రాయలవారు మెచ్చిన పెద్దన గారి ఉత్పలమాలిక - Utpala Maalika

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • శ్రీకృష్ణదేవరాయలుచే పెద్దనగారికి స్వయంగా గండపెండేరము తొడిగించిన ఉత్పలమాలిక
    ఒకసారి రాయలవారు తన సభ అయిన భువనవిజయానికి వస్తూ వస్తూ.. తనతో పాటూ ఒక బంగారపళ్ళెంలో పెట్టి ఉన్న గండపెండేరాన్ని కూడా తీసుకు వచ్చారు. సంస్కృతంలోనూ, తెలుగులోనూ సమంగా కవిత్వం చెప్పగలిగిన కవిదిగ్గజానికి ఈ గండపెండేరాన్ని బహుమతిగా ఇస్తానన్నారట. అష్టదిగ్గజ కవులంతా తర్జనభర్జన పడుతున్నారు. అప్పుడు రాయలవారు
    “ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు బహూకరింపగ
    నొద్దిక నాకొసంగుమని యొక్కరు గోరగలేరు లేరొకో?” అన్నారట.
    అంటే.. నేను గండపెండేరాన్ని బహూకరిస్తున్నాను, తీసుకోండి అంటుంటే.. ఒక్కరూ తీసుకోరేమిటి అని అన్నమాట. రాయలవారు అన్న మాటలు ఉత్పలమాల వృత్తంలో 2 పాదాలలో ఉన్నాయి. అప్పుడు ఆంధ్రకవితాపితామహుడైన అల్లసాని పెద్దనగారు లేచి
    “పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీ వెరుంగవే?
    పెద్దన కీదలంచినను బేరిమి నాకిడు కృష్ణరాణ్రుపా!” అంటూ మిగిలిన రెండు పాదాలనూ పూరించారు.
    అంటే ఓ రాజా! పెద్దన పోలిన పండితులు ఈ భూప్రపంచంలో లేరని నీకు తెలియనిదా. కనుక ఆ గండపెండేరం నాకే బహూకరించు అన్నారట. మరి అంటే సరిపోతుందా.. రాయలవారు అడిగినట్లుగా సంస్కృతాంధ్రాలలో కవిత్వాన్ని గుప్పించాలి కదా. అప్పుడు పెద్దన గారు అందుకున్నదే ఈ ఉత్పలమాలిక. ఉత్పలమాల ఛందస్సులో, పద్యంలా కేవలం నాలుగు పాదాలతో ఆపకుండా అంతకు మించి మాలికలా అల్లుకుంటూ పోయేదే ఉత్పలమాలిక. పెద్దన గారు చెప్పిన ఉత్పలమాలికేమిటో చూద్దాం.
    - Rajan PTSK
    #RajanPTSK #UtpalaMaalika #TeluguPoems

ความคิดเห็น • 46

  • @palakshibalajiprasad97
    @palakshibalajiprasad97 3 ปีที่แล้ว +11

    గురువు గారు ఇప్పటి నుంచి మీకు మేము ఇచ్చే బిరుదు -
    "తెలుగు కవితాయిష్టులు".
    మిమ్మల్ని ఇకపై అలానే పిలుస్తాం గురువుగారు.

  • @ramsa2370
    @ramsa2370 3 ปีที่แล้ว +4

    రాజస్సూతే అమృతం భువి. ఆర్యా! ,,👌👌🙏🙏

  • @kavspadma
    @kavspadma ปีที่แล้ว +1

    మీకు చాలా రుణపడి ఉన్నాము రాజన్ గారు.ఇదివరకు అప్పుడప్పుడు ఆస్వాదించే సాహితీ మధురిమలు, మీ ఛానల్ గురించి తెలిసిన దగ్గర నుంచి ప్రతి రోజూ విందు భోజనం చేస్తున్నాము.🙏

  • @krishnamurthy524
    @krishnamurthy524 3 ปีที่แล้ว +1

    పెద్దన గారి గురించి
    ఇంత పెద్దగా ఇదివరకు తెలియదు. ధన్యవాదాలు

  • @pathansamiullakhan829
    @pathansamiullakhan829 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది మీ పద్య పఠనం..,వివరణ అద్భుతం....

  • @krishnareddy2803
    @krishnareddy2803 3 ปีที่แล้ว +1

    Wonderful. Adbhutam.

  • @gsvenugopal2015
    @gsvenugopal2015 3 ปีที่แล้ว +9

    అద్భుతమైన కవిత్వ ధార మన భువన విజయం సొత్తు....ఆ యుగం స్వర్ణ యుగం....మీరు మరల సృష్టిస్తున్నారు మీ గాత్రం తో

  • @sivashankarkasturi5065
    @sivashankarkasturi5065 ปีที่แล้ว +1

    తెలుగులో మోట్టమొదటి సుదీర్ఘమైన మాలిక. 30 పాదాల మాలిక.
    ఆ తరువాత భట్టుమూర్తి, ధూర్జటి నుండి కరుణశ్రీ గారి వరకూ ఎందరో ఇటువంటి ఉత్పలమాలికలు అందించారు

  • @ajeyavijayeendra8325
    @ajeyavijayeendra8325 3 ปีที่แล้ว +5

    నేను చూసింత వరకు...ఇద్దరు మాత్రమే ఈ ఉత్పలమాలిక ను "చూడకుండా" సభికులముందు చెప్పారు.
    1) బాలకృష్ణ (రవీంద్ర భారతి) 2) తనికెళ్ళ భరణి
    వారిద్దరికీ తెలుగంటే ప్రాణం

    • @sivashankarkasturi5065
      @sivashankarkasturi5065 ปีที่แล้ว

      క్షమించాలి. చాలా మంది సాహితీవేత్తలకూ, అవధానులకూ, సాహిత్యం అభిమానించే వారికి ఈ పద్యం కంఠతా వస్తుంది
      యండమూరి వారి ఆనండోబ్రహ్మ నవలలో సైతం ఈ పద్యం కనిపిస్తుంది. కాలేజి రోజుల్లోనే బట్టీయం వేశాము.
      ఎందరో "భువనవిజయం" వంటి సాహితీ సభల్లో కూడా ఈ పద్యాన్ని చూడకుండా చెప్పగలరు

  • @kolipakaashok4369
    @kolipakaashok4369 3 ปีที่แล้ว +1

    Dhanyavadamulu.. 🙏🙏

  • @AksharasGaanaLahari
    @AksharasGaanaLahari 3 ปีที่แล้ว +1

    Rayalavri Bhuvanavijayam A Astanamloni Astadiggaja Kavulu Alanti Maha Raju Na Bhuto na Bhavishyati chala bagunnadi Thanqu.so much

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 3 ปีที่แล้ว +1

    Adbhutam 🌹💐🌹💐

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 3 ปีที่แล้ว +1

    Thank you raajan garu

  • @durgaprasad90
    @durgaprasad90 3 ปีที่แล้ว +1

    Enno rojula eduru chusanu ee kavita artham kosam dhanyvadalu...

  • @gnannavaaniforcompititivee6144
    @gnannavaaniforcompititivee6144 3 ปีที่แล้ว +1

    Namaskaram Gurujii

  • @narasimhamurthy-yi2oc
    @narasimhamurthy-yi2oc 2 หลายเดือนก่อน +1

    Tirupati kavulanu stutistu kopparapumalika pettavalasinadiga prardhana 4:02

  • @gudalarambabug.rambabu7312
    @gudalarambabug.rambabu7312 3 ปีที่แล้ว +2

    2nd comment sure

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 3 ปีที่แล้ว +1

    రాయలవారి కాలంలో పుట్టిన సామాన్య ప్రజలు అదృష్టవంతులు అనుకోవచ్చా!!?🤔

  • @murthydvs1645
    @murthydvs1645 3 ปีที่แล้ว +5

    Desabhaashalandhu telugu lessa

  • @thedarkhorse7341
    @thedarkhorse7341 3 ปีที่แล้ว +4

    గురువు గార్కి పాదాభివందనాలు,

  • @leelanallagachu2916
    @leelanallagachu2916 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏శ్రీ గురుభ్యోనమః
    గురువుగారు కాశీమజిలీ కథలు పోస్ట్ చేసి 6 రోజులు అవుతుంది.
    ఎప్పుడు పోస్ట్ చేస్తారు.....

    • @Ajagava
      @Ajagava  3 ปีที่แล้ว

      రెండు మూడు రోజులలో తరువాత కథ చెబుతానండి.

    • @leelanallagachu2916
      @leelanallagachu2916 3 ปีที่แล้ว

      🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః.....
      అమ్మబాబోయ్ రెండు మూడు రోజుల్లో నే....
      అంటే మొత్తం పది రోజులు పైనే అవుతుంది గురువుగారు.....
      ప్చ్.......ఏం చేస్తాం ఎదురు చూడడం తప్ప.....🙏🙏

  • @gangadhargangadhar2123
    @gangadhargangadhar2123 3 ปีที่แล้ว +2

    Namasarm gurugaru kasi mageli khatha pettanddi 👏👏💐💐👌👌🙏🙏

  • @KreativeSanju777
    @KreativeSanju777 ปีที่แล้ว +1

    తల్లి తండ్రుల గురించి గొప్పతానం గురించే రచన ఏది .... అందులో రచయిత ఏం చెపుతాడు అంటే పిల్లలు ఎన్ని సాధించిన అవి తల్లి తంద్రులకీ చెందుతాయి అంటాడు ఇంతకీ రచ్చ పేరు ఏంటి కాస్త చెప్పగలరా

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 3 ปีที่แล้ว +1

    అద్భుతం. ఈ పద్యాలు చాలా బాగా అనర్గళంగా చదివారు. అర్థం చెప్పారు. ధన్యోస్మి....🙏

  • @MrGogi1969
    @MrGogi1969 3 ปีที่แล้ว

    Thank you. So. Much kiranprabhagaru. Meephone number. Teliyacheyyandi dayachesi.

  • @gayataridevi5516
    @gayataridevi5516 3 ปีที่แล้ว +1

    Ha rajannu niku nuvve sati

  • @tkramanjaneyulu6057
    @tkramanjaneyulu6057 3 ปีที่แล้ว +1

    మీ సొగసైన కంఠం చేత పద్యమునకు ఎంతో అందం తెచ్చారు. ఇలాగే వినాలనిపిస్తుంది. కృతజ్ఞతలు మీకు

    • @Ajagava
      @Ajagava  3 ปีที่แล้ว

      🙏

  • @chengalvaraobodepu7163
    @chengalvaraobodepu7163 3 ปีที่แล้ว +1

    Melodeus Utmala poem, thanks for nice explanation.
    You too.

  • @mastermaster5442
    @mastermaster5442 3 ปีที่แล้ว +2

    Tq guruji

  • @beerejayaram1153
    @beerejayaram1153 3 ปีที่แล้ว +1

    అబ్బా ఎంత చిక్కగా అద్భుతం గా ఉంది చాలా చాలా అద్భుతం

  • @lvsnkumar
    @lvsnkumar 3 ปีที่แล้ว +2

    అభినందనలు🙏

  • @venugopalg916
    @venugopalg916 3 ปีที่แล้ว +1

    కాశీమజలీ కథలు aplod చేయగలరని మనవి

    • @Ajagava
      @Ajagava  3 ปีที่แล้ว

      రెండు మూడు రోజులలో తరువాత కథ చెబుతానండి.

  • @u.dastagiri3
    @u.dastagiri3 3 ปีที่แล้ว +1

    అద్భుతం గురూజీ 🌹🌹💐💐👏🙏

  • @rampradeep.k6953
    @rampradeep.k6953 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @durgaprasadsamantula699
    @durgaprasadsamantula699 3 ปีที่แล้ว +1

    మాటల్లేవ్ 🙏🙏🙏🙏🙏

  • @NVS-VS
    @NVS-VS 3 ปีที่แล้ว +1

    చాలా బాగ వివరించినారు

  • @dhaksithrajkumarraju9878
    @dhaksithrajkumarraju9878 3 ปีที่แล้ว +1

    Gurvu gariki namskram🙏

  • @ellendularaghu382
    @ellendularaghu382 3 ปีที่แล้ว +1

    Allasaani vaani allikajigibigi maku chupincharu🙏

  • @ngmani5296
    @ngmani5296 3 ปีที่แล้ว +1

    👏👏👏

  • @MuralimohanUriti
    @MuralimohanUriti 2 ปีที่แล้ว

    ఎంత అద్భుతం గా విశ్లేషణ చేశారు సార్. ధన్యవాదములు

  • @isankararao7151
    @isankararao7151 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది. ధన్యవాదాలు. 👏👏🙏