adigo koluvai unnaadu alamelumangapathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    #అన్నమయ్య_అక్షరవేదం ..సంపుటి -- 110
    ( #అదిగో_కొలువై_ఉన్నాడు_అలమేలుమంగపతి...)
    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    ఓం నమో వేంకటేశాయ.🙏
    అందరికీ శుభ శనివారము.
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 110 కి శుభ స్వాగతం
    ✍️ -- మీ వేణుగోపాల్ యెల్లేపెద్ది.🙏
    ప్రార్ధన ః-- 🌹🌹
    అప్పడు వచ్చెను కొలువుకు,
    గొప్పగ కాంతామణులను గూడి , తిరుచపై !
    తప్పుకొని త్రోవ నీయరె,
    చెప్పరె మీ విన్నపములు , చింతలు దీరున్ !!
    ✍️ --- స్వీయ పద్యము ( కందము )
    నా భావము :-- 🌹🌹👇
    అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ,
    మన తండ్రి ( అప్పడు ) , మలయప్ప స్వామిగా , ( ఉత్సవ మూర్తిగా ) , కొలువుకు వేంచేస్తున్నారు ,
    ఉభయ దేవేరులతో కూడి ( తిరుచపై ) పల్లకిపై . 🙏
    అందరు తప్పుకొని త్రోవ నీయండి,
    భక్తితో మీ విన్నపములన్నీ చెప్పుకోండి ,
    చింతలు తీరిపోవునిపుడు !! 🙏
    🌹🙏🌹
    అన్నమాచార్యుల వారు మలయప్ప స్వామి , ఉభయ దేవేరులకు తిరుమలలో జరిగే ఉత్సవాలు , సేవలు , కనులకు కట్టినట్లుగా అనేక కీర్తనలలో వర్ణించారు .🙏
    స్వామి వారు అమ్మవార్లతో కొలువుకు వేంచేసి,
    పంచాంగ శ్రవణము విని , భక్తుల యోగ క్షేమములను వీక్షించి , భక్తుల కానుకల ఆదాయము లెక్కలు ఆసక్తి గా విని సర్వాధికారిగా కొలువులో గడుపుతున్నారట ! 🙏
    మరి ఆ చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా ఈ వారము ! 🙏
    🌹🌹
    అదిగో చూడండి ! మన స్వామి ! మన అలమేలుమంగపతి కొలువుకు వేంచేసి యున్నారు !🙏
    వేవేల విధములు గా సర్వాధికారియై కొలువు తీరి , పెత్తనములు సలుపుచున్నాడు లోక క్షేమములు వినుచూ ! 🙏
    🌹🙏🌹
    🌹🌹
    మన స్వామి ఆ రంగనాయకుల మండపములో , రత్న సింహాసనమును , అధిరోహించి ,అత్యంత వైభవముగా భాసిస్తున్నాడు ! 🙏
    తన సరుసన ఉభయ దేవరులను కూడి వేచేసి యున్నాడు ఈ అమరవంద్యుడు ! 🙏
    ధగ ధగ మెరిసిపోయే బంగారు పట్టు వస్త్రములు , ఆభరణములు ధరించిన శ్రీదేవీ ,భూదేవి ఇరువైపులా వేంచేసి యున్నారు శోభాయమానముగా !🙏
    ఇంత అందముగా కొలువుదీరిన వీరిని సకల దేవతలూ వచ్చి సేవిస్తున్నారు అత్యంత ఆనందముగా ! 🙏
    🌹🙏🌹
    🌹🌹
    ఇక స్వామి కొలువును వీక్షించటానికి తండోప తండాలుగా వచ్చిన సురలు , యక్ష గంధర్వులు , భాగవతులు , అందరినీ అదుపు చేయటానికి , ద్వారపాలకులు , ( జయ విజయులు ) వెండి , బంగారు బెత్తములను ఝుళిపిస్తునారట . 🙏
    నిండైన పూల దండలును అలంకరించుకున్న స్వామి దేవేరులును చూడగా , పండు వెన్నెల అంతా అక్కడే విరిసినదా అన్నట్లుగా ఉన్నది ! 🙏
    ఇక కొలువులో కూర్చున్న స్వామి వారికి ,అత్యంత శ్రధ్ధా భక్తులతో , హుండి , కానుకల లెక్కలు కట్టి చెపుతున్నారట .🙏
    సర్వాధికారిగా ఆ లెక్కలన్నీ వింటూ ఠీవీ గా కూర్చున్నాడట స్వామి ! 🙏
    🌹🙏🌹
    🌹🌹
    ఈ సకల లోకములలో ఉన్న అంగరంగ వైభ వములన్నీ స్వామి స్వీకరిస్తున్నట్లుగా ,మంగళ హారతులు పుచ్చుకుంటున్నాడట ! 🙏
    అన్ని సింగారలూ కలబోసిన మన శ్రీ వేంకటేశ్వరుడు ,
    ప్రక్కన దేవేరుల ప్రార్ధనలను కూడా ఆలకిస్తూ , కొలువు చేస్తున్నాడు . 🙏
    🌹🙏🌹
    ఈ కొలువు స్వామి చేస్తునది , లోక కళ్యాణమును కోరి , సమస్త శుభములు భక్తజనకోటికి ప్రసాదుంచుట కొరకే కదా !🙏
    స్వామి కొలువు సదా శుభమంగళమౌ గాక !! 🙏
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశాయ నమః🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 110 )
    ✍️ ---వేణుగోపాల్ యెల్లేపెద్ది🙏
    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
    🌹🌹 సంకీర్తన 🌹🌹👇
    పల్లవి
    అదిగో కొలువై వున్నాడు అలమేలు మంగపతి
    పదివేల విధములను పారు పత్తెము చేయుచు
    చరణం
    రంగ మండపములో- రత్న సింహాసనముపై
    అంగనామణులతొ - అమరవేంచేసి
    బంగారు పావడలు- పసరించి యిరుగడల
    శృంగారముగ సురలు - సేవ సేయగను
    చరణం
    వెండి పైడి గుదియలను - వేత్రహస్తులు పొగడ
    నిండు వెన్నెల పూల - దండలు అమర
    గుండిగలు కానుకలను పొనర లెక్కలు చేయ
    దండిమీరగ నిపుడు దేవరాయడు చెలగి
    చరణం
    అంగ రంగ వైభవముల రంగుగా చేకొనుచు
    మంగళ హారతుల మహిమ వెలసీ
    శృంగార మైనట్టిమా శ్రీవేంకటాధిపుడు
    అంగనలు కొలువగాను యిపుడు వేంచేసి
    🌹🙏🌹
    #AnnamayyaAksharaVedam Episode
    #AdigoKoluvaiUnnaadu_Alamelumangapathi..
    #spbsongs #spbannamayya

ความคิดเห็น • 101