sri venkatesa rajeevaksha melukonave
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- #srivenkatesa_rajeevaksha_melukonave
#ANNAMAYYA_AKSHARAVEDAM EPISODE - 52
అన్నమయ్య అక్షర వేదం -- సంపుటి -- 52
( #శ్రీవేంకటేశ_రాజీవాక్షా_మేలుకొనవే*...)
🙏 *ఓం నమో వేంకటేశాయ.*🙏
అందరికీ శుభోదయం
✍️ --- మీ వేణుగోపాల్
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 52 కి శుభ స్వాగతం
✍️ --మీ వేణుగోపాల్
🌹భాస్వానుదేతి వికటాని సరోరుహాణి,
🌹సంపూరయంతి నినదైః కకుభో విహంగాః,
🌹శ్రీ వైష్ణవాః సతత మర్దిత మంగళాస్తే ,
🌹ధామాశ్రయంతి తవ వేంకటసుప్రభాతమ్ -- 26
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం (26 )
✍️ శ్రీ అనంతాచార్యులు1430AD
భావము --
🙏 ఓ దేవా!!
సూర్యుడు ఉదయించుచున్నాడు. కమలములు వికసించుచున్నవి. పక్షులు తమ కిలకిలరావములతో దిక్కులను నింపుచున్నవి.
శ్రీవైష్ణవులు శుభములను కోరుచు నీ సన్నిధిలో వేచియున్నారు.
ఓ వేంకటాచలపతీ !! 🙏🙏
నీకు సుప్రభాతమగు గాక !! 🙏
ప్రతి లోగిలిలో కమనీయముగా వినిపించే
శ్రీ స్వామి వారి దివ్య సుప్రభాతము ,
సమస్త లోకములకు శుభకరమగు మేలుకొలుపు.
ఇంత చక్కటి సుప్రభాతమును ,
పామరులు సైతం అలవోకగా పాడుకుంటూ,
తమ దైనందిన కార్యక్రమములు మొదలుపెట్టుకునే ముందు , స్వామిని మనసారా ధ్యానించుకుని తమకు తోడుగా ఉండమని ప్రార్ధిస్తున్నారు అన్నమయ్య చక్కని సుప్రభాత సంకీర్తనతో.🙏🙏
మరి ఆ అచ్చ తెలుగు మేలుకొలుపు పాట అర్ధము తెలుసుకుని మనము కూడా పాడుకుందామా .. 🙏
🌺 *ఓ శ్రీ వేంకటేశా..!!*🙏
🌺కమలముల వంటి సుందర నయనములు కలవాడా !!🙏
🌺మేలుకొనుము ... నిద్రనుంచి మేలుకొనుము..🙏
🌺తొందరగా మేలుకో స్వామి.
తూరుపుదిక్కున ..మెల మెల్లగా చీకటి చాయలు పోయి ....వెలుతురు వచ్చు సూచనలు కనిపించు చున్నవి . 🙏
🌺సకల దేవతలు, గంధర్వులు ,కిన్నెరలు , అందరు
ఒక వరుస క్రమములో మీ వాకిలి బయట వేంచేసి ఉన్నారు , తమ నైపుణ్యముతో , తుంబురలతో , శృతి బధ్ధముగా , మీ దివ్య గుణములను కీర్తించటానికి . 🙏
మెల్లగా మేలుకొనుము స్వామి!!
🙏🙏
🌺సూర్యూడుఉదయించబోతున్నాడు అని తెలిసి ,అందరూ జాగరూకులై ,
" హరీ ..హరీ ..హరీ.." 🙏🙏
అని చేతులు పైకెత్తి నీకు జే జే లు పలుకుతున్నారు.
🙏 *ఓ నరహరి .!!*🙏
మా లోని జ్ఞాన... అజ్ఞానములను వేరు చేసి , మమ్ము పవిత్రులను చేయు బాధ్యత నీపై ఉంది తండ్రి .
ఓ హంస స్వరూపా!! ...తొందరగా మేలుకొనవయ్యా .!!🙏🙏
🌺మీ అధరములను చూచి ఎర్రమి దొండపండు అని తలచి మీ చెంత చేరుటకు చక్కని చిలుకలు ఊసులాడుకుంటున్నాయి .🙏
🌺దిక్కులన్నీ నెమ్మదిగా ప్రకాశవంతమవుతున్నాయి స్వామి ,ఇక మేలుకొను సమయము ఆసన్నమయ్యింది .🙏
🌺వైభవముగా ఉన్న గిరులపై ఉదయపుఛాయలు ,
మెరిసి , మంచుతెరలు అన్ని నెమ్మదిగా వీగిపోతున్నాయి .
మా మనసులను కమ్మిన అజ్గ్నానపు తెరలను కూడా , నీ దర్శన భాగ్యముతో మేము తొలగించకొను వేళాయె స్వామి .🙏ఇక మేలుకో 🙏
🌺సూర్య చంద్ర కాంతులకు కూడా సరిపోలని ,మీ పట్టపురాణియైన అలమేలుమంగ చెవి కమ్ముల యొక్క మిరుమిట్లుగొలుపు కాంతిని , కనుగొని ,
కమలములు అన్నీ సంపూర్ణముగా వికసించాయి .🙏
🌺మిక్కిలి అందచందములతో , ప్రసన్నవదనములతో ,
ప్రకాశించే మీ ముఖారవిందకాంతులు లోకములో అందరూ కాంచుటకు సమయము ఆసన్నమైంది .🙏
🌺 ఓ అలమేలు మంగపతీ , 🙏🌺 ఓ వేంకట రమణా , 🙏
🙏 *మేలుకో .. మేలుకో*🙏
🙏 *మేలుకొని మమ్ము ఆదుకో.*🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న
నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..
దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏🙏
( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 52 )
✍️ -- మీ వేణుగోపాల్
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃
🌹 సంకీర్తన 🌹
శ్రీ వేంకటేశ రాజీవాక్ష మేలుకొనవే
పల్లవి:
శ్రీ వేంకటేశ రాజీవాక్ష మేలుకొనవే
వేగవేగ మేలుకొను వెలిఛాయ లమరే
చరణం
సురలు గంధర్వ కిన్నరులెల్ల గూడి
తంబురుశ్రుతులను జేర్చి సరవిగాను
అరుణోదయము దెలిసి హరిహరి యనుచు
నరహరి నిన్ను దలచెదరు హంసస్వరూప
చరణం:
అల చిలుక పలుకులకు నధరబింబము బోలె
తెలివి దిక్కుల మిగుల తేట బారే
అలరు కుచగిరుల నుదయాస్త్రాదిపై వెలిగె
మలినములు తొలగ నిదో మంచు తెరవిచ్చే
చరణం:
తళుకొత్త నిందిరా తాటంకరైరుచుల
వెలిగన్ను తామరలు వికసింపగాను
అలర్మేల్ మంగ శ్రీవేంకటాచలరమణ
చెలువు మీఱగను ముఖకళలు గనవచ్చె
🌺 Oh Lotus Eyed Lord !! 🙏
🌺 *Oh Sri Venkatesa !!*🙏
🌺Please Awake From Your Sleep !!🙏
🌺Please Awake Fastly !!
As The Signs Of Auspicious Dawn Are Approaching.🙏
🌺All The Gods And Celestial Musicians , Stood In Order And Singing Your Holy Praise ,
To Rouse You !! Please Awake !! Oh lord !!🙏
🌺Knowing That It Is The Time To SunRise ,Every One Is Chanting “ HARI ..HARI “
Oh Embodiment Of Supreme Brahman !! 🙏
And Ruler Of Mankind !!🙏
🌺Lured By Your Red Lips Like Scarlet Fruit ,
Parrots And All Mountain Birds ,
Are Singing Your Praise
With Their Chirping Sound In The Morning Sky !!🙏
🌺The Dawn Light Is Slowly Spreading
On The Holy Mountains
And The Mist Is fading away Removing All Our Illusions .🙏
🌺With The Ever New Lustre Of
The Earstuds Of Indira ,
Your Consort , Lotuses Are Slowly Blooming .🙏
🌺 Oh Lord Of Alamelumanga!! 🙏
🌺 Oh Lord Of
*Venkatachala !!*🙏
🌺Every One Is Waiting To Glance ,
The Exceedingly Splendid Gestures Of You Both !!🙏
🌺 *Please Awake !!*🙏
🌺 Please Awake !! 🙏
🌺 Oh Lord !!Please Awake *And Rule Us !!*🌺🙏🙏
✍️ --- Venugopal