పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తియ్యని సంగీతం నీవే తరతరములలో నీవే నిత్య సంకల్పసారధి నీవే జగములనేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే 1. ఉరుముతున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలో (2) నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైన విడువక ఔదార్యమును నాపై చూపినావు నీ మనసే అతిమధురం అది నా సొంతమే ||పరిమళ|| 2. చీల్చబడిన బండ నుండి నా కొదువ తీర్చి నడిపితివి నిలువరమగు ఆత్మ శక్తితో కొరతలేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకొంటివి నీ స్వాస్థ్యములో నే చేరుటకై అభిషేకించినావు నీ మహిమార్థం వాడబడే నీ పాత్ర నేను ||పరిమళ|| 3. వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్ధపడిన రాజుగ నీవు నా కోసం వస్తావని నిను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై యుగ యుగములలో నీతో నేను నిలిచిపోదును || పరిమళ||
పరిమళ తైలం నీవే
తరగని సంతోషం నీలో
జీవన మకరందం నీవే
తియ్యని సంగీతం నీవే
తరతరములలో నీవే
నిత్య సంకల్పసారధి నీవే
జగములనేలే రాజా
నా ప్రేమకు హేతువు నీవే
1. ఉరుముతున్న మెరుపుల వంటి
తరుముచున్న శోధనలో (2)
నేనున్నా నీతో అంటూ
నీవే నాతో నిలిచినావు
క్షణమైన విడువక
ఔదార్యమును నాపై చూపినావు
నీ మనసే అతిమధురం
అది నా సొంతమే
||పరిమళ||
2. చీల్చబడిన బండ నుండి నా
కొదువ తీర్చి నడిపితివి
నిలువరమగు ఆత్మ శక్తితో
కొరతలేని ఫలములతో
నను నీ రాజ్యమునకు
పాత్రుని చేయ ఏర్పరచుకొంటివి
నీ స్వాస్థ్యములో నే చేరుటకై
అభిషేకించినావు
నీ మహిమార్థం వాడబడే
నీ పాత్ర నేను
||పరిమళ||
3. వేచియున్న కనులకు నీవు
కనువిందే చేస్తావని
సిద్ధపడిన రాజుగ నీవు
నా కోసం వస్తావని
నిను చూచిన వేళ
నాలో ప్రాణం ఉద్వేగభరితమై
నీ కౌగిట ఒదిగి
ఆనందముతో నీలో మమేకమై
యుగ యుగములలో నీతో నేను నిలిచిపోదును
|| పరిమళ||
😊
🎉😊
❤
Praise the lord 🙏 good song 👏
Praise the Lord pastor Garu
❤ love you Jesus
ఓకె
T
Praise the lord 🙏 good song 👏