ksheerabdhi kanyakaku
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- #ksheerabdhi_kanyakaku_srimahalakshmiki
ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 50
( Singer Is Sri Annamayya Pavan. Very sweet voice .Sorry As I could not mention it in the video credits as I did not find the detail during making of the video )
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 50*( #క్షీరాబ్ధికన్యకకు_శ్రీ మహాలక్ష్మికిని ..)
🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏
అందరికీ శుభ శనివారము
--- ✍️ మీ వేణుగోపాల్
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 50 కి శుభ స్వాగతం
✍️ .. మీ వేణుగోపాల్
🌹🌹🍃🌹🌹🍃🌹🌹🍃
ఈశానం జగతోస్య వేంకటపతేర్
విష్ణోః పరాం ప్రేయసీమ్ ,
తత్ వక్షస్థల నిత్యవాస రసికాం
తత్ క్షాంతి సంవర్థనీమ్ ,
పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం ,
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్ 🌹🙏🙏
---- శ్రీ వేంకటేశ ప్రపత్తిః
భావం :
🌹సర్వజగత్తుకూ పాలకుడయిన , వేంకటాచల పతి యైన , ఆ శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రియురాలు , 🌹
🌹అతని హృదయమునే తన నిత్య నివాసముగా చేసుకుని ఆనందించునదియూ , 🌹
🌹అతని దయా, క్షమా , గుణములను ఎల్లప్పుడూ వృధ్ధి చేయునదియూ ,🌹
🌹తన కోమల హస్తములతో కమలములను ధరించి ఉన్నదియూ ,🌹
పద్మముపై సదా పద్మాసనములో ఉండునదియూ ,🌹
🌹వాత్సల్యము మొదలగు అన్ని ఉత్తమగుణములతో శొభిల్లునదియూ ,🌹
భగవతియూ , సకలలోకములకూ తల్లియైన,ఆ శ్రీ మహాలక్ష్మికి నమస్కారములు . 🌹🙏🙏
చక్కని తల్లి అలమేలుమంగపై అన్నమాచార్యుల వారు ఎన్నో సంకీర్తనలు మనోహరముగా రచించి , అమ్మ అపారదయకు పాత్రుడయ్యాడు .🙏
ఆ శ్రీ మహాలక్ష్మిని ఆపాదమస్తకమూ పొగుడుతూ ,అ తల్లి అంగాంగ వైభవములనూ కీర్తిస్తూ నీరాజనాలు పాడుతున్నాడు అన్నమయ్య .🙏
మరి ఆ చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా .
🌺పాలసముద్రమునుంచీ ఉద్భవించిన కన్య అయిన మా శ్రీమహాలక్ష్మి కి నీరాజనము .🌺🙏
🌺కమలమందు ఆసీనురాలు అయి , కమలవాసిని అయిన మా శ్రీ మహాలక్ష్మికి నీరాజనము . 🌺🙏
🌺కలువల వంటి కనులు గల ఆ పద్మనయన ముఖారవిందమునకు నీరాజనం. 🌺🙏
🌺సమస్త లోక చరాచర జీవరాశినీ పోషించి వృధ్ధి చేయగల మా చల్లని తల్లి స్తన్యములకు కర్పూర నీరాజనం.🌺🙏
🌺సుగంధపుష్పాలతో అతి సుందరముగా మెరుస్తున్న
మా తల్లి కొప్పునకు నీరాజనం.🌺🙏
🌺కోమలమైన ఎర్ర తామరులవలె ఉన్న మా తల్లి హస్తములకు మాణిక్యములతో నీరాజనం. 🌺🙏
🌺లేత చిగురులకన్నా కోమలముగా ఉన్న ఆ తల్లి పాదములకు , అరటి బోదలువంటి ఉరువులకూ మంచి ముత్యములతో నీరాజనం. 🌺🙏
🌺అపురూపమైన కటి భాగమునకూ , నిజమైన నాభికీ,అన్ని వర్ణములతో , అన్ని రకములయిన హారతులు🌺🙏
🌺శ్రీవేంకటేశ్వరుని హృదయ సామ్రాజ్యమునకు పట్టపు రాణియై ప్రకాశిస్తూ , పరిపూర్నముగా పదహరు కళలతో శోభిస్తున్న శ్రీ సతికి నీరాజనం. 🌺🙏
🌺ఈ జగతి మొత్తాన్ని వ్యాపించిన మా అమ్మ అలమేల్మంగ అన్ని చక్కదనములకు మంగళప్రదమైన హారతి🌺🙏
🌺ఆ శ్రీ మహా లక్ష్మి కి మంగళప్రద నీరాజనములు . 🌺🙏🙏
🌺🙏 ఓం నమో అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశాయ !! 🌺🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న
నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..
*దోషములున్న...మన్నించమని విన్నపము*... 🙏🙏
( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 50 )
✍️ -- మీ వేణుగోపాల్
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃
🌺 *సంకీర్తన*🌺
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం