Ballari Famous Cycle PalaKova | 82 Years Famous Palakova| Traditional Sweet | Bellary | Food Book

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • బళ్లారి సైకిల్ కోవ కై సంప్రదింగలరు:- 6360193209,8867293039.
    సుమనోహర దృశ్యాలు తన్మయత్వంతో సమ్మోహనపరచగా సుమాలించే ఎన్నో స్మృతులతో మదిలో అందంగా భూషితమై ఉంది ఈ పయనం.
    నూతన ప్రదేశాలకు వెళ్లాలని.అక్కడి రుచులను నేను ఆస్వాదించి మీకు పరిచయం చేయాలన్నది నా అభికాంక్ష. తదానుగుణంగా సాగింది మా ఆహార విహారం కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి నగరానికి.
    ఈ విహారాన..
    నా అనుభూతులను మీతో పంచుకొబోతున్నాను.
    తొలుత గా మానవతా మూర్తి పునీత్ రాజ్ కుమార్ గారికి నివాళి.
    బళ్లారి చరిత గల ధాత్రి. భారతదేశంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో వకటైన విజయనగర రాజ్యం యొక్క రాజధాని హంపీ.బళ్లారికి సమీపంలో ఉంటుంది.
    ప్రపంచంలోనే రెండవ పెద్దదైన ఏకశిలా కొండ ఇక్కడ కలదు.ఆగిరిపై నగరంలో నలుదిశలకు కనిపించే కోట బళ్లారి చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది.
    బళ్లారి గుడ్డగా పిలిచే ఆ కోటను ఎగువ, దిగువ భాగాలు విభజించగా ఎగువ కోటను హనుమప్ప నాయక,దిగువ కోటను హైదర్ అలీగార్లు నిర్మితం చేసినట్లు గ్రంధాలలో నిక్షిప్తమై ఉంది.
    అప్పటి మద్రాస్ రాష్ట్రంలో దత్త మండలం అలానే సీడెడ్ అని పిలవబడిన ప్రాంతంలో రాయలసీమతో కలసి బళ్లారి ఉండేది.
    ఈ నేపథ్యంలో ఇక్కడి వారు మాతృ భాష కన్నడతో పాటు తెలుగు మాట్లాడగలరు.
    కన్నడ చలనచిత్రాలతోపాటు తెలుగు చలనచిత్రాలను సైతం విశేషంగా ఆదరిస్తారు.
    ముఖ్యంగా ఈ ప్రాంత వాసులు ఎంతో సహృదయులు.సాటివారి తో ఆత్మీయంగా ఉంటారు.
    అట్టి ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వంటకాల గూర్చి కార్యక్రమాలు చిత్రీకరణ చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను.
    బళ్లారిలో ప్రసిద్ధి చెందిన రుచుల కొరకై అంతర్జాలంలో శోధన చేసిన స్థానికులను వివరణ అడిగిన తొలుత గా వచ్చే సమాధానం గత 82 ఏళ్లగా ఈ ప్రాంత వాసులకు తియ్యదనం పంచుతూ
    మధుర చరిత్ర సొంతం చేసుకున్న సైకిల్ పాలకోవా మాధుర్యం గూర్చి.
    ఏ పండగైన, శుభకార్యామైన సైకిల్ కోవా తోనే నోరు తీపి చేసుకుని ఆనందం వ్యక్తం చేస్తారు బళ్లారి వాసులు.అంతలా అమితంగా ఇష్టపడతారు.
    మానవీయ భావాలు వ్యక్తపరిచేందుకు వారధిగా నిలిచిన ఈ మిఠాయికి ఆధ్యులు గుడె సాహెబ్ గారు.వారిది బళ్ళారి కీ సమీపాన గల ఓ గ్రామం.ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి
    పాక శాస్త్రంలో ప్రావీణ్యులయ్యారు.
    నూతన వంటకాలను తయారు చేయడంలో ప్రసిద్ధులైన ఆయన.ఆ పరంపరలో పాలకోవాకు ప్రత్యేక వర్ణం, కమ్మనైన మధుర రుచి వనగూర్చి ఇస్తరాకులో అందిస్తూ ఘన కీర్తిని లిఖిత పరుచుకున్నారు.సైకిల్ మీద విక్రయంచే వారు కనుక సైకిల్ కోవాగా ప్రాచుర్యం పొందింది.
    గుడే సాహెబ్ గారి తదుపరి వారి కుమారులు ఆ తరువాత వారి మనవళ్ళుతో పాటు ముని మనవళ్ళు సైతం వారసత్వాన్ని పునికిపుచ్చుకుని ఉమ్మడిగా పాలకోవాని నాణ్యత,వైవిధ్యమైన రుచి తో అందిస్తూ తమ కీర్తి ని కొనసాగిస్తున్నారు.
    పాలకోవా కి సమున్నతి చేకూరాలంటే స్వచ్ఛమైన పాలు వారికే తెలిసిన తయారీ సూత్రంతోపాటు ఓపిక ఎంతో అవసరం.ప్రత్యేకమైన అంతికమీద గంటల తరబడి పాలు కాస్తూ ఆసాంతం ధర్వి తో కదంభించాలి.అలా చేస్తేనే వాస్తవిక సద్గుణం ఓనగూరుతుంది.
    కోవా ఏ మాత్రం పొడిగా ఉండదు.కాస్త తడిగా ,ఇసుమంత గుల్లదనంతో పుట్టతేనె వలే ఉండు పాకాన్ని నింపుకుని ఉంటుంది.అట్టి పాలకోవా ని నోటికి అందించగా కోమలమైన కోవా రూపాంతర రేణువులు అద్భుతమైన అమృతసారాన్ని విరజల్లడంతో జిహ్వానికి మధుర రసభరిత రుచి లభిస్తుంది. ఆ ఆస్వాధన మదిని తాకుతుంది.

ความคิดเห็น • 374

  • @rakeshm2949
    @rakeshm2949 2 ปีที่แล้ว +44

    మా బళ్ళారి గురించి ఇంత ప్రాచుర్యం చేసినందుకు ధన్యవాదములు..

  • @Chandra806
    @Chandra806 2 ปีที่แล้ว +13

    మీ తెలుగు భాషా ఉచ్చారణా మరియు స్వచ్ఛమైన పదప్రయోగం అద్బుతం ....🙏

  • @m.schannel3532
    @m.schannel3532 2 ปีที่แล้ว +53

    Proud to be Ballarian💪...My mouth is watering seeing this video also my favourite sweet..🤗

  • @krishnasumanbonthalavenkat1913
    @krishnasumanbonthalavenkat1913 2 ปีที่แล้ว +68

    తెలుగు కార్యక్రమంను తెలుగు లోనే చెప్పినందుకు ధన్యవాదాలు 🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +5

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @dasariambicavasanth4767
    @dasariambicavasanth4767 2 ปีที่แล้ว +36

    Proud to be bellary district. It's my karnataka. My favorite cova.

  • @ssavlogs877
    @ssavlogs877 2 ปีที่แล้ว +9

    పాల కోవ వలే మీ స్వచ్ఛమైన తెలుగు అద్భుతం 🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @nirosharaj7352
    @nirosharaj7352 2 ปีที่แล้ว +33

    Really getting goose bumps... feeling proud to be bellaryian...

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 2 ปีที่แล้ว +3

    ఈ కోవా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే నేను బళ్లారి వెళ్లిన ప్రతిసారీ ఈ కోవా రుచి చూడకుండా ఉండలేను. బళ్లారి నుంచి వాపస్ వచ్చేటప్పుడు పార్శిల్ తీసుకొని రావడం మాత్రం మరువం. ఈ కుటుంబానికి భగవంతుని/అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి.

  • @bparimala1
    @bparimala1 2 ปีที่แล้ว +16

    I am from bellary district... Really this sweet is so yummy... Lots of memories are attached with dis sweetdish... My appa always brings cova and we are eagerly waiting for the dish... Know I am in uttarakhand when ever I go to my home town I always eat cova.. Missing my dad nd memories...

    • @santhu_shymachari
      @santhu_shymachari 2 ปีที่แล้ว

      ನೀವು ಹಾಕಿದ ಕಮೆಂಟ್ ಎಲ್ಲವೂ ಸಹ ಕನ್ನಡದಲ್ಲೇ ಬರೆಯಲು ಮುಜುಗರವೇ 👍

  • @tahsildarpkd3237
    @tahsildarpkd3237 2 ปีที่แล้ว +3

    మీరు మాట్లాడే తెలుగు బహు చక్కగా వుంది. పదాలు కూర్పు చాలా బాగుంది. చాలా కాలం తరువాత ఇలాంటి తేట తెనుగు వీనుల కు ఆనందం కలిగింది. బాగు... బాగు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @lvcreation158
    @lvcreation158 2 ปีที่แล้ว +7

    From Ballri Local ಹುಡುಗ ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ❤️

  • @shoukathali2727
    @shoukathali2727 2 ปีที่แล้ว +8

    Very FAMOUS and delicious SWEET in our BALLARI , we LOVED it . It's our PRIDE

  • @ravindrakannadachannel4491
    @ravindrakannadachannel4491 2 ปีที่แล้ว +1

    మా బళ్ళారి గురించి గొప్పగా చెప్పినందుకు ధన్యవాదాలు మీ తెలుగు అద్బుతం మీరు 1900 కాలం నాటి మనిషి లా మాట్లాడుతారు నేను చాలా చాలా ఆనందిచాను మిత్రమా

  • @naseemakbar2106
    @naseemakbar2106 2 ปีที่แล้ว +11

    Abid cycle khowa is not just khowa it's emotion ❤😍😍😍

  • @gayathrisuresh3537
    @gayathrisuresh3537 2 ปีที่แล้ว +12

    Excellent,I never thought telgu would be so sweet as pal kova,native bellarian now pr of Bangalore.

  • @mdsadiq8869
    @mdsadiq8869 2 ปีที่แล้ว +6

    Proud to be a citizen of bellary..
    Its very unique experience that staying in karnataka sharing our borders with karnool and anantapur, due to very near to AP border we speak very fluent telegu along with kanna its our first priority ,.
    We witness here bouth states festives , culture and many more things..thank for visiting bellary, plz visit again with different topics...

  • @sreevanisonu5846
    @sreevanisonu5846 2 ปีที่แล้ว +4

    Proud to be Ballarian.. cycle kova is the best sweet available here..

  • @Ram-ki9np
    @Ram-ki9np 2 ปีที่แล้ว +2

    ఆహ....ఏమి తెలుగు ....పాలకోవా కంటే మధురంగా ఉంది..❤️

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @murugeshhc8723
    @murugeshhc8723 2 ปีที่แล้ว +3

    My favourite dish in Bellary 🌹❤️ we used to get for Rs 2 in 80s.. proud to be a Bellarian 🌹❤️🙏 love you Bellary ❤️ forever 👍 you're my soul 🙏

  • @ranganathrams3356
    @ranganathrams3356 2 ปีที่แล้ว +3

    మధి లో మధుర భూషితం ఐయే పదం బాగుంటుంది అండీ మీ ఫ్లో కి
    Yakkado vundi madhura palaharam ni maku chuspestunaru manchi telugu Sanskrit padalathoti
    Wow brother

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @praveenkumarr2528
    @praveenkumarr2528 2 ปีที่แล้ว +14

    Proud to be ballarian 👍

  • @srikantholety8514
    @srikantholety8514 2 ปีที่แล้ว +9

    Welcome to Bellary nd thx for paying tribute to Puneeth 🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +2

      హృదయ పూర్వక ధన్యవాదాలు..

  • @kannayyakumar4661
    @kannayyakumar4661 2 ปีที่แล้ว

    అన్నగారు నమస్కారములు ముందుగా మీకు. మీ తెలుగు పద ఉచ్చారణ అద్భుతం. వివరణ అమోగం. ధన్యవాదములు అన్నగారు 🙏.

  • @mdmasthan742
    @mdmasthan742 2 ปีที่แล้ว +3

    Anna ilaanti Telugu vini ennoo rojulu ayyindi .... Mee matalu vintu unte Telugu bhasa inka batiki unda ani anipustundi ... 👍👍👍👍🙏🙏🙏🙏

    • @pavansiripudi5262
      @pavansiripudi5262 2 ปีที่แล้ว +1

      Manam prathi roju Telugu matladali,mana tarwatha tharaalaki Telugu ni andhinchali..mana bhasha ni manam kaapadukune rojulu vachesay 🥺😞

    • @mdmasthan742
      @mdmasthan742 2 ปีที่แล้ว +1

      @@pavansiripudi5262 👍👍🙏🙏🙏

  • @ಹರಿಬಾಬುತಲಾರಿ
    @ಹರಿಬಾಬುತಲಾರಿ 2 ปีที่แล้ว +9

    Ma Ballari, Ma Pride

  • @someshsomu4422
    @someshsomu4422 2 ปีที่แล้ว +4

    Super Anna I'm also Ballarian ma Ballari ni ila chupisthunte chala Happy ga undi ilane Ballari gurinchi inka konni videos cheyyandanna

  • @dr.kaziarshadhusain8104
    @dr.kaziarshadhusain8104 2 ปีที่แล้ว +4

    Cycle kova, oggarni mirchi, sardar jalebi, kaushik chat, Ravi bhel bandi, Bangalore bakery creambun, girmit, pola paradise idli wada, mitti roti (that old man now no more ☹️), st johns school mandalu mirchi , Pampanna idli. these are the foods😋😋😋👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻

  • @sandheshashi5354
    @sandheshashi5354 2 ปีที่แล้ว

    దేశ భాషల యందు తెలుగు భాష లేశ అన్నారు.. పెద్దలు ఇప్పుడు మీరు వ్యాఖ్యనించటం చాలా అద్భుతంగా ఉంది.. సోదర

  • @brundhabandi3441
    @brundhabandi3441 2 ปีที่แล้ว +3

    In childhood memories palacova is one of favourite sweet in bellary❤️

  • @raginiprathi5413
    @raginiprathi5413 2 ปีที่แล้ว +11

    great tasty one.
    20 years ago i use to eat.
    thanks for reminding the taste thru your travel

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @printexsprasadprintex3561
    @printexsprasadprintex3561 2 ปีที่แล้ว +1

    మంచి వివరాలు తెలియజేశారు. ధన్యవాదములు.

  • @karanamraghavendrarao3243
    @karanamraghavendrarao3243 2 ปีที่แล้ว

    " ನಮ್ಮ ಬಳ್ಳಾರಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ "
    ನಮ್ಮ ಬಳ್ಳಾರಿಯ ಸಿಹಿ ತಿನಿಸಿನ ಬಗ್ಗೆ ತುಂಬಾ ಸುಂದರವಾಗಿ ವಿವರಿಸಿದ ತಮಗೆ ಧನ್ಯವಾದಗಳು.

  • @sreenivasulumalapati6368
    @sreenivasulumalapati6368 2 ปีที่แล้ว +3

    Sir,
    Excellent that you have given respect to telugu language.
    Our telugu film industry people should learn from you.
    They are earning crores of rupees
    And speaking in another language.
    🙏🙏🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @chinnachinna8561
    @chinnachinna8561 2 ปีที่แล้ว

    వీడియో బాగుంది మరియు మీ స్పష్టమైన తెలుగు కూడా చాల వినసొంపు గ ఉంది.

  • @maheswarij3265
    @maheswarij3265 2 ปีที่แล้ว +1

    My all time favourite sweet...am proud to be an bellarian

  • @swamysbayalu4881
    @swamysbayalu4881 2 ปีที่แล้ว +8

    I'm From Bellary, Mee Telugu Super Anna Bellary lo 1St Gate Biryani Kuda Chala Femase Anna.

    • @lakshmannarayana1630
      @lakshmannarayana1630 2 ปีที่แล้ว

      Hi good morning 1kg cost ? Please send me

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      @@lakshmannarayana1630 400/-

    • @VlogsbyVaralakshmi
      @VlogsbyVaralakshmi 2 ปีที่แล้ว

      @@lakshmannarayana1630 400 for 1 kg

  • @veereshkumar68186
    @veereshkumar68186 2 ปีที่แล้ว +1

    Thanks for the telecasting Bellary City Kova Proud to be Bellarians 🙏👍

  • @spbtailorbro
    @spbtailorbro 2 ปีที่แล้ว +1

    ನಿಜವಾಗ್ಲೂ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ...ನೋಡಿ ..ಫ್ರಮ್ ಬಳ್ಳಾರಿ

  • @lvcreation158
    @lvcreation158 2 ปีที่แล้ว +3

    Aa circle Lo ಪುನೀತ್ ರಾಜಕುಮಾರ್ Banner kattindi Nene Bro 😍♥️

  • @SaiKumar-eh7hn
    @SaiKumar-eh7hn 2 ปีที่แล้ว +4

    Nuv telugu chala అద్భుతo ga matladutunnaru annaya 😊

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

  • @WaliKhan-zw4lw
    @WaliKhan-zw4lw 2 ปีที่แล้ว +1

    Thanks bro for making me remember my child hood days, we use to buy this in bellary private bus stand while travelling by.

  • @sharmilakolli4869
    @sharmilakolli4869 2 ปีที่แล้ว +1

    Maa Ballari gurinchi, chakkani telugulo opikaga vivarinchinandhuku Ballari vasulandhari tharapuna meeku dhanyavaadhalu!

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @Pradeepkumar-uc4pj
    @Pradeepkumar-uc4pj 2 ปีที่แล้ว +3

    Superb anna palakova tho mee matalu amrutham superb👍👍👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

  • @nagalakshmi1077
    @nagalakshmi1077 2 ปีที่แล้ว +3

    Khova eaten on leaf is more tastier than eaten in box..thanks for showing ballari kova andi🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

    • @rishibharadvaaj5485
      @rishibharadvaaj5485 2 ปีที่แล้ว +1

      Yes, you are right. Same I was thinking.

  • @currentaffairskannada6789
    @currentaffairskannada6789 2 ปีที่แล้ว +1

    Wow 😲😋👌i love this sweet my favorite kova 😋😋 iam from bellary 👌👌👌😋😋😋😋

  • @babasameer14
    @babasameer14 2 ปีที่แล้ว +1

    My all time favorite sweet, I used to call it Laal Palakova 😍😍😍😍

  • @shaikmamola1626
    @shaikmamola1626 2 ปีที่แล้ว +2

    Na chinapudu tinanu sir suparga untundi malli ipudu chupincharu meru thanks iam live in kuwait 🇰🇼 😀 😄 😊

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @harishkd1
    @harishkd1 2 ปีที่แล้ว +1

    Excellent telugu ...all telugu peoplw will love it ...keep doing it

  • @hariambati9183
    @hariambati9183 2 ปีที่แล้ว +1

    Anna mee telugu chala bagundi anna....Dhanyavadalu

  • @VlogsbyVaralakshmi
    @VlogsbyVaralakshmi 2 ปีที่แล้ว +4

    Just 10 days back ballari nunchi parcel techukunna deepak store dagara. I'm from ballari but staying in Bangalore. But ipatiki I m missing ballari food a lot..

  • @sowmyapatil91
    @sowmyapatil91 2 ปีที่แล้ว +1

    Mee baasha entha madhuramuga undo.. Antha theeyaga mariyu parimalabharithamga untundi maa uri palakova.. Sudheergakaala nirikshana saphalikruthamaindiuku.. Kruthagnatalu...

  • @arogyamarymatheharihara9026
    @arogyamarymatheharihara9026 2 ปีที่แล้ว

    Chala thanks sir meeku maa Bellary gurunchi inta baga chopinanduku and cycle cowa sweet nee parichayam chesinanduku ❤️❤️❤️❤️❤️❤️

  • @bsprakasarao3596
    @bsprakasarao3596 2 ปีที่แล้ว

    పాలకోవా లాగె మీ తెలుగు కూడా చాలా బావుంది తమ్ముడు

  • @brundhabandi3441
    @brundhabandi3441 2 ปีที่แล้ว +6

    Bellary bengalore bakery is also one famous one ❤️

  • @chandrashekar.dchandru1729
    @chandrashekar.dchandru1729 2 ปีที่แล้ว +2

    I never miss to eat khova daily thanks for the documentry 😍

  • @anuradhak3181
    @anuradhak3181 2 ปีที่แล้ว

    sir, your promotion of our beloved bellary is superrb. very kind of you.

  • @reikiandlawofattraction4225
    @reikiandlawofattraction4225 2 ปีที่แล้ว

    My childhood memory attached to this particular dish. We use to enjoy every bit of it.tq to u,and god

  • @venkatramanareddy712
    @venkatramanareddy712 2 ปีที่แล้ว

    ప్రెసెంటెర్ గారు మాకు అనిపిస్తోంది మీరు కన్నడ బాష మదర్ టంగు అని కాని మీరు చక్కటి తెలుగు లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకు ధన్యవాదములు,భల్లారి పాలకోవ రెసిపి చాలా బాగుంది 🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు సార్.. ఒంగోలు మాది

    • @venkatramanareddy712
      @venkatramanareddy712 2 ปีที่แล้ว

      Ohh..అలాగా anyway ధన్యవాదములు సర్ 🙏

  • @Radhakrish-i5c
    @Radhakrish-i5c ปีที่แล้ว

    My Childhood Memory and I miss my old relatives who they went along with them

  • @praveenreddymalla2340
    @praveenreddymalla2340 2 ปีที่แล้ว +1

    మీరు తెలుగు అద్భుతంగా మాట్లాడారు.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @Bhruthikababu
    @Bhruthikababu 2 ปีที่แล้ว

    Na favorite kova chinnappadinunchi thintune unna... I love this kova... Na uru bellary

  • @NavazuddinShaik
    @NavazuddinShaik 2 ปีที่แล้ว

    meeru varninche vidahanam lo ne dani Ruchi kanpadutondi, good Explanation

  • @srinivaschowdary1929
    @srinivaschowdary1929 2 ปีที่แล้ว +1

    Bro mee telugu challa baga matladuthunaru super bro ❤️ you

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @tharunkumarreddynagella2604
    @tharunkumarreddynagella2604 ปีที่แล้ว

    తెలుగు తల్లికి మాట్లాడితే వినలేదు కానీ మీ గొంతు తెలుగు తల్లి ప్రసాదించిన వరం

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @ravishankarvolunteer5710
    @ravishankarvolunteer5710 2 ปีที่แล้ว +1

    భాష అద్భుత హ

  • @yesusharmila2404
    @yesusharmila2404 2 ปีที่แล้ว +4

    Pata bustand daggara vepachettu kinda vundedi nenu tinnanu 1998 lo I'm also ballary eppudu anta maripoyindhi

  • @udvitaudvi5542
    @udvitaudvi5542 2 ปีที่แล้ว

    Super video memu bellary lone undedi chala sarlu tinnanu taste super and biryani kuda chala baguntundi bellary lo

  • @mallikarjunraobv4242
    @mallikarjunraobv4242 2 ปีที่แล้ว +2

    It's good. Narration in telugu is very nice

  • @chait1573
    @chait1573 2 ปีที่แล้ว +6

    1st like anna, been seeing you since from your first video ...become big fan of your way of speaking and pass the info to us

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

  • @abhilash410
    @abhilash410 2 ปีที่แล้ว +4

    Thank you for visiting my Town and making us know the history of our own savoury. I grew up with the taste of khova. Like the owner said I used to buy and gift them to my friends in other cities. They used it eat it like they never ate khova. I hope this savoury and culture of making lasts for generations to come.

    • @aliyar6846
      @aliyar6846 2 ปีที่แล้ว +3

      Beautiful comment and I too do the same. I take boxes from Bellary to Bangalore where I work and gift it to my friends and they just go crazy. Have tasked Belgaum khowa too. It is nothing in front of our Bellary khowa.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +2

      హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @anilkumar-pvg
      @anilkumar-pvg 2 ปีที่แล้ว

      Location please.

  • @chetanjly9044
    @chetanjly9044 2 ปีที่แล้ว

    Ee video lo Entha manchiga mana ballarini chupinchinandhuku chala santosham brother ☺️ Thank yu 😍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @kiran019pal
    @kiran019pal 2 ปีที่แล้ว +7

    Thanks for sharing my native's favourite sweet, you should also try ballary's famous Vaggarani mirchi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +2

      హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @kiran019pal
      @kiran019pal 2 ปีที่แล้ว

      @@LOKFOODBOOK Welcome 🙏

    • @reikiandlawofattraction4225
      @reikiandlawofattraction4225 2 ปีที่แล้ว

      I too agree,it's very famous dish in bellary.you will never find this taste

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 2 ปีที่แล้ว

    Madi ballari ..I like t way u explained t history n even I ate this cycle cova tqu so very much ..sandhya from bellary..

  • @allabakashallu5596
    @allabakashallu5596 2 ปีที่แล้ว +3

    Namma Ballari 😍❤️

  • @saikrishna7364
    @saikrishna7364 2 ปีที่แล้ว

    okka padam kooda english lekunda telugu matladutunaaru chala happy

  • @kavithakavi4879
    @kavithakavi4879 2 ปีที่แล้ว +2

    I am from ballari my favourite sweet cova

  • @akshayakhi5451
    @akshayakhi5451 2 ปีที่แล้ว +11

    Annaya chinna suggestion, me Telugu work chesevallaki artham kakapovachu, so meru question chesetapdu normal language lo adagandi so that conversation inka bavuntadi… as usual ga chala bavundi ee video kuda… all the very best 🙌🙏🏼❤️

    • @NavaYuvaRaithulam
      @NavaYuvaRaithulam 2 ปีที่แล้ว +4

      Normal anedhi separate ga em undadhu Mana loknath normal ga matladedhi ilagane Thanu video lo matlade vidhangane roju andharitho matladedhi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      @@NavaYuvaRaithulam అన్న...👍🥰

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +6

      Akshay akhi@ యాదృచ్చిక మాటల పరంపర తమ్ముడు.చిన్ననాటి నుండే స్థానిక ప్రసార మాధ్యమం లో పని చేసిన నేపథ్యం రీత్యా. ధన్యవాదాలు.

    • @trend5780
      @trend5780 2 ปีที่แล้ว

      Content is more important slang and language is not

  • @siva.s9537
    @siva.s9537 2 ปีที่แล้ว +4

    Super మీ వాయిస్ సూపర్

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @naveenpatil452
    @naveenpatil452 2 ปีที่แล้ว +1

    Bellary boys present here.....thnk u brother

  • @santhoshkumars4807
    @santhoshkumars4807 2 ปีที่แล้ว +3

    Super Video, Still more Special and Unique foods are in Ballari

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @OxTongue0
    @OxTongue0 2 ปีที่แล้ว

    Nice To continue family Business
    Thanks Mohammed Rafiq garu

  • @imamvali2672
    @imamvali2672 2 ปีที่แล้ว +1

    My Bellary my Karnataka is great

  • @manikantar8412
    @manikantar8412 2 ปีที่แล้ว

    Thank you 😍😍 ma ballari gurunchi mee bhashalo chappindaku🙏🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @goutamr6660
    @goutamr6660 2 ปีที่แล้ว

    Excellent taste ga undhi

  • @Mrd-sr1ge
    @Mrd-sr1ge 2 ปีที่แล้ว

    very gud si yappudo yawwaru mana karnataka Wallu dini gurinchi cheppa ledu ballari Kota gurinchi viwaralu

  • @prasadudevarapu3989
    @prasadudevarapu3989 2 ปีที่แล้ว +1

    వంటలు మాత్రమే కాకుండా, మంచి విహార స్థలాలు గురించి వివరించి పెట్టండి. మీ నోటివెంటా వినడం వలన ఆ స్థలంకు మరింత ప్రచురియం లభిస్తుంది.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు👍

  • @nppganekal8689
    @nppganekal8689 2 ปีที่แล้ว +1

    Okka word English lekunda matlade mee telugu great anna...

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @srinivasaraopallekona4022
    @srinivasaraopallekona4022 2 ปีที่แล้ว +1

    Meeru inka chala videos cheyali sir, me explanation super...

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @handsome_devil
    @handsome_devil 2 ปีที่แล้ว

    Nenu ballari lo ne chaduvutunna bhayya i love it😍

  • @maheswarishivanna9263
    @maheswarishivanna9263 2 ปีที่แล้ว +10

    Proud to be Ballarian

  • @raidutt558
    @raidutt558 2 ปีที่แล้ว +3

    In Kurnool district also, one village by name TADAKALA PALLI, (near Chinna Tekuru) is famous for pala kovva.
    The entire village is preparing the pala kovva.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว +2

      తడకనపల్లి పాలకోవ గూర్చి గతంలో కార్యక్రమం చిత్రీకరణ చేశాము

    • @reikiandlawofattraction4225
      @reikiandlawofattraction4225 2 ปีที่แล้ว +1

      Man really taste this,you will love it.still I miss this always.my childhood greatest memory begins with this

  • @padmavathipobbathi5463
    @padmavathipobbathi5463 2 ปีที่แล้ว +2

    బళ్లారిలో తెలుగూ ఎక్కువే, రుచులూ ఎక్కువే. చవి చూడండి

  • @raginiprathi5413
    @raginiprathi5413 2 ปีที่แล้ว +6

    please use the language exactly what you are currenly using.
    This helps kids to know the telugu words.

  • @dudekulaabdulrahman9505
    @dudekulaabdulrahman9505 2 ปีที่แล้ว +2

    Welcome to Bellary Brother

  • @undabandaobulesh5757
    @undabandaobulesh5757 2 ปีที่แล้ว +1

    Nenu tinna maadi bellary pakkana, andra border lo HAVALIGI my lovely village

    • @sivanarayana106
      @sivanarayana106 2 ปีที่แล้ว

      Maku ಹಾವಳಿಗೆ lo banduvulu vunnaru bro

  • @pavansiripudi5262
    @pavansiripudi5262 2 ปีที่แล้ว

    Modhata mana Telugu bhasha lo matladuthu me madhyanaanni konsaagisthunanduku dhanyavaadhaalu andi..ilage Telugu bhasha lo matladi mana Telugu vaariki mana bhasha praamukyatha theliyacheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @kaneezfathima1993
    @kaneezfathima1993 2 ปีที่แล้ว

    Do they add any sugar for sweetness or just by reducing milk we will get tat sweetness

  • @Telugupole
    @Telugupole 2 ปีที่แล้ว

    Reporter is having good grip on telugu good luck

  • @chuttanagarinaresh3088
    @chuttanagarinaresh3088 2 ปีที่แล้ว +1

    మా ఇంటి పక్కనే బ్రో ఇది but మిమ్మల్ని చూడలేదు miss you... 😘😁

    • @manjugolla5782
      @manjugolla5782 2 ปีที่แล้ว

      Address yekkada bro. మాది రాయదుర్గం.

  • @vijayalaxmidaulatabad5553
    @vijayalaxmidaulatabad5553 2 ปีที่แล้ว

    I am proud to be bellarian. Miss u appu