lakshmi kalyanamu leelatho paadedhamidhe memu
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- #lakshmikalyanamu_leelatho_paadedhamidhe memu
ANNAMAYYA AKSHARA VEDAM EPISODE -- 53
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 53
( #లక్ష్మీకళ్యాణమూ_లీలతోపాడెదమిదె మేము ..*)
🙏 *ఓం నమో వేంకటేశాయ.*🙏
అందరికీ శుభోదయం
--- ✍️మీ వేణుగోపాల్
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 53 కి శుభ స్వాగతం
✍️ ...మీ వేణుగోపాల్.
🌺నారాయణస్య హృదయే భవతీ యథాస్తే ,
🌺నారాయణోఽపి తవ హృత్కమలే యథాస్తే |
🌺నారాయణస్త్వమపి నిత్యముభౌ తథైవ
🌺తౌ తిష్ఠతాం హృది మమాపి దయావతీ శ్రీః || 🙏🙏
శ్రీ మన్నారాయణుని హృదయములో కొలువై ఉంటుంది అమ్మ శ్రీ మహాలక్ష్మి.
మరి ఆ సిరుల రాశి హృదయములో సదా నారాయణుడు ఆనందపరవశుడై ఉండును.🙏
అట్టి లక్ష్మీ నారాయణులు అయిన , మీ ఇరువురూ,నిండుదయతో ,ఎల్లవేళలా , మా హృదయాలలో ,
సుస్థిరముగా ,కొలువై ఉండండి . 🙏
లక్ష్మీ నారాయణుల తత్వం అందరికీ ఆదర్శం, ఆచరణీయం. ఒకరికోసం ఒకరు , ఒకరికి ఒకరు, చివరకు ఇద్దరూ ఒకరు .🙏🙏
అందుకేగా హైందవ ధర్మంలో ప్రతీ కన్యా దాత , వధూవరులను లక్ష్మీ నారాయణుల గానే తలచి , తన గారాల పట్టి కి కళ్యాణము గావించును . 🙏
మరి ఆ లక్శ్మీ నారాయణుల కళ్యాణముపొగడతరమా ?? ..
అన్నమాచార్యుల వారు అంటున్నారు ఇలా.. ""మీరు ఇరువురూ పక్క పక్కన నిలబడితే చాలు అది కళ్యాణమే కదా ...""🙏🙏
అది ఎలాగో చమత్కారంగా , శృంగారంగా వర్ణించారు .
మరి ఆ చక్కటి కీర్తన అర్ధం తెలుసుకుని పాడుకుందామా ..
🌺ఇదియే లక్ష్మీ కళ్యాణము !! 🙏
🌺ఆనందముగా పాడుకుందాము మనము !! 🙏
🌺సిగ్గులతో , ఒకరిని ఒకరు చూసుకుంటున్న మీ చూపులే మీకు నొసట కట్టిన కళ్యాణ బాసికము , మరియూ సిగను ధరించిన కళ్యాణ ఆభరణము ( సూసకము ).🙏
🌺మీ ఘనమైన స్తనములే , పూర్ణ కలశములైన పూజ కుండలు .🙏
🌺మీ తీయని అధరములు , పలుకు తేనెలే ' బహు మధురముగా అందిపుచ్చుకునే మధుపర్కములు .🙏 ( పెరుగు , తేనె ,చెక్కెర, అరటిపండు మధుర మిశ్రమము )🙏
🌺చక్కగా పెళ్ళి ఆడండి ఇద్దరు , మీకే తగును ఈ వైభోగము . 🙏
🌺ఒకరికొకరు చక్కగా చెప్పుకునే ప్రేమ భరితమైన ఉసులే మీకు కళ్యాణ మంత్రములు .🙏
🌺ఆనందముతో మిక్కిలి సంతోషముతో చిందించే మీ చిరునవ్వులే శ్రేష్టమైన తలంబ్రాలు .🙏
🌺మీ తనువులు ఒకరికి ఒకరు తాకునప్పుడు మీలో కలిగిన పులకింతలే ఘాటయిన కర్పూర వసంత స్నానములు . 🙏
🌺మురిపెముగా పెండ్లి ఆడండి ఇద్దరూ , మీ కోరికలన్నీ నెరెవేరు సమయమిదే .🙏
🌺అత్యంత ప్రేమతో చేసుకున్న మీ కౌగిలులే మీకు కళ్యాణ మంటపము . స్వామికి , అమ్మకు , వేదిక , వేడుక వారి కౌగిలులే కదా .🙏
🌺ఇక కళ్యాణ ఘడియకు సమీపించుచున్నకొద్ది
, దారి చూపుతున్నయి మీ చెలరేగు కోరికలు పాంవుకోళ్లుగా . 🙏
🌺కొంచము బిడియముగా , ఆగి ఉన్నారు ఎందుకు ఇద్దరు ,??
ఓ వేంకటేశా ఓ అలమేల్మంగమ్మా ? ఉత్సాహముగా వేంచేసి కళ్యాణము జరిపించుకోండి.🙏
🌺ఇది మీ వేడుక .. మాకు కన్నుల పండగ.🙏
🌺🙏కళ్యాణమూర్తులై , మా యందు ప్రసన్నముతో ,సదా ఉండండి .🙏🌺
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న
నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..
దోషములున్న...మన్నించమని విన్నపము...
( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 53 )
✍️ -- మీ వేణుగోపాల్
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃
🌹 *సంకీర్తన*🌹
లక్ష్మీ కళ్యాణము లీలతో బాడేద మిదే నేము
లక్ష్మీ నారాయణులే లలనయు నీవును
చూపులు చూపులు మీకు సూసకము బాసికము
వూపచన్ను గుబ్బలివి బూజగుండలు
తీపుల మోవితేనెలు తీరని మధు పర్కము
దాపుగ బెండ్లి యాడరయ్య తగుదగు మీకును
మాటలు మీ కిద్దరికి మదన మంత్రములు
మేటితలబాలు మీలో మించు నవ్వులు
గాటమైన పులకలు కప్పురవసంతాలు
నీతున పెండ్లాడరయ్య నెరవేరె మీకును
కౌగిలి కౌగిలి మీకు కందువ పెండ్లి చవికె
పాగిన కోరికలే పావకోళ్ళు
ఆగిన శ్రీవేంకటేశ అలమేలుమంగా నీవు
వీగక పెండ్లాడడయ్య వేడుకాయమీకును
🌹We Sing With Joy ,
The Holy Praise Of Lakshmi's Wedding .🌹🙏
🌹The Grand Lady And You , Are The Lakshmi Narayana Couple !!🌹🙏
🌹Your Mutual lovable Glances ,
Are The Wedding Chaplets On Your Forehead !!🌹🙏
🌹Your Mighty Bosoms Are
The Consecrated Ceremonial Pots For The Wedding !!🌹🙏
🌹Your Lovely Lips To Each Other , Is The Everlasting Honey And Milk Offering !!🌹🙏
🌹Joyfully Get Into WedLock ,
Oh Holy Couple !! You Both Alone Deserve It !!🌹🙏
🌹Your Romantic Talks Itself ,
Are The Holy Mantras Chanted In The Wedding!!🌹🙏
🌹The Exceedingly Joyful Smiles , Are The Holy Rice Poured On Both Of Your Heads !!🌹🙏
🌹The Bristling And Tingling Glow Of Your Touches
Is The Divine Camphor perfumed Bath For Both.!!🌹🙏
🌹Elegantly Get Married , Oh Divine Couple !!Your Wishes Are Fulfilled !!🌹🙏
🌹Your Huggings To Each Other Is The Grand Wedding Pavilion !!🌹🙏
🌹Your Longing Desires Are The Steps With The Divine Wedding Shoes !!🌹🙏
🌹Oh Venkatesa And Alamelumanga !!
Do not Hesitate Now ,
And Move On Joyfully , For The Grand Wedding !!🌹🙏
✍️ ----Venugopal 🙏