ఆరాధన ఆరాధన ప్రభు యేసుక్రీస్తుకే - Aaradhan aaradhana prabhu || Worship by church youth
ฝัง
- เผยแพร่เมื่อ 28 ม.ค. 2025
- ఆరాధన ఆరాధన ప్రభుయేసుక్రీస్తుకే ఆరాధన
స్తుతికీర్తన స్తుతికీర్తన రాజాధి రాజుకే స్తుతికీర్తన
జీవాధిపతియైన యెహోవకు ప్రభువుల ప్రభువైనయేసునకు
నేపాడెదన్ కొనియాడెదన్ కొనియాడి కీర్తించెదన్
॥ఆరాధన ॥
చీకటి నుండి వెలుగునకు నడిపెను ప్రభుయేసు
మరణము నుండి జీవముకు నడిపెను నను క్రీస్తు - 2
మార్గము సత్యము జీవము ఆ యేసే - 2
నా గమ్యము నా సర్వము నా ఉన్నతమైన కోట - 2
॥ఆరాధన ॥
మోడైపోయిన నా బ్రతుకు చిగురింపజేసెను ప్రభుయేసు
తన ద్రాక్షవల్లిలొ ఒక తీగెగా నాటెను నను క్రీస్తు - 2
ఆత్మ ఫలములు ఫలియించెదను నా ప్రభుయేసుతో - 2
చిరకాలము నా యేసుకై ఇలలో జీవించెదన్ - 2
॥ఆరాధన ॥