Thalli Naa Velishala Folk Song | Mittapalli Surender Songs | Latest Folk Songs 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 3.6K

  • @perumandlavishnu8602
    @perumandlavishnu8602 ปีที่แล้ว +3343

    ఒక్క పాటను ఇంత మంది పాడటం చాలా ఆనందం,అమోఘం.
    స్వచ మైన పల్లె పాట పాడినందుకు మీ అందరికీ ధన్యవాదాలు 💐💐💐

    • @sahithgottiparthi8598
      @sahithgottiparthi8598 ปีที่แล้ว +118

      Avunuu

    • @bhupathibobbili7054
      @bhupathibobbili7054 ปีที่แล้ว +54

      పాట అద్భుతం.. కానీ రికార్డింగ్ లో క్లారిటీ లేదు..

    • @sahithgottiparthi8598
      @sahithgottiparthi8598 ปีที่แล้ว +20

      @@bhupathibobbili7054 ఇంతమంది పాడితే అలానే ఉంటుంది

    • @bhupathibobbili7054
      @bhupathibobbili7054 ปีที่แล้ว +11

      @@sahithgottiparthi8598 ఎన్ని గొంతులు కలిసినా..ఎంత ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ వాడినా..ఫైనల్ గా రికార్డింగ్ చేసే ఎక్విప్ మెంట్ ను బట్టే మ్యూసిక్ లో క్లారిటీ ఉంటుంది బ్రో..

    • @NareshDivanam-hp2kl
      @NareshDivanam-hp2kl ปีที่แล้ว +16

      అందరి గాయకులతో పాటకి ప్రాణం పోశారు అని నేను అనుకుంటున్నాను.

  • @achemahesh7268
    @achemahesh7268 ปีที่แล้ว +260

    ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు దీసి పోరాడ మన్నావు ...నీ పాటకు సలాం..... ఎంతో లోతైన అవగాహన ఉంటేనే ఇంతటి సాహిత్య సంతకం చేయగలరు అన్న గారు... అభినందనలు

  • @Funny_Boy_Bablu
    @Funny_Boy_Bablu ปีที่แล้ว +111

    తెలంగాణ ముద్దు బిడ్డలు.... ఏ విషయాన్ని అయినా వక్క పాటతో ముందుకు చెప్పొచ్చు అని మళ్ళీ గుర్తుతెచారు.....సాంగ్ సూపర్ అన్న.....🎉❤

  • @pradeepprad4575
    @pradeepprad4575 ปีที่แล้ว +348

    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......
    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......
    నల్లానీ రేగల్లో ఎర్రాని మల్లేలు నెత్తరోసుకున్న నేలా
    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......
    1. తూరుపు దిక్కూన మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించె శక్తుల్ని గన్నావు
    దిక్కుల్ని శాసించె శక్తుల్ని గన్నావు
    ఉయ్యాలలుపావు జంపాలలుపావు ఉద్యమాల ఉగ్గు బువ్వను బెట్టావు
    ఉద్యమాల ఉగ్గు బువ్వను బెట్టావు
    ఎండీన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు
    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......
    2. పడమటి కొండల్లో వాలేటి పొద్దును వేలేత్తి చూపావు ఉదయించమన్నావు
    వేలేత్తి చూపావు ఉదయించమన్నావు
    అన్యాయమన్నాది ఎదిరించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు
    న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు
    దీనూల కండ్లల్లో పేదోల్ల ఇండ్లల్లో దీపాలు మీరైన సాలుబిడ్డన్నావు
    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......
    3.పచ్చాని పైరుల్లో వెచ్చాని నెత్తురు చిల్లీన నీ కంట్లో కన్నీళ్ళు దాచావు
    చిల్లీన నీ కంట్లో కన్నీళ్ళు దాచావు
    తడి ఆరిపోనట్టి మరకల్ని చూపెట్టి పోరులో త్యాగాల తొలి మెట్టు అన్నావు
    పోరులో త్యాగాల తొలి మెట్టు అన్నావు
    తెలుసుకోమన్నావు తెలుసుకోమన్నావు పేదోళ్ళ రాజ్యాన్ని సాథించమన్నావు
    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......
    4. దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకుదెరువు లేక బార్డర్ కు పంపావు
    బతుకుదెరువు లేక బార్డర్ కు పంపావు
    అరచేత పెంచావు ఆయూధాన్నిచ్చావు సరిహద్దు సేవల్లో సాగిపోమ్మన్నావు
    సరిహద్దు సేవల్లో సాగిపోమ్మన్నావు
    శత్రువులకేనాడు తలవంచకన్నావు కన్నందుకు తలవంపుతేకన్నావు
    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......
    హే గునాన గూనానరే గూనానరే గూనాన గూనానరే గూనాన గూనానరే
    గూనానర గూనాన గూనానరే హు
    5. త్యాగాల కాగితం మరణాల సంతకం నీ గుండె గొంతుతొ చదువుకోమన్నావు
    నీ గుండె గొంతుతొ చదువుకోమన్నావు
    ఉద్యమం ఏనాడు ఓడిపోదన్నావు రాజకీయాలను కూలదొయమన్నావు
    రాజకీయాలను కూలదొయమన్నావు
    ఎర్రా జెండనెత్తి దొరల గుండెపైన దండూతో దండీగ దాడీచేయమన్నావు
    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......
    నల్లానీ రేగల్లో ఎర్రాని మల్లేలు నెత్తరోసుకున్న నేలా
    తల్లీ నా వెలిశాల నీకున్నాది చరిత్ర చాలా
    తల్లీ నా వెలిశాల.......

    • @gopalgana108
      @gopalgana108 ปีที่แล้ว +14

      మీరు పాడిన ప్రతి పదంలో పాటతో సువర్ణ అక్షరాలు మీ లాంటి గొంతు కలిపి మరో బందీ అయిన మన తెలంగాణ విముక్తి చేయాలని కోరుకుంటున్నా

    • @vdattu9856
      @vdattu9856 ปีที่แล้ว +7

      TQ bro pata mottam rasi pettinandhuku

    • @KarunakarreddyGala
      @KarunakarreddyGala ปีที่แล้ว +3

      🎉❤😊

    • @dumpatiyadagiridumpatiyada4440
      @dumpatiyadagiridumpatiyada4440 ปีที่แล้ว +5

      అన్నా నాకు కూడా సాంగ్స్ పాడటం చాలా ఇష్టం అన్నా ❤🎉

    • @dmm8899
      @dmm8899 ปีที่แล้ว +4

      పాపం బిడ్డ ఎంత కష్టం రాయడానికి

  • @anilnarapaka575
    @anilnarapaka575 ปีที่แล้ว +91

    తెలంగాణ అంటేనే ఒక ఆత్మగౌరవం ఈ ఆత్మగౌరంతో పాటు తెలంగాణ కోసం ఎన్నో ఆత్మ బలిదానాలు అటు విప్లవ ఉద్యమాలు ఇటు తెలంగాణ ఉద్యమాలు జోహార్ తెలంగాణ అమరవీరులకు

  • @LuckyMadhu-pq9xn
    @LuckyMadhu-pq9xn ปีที่แล้ว +252

    మన కళాకారులందురు ఒక పెద్ద అడవిలో పెద్ద పులి లాగా గర్జించారు😢 సూపర్ అన్నలు super super రా శివ .... జై బీమ్ అందరికి....

  • @pnrstudiosbynaresh9316
    @pnrstudiosbynaresh9316 ปีที่แล้ว +191

    నా ప్రాణ స్నేహితుడు రాంబాబు పాడిన "తల్లీ నా వెలిశాల" పాట అద్భుతమైన విజయం సాధించింది.
    "రాము నీ నోటి నుండి జాలువారే ప్రతి మాట, ప్రతి పదం ఒక్కొక్క అగ్ని కణం లాంటిది.

    • @LAVUDIYAAshok
      @LAVUDIYAAshok ปีที่แล้ว +2

      Rambabu contact number evvu anna okka song padali

  • @ollamallanaveen3320
    @ollamallanaveen3320 ปีที่แล้ว +687

    ఒక పాటను ఇంత మంది గాయకులు పాడడం ఇదే మొదటిసారి అనుకుంటా అద్బుతం,ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టీ చాలా బాగా పాడారు🙏💐👍👌

    • @maths0909
      @maths0909 ปีที่แล้ว +7

      Malli aa rojulu raavaali. ❤

    • @shivabolka94
      @shivabolka94 ปีที่แล้ว +21

      ✨️వంద స్పీచ్ లు కన్నా ఒక్క పాట ఎక్కువగా ప్రజలను ప్రభావితం చేస్తుంది.✊ అలాంటిది వందమంది కళాకారులు ఒక్కచోట ఉంటే అక్కడ ఒక్క కొత్త చరిత్ర తిరగరాయబడుతుంది.🔥

    • @anjianji4097
      @anjianji4097 ปีที่แล้ว +2

      Yes

    • @venudarvingtravelingvideos6531
      @venudarvingtravelingvideos6531 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🫶👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

    • @praveenbollepally1993
      @praveenbollepally1993 ปีที่แล้ว +1

      Super song anna

  • @dsammaiah6835
    @dsammaiah6835 ปีที่แล้ว +162

    ❤ అద్భుతంగా పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్న కళాకారులు అందరూ కలిసి పాడిన పాట కళాకారుల అందరికీ ధన్యవాదములు మీ తెలంగాణ ప్రజానాట్యమండలి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మయ్య

  • @VENKATNani-k2x
    @VENKATNani-k2x ปีที่แล้ว +44

    అన్నాలు ఏంటన్న❤👌🏻ఒక 100 సార్లు చొడోచున్న ఇప్పటికీ నా కూతురు తో 1 year 6months ఉంటది మీ పాట పెడితేనే ఒకే లేదంటే మకు ఉన్నదే ఈగ 🙏🏻🙏🏻

  • @mchandu-en2vt
    @mchandu-en2vt ปีที่แล้ว +337

    మా ఊరు గురుంచి ఇంత మంది కళాకారులు పాట పడుతుంటే ఎంత గర్వాంగా ఉందొ మీ కళాకారులుకు నిజంగా పాదాభి వందనాలు

  • @ShahrukhShaikh-kn8xz
    @ShahrukhShaikh-kn8xz ปีที่แล้ว +136

    కధం తోక్కిన యువ కళాకారులు... తల్లి నా వెలిశాల.... పాట ❤
    విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
    #20anniversary
    Surendar Mittapally....🤩✊

    • @Vamshi_11
      @Vamshi_11 ปีที่แล้ว

      🔥🔥

    • @asrishailam5784
      @asrishailam5784 ปีที่แล้ว

      Oka sari garjana song vinandi please 😢

  • @vamsiKrishna-tk1vz
    @vamsiKrishna-tk1vz ปีที่แล้ว +25

    తల్లి నా వెలిశాల
    నికున్నది చరిత్ర చాలా...
    తల్లి నా వెలిశాల
    నల్లని రేగల్లో ఎర్రని మల్లెలు
    నెత్తురోసుకున్న నేల
    తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల
    తూరుపు దిక్కున మోదుగుమొక్కల్లో
    దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నావు
    ఉయ్యాలలుపావు జంపాలలూపావు
    ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టవు
    ఎండిన ఆకుల వెన్నుపూసల నుండి
    ఆయుధాలు తీసి పోరాడమన్నావు.....
    తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల
    పడమటి కొండల్లో వాలేటి పొద్దును
    వేలెత్తి చూపవు ఉదయించమన్నావు
    అన్యాయమనది ఎదిరించమన్నావు
    న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు
    దీనుల కళ్ళలో పేదల ఇండ్లలో దీపాలు మీరైన చాలు బిడ్డన్నావు
    తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల
    పచ్చాని పైరుల్లో వెచ్చాని నెత్తురు
    చిల్లిన నీకంట్లో కన్నీళ్లు దాచావు
    తడి ఆరిపోనట్టి మరకల్ని చూపెట్టి
    పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు
    తెలుసుకొ మన్నావు తలచుకొ మన్నావు
    పేదోల్ల రాజ్యాన్ని సాదించమన్నావు
    తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల
    దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకుదెరువు లేక బార్డర్ కి పంపావు
    అరచేత పెంచావు ఆయుదాన్నిచ్చావు
    సరిహద్దు సేవల్లో సాగిపొమ్మన్నావు శత్రువులకేనాడు తలవంచకన్నావు
    కన్నందుకు తలవంపు తేకన్నావు
    తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల
    త్యాగాల కాగితం మరణాల సంతకం
    నీగుండె గొంతుతొ చదువుకొమన్నావు
    ఉద్యమం ఏనాడు ఓడిపోదన్నావు
    రాజకీయాలను కూలదొయమన్నావు
    ఎర్ర జెండానెత్తి దొరల గుండెపైన
    దండుతొ దండిగా దాడిచేయమన్నావు
    తల్లీ నావెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల
    నల్లని రేగల్లో ఎర్రని మల్లెలు నెత్తురోసుకున్న నేల

  • @gaddamsrikanthjaiswal5974
    @gaddamsrikanthjaiswal5974 ปีที่แล้ว +54

    ఈ పాట విన్న కొద్ది ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది గాయకులకు అందరికీ నాయొక్క పాదాభివందనాలు మిట్టపల్లి సురేందర్ అన్నకు ధన్యవాదాలు❤❤

  • @akashkedewar
    @akashkedewar ปีที่แล้ว +140

    తెలంగాణ ప్రజలు మరువలేని ఒక పాట... తల్లి ఓ వెలిశాల ♥️♥️🙏🙏🙏

  • @zuheebmd8368
    @zuheebmd8368 ปีที่แล้ว +76

    వెలిశాల గ్రామం మీ అందరికీ రుణపడి ఉంటుంది. జై భీమ్ జై తెలంగాణ.

    • @nanidon1327
      @nanidon1327 7 หลายเดือนก่อน +1

      Thirumala giri velishala grama ha bro

    • @e.prashanthgoud5203
      @e.prashanthgoud5203 7 หลายเดือนก่อน

      Jai Bheem Jai arjuna Jai sriram

  • @banjaneyuluanji
    @banjaneyuluanji ปีที่แล้ว +2033

    రాంబాబు అన్న నోట జాలువారే ప్రతి పదం ఒక నిప్పు కణo🔥🔥 అన్న సాంగ్స్ కి ఎంత మంది ఫ్యాన్స్ వున్నారు👍👍 ఈ సాంగ్ చరిత్ర సృష్టించింది ఒక్కప్పుడు ❤❤

  • @lingaswamygouthami6062
    @lingaswamygouthami6062 ปีที่แล้ว +273

    ఈ పాట పాడిన ప్రతి ఒక్కరికీ నాయొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిట్ట పల్లి సురేందర్ సార్. జై భీమ్ జై జై భీమ్ సార్.✊✊✊

  • @venuchinnachittibhuthkuri1258
    @venuchinnachittibhuthkuri1258 ปีที่แล้ว +27

    ఒక పాట తో తెలంగాణా పల్లెల చరిత్ర చూపించావు సురేందర్ అన్న నీ కలానికి అలాగే పాట ఆలపించిన అన్నలందరికీ.. 🙏🙏

  • @rangucreative
    @rangucreative ปีที่แล้ว +38

    నల్లని రెగల్ల ఎర్రాని మల్లెలు నెత్తురోసుకున్న నేల....ఈ లైన్ ప్రతి పల్లె కు హెడ్ లైన్❤...విప్లవ అభివందనాలు తెలంగాణ కళాకారులకు....

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 ปีที่แล้ว +82

    ఇంతమంది యువ కళాకారులను చూస్తుంటే తెలంగాణా జానపదం సురక్షితంగా వుంది అనిపిస్తుంది

  • @akkijanardhangoud7473
    @akkijanardhangoud7473 ปีที่แล้ว +118

    ఈ పాట ఎంత మందికి నచ్చిందో like చేయండి❤️.... 😇💙🥳

  • @shyamcharanb2799
    @shyamcharanb2799 ปีที่แล้ว +131

    కన్న ఊరు కోసం...కన్న తల్లి లాంటి పాటా రాసి వెలిశాల గ్రామా చరిత్రను ప్రపంచానికి చాటిన మా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ కెరటం మా మిట్టపల్లి సురేందర్ అన్న కు హృదయపూర్వక శుభాకాంక్షలు....❤

  • @elthurishankar5387
    @elthurishankar5387 ปีที่แล้ว +62

    మిట్టపల్లి నుండి జాలువారిన అద్భుతమైన సాహిత్యం.అద్భుతంగా పాడిన యువ గాయకులకు వందనాలు.
    జై భీమ్ లతో.

  • @ramuyadavmekala6378
    @ramuyadavmekala6378 ปีที่แล้ว +34

    నా తల్లి తెలంగాణ మట్టి లో పుట్టిన మనిక్యాలకు అభినందనలు తల్లి నా తెలంగాణ నీకు ఉన్నది చరిత్ర చాలా 🚩🚩🙏🙏

  • @sathishakkapaka6223
    @sathishakkapaka6223 ปีที่แล้ว +82

    ఈ పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో రాయాలని చరిత్రలోనే నిలిచిపోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను

  • @kashiscommerce2048
    @kashiscommerce2048 ปีที่แล้ว +52

    తెలంగాణ సాహిత్యం ఒక అద్భుతం...
    తెలంగాణ గాయకులు మరో అద్భుతం...
    మన పాటకు వందనం...
    మన ఎర్ర జెండాకు వందనం...

  • @santhoshkondaparthi6273
    @santhoshkondaparthi6273 ปีที่แล้ว +401

    వెలిశాల గ్రామంలో పుట్టినవారు ఎంత అదృష్టం చేసుకున్నారు అన్న..... 👌👌👌

    • @Deccan926
      @Deccan926 ปีที่แล้ว +15

      మాది వెలిచాల రామడుగు మండలం కరీంనగర్ జిల్లా

    • @OkaSamanyudu
      @OkaSamanyudu ปีที่แล้ว +5

      ఇంతకు ఈ పాట ఏ వెలిశాల గ్రామం లోది

    • @Deccan926
      @Deccan926 ปีที่แล้ว +4

      @@OkaSamanyudu ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన ది

    • @neerajabandi1474
      @neerajabandi1474 ปีที่แล้ว +1

      District enti Anna velishal dhi

    • @mahenderverpula798
      @mahenderverpula798 ปีที่แล้ว +1

      @@Deccan926Mandalam?kodakndla?

  • @nareshposhalaofficial
    @nareshposhalaofficial ปีที่แล้ว +37

    నేను వెలిశాల బిడ్డగా చెప్తున్న ఈ పాట చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్న గారికి నా తరుపున మరియు మా వెలిశాల గ్రామ ప్రజల తరుపున మీకు వేల వేల కృతజ్ఞతలు.. తల్లి నా వెలిశాల నీకు సలాం ✊✊

    • @shekharp240
      @shekharp240 ปีที่แล้ว +1

      👏👏

    • @NeverGiveup-fw4tp
      @NeverGiveup-fw4tp ปีที่แล้ว

      Anna niku gajarla Ashok anna telusa

    • @ajayvarmaajayv901
      @ajayvarmaajayv901 ปีที่แล้ว

      Bro velishala a DIST bro

    • @shekharp240
      @shekharp240 ปีที่แล้ว

      @@ajayvarmaajayv901 song lo unna velishala Jaya shanakar bhupalapally dist

    • @anilvanam8742
      @anilvanam8742 ปีที่แล้ว

      ❤❤

  • @muninderkaligeti3357
    @muninderkaligeti3357 ปีที่แล้ว +30

    ఈ పాట పాడిన గాయకులకు పేరు పేరున హృదయ పూర్వక కళభివందనలు....
    మిట్టపల్లి సురేందర్ అన్న గారి నుండి ఇలాంటి తెలంగాణ పల్లె ప్రాముఖ్యత పాటలు మరెన్నో రావాలి.. మరియు
    అందరికీ అభనందనలు 🎉🎉🎉🎉🎉

  • @singermothilalbanjara4639
    @singermothilalbanjara4639 ปีที่แล้ว +113

    అద్భుతమైన పాటని అందించిన మన కళాకారులకి ప్రత్యేక ధన్యవాదాలు🎉🎉🎉

  • @rayala1280
    @rayala1280 ปีที่แล้ว +40

    రాంబాబు అన్న నోట జాలువారే ప్రతి పదం ఒక నిప్పు కణం 🔥🔥
    కథం తొక్కిన యువ కళాకారులు ...... తల్లి నా వెలిశాల పాట ......,💐💐💐

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 ปีที่แล้ว +10

    ఒక్క పాటకు ఇన్ని గొంతులు ఏకమై పాడటం ఎంతో గొప్ప విషయం ..... ఈ కళామతల్లి ముద్దు బిడ్డలకు వందనాలు...... ఈ పాటపాడిన కళామతల్లి ముద్దు బిడ్డలకు (అన్న గార్లకు) ఒక విన్నపం ఎప్పుడైనా సరే రాజ్యం లో జరుగుతున్న దోపిడీని అరికట్టే విధంగా మీ గొంతు నుండి పాటలు వస్తాయని ఆశిస్తున్న అన్న....
    అందరికీ వందనం.....🙏🙏

  • @katravathvinod3742
    @katravathvinod3742 ปีที่แล้ว +7

    నిజముగా ఈ పాట చాలా బాగుంది అన్న ..ఈ పాట వింటుంటే మనం పలెలో పుట్టినందుకు గర్వపడాలి ...మీ వెలిషలా గ్రామం గురించి ఒక చరిత్ర తిరగ రాసింది ....మీ అందరి voice కూడా చాలా బాగుంది
    జై హింద్🇮🇳🇮🇳🇮🇳

  • @shivaganeshthandra5163
    @shivaganeshthandra5163 ปีที่แล้ว +57

    ఇంత చక్కటి పాట పాడిన మన బహుజన గాయకులకు నా ప్రత్యేక జై భీములు.అలాగే ఇ పాట రాసిన మిట్టపెల్లి సురెందర్ అన్న కి నా పాదాభివందనం..జై భీమ్

  • @ambalaajay7957
    @ambalaajay7957 ปีที่แล้ว +61

    దళిత సమాజం గర్వపడాలి,మన బిడ్డలు ఇంత మంచి గాయకులు అయినందుకు

    • @rambabuvanguri828
      @rambabuvanguri828 ปีที่แล้ว

      మన జాతిలో గొప్ప గొప్ప గాయకులు ఉన్నారు

    • @jhansirani3090
      @jhansirani3090 ปีที่แล้ว

      Yes anna

  • @ramalaxmipoultry2966
    @ramalaxmipoultry2966 ปีที่แล้ว +75

    తెలంగాణలో రాంబాబు పాట అంటే పిల్లలు పెద్దలు అందరు వింటారు తక్కువ సమయంలో ఎక్కువ మనసులు గెల్చుకున్న గాయకుడు మన రాంబాబు అన్నయా

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 ปีที่แล้ว +46

    తల్లి నా వెలిశాల
    నికున్నది చరిత్ర చాలా...
    తల్లి నా వెలిశాల
    నల్లని రెగల్లో ఎర్రని మల్లెలు
    నెత్తురోసుకున్న నెల
    తూర్పు దిక్కున మోదుగుమెక్కల్లో
    దిక్కుల్ని శాసించే శాక్తుల్ని కన్నవు
    ఉయ్యాలలు ఉపావు జంపలలుపావు
    ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టవు
    ఎండిన ఆకుల వెనుపుసల నుండి
    ఆయుధాలు తీసి పొరడమన్నవు....
    2 పడమటి కొండల్లో వాలేటి పొద్దును
    వేలెత్తి చూపవు ఉదయించమనవు
    అన్యాయమనది ఎదిరించమనవు
    న్యాయాన్ని నీ చేత రక్షించమనవు
    వీరుల కళ్ళలో పేదల ఇండ్లలో దీపాలు మిరయ్యా చాలు బిడ్డ అన్నారు

    • @sureshmuppidi4531
      @sureshmuppidi4531 ปีที่แล้ว +2

      పచ్చని పైరుల్లో వెచ్చని నెత్తురు
      చిల్లిన నీ కండ్లు కన్నీరు దాచవు

    • @sukanyabheemrao8399
      @sukanyabheemrao8399 ปีที่แล้ว +3

      Full song pettu anna

  • @BalaWithTrue
    @BalaWithTrue ปีที่แล้ว +28

    ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే పాట ❤🙏 థాంక్స్ మిట్టపల్లి సురేందర్ అన్న ❤

  • @KavithaRamuSwaeroes
    @KavithaRamuSwaeroes ปีที่แล้ว +28

    అన్న ఈ పాట లో సాహిత్యం, అర్థాలు , అర్థం చేసుకొని వింటుంటే నా వళ్ళు పులకరిస్తుంది..... మీరందరూ ఏకమైతే అంబేద్కర్ కలలు కన్న రాజ్యం పక్క వస్తది అన్న....జై భీమ్

    • @naveenmaharaj5396
      @naveenmaharaj5396 ปีที่แล้ว +1

      జై భీమ్ అన్న 🙏✊

    • @ravisoljar6803
      @ravisoljar6803 ปีที่แล้ว +1

      జై భీమ్...జై RSP

  • @rambaaki
    @rambaaki ปีที่แล้ว +18

    20 ఏళ్ల కిందట వచ్చిన పాట ఇప్పుడు ఇంత మంది కళాకారులతో మన ముందుకు రావడం చాలా సంతోషం. పోరాట స్ఫూర్తితో వచ్చిన "వెలిశాల" పాట ప్రతీ గుండెలో నిలిచిపోయింది 🚩 Thanks to మిట్టపల్లి సురేందర్ అన్న.......
    FROM: బాకి 😊

  • @ramchandarpunem4307
    @ramchandarpunem4307 ปีที่แล้ว +7

    ఎన్ని సార్లు విన్న, ఎప్పుడు విన్న కొత్త పాటల ,అమ్మ పాటల ,మన పాటల అనిపించే ఉద్వేగ భరిత పాట సురేందర్ అన్నకు సలాం 20.సంవత్సరాలైన అన్ని తరాలని కదిలించే పాట గాన బృదానికి జై భీం....

  • @babuaeda1615
    @babuaeda1615 ปีที่แล้ว +64

    అద్భుతం.... Wow... ఇంత మంది నోటా పలికిన ఈ పాట అమోఘం... సురేందర్ అన్న... సూపర్బ్... లిరిక్స్..
    ఒకటి కన్నా ఎక్కువసార్లు విన్నోళ్లు... Like వేసుకోండి

  • @Ravi-bt2yj
    @Ravi-bt2yj ปีที่แล้ว +68

    బహుజన గాయకులు అందరికీ కళాభివందనం జై భీమ్✊🤝❤️

  • @narenvlogs7394
    @narenvlogs7394 ปีที่แล้ว +5

    ఒక పాటను ఇంత మంది పాడటం అధ్బుతం, అది చూడటం మా అదృష్టం 🙏🙏🙏🙏🙏 Goose bumps🤝 అందరు చాలా అద్భుతంగా పాడారు 💐💐💐 మిట్టపల్లి అన్న సూపర్👌

  • @manojkongala909
    @manojkongala909 ปีที่แล้ว +23

    ఇంత గొప్ప పాట రాసిన సురేందర్ అన్న కి నా శుభాకాంక్షలు........ నాకు ఇష్టమైన రచయిత సురేందర్ అన్న....

  • @Pashachinna
    @Pashachinna ปีที่แล้ว +10

    యెన్ని సర్లు విన్న మల్ల మల్ల వినాలనిపిస్తుంది థాంక్స్ గాయకులకి అందరికి...

  • @bodapatlanaveen
    @bodapatlanaveen ปีที่แล้ว +2

    Meeru vaade Telugu Pavithra maina padhalu mana Telangana prajalalo oka❤ unity in erpaduthundi

  • @scharan9582
    @scharan9582 ปีที่แล้ว +18

    ఈ పాటను ఇంత మంచిగా పాడిన మన తెలుగు గాయకులకు ధన్యవాదములు

  • @Navi_multi_creations
    @Navi_multi_creations ปีที่แล้ว +11

    నా జిందగీ లో 2-3 డేస్ లో సామాజిక గీతాలలో ఇదే బెస్ట్ అన్నా జై భీమ్ సోషల్ మీడియా మొత్తం ఉపేసింది.... మరియు ఈ పాట దేశం లొనే అతి ఎక్కువ యూత్ అడిక్ట్ అవుతాది పక్క ఎం అక్షరాలు... ఎం మ్యూజిక్.. ఎం వాయిస్ 🙏🙏🙏👏👏👏రియల్లీ నీల్ లాల్ సలామ్ లు అందరికి మరియు మిట్టపల్లి అన్నా కు ప్రత్యేక జై భీమ్ లు సెల్యూట్ నిజామాబాదు జిల్లా తడపాకల్ గ్రామం నుండీ ఈ కామెంట్ ✊✊✊✊✊

  • @thalpunoorigopal6055
    @thalpunoorigopal6055 ปีที่แล้ว +17

    💐ఒక్క పాటను ఇంత మంది పాడటం చాలా గర్వంగా ఉంది మీ అందరికి చాలా కృతగణతలు 🙏🙏🙏❤️❤️❤️

  • @sathishpagilla837
    @sathishpagilla837 ปีที่แล้ว +59

    ఒక్కొక్కరు ఒక్కో చరణం తో అదరగొట్టారు అన్న... తెలంగాణ జానపదాలు ప్రపంచానికే అధ్బుతం అన్న.....🤝🤝🤝

  • @KrishnaKrishna-wc7jo
    @KrishnaKrishna-wc7jo ปีที่แล้ว +120

    ఇంత గొప్ప పాటను అందరూ కలిసి పాడిన గాయకులకు హృదయ పూర్వక అభినందనలు 💐💐💐💐

  • @KS-uf9oo
    @KS-uf9oo ปีที่แล้ว +13

    సురేందర్ అన్న పాటలో ఒక్కో మాట అద్భుతమైన మాట. ప్రతి ఒకరు ప్రాణాలు పెట్టి పాడారు అందరికి ఉద్యమ వందనాలు❤

  • @ravindarmailaram5700
    @ravindarmailaram5700 ปีที่แล้ว +54

    ఈ పాట పాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు 🎉🎉మిట్టపల్లి సురేందర్ అన్నగారికి ప్రత్యేక ధన్య వాదములు 🎉🎉🎉

  • @SampathChinna-n8e
    @SampathChinna-n8e ปีที่แล้ว +35

    సురేందర్ అన్న ఈ పాట కోసం నేను వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న .. చాలా అంటే చాలా బాగుంది అన్న పాట.. ఈ పాటకు ఊపిరి పోసి పాడిన అన్నలకు పేరుపేరునా పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @venkateshkarupothula
    @venkateshkarupothula ปีที่แล้ว +57

    సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం లో కూడా వెలిశాల గ్రామం ఉంది...❤

    • @jalagamkavitha3385
      @jalagamkavitha3385 ปีที่แล้ว +6

      జయ శంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ టేకమట్ల మండల్

    • @sriramojunaveen6874
      @sriramojunaveen6874 ปีที่แล้ว +1

      Avnu udi annna

    • @sriramojunaveen6874
      @sriramojunaveen6874 ปีที่แล้ว +1

      Mothukr adagudru

    • @akulanikhil4554
      @akulanikhil4554 ปีที่แล้ว

      ​@@sriramojunaveen6874Gundala Pedda padishala

    • @rameshgoud6737
      @rameshgoud6737 ปีที่แล้ว +2

      అవును బ్రదర్ తొండ గ్రామం పక్కన...,మాది ఫణిగిరి

  • @vijaymekala2025
    @vijaymekala2025 ปีที่แล้ว +25

    మాటలు లేవు అన్నలు
    ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ThutiChandu-ev6ir
    @ThutiChandu-ev6ir ปีที่แล้ว +17

    అందరూ అన్నయ్యలు చాలా చక్కగా పాడారు ఈలాంటి పాటలు మరెన్నో పడాలి అని ఆ దేవుడు ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @bunnymanaswithkethimadhu4209
    @bunnymanaswithkethimadhu4209 4 หลายเดือนก่อน +2

    నీలాంటి కళాకారుడు మన తెలంగాణలో పుట్టడం మన తెలంగాణ తల్లి చేసుకున్న అదృష్టం మీలాంటి వారి అడుగుజాడల్లో నడుస్తున్న ఒక తెలంగాణ ఉద్యమకారుడు

  • @narinari6931
    @narinari6931 ปีที่แล้ว +139

    తెలంగాణ పాటల తోటలో విరబూసిన స్వర యోధులు.....పల్లెల్లో నుండి వెలువడ్డ మట్టిలో మాణిక్యాలు ఎందరో నా తెలంగాణ లో.....❤

  • @srikanthchervugattu
    @srikanthchervugattu ปีที่แล้ว +6

    వెలిశాల గ్రామం చేసుకున్న పుణ్యం మిట్టపల్లి జననం। ఇరవై ఏండ్ల ఈ పాట మళ్లీ పునరుజ్జీవనం పొందింది। త్యాగాల కాగితం మరణాల సంతకం వెలిశాల జీవితం। ఓక్కో చరణం చేయమంటుంది రణం। సురేందరన్న నువ్వో పాటల పూదోట । వీ పాటకు నా కలం ✍🏻సలాం చేస్తుంది

  • @sampathpitta4012
    @sampathpitta4012 ปีที่แล้ว +9

    అన్నలార ముందుగా ఈ పాట కలిసి పాడినందుకు మనోళ్ళందరికి పాదాభి వందనం.. thank you so much all cangratulataion's..& johar Sai Chand anna..😢😢🙏💐💐🚩✊✊

  • @shiluverudevender1359
    @shiluverudevender1359 ปีที่แล้ว +28

    అన్న మి పాటలు అద్భుతం
    అంత మంది గాయకులు హృదయానికి హత్తుకునేలా పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు ❤

  • @dhasarijyothijyothi7672
    @dhasarijyothijyothi7672 ปีที่แล้ว +36

    మీ అందరి గానంతో పరవళ్ళు తొక్కుకుంటు పాటమ్మ పారే నదిలా ఎంతో ఉత్సాహంగా వినసొంపు ఉంది ఇంత చక్కని అందించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏

  • @jayagoud5842
    @jayagoud5842 ปีที่แล้ว +4

    అన్నలారా తమ్ముల్లారా మేము ఇప్పుడు మేము మేము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 70 వేల మంది అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ప్రజలకు ఎంతో సేవ చేసి ఎన్నో ఎన్నో బాధలు అనుభవిస్తూ మా జీవితాలు చాలీచాలని జీతాల పైన బ్రతుకుతూ అంగన్వాడి టీచర్ కోసంలో ఒక పాట పెట్టండి అన్న తయారు చేసే ప్లీజ్ ధన్యవాదాలు

  • @nagaranipandari1624
    @nagaranipandari1624 ปีที่แล้ว +37

    అన్న పాట పూర్తిగా వినకుండానే ఒళ్ళు పులకరిస్తోంది అన్న...ధన్యవాదాలు 🙏🙏

  • @koumudi1912
    @koumudi1912 ปีที่แล้ว +15

    గొప్ప గాయకులను ఒకే ఫ్రేమ్ లో చూడ డం మా అదృష్టం కృతజ్ఞతలు గాయకులకు, కోరస్ గాయనిలకు సురేందర్ అన్న గారికి

  • @mamindladinesh4210
    @mamindladinesh4210 ปีที่แล้ว +6

    తల్లి నా వెలిశాల....
    నికున్నది చరిత్ర చాలా..
    నల్లని రెగల్ల ఎర్రని మల్లెలు
    నేతురోసుకున్న నెలా..
    తల్లి నా వెలిశాల..
    తూరుపు దిక్కున మోదుగ మొక్కల్లో
    దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నవు
    ఉయ్యాలలో ఉపావు జంపలలు ఉపావు
    ఉద్యమాల ఉక్కు బువ్వను పెట్టావు
    ఎండిన ఆకుల వెనుపుసల నుండి
    ఆయుధాలు తీసి పోరాడమన్నవు
    పడమటి కొండల్లో వలేటి సూర్యుణ్ణి
    వేలెత్తి చుపావు ఉదయించమన్నవు
    అన్యాయమన్నది ఎదురించమన్నవు న్యాయాన్ని ని చేత రక్షించమాన్నవు
    దీనుల కండ్లల్ల పేదల ఇండ్లల్ల దీపాలు
    మీరైనా చాలు బిడ్డ అన్నావు
    పచ్చని పైరుల్ల వెచ్చని నెత్తురు
    చిందిన ని కంట కనీరుదచవు
    తడి ఆరిపొనట్టి మరకల్ని చుపావు
    పోరులో త్యాగాలు తొలి మెట్టన్నవు
    తెలుసుకోమన్నవు
    తెలుసుకోమన్నవు పేదొల్ల
    రాజ్యాన్ని సాడించమన్నవు
    దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల
    బతుకు దెరువు లేక బడరు పంపావు
    అరచేత పెంచావు ఆయుధాన్నిచావు
    సరిహద్దు సేవల్లో సగిపొమ్మన్నావు
    శత్రువులకు ఏనాడూ
    తలవంచకన్నావు
    కన్నందుకు తలవంపు తేకన్నవ్
    త్యాగాల కాగితం మన నెల సంతకం
    నీ గుండె గొంతులో చదువుకొమ్మన్నవు
    ఉద్యమం ఏనాడూ ఒడిపొదన్నవు
    రాజకీయాలను కులదోయిమన్నవు
    ఎర్రజెండా ఎత్తి దొరల గుండెపై
    దండుతో దండిగా దాడి చేయమన్నవ్
    తల్లి నా వెలిశాల.....

  • @vennu1994
    @vennu1994 ปีที่แล้ว +40

    పాట చాల అద్భుతం రాసిన వారికి పాడిన వారికి నా వందనాలు వందనాలు

  • @gorenkalaganesh871
    @gorenkalaganesh871 ปีที่แล้ว +5

    నిరుద్యోగులు ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి మీపాటలు నిదర్శనం అన్న మేము జీవితంలో ఒక స్థాయిలో ఉంటే ఈ పాటలే కారణం అన్న ప్రతిరోజూ రోజు కూడా వింటాను🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏✊👍

  • @arugondasandeep3800
    @arugondasandeep3800 ปีที่แล้ว +36

    ఉరుములాతో కూడిన తొలకరి వలె ఈ పాట ఉంది వింటుంటే.. goosebumps వస్తున్నాయి..
    పాట పాడిన గాయకులకు మరియు పాట రాసిన గేయకుడి కి నా అభివందనం ✊

  • @kumaraswamychelpuri
    @kumaraswamychelpuri ปีที่แล้ว +20

    మిట్టపెళ్ళి సురేందర్ అన్న పాటను అందరు కళాకారులు కలిసి పాడటం చాలా సంతోషంగా ఉంది ❤❤

    • @umadevi-fb5mn
      @umadevi-fb5mn ปีที่แล้ว

      గలమెత్తి పాడిన మీ గానం..
      తెలంగాణ జానపద కళకి మరో మకుటం అవుతుంది అన్నలు....
      Really Great thought...
      All the best all of you....

  • @RowdyBoy-sm5xr
    @RowdyBoy-sm5xr ปีที่แล้ว +6

    ఊరు ప్రాణం పోసింది
    బడి బ్రతుకు బాటలు నేర్పింది
    వాటి విలువ తెలిసిన వాళ్ళుగా... పాట రూపంలో ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేశారు
    Great 👍👍👍

  • @darshanam489
    @darshanam489 ปีที่แล้ว +17

    ఒక్కొక్కరి గాయకుల గొంతులలో వెలిశాల పోరాట ప్రతిమను కళ్ళకు కట్టినట్టు కనిపించేలా పాడిన గాయకులకు వందనాలు. 🙏🙏🙏 🌻🌻🌻

  • @rajuchinny2146
    @rajuchinny2146 ปีที่แล้ว +39

    ఈ పాట పాడిన గాయకులు అందరికీ నా యొక్క హృదయపూర్వక పాదాభివందనములు ధన్యవాదములు జై భీమ్ జై భీమ్

  • @godugusurendhar881
    @godugusurendhar881 ปีที่แล้ว +4

    ఒకొక్క సింగర్ మట్టిలో మాణిక్యాలు ఇంత మంది సింగర్స్ తో పడించడం గొప్పవిషయం సూపర్ సాంగ్ అన్నా పాట వింటుంటే రోమాలు నిక్కబోడుచుకున్నాయి ❤❤❤

  • @errollasandeep3482
    @errollasandeep3482 ปีที่แล้ว +11

    దాచిన, మరచిన బహుజన బతుకు చరిత్రను మల్లొక్కసారి మీ కలంతో, గలంతో గుర్తుచేసినందుకు అన్నలందరికి పేరుపేరునా ఉద్యమాభివందనాలు💐💐✊✊🙏🙏

  • @Velishala
    @Velishala ปีที่แล้ว +10

    చరిత్రలో నిలిచిపోయే పాట రాసిన మిట్టపల్లి సురేంద్ర అన్న గారికి ఆ పాటను పాడిన కళాకారులు అందరికీ కళాభివందనాలు.

  • @shivar3324
    @shivar3324 7 หลายเดือนก่อน +4

    ఇట్లా అందమైన పాటలు పాడే అవకాశం ఇవ్వగలరని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ప్లీజ్ అన్న సాంగ్స్ పాడటం అంటే ఇంట్రెస్ట్ ఉంది ఇన్స్పిరేషన్ కొంచెం నేర్పిస్తే చాలు పడేస్తాను ప్లీజ్

  • @rockstarsrinivas5143
    @rockstarsrinivas5143 ปีที่แล้ว +34

    కాలాకారులందరికి కాలాభివందనాలు ఈ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయ్🔥🔥🔥🔥🔥✊✊✊ నేను ప్రతి రోజు ఈ సాంగ్ 10 సార్లు కన్నా ఎక్కువ వింటూంటా ఎంత విన్న వినాలి అనిపిస్తుంది

  • @kumarperuka1143
    @kumarperuka1143 ปีที่แล้ว +5

    "ఎండిన ఆకుల వెన్ను పూసల నుండి
    ఆయుధాలు తీసి పోరాడమన్నావు " పౌరుషాల గడ్డ....
    "త్యాగాల కాగితం
    మరణాల సంతకం
    నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు "
    ఈ అక్షరాల అగ్నికణాలు మరణాన్నే మండించిగలవు.
    అక్షర సేద్యం చేస్తున్న మిట్టపల్లి గారికి,
    గాత్రాభిషేకం చేసిన ప్రతి గళానికి హృదయాభివందనాలు 🙏🙏🙏

  • @pranayanagarapu3258
    @pranayanagarapu3258 ปีที่แล้ว +6

    అద్భుతమైన స్వరకల్పన అత్యద్భుతమైన సాహిత్యం మధురంగ ఆలపించిన గాయకులు మీ అందరికీ హృదయ పూర్వక వందనాలు

  • @anandthodeti-er1vy
    @anandthodeti-er1vy ปีที่แล้ว +18

    అద్భుతం మహాద్భుతం.. ఇంతమంది కళాకారులు ఒక్కచోట చేరి వారి గళాలను తెరిస్తే ఇంకా ప్రళయమే
    ప్రతి ఒక్క కళాకారులకి నిండు వందనం 💖💖

  • @banothvasundar3100
    @banothvasundar3100 ปีที่แล้ว +8

    ఇంత గొప్ప గాయకులు ఇంత గొప్ప రచయితలు ఉన్నా మన తెలంగాణ లో నేను నా జన్మ ధన్యం గాయకులు మరియూ రచయితలు మీ యొక్క గళాన్ని మరియు కలాన్ని పదును పెట్టె రోజు వచ్చింది

  • @machaprabhakar1084
    @machaprabhakar1084 ปีที่แล้ว +6

    అన్నలు మీ అందరికీ నమస్కారములు ఇంత గొప్ప పాట పాడినందుకు ధన్యవాదములు అన్నలు 🙏ఈ పాట ఎన్నిసార్లు విన్నా మీ అందరి గొంతు వినాలని ఉన్నది మట్టిలో మాణిక్యంలా మీరు అందరు విప్లవ వీరుల అనిపిస్తున్నారు 🙏🙏💐💐

  • @MalleshAmmacreations161
    @MalleshAmmacreations161 ปีที่แล้ว +28

    ఈ పాట ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు విన్న వాలు ఒక లైక్ వేసుకోండి

  • @nagarajulingamalla9013
    @nagarajulingamalla9013 ปีที่แล้ว +1

    Chala chala bagundhi e song ok 100000 vinnanu anni sarlu vinna malli vinnalanipistundhi pata padinavarindhari na yokka dhanyavadhalu ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏supar supar

  • @narendharchanty4601
    @narendharchanty4601 ปีที่แล้ว +12

    సూపర్ సాంగ్ అన్న మీ అందరికీ ఉద్యమాబి వందనాలు... పాట వింటుంటే అమ్మ చేతితో గోరుముద్ద తినట్టు ఉంది.

  • @praveenreddynarraou5141
    @praveenreddynarraou5141 ปีที่แล้ว +21

    తెలంగాణ గుండెలో మోదుగపువ్వు వెలిశాల...
    సురేందర్ అన్న చేతిలో మోదుగ వృక్షం అయ్యింది!
    జీవాన్నిచ్చి పాటను పాడిన గాయకులందరికీ శుభాకాంక్షలు...🎉
    - నర్రా ప్రవీణ్ రెడ్డి
    ఉస్మానియా యూనివర్సిటీ

    • @PraveenKumarGaddapati
      @PraveenKumarGaddapati ปีที่แล้ว +1

      ఈ వెలిశల అంటే ఎంటి అన్న. ?

  • @kumbalarajesh4120
    @kumbalarajesh4120 ปีที่แล้ว +1

    Super annalu

  • @sathishmanthena789
    @sathishmanthena789 ปีที่แล้ว +11

    పాట తో సమాజాన్ని మేల్కొనేలా చెయ్యొచ్చు , పాటకి ప్రాణం పోసి ప్రజలను చైతన్య పరుస్తున్నారు ఈ పాట పాడిన అందరికీ నా జోహార్లు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @పల్లెటూరుపిల్లగాడు

    చాలా గొప్ప పాత
    ఇంత మంది కలిసి పాడటం చాలా బాగుంది
    ప్రతి అక్షరం నిజం
    ఊరు... ప్రతి వారికీ మొదటి గురువు

  • @swamylingaindrakanti4264
    @swamylingaindrakanti4264 ปีที่แล้ว +3

    కోహినూరు వజ్రము వినడం తప్ప .ఎప్పుడు చూడలేదు భాహుష అది మీలాగే ఉంటుందో ఏమో ఎం తేజస్సు అన్న మీ పాటకి నా మనస్సు కరిగి పోయింది 🙏🙏

  • @archanaashok3972
    @archanaashok3972 ปีที่แล้ว +15

    ప్రతి ఒక్కరికీ.. పేరు పేరున..🙏 పాట వినసేపు... అసలు చెప్పలేని ఆనందం.... కోరస్ ఇచ్చిన అక్కలు కు ..సంగీతాన్ని అందాచిన అన్నకు....🙏❤️❤️ మాకు ఇంత

  • @veeraboinasrinivas4227
    @veeraboinasrinivas4227 ปีที่แล้ว +8

    ప్రతీ ఒక్కరి గుండెని కదిలించింది ఈపాట.ఇంతమంది గాయకులు పాడటం చాలా అద్భుతంగా ఉంది. తెలంగాణ బిడ్డలకే ఇది సాధ్యం.

  • @ramanjuluram6817
    @ramanjuluram6817 ปีที่แล้ว +6

    తెలంగాణ అంటేనే ఒక ఆత్మగౌరవం ఈ ఆత్మగౌరంతో పాటు తెలంగాణ కోసం ఎన్నో ఆత్మ బలిదానాలు అటు విప్లవ ఉద్యమాలు ఇటు.🎉🎉🎉🎉 తెలంగాణ ఉద్యమాలు జోహార్ తెలంగాణ అమరవీరులకు

  • @bhaskar8235
    @bhaskar8235 ปีที่แล้ว +11

    ఈది మన దళిత స్వరం అంటే 🙏🙏🙏🙏🙏🙏🎁🎁🎁🎁🎁💐💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🤝🤝🤝🤝🤝🤝🤝💪💪💪💪💪💪💪🐅🐅🐅🐅🐅🐅

  • @ramanaghugloth293
    @ramanaghugloth293 ปีที่แล้ว +8

    80- 90 లో పుట్టిన ప్రతి వాడి గుండె ఈ పాటతో కన్నీరు కారుస్తూ ఉంటుంది 😭

  • @devilalofficelcinima9931
    @devilalofficelcinima9931 ปีที่แล้ว +12

    ఈ పాట వినంత సేపు గుస్ భమ్స్ వచ్చాయి బ్రదర్స్ ఎంత సూపర్ గా ఉంది అంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది నిజంగా👌👌👌 సూపర్ సూపర్ 🔥🔥థాంక్యూ అందరికి ఇంత మంచి పాట పాడినందుకు 🙏🙏🙏