిచ్చి పెళ్ళిచెయ్యాలని నిశ్చయించుకోవడం, అందుకు అగ్నిహోత్రావధానులు భార్య వెంకమ్మ, బావమరిది కరటక శాస్త్రులు తీవ్రంగా వ్యతిరేకించడం, ఇదిలా ఉండగా వెంకటేశం అక్క బుచ్చమ్మను చూసిన గిరీశంలో దురాలోచన మొలకెత్తడం వరకూ కథను చెప్పుకున్నాం. ఇక కరటశాస్త్రుల శిష్యుడి స్వగతంతో మొదలయ్యే ఆ తరువాయి కథలోకి వెళదాం.
    Rajan PTSK
    #RajanPTSK #kanyasulkam #Ajagava #Telugu
  • บันเทิง

ความคิดเห็น • 16

  • @gurusatsang6138
    @gurusatsang6138 2 ปีที่แล้ว +1

    బ్రహ్మణసుల్కం అనే పేరు బాగుంటుంది

  • @krishnamurthy524
    @krishnamurthy524 3 ปีที่แล้ว +2

    మొత్తం కన్యాశుల్కం లో కలికితురాయి లాంటి భాగం ఇది.

  • @Shivavizianagaram
    @Shivavizianagaram 3 ปีที่แล้ว +2

    Waiting

  • @dhaksithrajkumarraju9878
    @dhaksithrajkumarraju9878 3 ปีที่แล้ว +3

    Munduga gurvu gariki namsakaram🙏

  • @user-kt1yh3cm6e
    @user-kt1yh3cm6e 3 ปีที่แล้ว +2

    Migatha bagalu pettandi sir🙏

  • @ramaprasadm4268
    @ramaprasadm4268 3 ปีที่แล้ว +1

    Please update balance part of the episode

  • @vanisripendyala2559
    @vanisripendyala2559 3 ปีที่แล้ว +1

    We Mataram mee ghatram lo vinatam chala bagundi

  • @MadhuKumar-hu7rb
    @MadhuKumar-hu7rb 3 ปีที่แล้ว +4

    Sir kanasulkam complete chyendi 👍

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 3 ปีที่แล้ว +2

    🙏🙏

  • @srinivasulupothulapally1537
    @srinivasulupothulapally1537 3 ปีที่แล้ว +2

    Pule gurinchi cepadhi 🙏

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 3 ปีที่แล้ว +3

    Guruvugaaru tharuvayi bagam pettandi

  • @mastermaster5442
    @mastermaster5442 3 ปีที่แล้ว +1

    Tq guruji

  • @venkyvempati4484
    @venkyvempati4484 3 ปีที่แล้ว +1

    Ñalgavabhaqam emàindi rajangaruv3mpati v rao

  • @kundetiusha9615
    @kundetiusha9615 3 ปีที่แล้ว +1

    Thanks sir🙏 nenu kanyasulkam and kaasimajili Kadhalu vintunna samayam dorukinapudalla , me explanation chala bagundi sir ....

  • @prashanthsinehan2894
    @prashanthsinehan2894 2 ปีที่แล้ว +1

    Kanyasulkam part 4?

  • @harikrishna3713
    @harikrishna3713 3 ปีที่แล้ว +1

    Migilina naatakam kuda video pettandi.
    Kanyasulkam audiobook ekkadaa ledu youtube lo.
    Meeru idi poorthi chesthe Telugu vaarandariki entho saayam chesinavaaravuthaaru.