The Judgement of GOD (దేవుని తీర్పు) | Lyrical Song - 127 | Pournami Special Alert

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • It's the Judgment Day !!!
    ఒక శిక్ష కానీ లేక అక్ష కానీ అమలు పరచే ముందు, ఆ శిక్షాక్షలతో కూడిన శిక్షాస్మృతిని మొదట ప్రభువు ప్రవచన రూపములో తన ప్రభుత్వమునకు, రాజు రాజ్యాంగ రూపములో తన రాజ్యమునకు తప్పక తెలియచేయవసి ఉండును. అలా తన తీర్పుయొక్క విధివిధానమును ప్రకటించిన పిదప, ఆ శాసనములకు లోబడి నడుచుకొననివారిని, ఆ ఆజ్ఞలను ధిక్కరించువారిని .. ప్రభుత్వ పాలకులు మరియు రాజుయొక్క సైన్యము కలిసి తప్పక శిక్షించెదరు.
    ముఖ్యముగా దేవుని యెడల జీవుడు తప్పు భావమును పొందు అదే క్షణములోనే ... నేరారోపణ, విచారణ, నేరనిర్థారణ, తీర్పు, అమలు అనునవి వెంటవెంటనే జరిగిపోవును. జీవుడు చేయు పాతకమునకు అదే జీవుని చేతనే సంతకము పెట్టించి మరీ తీర్పు అమలగును.
    నేడు ఈ కలియోగమున కలిపురుషుడు అవతరించి సృష్ట్యాదినుండి కట్టుదిట్టముగా ఉన్న తన తీర్పును మరియొకసారి ప్రబోధగా ప్రకటించిన ప్రకటనే ఈ "దేవుని తీర్పు". ఈ గ్రంథము ప్రభవించిన పిదప ఇక తీర్పు అమలులోకి వచ్చి తీరును. ఇది ఆదినుండి ఉన్న ఆదికర్త ఆజ్ఞ.
    ఈ తీర్పు ఎవ్వరినీ వదలదు, ఎవరి సిఫారసూ ఇక్కడ స్వీకరించబడదు, ఎటువంటి రాయితీ ఇక్కడ లేదు. ఇది ఒక వదిలిన బాణము వంటిది. ఇది తప్పక తన లక్ష్యమును నెరవేర్చక ఆగదు.
    దేవుడు ఉన్నాడని కొందరు, లేడని కొందరు వాదించుకొనుచున్న ఈ కలికాలంలో.. చూసో చూడకో, వినియో వినకో, తెలిసో తెలియకో మనందరమూ "దేవుని తీర్పు"లోనే ఉన్నాము. దేవుని రూపు మీకు కనిపించకపోవచ్చు, కానీ దేవుని తీర్పు మీకు తప్పక కనబడుతుంది. దేవుని వాణి మీకు వినిపించకపోవచ్చు, కానీ దేవుని తీర్పు మీకు తప్పక వినబడుతుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో, దేవుడు తీర్పును తీరుస్తాడు అన్నది అంతే నిజము.
    గురువు విషయములో జీవుడు తొందరపడి గురువ్యతిరిక్త భావమును, గురుభక్తి వీడి మానసిక వ్యభిచార భావమును పొందుట నేరములలోకెల్లా పెద్ద నేరం ! అది మహా ఘోరం !! ఆ విషయములో తీర్పు మహా కఠినముగా ఉండును. తస్మాత్ జాగ్రత్త !
    Sections 963, 369, 666 ...
    Be Alert .(144 section).. Attention Everybody ... GOD's Judgment is on Live ... Be Ready !!!
    TEAM:
    ---------
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Ramu (Chennai)
    Music - N Nagesh
    Video Composition - Subbu
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel
    సాకీ :
    ----
    G for the Generator ... O for the Operator ... D for the Destroyer
    He is the Judger ... of all your Ledger
    It's the Decision on the Summit ..
    and no one can escape it..
    It's The Judgement Of GOD !!!
    పల్లవి :
    ----
    ఒక కనిపించని ధర్మస్థానం అది చేసేదేలే శాసనం
    అది వినిపించని న్యాయస్థానం తీర్పందించే తీర్మానం
    శిక్షఅక్షా శిరమున దాచి శాసించేటి సింహాసనం
    శిధిలం కాని సిరలో ముంచి రాసేటి శిలాశాసనం
    ఇదే దేవుని తీర్పు ఇదే దేవుని తీర్పు
    ఇదే దేవుని తీర్పు ఇదే దేవుని తీర్పు
    ఒక కనిపించని ధర్మస్థానం అది చేసేదేలే శాసనం
    అది వినిపించని న్యాయస్థానం తీర్పందించే తీర్మానం
    కోరస్ :
    పాశమే పాళిగ యముడు రాయు శాసనం
    పాపపుణ్యాలుగా జీవి పొందు అనుభవం
    చరణం 1:
    ------
    ఆదిలో దైవమె శిక్షాస్మృతులుగ నిర్మించిన వైనం .. తీర్పు
    ఆ శాసనమునె ఆత్మే అమలుగ పరిచే రాజ్యాంగం .. తీర్పు
    దేహము వెలుపల యమకింకరులుగ ప్రకృతి పాటిస్తే .. తీర్పు
    దేహము లోపల దేవుడె యముడై ఆజ్ఞలు సంధిస్తే .. తీర్పు
    పుణ్యం తీపి పాపం చేదు .. అది.. కర్మలలోనే రాసిన పద్దు
    దేహం దాటి అనుభవమే లేదు ... అది దేవుడు నీకై గీసిన హద్దు
    స్వర్గం నరకం లోకము కాదు ..అది .. జీవుని తలలో మలచిన ఖైదు
    రాసిన రాత ఇక చెరిగే పోదు ... నువు కాదన్నా లేదన్నావదిలేందుకు వీలే లేదు
    ఇదే కర్మల కూర్పు .. ఇదే దేవుని తీర్పు
    ఇదే దేవుని తీర్పు ... ఇదే దేవుని తీర్పు
    ఒక కనిపించని ధర్మస్థానం అది చేసేదేలే శాసనం
    అది వినిపించని న్యాయస్థానం తీర్పందించే తీర్మానం
    కోరస్ :
    కాలుడే కదిపిన ఖర్మచక్ర ఖేళనం
    దేవుడే ధరించిన ధర్మచక్ర పాలనం
    చరణం 2:
    ------
    ప్రకృతి జనిత శరీరమునందలి శిక్షకు కారణమే ... కర్మ
    దైవిక పథమున జీవుడు శిక్షలకే గురి కావడమే ... ధర్మ
    ప్రాకృతికముగా ప్రారబ్ధములో అక్షలనిచ్చునదే .. కర్మ
    దైవికముగ నీ జ్ఞానభవితతో మోక్షము చేర్చునదే .. ధర్మ
    అజ్ఞానంతో కర్తను నేను ... అంటు... అహమే పొంది జీవి మరచితే మేను
    అజ్ఞాతంలో చిత్రగుప్తుడు నేను .. అంటు ... ఆత్మే రాసే రాత కర్మల బోను
    శ్రద్ధేలేక జీవి మాయకు లోను .. ఐతే ... గుణవిషయాలే తనకు పండే చేను
    బుద్దేలేని సుద్ధమొద్దై తాను .. ఇక .. ప్రతిజన్మ గతితప్పి అధోగతి పాలైపోను
    ఇదే జన్మల మార్పు ...ఇదే దేవుని తీర్పు
    ఇదే దేవుని తీర్పు ... ఇదే దేవుని తీర్పు
    ఒక కనిపించని ధర్మస్థానం అది చేసేదేలే శాసనం
    అది వినిపించని న్యాయస్థానం తీర్పందించే తీర్మానం
    కోరస్ :
    గురువునే గాంచని జనుల పాలి సంతకం
    క్షరుడుతా పొందిన క్షమించరాని పాతకం
    చరణం 3:
    ------
    త్రైతము తెలిపిన దేవుని బోధను తప్పుగ గ్రహియిస్తే ... నేరం
    తత్వము తెలియక మాయల బోధను ఒప్పుగ ప్రకటిస్తే ... ఘోరం
    గ్రంథమునిచ్చిన గురువును కాదని గ్రుడ్డిగా చరియిస్తే .. నేరం
    ధర్మప్రచారము చేసే త్రైతికి అడ్డుగా నిలుచుంటే ... ఘోరం
    ప్రతి యుగమందు పుట్టే గురుని ...మీరు.. జ్ఞానంకోసం శరణే వేడి
    భక్తే పెంచి అతని ఆరాతీస్తే ...మీకు.. ముక్తే ఇచ్చే ధర్మజ్యోతే తీర్పు
    దైవం మనిషై వచ్చిన కాని ... వారికెదురై జ్ఞానం చెప్పిన కాని
    అవమానించే వారందరినీ ... కనికరమే లేకుండా కర్కశమై కాల్చును తీర్పు
    ఇదే మారని మార్పు ... మరేం లేదిక ఓర్పు
    ఇదే దేవుని తీర్పు ... ఇదే దేవుని తీర్పు
    ఒక కనిపించని ధర్మస్థానం అది చేసేదేలే శాసనం
    అది వినిపించని న్యాయస్థానం తీర్పందించే తీర్మానం
    శిక్షేకానీ లేక అక్షేకానీ ... జన్మకు పోనీ లేక మోక్షం రానీ
    సాక్షై చూస్తూ ఉన్న ఆ నేత్రాన్ని .. త్రైతంలోనే నీకు చూపే వాణి
    కక్షే లేని పక్షపాతం కాని .. శిక్షాస్మృతికే లక్ష్యమైనది తీర్పు
    రక్షేలేని క్షమకు పాత్రంకాని .. దక్షతకే నొచుకోని శిక్షలతో నిండిన తీర్పు
    ఇదే దేవుని తీర్పు ఇదే దేవుని తీర్పు
    ఇదే దేవుని తీర్పు ఇదే దేవుని తీర్పు

ความคิดเห็น •