Lechinadu Ra Samadhi song|Sunil Anna Calvary Temple

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024

ความคิดเห็น • 2

  • @nagarajukoppara3039
    @nagarajukoppara3039 ปีที่แล้ว

    Shalom

  • @gangavarapuvijayarani7174
    @gangavarapuvijayarani7174 ปีที่แล้ว

    Praise The Lord 🙏
    లేచినాడురా సమాధి గెలిచినాడురా - యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా
    లేతునని తా జెప్పినట్టు - లేఖనములలో
    పలికినట్టు /లేచి/
    భద్రముగ సమాధిపైని - పెద్దరాతిని యుంచిరి భటులు
    ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న
    ప్రభువు దూత పరమునుండి - త్వరగా దిగి రాతిని పొర్లించి
    భళిర దానిపై కూర్చుండె - భయమునొంద కావలివారు
    పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు
    శ్రద్ధతోడ తెచ్చి యేసుకు - రుద్దుదామని వచ్చి చూడ
    చూడవెళ్లిన స్త్రీలను దూత - చూచి యపుడే వారితోడ
    లేడు గలలియ ముందుగ పోతున్నాడు - అపుడె లేచినాడని
    చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తుల కగుపడినాడు
    చచ్చినను నను లేపుతాడు - చావు అంటే భయపడరాదు
    నేను చేసే పనులనెరుగు - నేను నడిచే మార్గమెరుగు
    నేను చేప్పు మాటలెరుగు - నేను బ్రతికే బ్రతుకు నెరుగు
    నేను లేచిన యేసునందు - మానక మది నమ్ముకొందు - తాను
    నాలోయుండినందున - దయను జేర్చు మోక్షమందు
    పాపభారము లేదు మనకు - మరణ భయము లేదు మనకు
    నరక బాధ లేదు మనకు - మరువకండి యేసు ప్రభుని
    యేసు నందే రక్షణ భాగ్యం - యేసు నందే నిత్య జీవం
    యేసు నందే ఆత్మ శాంతి - యేసు నందే మోక్ష భాగ్యం
    పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించాడు
    పాపులను ప్రేమించానాడు - ప్రాణదానము చేసినాడు