భావం,భావుకత,భావజాలం-నా ఆలోచనలు మీతో| సీడ్ బాల్స్ విసిరాము|BLikeBindu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ย. 2024

ความคิดเห็น • 341

  • @AVకృష్ణారెడ్డి
    @AVకృష్ణారెడ్డి หลายเดือนก่อน +18

    బిందు గారు నమస్కారం అండీ
    ఈరోజు టాపిక్ కూడా చాలా బాగా వివరించారు మన చుట్టూ చాలామందిని చూస్తూ ఉంటాము ఎన్నో భావాలు వారి మనసులో ఉన్నా కూడా వాటిని సరైన పద్ధతిలో భావవ్యక్తీకరణ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ భగవంతుడు మీకు మీ మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి మీ అంతరంగాన్ని ఆవిష్కరించేందుకు మంచి మనసుతో పాటు మంచి గొంతుకను కూడా జోడించారు
    ఇక ఈరోజు టాపిక్ లోకి వస్తే నిజంగా మా నానమ్మ నాన్న అమ్మ అందరూ మాకు చిన్నప్పుడు చెప్పిన విషయాల్ని మరొక్కసారి గుర్తుకు వచ్చాయి ఎలాగంటే ఎదిగిన పాయల్లో మధ్యలో ఎప్పుడైనా తెలియక మేము ఓ మొక్కను పీకేస్తే వెంటనే మా అమ్మ ఓ మాట చెప్పేది నాన్న మీ అన్నదమ్ముల్లో మీ స్నేహితులు ఒకళ్ళ దూరం అయితే మీకు ఎలా కనిపిస్తుంది చెప్పండి అని బాధగా ఉంటుందమ్మా అని చెప్తే మొక్కలు కూడా అంతే నాన్న మీరు కావాలంటే చూడండి కింద భూమిలో వేర్లు ఎలా ఉంటాయో అని కొంచెం మట్టిని పక్కకు తీసి మాకు చూపించేది అప్పుడు చూస్తే ఆ వేర్లన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి మాట్లాడుకుంటూ ఉన్నట్లు అనిపించేది అక్కడనుండి ఎప్పుడూ కూడా మేము మళ్ళీ ఆ తప్పు చేయలేదు
    అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు ఆలోచిస్తే పెద్దగా చదువు లేకపోయినా అమ్మకు ఎంత జ్ఞానం ఉందో అని ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా మా అమ్మగారు చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి
    ఇంకో విషయం ఏమంటే వయ్యారిభామ మొక్క గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాము మనకు మన పొలాల్లో తప్పించి దట్టమైన అడవుల్లో ఎక్కడా కూడా ఒక్క వయ్యారి మొక్క కూడా కనిపించదు చూడండి ఎందుకంటే నాకు అర్థం అయినంత మేరకు అడవిలోని మొక్కలు మొత్తం తమతో తాము పరస్పరం మాట్లాడుకుంటూ వాటికి వాటి జీవనానికి చెడు చేసేటటువంటి ఎలాంటి వయ్యారిభామ లాంటి మొక్కను కూడా బ్రతకనీయవు ఎందుకలా చేస్తున్నాయి అంటారు చెప్పండి అవి మొత్తం ఓ సైన్యం ఎలా ఉంటే తప్ప అలా సాధ్యపడదు కదా ??
    మరి సైనికులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఇంత పెద్ద యుద్ధాన్ని ఎలా చేయగలరు చెప్పండి
    అందుకే మీరు చెప్పింది అక్షరాలా సత్యం మొక్కలకు కూడా మనసు ఉంటుంది స్పర్శ జ్ఞానం ఉంటుంది మనలాగే అన్ని భావాలను కలిగి ఉంటాయి కానీ అవి వ్యక్తీకరించే భావం మనకు తెలియదు అంతే!
    ఈరోజు మీరు అడవిలో సీడ్ బాల్స్ వేశారు చాలా బాగా అనిపించిందండి నీతో ఎంత సహకారం అందిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి మనసు ఉంది అని అర్థమవుతుంది అందుకే అందరికీ ధన్యవాదాలు
    ఇక కొసమెరుపు ఏంటంటే మా పాప మీ వీడియో చూసింది మాకు మేముండే టౌన్ దగ్గర నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో 9 ఎకరాల భూమి ఉంది అందులో మీకు లాగా తయారు చేయాలంట మీకు లాగా ప్రశాంతమైన జీవితం గడపాలంట ? అది కూడా తను ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత
    స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు ఈ సమాజంలో మరెందరికో స్ఫూర్తిని ఇస్తారు అనేదానికి ఈరోజు మా ఇంట్లో జరిగినటువంటి ఈ సంభాషణ ఉదాహరణ
    ధన్యవాదములు అండి 🙏🏻

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน +5

      నమస్కారం అండీ ..శుభోదయం 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ .ముందుగా మీ ఇంటిలోని కుటుంబ పెద్దలందరికీ నమస్కారములు అండీ . మీ కుటుంబ పెద్దలు మిమ్మల్ని ఎంత బాగా పెంచారు అన్నదానికి మీరు ప్రతీ సారి ఇక్కడ మాతో పంచుకునే మీ అనుభవాల భావాలే నిదర్శనం. రోజూ మన కంటికి కనిపించే ఎన్నో విషయాలని మనం చాలా సాధారణ దృష్టితో చూస్తాము . కానీ సరిగ్గా గమనిస్తే రోజూ మన కంటికి సాధారణంగా కనిపించే వాటిలోనే ఎన్నోవిషయాలు నిగూఢంగా ఉంటాయి . జస్ట్ వాటిని చూడగలిగే మూడవ కన్ను(జ్ఞాన నేత్రం) మనకు తెరచుకోవాలంతే . మీ వాళ్ళు చెప్పింది చాలా చాలా కరెక్ట్ అండీ . మొక్కలు వేర్ల ద్వారా సంభాషించుకుంటాయి .అడవిలో ఏదైనా ఒక చెట్టుని కొట్టేసినా లేదా ఒక చెట్టు కొంచెం క్షీణ దశలో ఉన్నా మిగిలిన చెట్లు వాటి వేర్ల ద్వారా వాటికి పోషకాలు అందించి మళ్ళీ వాటిని బతికిస్తాయి.అందుకే అడవులు ఎప్పటికీ దట్టంగానే ఉంటాయి(మనుషుల చొరబాటు లేకపోతే) . ఎప్పుడైనా గమనించి ఉంటే మోడులా మారిన పెద్ద వృక్షాలు ఒక పక్కన డొల్లగా మారి కుళ్లిపోయినట్లుగా ఉన్నా ఇంకో పక్క నుండి చిగుర్లు కనిపిస్తాయి .దానికి కారణం పక్క చెట్ల సహకారం ఉండడం . వేర్ల మధ్య సంభాషణకు mycorriza(మైకోరైజా) అనే శిలీంద్రం వాహకంగా ఉంటుంది. బ్రిటిష్ వారి కాలంలో రైలు పట్టాల కొరకు ప్రత్యేకించి సాల్ చెట్లను పెంచే ఉద్దేశ్యంతో మధ్య ప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ మధ్య సరిహద్దు ప్రాంతంలో వాటిని పెంచాలి అని కొన్ని మొక్కల్ని తెచ్చి తోటలా నిర్ణీత దూరంలో నాటారు అంట అండీ . కానీ అవి చచ్చిపోతూనే ఉన్నాయి అంట . ఎన్ని సార్లు పెట్టినా అలాగే జరిగింది అంట . దానికి కారణం ఆ చెట్లు symbiotic రిలేషన్ షిప్ ను కలిగి ఉండడమే . అడవిలో సహజంగా అయితే ఎన్నైనా ఉంటాయి కానీ ప్రత్యేకించి విడగొట్టి పెట్టదలిస్తే మాత్రం ఉండలేదట అండీ . ఇవన్నీ ఎందరో foresters ఎంతో గమనించి పుస్తకాల్లా రాశారు. కానీ వారికన్నా మీ పెద్దవారేమి తక్కువ అండీ! . ఎంత చక్కని పరిశీలన? ఎంతటి సునిశిత దృష్టి కదండీ! చాలా సంతోషం అండీ . మీ చిన్ననాటి చక్కని జ్ఞాపకాలను మాతో పంచుకుంటున్నారు , అలాగే మీ పాప కు కూడా మీ వంటి అందమైన బాల్యమే ఉండి ఉంటుంది అని భావిస్తున్నాను . అందుకే తాను కూడా అలాంటి ప్రశాంతమైన జీవితం జీవించాలి అనుకుంటుంది అనుకుంటాను అండీ . తను అనుకున్న ప్రతీది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను . బిందూ ఆంటీ అడిగింది అని పాపకు🤗😍 చెప్పగలరు .

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน +3

      అవునండీ మొక్కలకు కూడా మనలానే స్పర్శ జ్ఞానం ఉంటుంది . సర్ జగదీష్ చందర్ బోస్ గారు మొక్కల మీద ఎంతో అపార పరిశోధన చేశారు(ఆయన ఆ పరిశోధన గురించి చెప్పినప్పుడు బ్రిటిష్ వారు ఎగతాళి చేశారు. ఆయనకు ల్యాబ్ మరియు apparatus లాంటివి ఇవ్వకుండా నానా హింసలు పెట్టారు . కనీసం ఆయనకు జీతం కూడా ఇవ్వలేదు . తర్వాత ఆయన సొంత ఖర్చులతో ఇంట్లోనే పరిశోధన శాల ఏర్పాటు చేసుకున్నారు. ఒకసారి అందరి ముందు పరిశోధన ఫలితాన్ని నిరూపించాక నోర్లు మూతబడ్డాయి) . అందులో భాగంగా మొక్కలకు అనేక ప్రేరణలను(stimulii) కలిగించి ఎలక్ట్రికల్ impulse రూపంలో వాటిలోని కదలికలను crescograph అనే పరికరం ద్వారా చూపించి నిరూపించారు . అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటి wireless టెక్నాలజీ ని కనిపెట్టింది కూడా ఆయనే అండీ . ఈ విషయం ఇప్పుడు ఈ టెక్నాలజీ ని విరివిగా వాడుతున్న ఎంతమందికి తెలుసో లేదో అండీ .

    • @AVకృష్ణారెడ్డి
      @AVకృష్ణారెడ్డి หลายเดือนก่อน +1

      @@BLikeBINDU బిందు గారు మీ ఎడ్యుకేషన్ ఏంటో తెలియదు కానీ చాలా జ్ఞానం సంపాదించారు నా ఊహ కరెక్ట్ నో కాదో కానీ మీరు చదువు వలన కంటే మీ పరిశీలనాత్మక ద్రుష్టి వలన ఇంత జ్ఞానం సంపాదించారు అనుకుంటున్నాను (నా ఊహ తప్పు ఐతే మన్నించగలరు )
      ఏది ఏమైనా ఇప్పుడు మీ షోషల్ మీడియా కుటుంబం లో సభ్యులమై ఇలాంటి సున్నితమైన విషయాలు గురించి మీద్వారా తెలుసుకుంటూ జ్ఞానసంపద పొందగలిగిన మేము కూడా అదృష్టవతులమే 🙏🏻
      తప్పకుండా మా పాపకు మీ ఆశీస్సులు అందజేస్తానండి
      తను మీ ద్వారా ఎంత ప్రేరణకు పొందినది అనేది చెప్పాలంటే మొన్న వినాయక చవితి మరునాడు మేము మా ఇంటి ముందర ఉన్న పందిరి దగ్గర అన్నదానం చేసేందుకు కొన్ని కూరగాయలు తీసుకొచ్చాము అందులో సొరకాయలు కొన్ని ముదిరిపోయినయ్ అని వంటవాళ్లు పక్కన పెట్టేస్తూ ఉంటే మా పాప అవన్నీ తీసుకొని ఇంట్లో దాచుకుంటూ ఉంది సుమారుగా ఓ 20 కాయలు అలా తీసుకోకూడదు మా తప్పు నాన్న అని చెప్పి చెప్తున్నా తీసుకొస్తూనే ఉంది ఓ పది నిమిషాల తర్వాత తీరిగ్గా కూర్చొని వాటిని చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించడం మొదలుపెట్టింది అలా చేయకూడదు అమ్మ అవి పనికిరావు అని వంట చేసే వాళ్ళు పక్కన పెట్టారు పడేసేమని చెప్పి ఎంత చెప్పినా వినలేదు మొత్తం సుమారుగా ఓ గోతం నిండుగా కత్తిరించి పెట్టింది పావుగంట తర్వాత మా వీధిలో జంక్షన్ దగ్గర కొన్ని ఆవులు చెట్టు కింద పడుకొని ఉంటే ఈ గోతం మొత్తం తీసుకెళ్లి వాటికి తినిపిస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషం వేసింది అమ్మ బిందు గారు మేము మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరం ఆ సన్నివేశాన్ని చూస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురై ఎంత మంచి మనసు అండి మీ పాపకు అని తనని పొగుడుతూ ఉంటే నేను మాత్రం తనకు ప్రేరణ ఇచ్చినటువంటి మిమ్మల్ని గుర్తు చేసుకున్నాను ధన్యవాదాలు 🙏🏻

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน +2

      మీ పాప చాలా చాలా మంచి పని చేసింది అండీ . .చాలా సంతోషం.🤗🤗😍..నా చదువు MSc Information టెక్నాలజీ అండీ..గ్రూప్స్ పోటీ పరీక్షలకు ఒక రెండేళ్లు చదువుకున్నాను.ఉద్యోగం అయితే రాలేదు కానీ నేను ఆలోచించే తీరులో మాత్రం గణనీయమైన మార్పు వచ్చింది అండీ . ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడడం మొదలు పెట్టాను . కానీ మీరన్నట్లు నా చదువు సర్టిఫికెట్ చదువు కన్నా పరిశీలన మీదే ఎక్కువ అండీ . నిత్య విద్యార్ధినిగా ఉండడం నాకు ఆనందాన్ని ఇస్తుంది . నాకు foodvedam.com మరియు maatamanti.com అని రెండు వెబ్సైటు లు ఉన్నాయి అండీ . వాటిలో నేను నా పరిచయంలో మొదట చెప్పుకున్న మాట ఇదే జీవించి ఉన్నంతవరకు విద్యార్ధినిగా ఉండడం.

    • @arunadatla6059
      @arunadatla6059 หลายเดือนก่อน

      ​@@BLikeBINDUYou are a genius, me salahalu , theesukuni mundu kelle bhagyam e vyavastaku ledanipinchinchindi, groups lo select aithe enthomandiki upayoga padevaru , pedda encyclopaedia meeru

  • @bathinamangamhasivudu5096
    @bathinamangamhasivudu5096 หลายเดือนก่อน +24

    భర్త భార్య ఓకే అదిప్రాయంలో ఉండటం చాలా గ్రేట్ మేడం

  • @madhavipannala8729
    @madhavipannala8729 หลายเดือนก่อน +3

    నమస్తే బిందు గారు.విజ్ఞానంతో పాటు జ్ఞానం కూడా కలగలిసిన పరిపూర్ణ వ్యక్తి మీరు🙏🙏

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 หลายเดือนก่อน +15

    హలో బిందు గారు మందారం అందం లక్కీ అల్లరి నేను మనసు లో ఫ్యాషన్ fruit గురించి అడుగుదాం అనుకునే లోపే మీరు చక్కగా వివరించారు నేను కుండీ లో కొన్ని మొక్కలు పెంచుతున్నాను వర్షం మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తే మొన్న వచ్చిన వరదలు భయాన్ని బాధ ని చూపించి వెళ్లింది సృష్టి లో ఏమీ ఆశించని కుళ్లు కుట్రలు లేనివి మొక్కలు మాత్రమే మీ మనసు లో వున్న మంచి అభిప్రాయం చక్కగా చెప్పారు చాలా తక్కువ మంది వుంటారు మీల ఆలోచించే వారు బిందు గారు 😊

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 หลายเดือนก่อน +12

    బిందు గారి అంతరంగ ఆవిష్కరణ కు హృదయపూర్వక అభినందనలు, దన్యవాదాలు.

  • @prudhvipinnaka2496
    @prudhvipinnaka2496 หลายเดือนก่อน +9

    చక్కగా అర్థం అయ్యే ఉదాహరణలతో మంచి తత్వం చెప్పారు అక్క🥳👍🏻

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน

      హాయ్ మా పృథ్వి నమస్తే 🤗🙏ఎలా ఉన్నావు మా? చాలా రోజుల తర్వాత నీ కామెంట్ చూశాను చాలా సంతోషం మా .😍

  • @Udaymar06
    @Udaymar06 หลายเดือนก่อน +4

    గుడ్ ఈవింగ్ బిందు గారు. మంచి టైమ్ లో సీడ్ బాల్స్ వేసారు అవి వచ్చిన రాకపోయినా వెయ్యాలన్న ఆలోచనకు నా హృదయపూర్వక అభినంందనలు. మీరు మాట్లాడే తెలుగు బాగుంటుంది కొన్ని పదాలు చాల రోజూల తరవాత వింటుంటే ఎలా మర్చిపోయానా అని ఆశ్చర్యం కూడ కలిగిండి. ఫామ్ దగ్గర వాతావరనము చ్చాల బాగుంది 👍👍👍🤗🤗

  • @vasavikalyani9379
    @vasavikalyani9379 หลายเดือนก่อน +2

    నమస్తే బిందు గారు నేను మీ ప్రతి వీడియో చూస్తాను.కచ్చితంగా మాకు ఉపయోగపడే ఏదో ఒక విషయం ఉంటుంది.అలాగే ఈరోజు చెప్పిన విషయాలకు మాత్రం నిజంగా ధన్యవాదాలు అండి.ఇప్పటివరకు నాకు ఏ విషయంలో నిర్దిష్ట అభిప్రాయాలు ఉండవు, త్వరగా ఒక కంక్లూజన్ కి రాను ఎందుకు ఇలా ఉన్నాను నేను అని అనుకునేదాన్ని కానీ అది లోపం కాదు విషయాన్ని ఇంకా తెలుసుకోవడానికి అని ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది.😊 మరొకసారి మీకు కృతజ్ఞతలు. తెలుగే మాట్లాడాలి స్థానికుల దగ్గర కొనాలి ఇటువంటి కొన్ని మీ భావజాలాలు మాత్రం నాకు నచ్చుతాయి.

  • @rajannajangiti9963
    @rajannajangiti9963 16 วันที่ผ่านมา

    మీ బంధుజాలానికి నమస్కారం

  • @hariyaadav4351
    @hariyaadav4351 หลายเดือนก่อน +2

    మేడమ్ మీరు చెప్పే విధానం ఒక్క. మంచి. టీచర్. పాఠం చెప్పినట్లుగా. ఉంది. చాలా బాగా చెప్పారు

  • @suneethakrishna3988
    @suneethakrishna3988 หลายเดือนก่อน +2

    మా బిందు మీ లాంటి వారు కొందరు వుండాలి అప్పుడే ఈ ప్రకృతి ఇలానే అందము గా ఉంటుంది. మీకు ఇంకొక అదృష్టం ఏంటి అంటే మీలా ఆలోచించే భర్త తోడు వుండటం. అలానే మీ పాప సహకారం . ఇవి అన్ని తోడు అవటం మీ అదృష్టం గా చెప్పాలి ఇలానే ఈ సహకారం ఎల్ల వేళల వుండాలి మీరు ఇంకా సమాజానికి ఎంతో ఉపయోగ పడే పనులు చేయాలి అని ఆ కృష్ణ పరమాత్మ ని వేడుకుంటున్నా మా.

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน +2

      నమస్తే అండీ . .🤗🙏అవునండీ మీరు చెప్పింది నిజం . మనలాగే ఆలోచించే తోడు ఉంటే అది అన్నింటికన్నా గొప్ప అదృష్టం . నేను ఎంత కష్టంలో ఉన్నా మానసిక ఒత్తిడిలో ఉన్నా వారిద్దరూ నాకెప్పుడూ అర్ధం చేసుకుంటారే కానీ నాకు ఇబ్బంది కలిగించరు. ఏమి చేసినా ముగ్గురం పనిని పంచుకుని చేస్తాము . మీ దీవెనలకి కృతజ్ఞతలు అండీ . .ధన్యవాదములు 🤗😍🙏

  • @jyothidatla9421
    @jyothidatla9421 หลายเดือนก่อน +10

    అవును బిందు గారూ..మిరియాలు వాడేవారం,మిరప కాయ రుచి ఘాటు అలాగే వుందని. మిరియంపు కాయ అని పిలిచేవారట ,కాలక్రమేణా మిరపకాయ అయింది

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน

      Chala manchi vishayam teliyachesaru. Dhanyavadamulu andi🤗🙏

  • @Jagriti_050
    @Jagriti_050 หลายเดือนก่อน +2

    ❤ చాలా మంచి మాట చెప్పారు బిందు ఎలా బతకాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి నాకు చాలా సంతోషంగా ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే

  • @satyavanipulijala1889
    @satyavanipulijala1889 หลายเดือนก่อน +1

    You are very ambitious Bindu garu and aa ambitions ni fulfill cheskotaniki chala kashtapadatharu ....adi kuda loka kalyanam kosam alochistharu....so great.... God bless you

  • @sulochanagudapati5256
    @sulochanagudapati5256 หลายเดือนก่อน +5

    Family lo andaru ఓకే లా undatamu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Susmitha.Susmitha
    @Susmitha.Susmitha หลายเดือนก่อน +3

    Very well said బిందు గారూ. otherside of the coin - US లో ఉండి పారిజాతాలు, మామిడిచెట్లు పెంచుకోడానికి ప్రయత్నిస్తే అది గొప్ప విషయమన్నట్టు భావిస్తారు కొందరు gardeners. మాకు ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో వింటర్ వచ్చాక ఆ మొక్కల్ని పెంచినా ఇంట్లో పెట్టుకుని వాటిని హింసించడమే కదా అనిపిస్తుంది ఒక్కోసారి. నేటివ్ మొక్కల్ని పెంచడం మొదటి ప్రయారిటీ. అది మర్చిపోకూడదు. అలా అని మిగిలినవి పెంచడం మానెయ్యక్కర్లేదు. బేలన్స్ ఉండాలి దేనికైనా.

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน +2

      కరెక్ట్ గా చెప్పారు అండీ మీరన్నట్లు అనుకూలత లేని చోట పెట్టి హింసించడమే అన్నట్లుగా ఉంటుంది .🤗🙏 మనకు తెలిసిపోతుంది అండీ . వాటికి ఆ వాతావరణం సరిపడుతుందో లేదో అని . ఉదాహరణకు మన దేశం లో కివి హిమాలయాలకు బాగా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో బాగా పండుతుంది అండీ . అరుణాచల్ ప్రదేశ్ లో వాటిని విరివిగా పండిస్తారు . మా నాన్న అక్కడ ఉన్నపుడు 1రూపాయి 2 రూపాయలకి అమ్మడం చూశారు అంట అండీ . అదే కివి మొక్కని నేను ఇక్కడ తీసుకొచ్చి పెడితే వెంటనే చచ్చిపోతుంది . అందుకే అలాంటి వాటి జోలికి పోకపోవడం ఉత్తమం . అదే ద్రాక్ష చూడండి అవి ఇక్కడివి కావు కానీ ఆల్మోస్ట్ అన్ని దగ్గర్లా విరివిగా పండుతాయి .ఒకప్పుడు హైదరాబాద్ చుట్టూరా ద్రాక్ష తోటలు ఉండేవి . అసలు జామ మన దేశం ది కాకపోయినా ఇప్పుడే మన దేశమే జామకాయల్ని ప్రపంచంలో అధికంగా పండిస్తోంది . అంటే దానికి ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండి సరిపడింది . అలాగే కోకో(cocoa) కూడా స్థానికం కాకపోయినా అనేక రైతులు పండిస్తున్నారు.నాకు తెలిసి ఆంధ్ర ప్రదేశ్ కోకో ఉత్పత్తి లో మొదటి స్థానంలో ఉంది అనుకుంటాను అండీ . ఇలా అనుకూలంగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన చోటులో పండే ప్రతీది మనకు స్థానికమే అనుకోవచ్చు అండీ.అక్కడ నిలబడింది బ్రతికింది బాగుంది అంటే అది ప్రకృతి సమ్మతమే.

  • @Ajaynerella-u9q
    @Ajaynerella-u9q หลายเดือนก่อน +5

    ఫ్యాషన్ ఫ్రూట్ పందిరి తీగ చాలా బాగుంది. అలాగే ద్రాక్ష తీగకూడా పెంచి మాకు మాకు ఫ్రూట్స్ తో చూపిస్తారు అని ఆశిస్తున్నాను.

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน

      ద్రాక్ష కూడా నెల క్రితం ఒక 20 దాక పెట్టాము అండీ . .బాగానే చిగుర్లు వచ్చాయి .కొంచెం పెరగగానే చూపిస్తాను అండీ 🤗🙏

  • @adilakshmi5863
    @adilakshmi5863 หลายเดือนก่อน +1

    Mimmalni chala rojuluga chusthunna ee roju Mee matalu Baga nachayi chala Baga chepparu plate ninda chiken lu matan lu vesukoni thine video lu chesthunnaru chala mandhi vati valla em upayogam dhani valla meeru enno vishayalu chetharu manchiga theliyani nalanti vallu Mee valla enno thelusukuntaru naku meeru Baga nacharu mam

  • @sisirasrikothapalli2847
    @sisirasrikothapalli2847 หลายเดือนก่อน +1

    నమస్తే బిందుగారు..... మీ వీడియోస్ నాకెంత ఇష్టమంటే..... 80% of videos నేను ఆఫ్ లైన్లో డౌన్లోడ్ చేసుకుని ఆఫీస్ నుండి వచ్చాక వాటిని చూస్తూ రిలాక్స్ అవుతాను..... కళ్ళకి అంత ఆహ్లాదంగా ఉంటాయి, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా peaceful గా ఉంటుంది.....
    God bless your family andi 🙏🏻❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน +2

      నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ 😍❤

  • @krapajayasree7781
    @krapajayasree7781 หลายเดือนก่อน +1

    As usual nice presentation andi..
    Great wisdom u shared..
    Thank you 😊🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน +1

      Thank you so much maa Jaya garu.. elaa unnaru bagunnara maa🤗😍🙏

    • @krapajayasree7781
      @krapajayasree7781 หลายเดือนก่อน

      @@BLikeBINDU
      Hello andi..😊
      Nenu bagunanu..
      Thank you 😊 🙏
      Meru andaru yela unaru.
      Oka Yogi atma kada book lo kuda untundi meru mokala gurinchi chepina matalu..
      Stay Blessed

  • @praveenraju5042
    @praveenraju5042 หลายเดือนก่อน +4

    It’s mind soul relief content where every one should live with the nature

  • @spanduspandana5101
    @spanduspandana5101 หลายเดือนก่อน

    Lucky, kasi friendship, meeru cheppina visayalu, anirvichamaina anubhuthi kaligindi bindugaru

  • @narraniharikaredddy1807
    @narraniharikaredddy1807 หลายเดือนก่อน

    Nature ni kapadatam prathi okkari karthavyam soo happy bindhu garu miru seeds challatam manasuku ki happy ga undhi🌱🌿🌾🌳

  • @AS_11114
    @AS_11114 หลายเดือนก่อน +1

    Living your life to the fullest andi ❤ few glimpses of today’s video were tooo good👌

  • @padmakothapalli2082
    @padmakothapalli2082 หลายเดือนก่อน

    Hi Bindu ! Eerojullo me la alochinche vallu Chala arudu chakkaga explain chestharu deni gurinchi ayina. Chala practical ga vuntaru Mimmalni choostunna, me matalu vintunna manasu ki Chala anandam ga vuntundi. God bless you

  • @AsmaBegum-xn8de
    @AsmaBegum-xn8de หลายเดือนก่อน

    Namasthe Bindu gaaru 🙏... Nice explanation about plants 💚.... you've done a great job 👍🏻 keep inspiring 👏👍🏻🙏

  • @bulakulalakshmi7149
    @bulakulalakshmi7149 หลายเดือนก่อน

    Bindu garu e video lo topic chala bagundi work disturb valla late ga chusanu me video chusthunnanthasepu prasanthamga anipisthundi thank you Bindu garu ❤

  • @vijayaklakshmi
    @vijayaklakshmi หลายเดือนก่อน +1

    Memu uganda lo unnapudu passion fruits ekkuvagaa tinevallamu. 2016 lo tirigivachu. A memories mee video tho re memorized chesukunnamu bindugaaru. Nenu ippudu chile lo unnanu. Melage cheyalani untundi me matalu chala baguntayi.

  • @rajannajangiti9963
    @rajannajangiti9963 16 วันที่ผ่านมา

    మీ కృషి కి అభినందనలు

  • @Sudharani-ge3sh
    @Sudharani-ge3sh หลายเดือนก่อน +1

    లాస్ట్ చూపించిన సీనరీ అద్భుతః.

  • @mahipalreddyvannela6784
    @mahipalreddyvannela6784 หลายเดือนก่อน +1

    Superb comparison bw humans and vayyaribhama.

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji หลายเดือนก่อน

    ❤❤❤❤
    Meeru konni rojula tharuvatha
    Forest lo mee nivasani Yerparuchukuntaru. That is better way to live life. ❤❤❤❤

  • @newzwaves3171
    @newzwaves3171 หลายเดือนก่อน +3

    కంటికి కనిపించిన దృశ్యాన్ని చూసి ఆస్వాదించడం భావం .ఆ దృశ్యానికి నీదైన ఉపమానం జోడించి చెప్పటమే భావుకత
    భావజాలం అనేది ఒక వ్యక్తి (లేదా సమూహం) కలిగి ఉన్న నైరూప్య ఆలోచనల వ్యవస్థ, ఇది వాస్తవికతను వివరించడానికి ఉద్దేశించబడింది, విలువ లక్ష్యాలను వ్యక్తపరుస్తుంది మరియు దాని ప్రతిపాదకులు ఎలాంటి సామాజిక క్రమాన్ని తిరస్కరించడం లేదా సాధించడం కోసం చర్య యొక్క కార్యక్రమాలను కలిగి ఉంటుంది. లక్ష్యాలను ఉత్తమంగా సాధించవచ్చని నమ్ముతారు.

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน +2

      మీరు సరిగ్గా చెప్పారు అండీ 🤗🙏మీ అంత డెఫినిషన్ నాకు రాదు . నేను వ్యక్తపరచాలి అనుకున్న విషయానికి మీ దగ్గర ఉన్నంత సరయిన భాషా జ్ఞానం నాకు లేదు అండీ . కానీ 'మమ' అని మాత్రం అనగలను 🤗

    • @newzwaves3171
      @newzwaves3171 หลายเดือนก่อน

      @@BLikeBINDU 🙏

  • @SudhaAmmu-iu9yz
    @SudhaAmmu-iu9yz หลายเดือนก่อน +1

    Meru chese prayathnam janalu andhulo sagam chesina bagundedhi ala cheyaka poga unna chetlu Anni kottesthunnaru

  • @shyamsundarnaidu3088
    @shyamsundarnaidu3088 หลายเดือนก่อน +2

    వీటన్నిటితో పాటు భయం అనేది ఒకటుంటుంది...ఇది అంటే మీరు చెప్పిన అన్నింటికీ భయం..

  • @vijayachandragiri2067
    @vijayachandragiri2067 หลายเดือนก่อน +1

    Bhavan,Bhavukatha,Bhavajaalam chakkaga chepparu😊

  • @lillybosco7966
    @lillybosco7966 หลายเดือนก่อน +1

    Your positive thinking is too good and your approach towards the nature and earth is commendable l too like the nature gardening and thankful to God for everything.

  • @karthikeyasatti8975
    @karthikeyasatti8975 หลายเดือนก่อน +1

    Chala chakkaga chepparu bindu
    Nice

  • @Ishan.99
    @Ishan.99 หลายเดือนก่อน +3

    Acha tenugu(thelugu) ucharinche....swachamyna....Himam lanti manasunna Bindhu gaaru......scent malle mokka naatandi manchi perfume smell untadhi.....,kadhambam and sampangi chettu kuda pettandi... ammavaari ki ishtamyna puvvulu, kadhambam,sampangi

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน

      Thank you so much andi🤗🙏. Kadambam sampangi unnayi andi. Inkaa peddhaga peragaledu. Secnt malli kudaa online lo order chesanu andi raavalsi undhi❤

  • @raghava-xt5jd
    @raghava-xt5jd หลายเดือนก่อน +1

    I'm big fan of you Akka.... mimmalni direct ga meet avvalani chala waiting

  • @swethamsaa9942
    @swethamsaa9942 หลายเดือนก่อน +1

    Well said Bindu garu👏👏

  • @srujanavarikuti6047
    @srujanavarikuti6047 หลายเดือนก่อน

    Bindu garu mi knowledge ki 🙏🙏🙏🙏. No words andi ❤

  • @ramadevi7244
    @ramadevi7244 หลายเดือนก่อน

    Mee video s anni chala baguntayi bhindu garu
    Naku mokkalu polalu aavulu ante chala istam

  • @musthafajm
    @musthafajm หลายเดือนก่อน +1

    Well said. Well explained.

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @Myhomevlogs-t8u
    @Myhomevlogs-t8u หลายเดือนก่อน

    U are the great inspiration to us. No words to describe you bindu garu

  • @Ishan.99
    @Ishan.99 หลายเดือนก่อน

    First nenu mee usirikaya pickle vedio chussanu....ventane subscribe chesaanu....aa roju aa vedio naku kanipinchadam na luck ga feel avthanu ....endhukante prakruthi ni dhaggara ga chuse avakaasham mee dwara......kaligindhi....main ganga n sharadha....ni chuse avakaasham vachindhi.......tq

  • @gleelawati5589
    @gleelawati5589 หลายเดือนก่อน

    Passion fruit mugina tarwata cut chesi chupinchandi. Very good & nice thoughts. ❤

  • @arunagavarraju2802
    @arunagavarraju2802 หลายเดือนก่อน +1

    Thank you for the nice video 🙏🙏

  • @madhavisanku5609
    @madhavisanku5609 หลายเดือนก่อน +1

    Nice video... Thanku❤

  • @Lavanyagiri23
    @Lavanyagiri23 หลายเดือนก่อน +4

    ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లని హైదరాబాద్ ఇంట్లో మీరు కొన్ని వంటలు చేసి చూపిస్తారు కదా ఆ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం వాటిని కూడా పెడుతూ ఉండండి.

  • @revathivandrangi4734
    @revathivandrangi4734 หลายเดือนก่อน

    I love you bindu gaaru soo much... lots of peace and happiness watching your videos

  • @sathyasree2445
    @sathyasree2445 หลายเดือนก่อน +1

    Chala baga cheppaaru ❤

  • @janamlakmitha3224
    @janamlakmitha3224 หลายเดือนก่อน

    Me video chusinappudu oka Kotha lesson nerchukunnanu AKKA 🙏🙏

  • @mutyalamanjula1423
    @mutyalamanjula1423 หลายเดือนก่อน

    Naaku meeru reply icchinanduku enta happy ga vundo bindu endukante enta busy ga vuntundo naaku telusu ayina reply ichharu chaala happy maadi western Odisha meeru koodaa Odisha lo vundevaaru kadaa 😊thanq so much amma bindu

  • @eshwarin5053
    @eshwarin5053 หลายเดือนก่อน +1

    Beautiful video ma'am ❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน

      నమస్తే అండీ . ..ధన్యవాదములు 🤗🙏

  • @SujathaThummala-to2ze
    @SujathaThummala-to2ze หลายเดือนก่อน +1

    Superb bindhu garu 👌

  • @pvaralaxmi3828
    @pvaralaxmi3828 หลายเดือนก่อน +1

    అలాగే నేను మీతో నా జీవితానికి సంబందించిన కొన్ని విషయాలు పంచుకోవాలి ఇంకా కొన్ని సలహాలు తీసుకుందామని అనుకున్నాను. మెయిల్ వెళ్లట్లేదని నేను గోపాల్ గారిని మిమ్మల్ని ఎలా కలవాలి, మాట్లాడే అవకాశం ఏమైనా ఉంటుందా అని అడిగాను. గోపాల్ గారూ లేదండి మీరు విషయమేంటో చెప్పండి నేను వారికీ తెలియచేస్తా అన్నారండి.

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน

      మా మీరు చెప్పాలి అనుకున్న దానిని దయచేసి ఏమీ అనుకోకుండా నా మెయిల్ maatamanti@gmail.com పంపగలరు . మీ మెయిల్ స్టోరేజ్ నిండిపోయింది అన్నారు . మీ మెయిల్ లో అవసరం లేని మెయిల్స్ అన్నీ డిలీట్ చేయండి . చాలా స్టోరేజ్ మళ్ళీ వస్తుంది . 15gb ఉంటుంది కదా ఫ్రీగా మీరు అది మొత్తం వాడేసినట్లు ఉన్నారు .అవసరం లెనివి పెర్మనెంట్ డిలీట్ చేసేయమ్మా. అప్పుడు నాకు మెయిల్ పంపవచ్చు . ఇక మీ ఇంటి దగ్గర దూడకు లంపి స్కిన్ డిసీస్ అయి ఉండవచ్చు ఒక్కసారి అలాగే ఉండే ఎలర్జీ కూడా రావొచ్చు ..ఒకవేళ లంపి జబ్బు అయితే TOPICURE అనే స్ప్రే దొరుకుతుంది మా . ముందు పుండ్లపై దానిని స్ప్రే చేస్తూ ఉండమని చెప్పు . th-cam.com/video/n7vVnWqD7ZI/w-d-xo.html ఈ వీడియో ను ఒకసారి చూడు మా ఉపయోగపడవచ్చు . 🤗

  • @samanthaguduru2636
    @samanthaguduru2636 หลายเดือนก่อน +2

    We are waiting for your videos madam garu

  • @sahithyakotha2345
    @sahithyakotha2345 หลายเดือนก่อน

    Chala bagaa chaparuu mam😍🙏🏻🙏🏻

  • @saasuperkids274
    @saasuperkids274 หลายเดือนก่อน +1

    Ba cheparu👍

  • @gangireddygariswarnagowri3724
    @gangireddygariswarnagowri3724 หลายเดือนก่อน +1

    Inspiring bindu garu

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండీ ధన్యవాదములు 🙏🤗

  • @Chinnibook
    @Chinnibook หลายเดือนก่อน +1

    Well said same feeling regarding kalupu (grass) na terrace garden mottam grass

  • @alaharigeetha1193
    @alaharigeetha1193 หลายเดือนก่อน

    . Cow shed lo floor konchem slopy ga unte cleaning chaala easy avutundhi .... Floor mats veste non slippy ga avi vundavachu....cow waste ni proper ga store chesukunela channels undaali..... Think it so that it will be useful to others also.....

  • @ritantareprises7967
    @ritantareprises7967 หลายเดือนก่อน +4

    ఇకపై క్లౌడ్ బరెస్ట్ అంటే కుండపోత వానలు సహజం గా వస్తాయి వరదలు సామాన్యమైన విషయం గా మారుతుంది లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు వరి లాంటి పంటలు వేసే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై వీడియోలు చెయ్యండి

  • @aneesshaik4949
    @aneesshaik4949 หลายเดือนก่อน

    Very well said Bindu garu

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 หลายเดือนก่อน +2

    Bindu mam e roju video chustunte oka professor mundu kurchunatu undi andi naku....... 🙏

  • @degondakumar538
    @degondakumar538 หลายเดือนก่อน +7

    హరే కృష్ణ అక్క fast like coment ❤

  • @ganeshramavath9965
    @ganeshramavath9965 หลายเดือนก่อน +1

    Night 12 tharuvatha...............
    Ganesh Nimmajanam ki bhaga dance chesi vacchi
    alisi poyee.......Reading room lo
    Food thintu.....
    Mee video chusthu alaaa ashadisthunte
    Entha Bhagundho......
    Bindu Tq.......
    Name vadesthunna anukokandi
    Your my friend
    Bindu anthe........naaku alaa vaadatame istam
    But bindu ante huge respect

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน

      నమస్తే అండీ . . 🤗🙏థాంక్యూ సో మచ్ . మీరు బిందు అని పిలిస్తే సంతోషమే అండీ . నేనేమి అనుకోను . అలాగే నిన్న మేము తిరిగి వ్ వస్తుంటే దారి పొడవునా ఎన్ని నిమజ్జనానికి వెళ్తున్న వినాయకుళ్ళని చూశానో!చాలా చాలా ఆనందంగా చూసాను . అత్యంత ఆత్మీయులకి వీడ్కోలు చెప్పేటప్పుడు కలిగే ఒక లాంటి ప్రేమతో కూడిన దుఃఖంకలిగింది .గొంతుక దగ్గరే ఆపుకోవాల్సి వచ్చింది . ఇంట్లో రోజూ చూస్తాము . అయినా కూడా ఆయనెక్కడికో వెళ్ళిపోతున్నాడు అనే భావన . అన్ని విగ్రహాలనూ చూస్తూ దణ్ణం పెట్టుకుంటూ వచ్చే అదృష్టం మాకు కలిగింది . చివరికి లక్కీ తో కూడా దణ్ణం పెట్టించాను . చిన్న పిల్లలు, పెద్దవారు అందరూ ఎంతో ఉత్సాహంగా, అనందంగా ఆయన్ని తీసుకెళ్తున్నారు . మీరు కూడా చక్కగా దగ్గరుండీ డాన్స్ చేసి సంతోషంగా పంపించి వచ్చారు . దాని వల్లనే అంత అలసటగా ఉన్నా కూడా మీరు ఇంత ఓపికగా నాకు కామెంట్ రాసారు ..సంతోషం అండీ . .😍🤗🙏

  • @kalyani9230
    @kalyani9230 หลายเดือนก่อน

    E sickness mood lo mi video ento satvana isthundandi thank u bindu garu

  • @navajyothit3042
    @navajyothit3042 หลายเดือนก่อน +1

    Bindu today 10:28 pm I am blessed with baby girl, normal delivery

  • @venkataramanamadakam3266
    @venkataramanamadakam3266 หลายเดือนก่อน

    Super explanation mam 🎉

  • @saradagoldkota5423
    @saradagoldkota5423 หลายเดือนก่อน

    Bindu garu chala correct ga chepparu

  • @bathinamangamhasivudu5096
    @bathinamangamhasivudu5096 หลายเดือนก่อน +1

    నమస్తే బిందు మేడం మొక్క చిన్న దశలోనే వివిధ తెగుళ్ళకు గురి అవుతుంది అది పాదులైన కావచ్చు లేదా పువ్వులైనా కావచ్చు లేదా దుంప కూరలు అయినా కావచ్చు దానికి మీరు ఏ మందులు వాడుతున్నారు వివరించగలరు వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం అయితే మాకు కొంచెం స్థలం ఉంది వీటిలోనే ప్రాక్టీస్ చేస్తున్న ఫ్యూచర్లో బాగా చేయాలని ప్రస్తుతానికి నేను దుంప కూరలు పెట్టాను బీర పెట్టాను చిన్న దశలోనే పురుగు పట్టేసింది మీరు వాడే మందులు చెప్పగలరు

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน +1

      నమస్తే అండీ 🤗🙏. మీరు మట్టిని సిద్ధం చేసుకున్నాక. అప్పుడు మొక్కలు కానీ విత్తనాలు కానీ దుంపలు కానీ నాటితే తెగుళ్లను ఎదుర్కోవచ్చును అండీ . మట్టిలో వేప పిండి, Trichoderma, pseudomonas వంటివి కలిపి కొన్ని రోజులు ఆగాక అప్పుడు వాటిని నాటుకోవాలి . అలాగే దుంపలు నాటేటప్పుడు మట్టి వదులుగా ఉండాలి / కొంచెం ఇసుక కలిపితే మంచిది(ఒక 5-10% సరిపోతుంది). లేకపోతే దుంప కుళ్లిపోయే అవకాశం ఉంది . పెరిగాక ఆకులకు పండ్లకు సోకె వాటికి క్రమం తప్పకుండా పురుగు ఉన్నా లేకపోయినా వారా నికి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండాలి . ఇంకో వారం పచ్చిమిర్చి , వెల్లుల్లి వేపాకు , ని కచ్చాపచ్చాగా నూరి ఆవు మూత్రంలో కాచి వడకట్టి చేసే అగ్ని అస్త్రం కూడా స్ప్రే చేస్తూ ఉంటె పురుగులు తెగుళ్లు రాకుండా నివారించవచ్చు . అలాగే ఇంగువ ద్రావణం పుల్లని ఆవు మజ్జిగ స్ప్రే కూడా బాగా పని చేస్తాయి అండీ . కుంకుడుకాయ రసం స్ప్రే కూడా బాగా పని చేస్తుంది .

  • @hemalathamanda5190
    @hemalathamanda5190 หลายเดือนก่อน +1

    Bindu garu naaku same mee laage anipisthundi. మొక్కలు ప్రాణులే... అవి మాట్లాడుతున్నట్లు feel అయిపోతుంటాను.....

  • @SSPrada
    @SSPrada หลายเดือนก่อน +1

    Meeru cheppe maatalu anni naku baga nachuthai. Mana aayurvedam prakaram local ga pande vatini matrame aahaaram ga teesukovali. Ade healthki manchidi. Non local items ni appudappudu teesukovachu kani mana vallaki poriginti pulla kura ruchi ekkuva. Konnalaki mana fruits manesi foreign fruits ee tinatam modalu pedatharu. Black pepper manesi red mirchi start chesaru. Anduke rakarakaala digestive issues, etc. modalayyayi. Idi ela undante maataki matram bharateeyulu govu ni gouravistharu antaru kaani beef export lo manam mundu unnam.

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน +1

      నమస్తే అండీ 🤗🙏 ఏ శాస్త్రం అయినా కాలానుగుణంగా రాయబడుతుంది అండీ. ఆయా శాస్త్రాల్లోని మౌలిక నియమాలను పాటిస్తూ అవసరం ఉన్న దగ్గర ఈ కాలానికి అనుగుణంగా మన అలవాట్లను మార్చుకుంటూ వస్తున్నాము . ఆ కాలంలో రవాణా వ్యవస్థ సురక్షితం కాదు . అత్యంత దట్టమైన చిక్కని కారడవులు అడవులు ఉండేవి .క్రూర జంతువుల మధ్య ప్రయాణం శ్రేయస్కరం కాదు . .అప్పుడు ఇప్పుడున్నంత వ్యవసాయం లేదు. ఆదిమానవులు ఒక నిలకడ లేక గుంపులు గుంపులుగా ఉండి సంచార జీవితం చేస్తూ వేట ప్రధానంగా ఉండేవారు . అలా సంచరిస్తూ సంచరిస్తూ నదీ పరీవాహక ప్రాంతాలకు చేరుకున్నారు . అలా కొన్ని ఏళ్ల తర్వాత అక్కడ నీటి వల్ల రకరకాల బార్లీ,గోధుమ వంటి ధాన్యాలు మొలకెత్తడం గమనించి వారు వాటిని మెల్లిగా పండించడం మొదలు పెట్టారు . అప్పుడు సంచార జీవితం ముగించి పరీవాహక ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు . కానీ వ్యవసాయం కొత్తల్లో ఉండడం వల్ల ఇంకా పూర్తి పరిజ్ఞానము లేనందువల్ల సగం వేట సగం వ్యవసాయం చేసి ఆహరం సంపాదించుకునేవారు . వేటాడడం చాలా కష్టమైన పని పైగా ఒకోసారి వేటాడే క్రమంలో ప్రాణం కూడా పోవచ్చును దాని కన్నా వ్యవసాయం తేలిక కాబట్టి మెల్లిగా వేటను తగ్గించి ఏ జంతువులనైతే తేలిగ్గా మచ్చిక చేసుకొవచ్చో ఆ జంతువుల్నే పెంచుకోవడం మొదలు పెట్టారు.ఉదాహరణ మొదట కుక్క తర్వాత ఆవులు. అప్పట్లో ఎవరి దగ్గర ఎక్కువ ఆవులు ఉంటే వారే ధనికులు. జనాలు గణాలుగా ఉండేవారు . మెల్లిగా వ్యసాయం లో వరి వంటివి కూడా వచ్చి చేరాయి . ఆయుర్వేద శాస్త్రం చెప్పబడిన సమయంలో వ్యవసాయం ఇప్పుడున్న స్థితిలో లేదు అండీ . లోకల్ గా పండేవి మాత్రమే మంచివి అని ఎందుకు చెప్తారు అంటే ..పండిన వెంటనే ఫ్రెష్ గా ఉన్నప్పుడే వాడతారు . అప్పుడు పోషకాలు ఎక్కువ అందుతాయి . అది రవాణా చేసి ఎక్కువ దూరం పోయిన కొలదీ అందులోని జీవశక్తి నశిస్తూ వస్తుంది . అందుకు స్థానికంగా మన దగ్గర పండినవే ఎన్నటికయినా ఖచ్చితంగా మంచివి . ఆహారం విషయంలో పొరుగిల్లు - పుల్ల కూర అనేది మన మనసు యొక్క భావన మాత్రమే అండీ. .టమాటో , మిర్చి , బెండ , cabbage, కాలీఫ్లవర్ ,ఆలుగడ్డ , క్యారెట్ , బీట్రూట్, దానిమ్మ , ద్రాక్ష , జామ , బొప్పాయి, అనాస పండు ఇవన్నీ కూడా పొరుగింటివే మనింటివి కావు . . కానీ అవి మన ఇంటి దగ్గర పండితే మన ఇంటివే/స్థానికమే అండీ . నా చేతికి ఆరోవేలు పెట్టాలని ప్రయత్నిస్తే నా శరీరం అంగీకరించదు.ఎందుకంటే అది ప్రకృతి విరుద్ధం . కానీ మనం ఇక్కడ ఒక మొక్కని పెడితే అది బ్రతికింది ఫలాలను అందించినది అంటే అది ప్రకృతి మాతకి సమ్మతమే అండీ . ప్రకృతి అనుమతి లేకుండా మనమేమీ చేయలేము. సుమారు 200 మిలియన్ ఏళ్ల క్రితం ఒకప్పుడు భూమి మొత్తం కలిసి ఉండేది. తర్వాత భూమి అడుగు పొరల్లోని కదలికల వల్ల భూమి ఖండాలుగా విడిపోయింది . దీనినే ఖండ చలన సిద్ధాంతం అంటారు . భూమి మొత్తం ఒకటిగా కలిసి ఉన్నప్పుడు ఇంకా ఆది మానవుడు పుట్టనేలేదు . అప్పుడు ఎన్నో రకాల మొక్కలు మహా వృక్షాలతో ఎన్నో పెద్ద పెద్ద భారీ జంతువులతో, పెద్ద పెద్ద విమానం అంత పక్షులతో భూమి ఉండేది . భూమి విడివడే ప్రక్రియ లో , లేదా ఉల్కాపాతాల వల్ల, అగ్నిపర్వత పేలుళ్ల వల్ల లేదా భూకంపాల వల్ల లేదా కొన్ని లక్షల ఏళ్ల పాటు మంచుతో కప్పబడి ఉండడం(హిమానీ శకాలు,ice ages) వల్ల అక్కడ స్థానికంగా ఉండే ఎన్నో రకాల జాతులు అకస్మాత్తుగా అసలక్కడ ఇంతకుముందు అవి లేనే లేవు అన్నట్లుగా పూర్తిగా నశించిపోయేవి . అదే సమయంలో భూమి విడివడే ప్రక్రియ కూడా జరగడం వల్ల మధ్యలోకి సముద్రం రావడం వల్ల కొన్ని రకాల జంతువులు, మొక్కలు ఒక ప్రాంతానికే పరిమితమైయ్యాయి . మీ మాటను కాదు అని ఇంకొకటి చెప్పాల్సి వచ్చినందుకు నన్ను దయచేసి క్షమించండి🙏🙏 . మిర్చి కూడా మిరియాల లా ఆరోగ్యానికి చాలా మంచిది. దాని వల్ల డైజెస్టివ్ issues వచ్చే అవకాశమే లేదు . కానీ దానిని పండించే విధానం వల్ల ఆరోగ్య సమస్యలు రావొచ్చు అనేది మాత్రం ఖచ్చితంగా నిజం . మిర్చి కి పిచ్చి పిచ్చిగా లెక్క లేనంతగా పురుగు మందులు వాడతారు . అందుకే మనకు సమస్యలు .ఆయుర్వేద కాలంలో అది చెప్పబడిన చోటులో మిర్చి ఉండి ఉంటే దాని యొక్క మంచి గుణాలను కూడా మన వాళ్ళు ఆ శాస్త్రంలో ఖచ్చితంగా చెప్పేవారు . నిజంగా పొరుగింటివి వాడకూడదు అన్న పట్టుదలే ఉంటే నేను వ్యక్తిగతంగా మొదట విడిచిపెట్టాలి అనుకునేది ఆహారం కాదు అండీ . . నిశ్శబ్ద యుద్దానికి ఆలవాలుగా ఉన్న పొరుగింటి సామాజిక మాధ్యమాలు వాళ్ళ దేశపు ఫోనులు , వస్తువులు అండీ . చివరికి మనల్ని క్రూరంగా హింసించిన వారి భాషే మనం వాడుతున్నాము . శాలివాహన శకం అని వాడకుండా క్రీస్తు శకం అంటున్నాము .

    • @SSPrada
      @SSPrada หลายเดือนก่อน +1

      @BLikeBINDU I greatly appreciate your time andi. Comment pette valla knowledge meeku telidu kada. So time teesukoni detailed ga reply icharu. Yes, I am aware of changes with time, and we must acknowledge those changes. There is a subtle difference between our definitions of acceptance of nature. Meere chepparuga vari, godhuma manam naatakundane Ave manaku sahajamga labhinchayani. Let's not go in the path that someone planned those at some point in time. According to your history, this is there by nature. Veetini nenu local and prakruthi siddam antanu. Meeru 6th finger ani antunnaru kabatti idi cheptunna. Dental issues unte sarichesukuntam body accept chestundi. Similarly, people do lip jobs/augmentation, nose jobs, jaw jobs inka anni rakala surgeries chesukuntunnaru, and body accepts those changes. Moreover nowadays men and women hormonal changes chesukoni interchange avutunnaru. In fewer cases, the body accepts those changes. Mokka vesthe bathiki nantha matrana prakruthi siddam kadu kada. Environment support chesthe non local foods Ina survive avuthayi. Usa winter zones lo jama chettu vesamanukondi summer lo thrive avutundi ade nature winter lo Danni champestundi. Prakruthi odilo perige prathi mokkalo edo manchi untundi. Avocado provides good cholesterol to humans, but it is not good for other animals. Tomato is a fruit, not a vegetable. Manam Danni vegetable la use chestam. Dani seeds valla stomach lining debbatintundani oka article lo chadivanu. Alage in general ga digestive issues, gas problem unte cauliflower, cabbage first avoid chesthaga Ala general ga annanu. Putte prathi Manisha gittaka tappadu. Local foods tinnatha matrana kalakalam undi poru. Kani bathiki nantha kaalam ela bathakalo cheppeve mana vedalu. Andulo ayurvedam edi tinalo manaku cheptundi. Mana vedalu, sastralu sanathanam. Avi eppatiki nijam sanathanam. Mana ancestors konni norms pettaru nijame. Avi kalam tho patu maralasinde. Avi lekka lenanni unnayi. Period time lo enduku bayata kurcho pettevaru, tine plate chuttu water enduku jallu tharu, dwaralaki pasupu enduku rastharu, sathi sahagamanam, balya vivahalu etc. Aa time tho change ayye norms ni meeru aayurveda local food definition ki aapadistunnaru. Sunset lope tinali aayurvedam prakaram. Appatlo current undedi Kadu anduke Ala annaru ippudu current undi kabatti manam tinochu ante sari kaduga. Avunu meeru annadi nijame english Bhasha kuda non local. Anduke naa kids ki telugu modata nerpinchanu. Vallaki raayatam, chadavatam and matladatam vachu. I opposed kalki movie as it is based on kaliyuga story based on our puranas, but the title uses 2098 AD, which is no longer used. We are supposed to use common era in these days right. I hope this detailed comment helps you to understand my perspective.

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน +1

      Meeru entho sahanamga chala manchi reply raasaru andi. I’m so happy for that. And comment raasevariki knowledge ledani ledaa thelidano nenu porabatuna kudaa eppudu anukonu andi. pratthee okkariki andulo naa videos chusevallu highly knowledgeable ani naaku thelisthune untundi. Meeko vishayam cheppali nenu video pettinappudu video ni enthamandi chustaro comments ni kudaa anthe mandi chaduvutaru andi. Alaa chadivanappudu chala knowledge exchange avutundi andi. Anduke alaa raasthanu. Chudandi ippudu nenu antha rayabatte kadaa meeru mee knowledge ni share chesaru. Adhe nenu korukunedi. And naa alochanalu konnintitho meeru vibhedinchavachu. And it’s totally okay andi. Naatho ekibhavinchali elaa ayina mimmalni nenu anukunna daaniki opponchali ani porabatuna kudaa anukokedu andi. Just naa thoughts meerho panchukunnanu.🤗😍🙏Kanee meetho matram nenu vibhedinchanu. Ee kinda comment lo meeru raasina prathee maatanu nenu manasphurthiga ekibhavistanu. Edi emaina at the end naaku kavalsindi andaram happy gaa undadam. And meeru raasindi chala correct andi. manam elaa unna emi chesina manaku entha kalam praptham undho anne naallu untamu. And mana sanathana dharmam patla naaku apaaramaina bhakti gouravam undhi andi. Ayurvedam, susrutha samhita , Ramayana, Mahabharathalu, arthasastram books teppinchukunnanu andi. Chadavadam start chesanu koddi koddiga. Chadavali ardham chesukovali ani. Sare andee untanu🤗🙏Good night andi

    • @SSPrada
      @SSPrada หลายเดือนก่อน

      @BLikeBINDU mee Pina respect perigundandi😍. Keep up your good work. I am always a great fan of your videos. Naa comment tho mimmalni kasta pettakudadani chala anukunnanu😊. I will be waiting for your videos🤗

  • @sreelakshmimeduri2814
    @sreelakshmimeduri2814 หลายเดือนก่อน

    Really you are great andi bindu!!!

  • @bhanumathipithani9842
    @bhanumathipithani9842 หลายเดือนก่อน

    You are great mam

  • @lakshmibathineedi8768
    @lakshmibathineedi8768 หลายเดือนก่อน +1

    Ekkadanundo ravanna Bindu tally gongali purugulu Batar fly's gudi pedatayi aniyan rasam raasukomma chaala eching vastundi

  • @sudarshanamsandhya4717
    @sudarshanamsandhya4717 หลายเดือนก่อน +1

    Okka coment ki inta information teliyanii vishayalu telusukoni Mari reply chesaru nijame manushulaki sthanikatha kuda avasaram ledu cheppalante alantidi chetlu pallu tinoddu annavariki manchi clarity vachindankunta any way I think bindu like a small weakypydea naku appudanna dout vaste mitho share chestanu

    • @sudarshanamsandhya4717
      @sudarshanamsandhya4717 หลายเดือนก่อน +1

      Local anedi stanikata ga teesukunte indianleni country ledankunta

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน

      నమస్తే అండీ . 🤗🙏లేదండీ ఆ కామెంట్లు రాక పూర్వమే నాకు ఇది తెలుసు . అలా కామెంట్ రాసినవారు కూడా ఎప్పుడో 2 ఏళ్ల క్రితం రాశారు.కానీ రీసెంట్ గా లాస్ట్ వీడియో లో ఒకరు మళ్ళీ అదే కామెంట్ రాసేసరికి ఈసారి ఇలా వీడియో రూపంలో చెప్పాలి అనిపించింది అండీ . అవునండీ నిజమే మీరన్నట్లు మనుషులకి కూడా స్థానికత అవసరం లేదు . 😍🤗❤🙏అందరం ఒకే దేశం అన్న ఆలోచన ఉంటే చాలా బాగుంటుంది అండీ .

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน

      😅😅😅అవునండీ మన దేశంలో లేని దేశం లేదు ...

    • @sudarshanamsandhya4717
      @sudarshanamsandhya4717 หลายเดือนก่อน

      Nenu kuda mi old subscriber ni nenu anta easy avari channel subscribe chesukonu but midi nenu appudo subscribe chesanu akkado mivi connect avutayee msges

  • @rajyalakshmiyarlagadda5638
    @rajyalakshmiyarlagadda5638 หลายเดือนก่อน

    Bindu garu chala baga cheparu❤

  • @ramanajada8697
    @ramanajada8697 หลายเดือนก่อน

    Totally it's a social lesson history and geography and more over ethics nice ❤sister

  • @siridonikela541
    @siridonikela541 หลายเดือนก่อน

    Assssalki ntha baga prathi wrd ki explanation hat's off akka mi prathi video lo edho okati nerchukuntanu nenu god echhina gift vi nijmga Nvvu nn kuda sensitive ga alochistha little bit kuda lvu akka ❤

  • @anjalidasari2697
    @anjalidasari2697 หลายเดือนก่อน +2

    Hiiiiiiiiii bindu akka hiii ra honey ela vunnaru akka eroju video super akka ni thinking super chaaala chaala baaga explain chestaru ni dhaggara nundi chaaala nerchukunanu nerchukovali inka ni laaga positive ga vundali akka naku plants ante chaaala istam but avakasam ledu akka naku voka mokka gift ga evvu jagartha ga penchununtanu adi chusinapudu nve gurthuku vastav u r my spl love u alot akka ❤❤❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน +1

      హాయ్ మా అంజలి తల్లీ 🤗🙏ఎలా ఉన్నావు?చిన్నూ బాబు ఎలా ఉన్నాడు? బాగా అల్లరి చేస్తున్నాడా? అమ్మా! నీకేమి మొక్క కావాలో చెప్పు ఇంస్టాగ్రామ్ మీ అడ్రస్ పెట్టు నువ్వు అడిగిన(నీకు నచ్చిన మొక్క) తీసుకుని నీకు తప్పకుండా పంపుతాను. వెంటనే చెప్పు తల్లీ 😍😘🤗

  • @vijayadamodaran8922
    @vijayadamodaran8922 หลายเดือนก่อน +2

    Food and the region it grows..definitely has great role to play..for the survival of that particular geographical living beings...
    Coming to vegetables and Fruits
    Goruchikkudu for example..the very native vegetable..it is used in intense research by Scientists..for curing n number of ailments...
    Nativity of any food grown..is directly proportional to those native people who has been cultivating and consuming the same for generations..
    An institute in Coiambatore is doing this research..they has a list of local varieties.of fruits n vegetables..
    Infact it is classified as..3 Roots- adhama
    Shrubs - Madhyama
    Climbers - Uthama..
    Potla kaaya/ beerakaaya/ Gummadi kaaya/ chikkudlu/ bobbarlu/ teega jaathivi..Daily diet lo vundaali..
    Remaining 2 kinds..oka vaaram lo okasaari..alaa vandamani chepthaaru
    Coming to fruits/ Coconut
    Devuniki Neivedyam ga vaadey chinna pasupu arati maathremey..months babies ki..pettalsina fruit...no other fruit is eligible for just months born..humans..
    like wise..our Native coconuts..has special nutritional value..
    Our Native Turmeric Curcumin value is high
    Asian region people..south..indians never had Chillies in their diet..
    only PEPPER is used in local.cuisines..
    50 years back..meeru screen lo pettina eh vegrtables...mana..poorvikulu thiney vaaru kaadhu..
    Likewise..Tonnes of information.available on this important subject..
    Thanks for bringing up this topic..
    I myself..doing research.on this😊❤
    Love you and your family

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน

      నమస్తే అండీ 🤗🙏చాలా చక్కని విషయాలను తెలియచేశారు. అవునండీ గోరు చిక్కుడు చాలా చాలా మంచిది . అలాగే మన పూర్వికులు ఇప్పుడు వాడే ఏవి వాడే వారు కాదు . ఆ కాలంలో ఇవేమి ఇక్కడ లేవు కూడాను . 15 వ శతాబ్దంలో కొన్ని 17 వ శతాబ్దంలో కొన్ని వచ్చాయి . వచ్చిన వెంటనే కూడా ఎవరూ వాడి ఉండరు . మెల్లి మెల్లిగా అలవాటు పడి ఉంటారు .అసల వాళ్ళ దాకా ఎందుకండీ మన చిన్నప్పుడు కూడా ఇప్పుడు మనం చూస్తున్న కూరగాయల్లో కొన్ని నేనెన్నడూ చూడలేదు.వినలేదు . బ్రోకలీ , lettuce ఇలాంటివి, అలాగే ఇంకా చాలా రకాల పండ్లు కూడా . అండ్ అవును అండీ . .ఇది ఒక చాలా పెద్ద టాపిక్ . continuous రీసెర్చ్ అనేది అవసరమే . ఒక మొక్క కానీ, జంతువు కానీ ఒక వాతావరణాన్ని తట్టుకుని నిలబడింది అంటే అది ప్రకృతి సమ్మతమే అయి ఉండవచ్చును అండీ . ప్రకృతి అనుమతి లేనిదే సహజ క్రియలు ఏమీ జరగవు . ప్రకృతి కి ఎదురెళ్లి మనమేమీ చేయలేము . చేసినా పెను ఉత్పాతమే మిగులుతుంది . కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం ఒకప్పుడు భూమి మొత్తం ఒకే భాగంగా కలిసి ఉండేది అంట అండీ . టెక్టోనిక్ ప్లేట్ మూవ్మెంట్స్ వల్ల భూమి ఇప్పుడున్న ఈ స్థితికి చేరుకొని ఖండాలుగా విడిపోయింది . కలిసి ఉన్నప్పుడు అన్ని రకాల జంతువులు పక్షులు భూమి మొత్తం సంచరిస్తూ ఉండవచ్చు(ఇప్పటికీ సైబీరియా నుండి పక్షులు మన దేశానికి ఒక కాలంలో వలస వస్తూ ఉంటాయి). అవి అనేక రకాల మొక్కల విత్తనాలను మోయడానికి వాహకాలుగా ఉండి ఉండవచ్చు . ఏదైనా విపత్తు జరిగినప్పుడు సడన్ గా అవి అంతరించి పోవడంతో విత్తనాలను మోసే అవకాశం లేక అవి ఒక చోటుకే పరిమితం అయిపోయి ఉండవచ్చు . సరిగ్గా అదే సమయంలో భూమి విడివడే ప్రక్రియ అనేది మొదలయ్యి ఉండవచ్చు. ఇవన్నీ ఒక అభిప్రాయానికి రాకుండా ఇంకా తెలుసుకోవాలి అన్వేషించాలి అన్న తపన లో భాగంగా నా ఆలోచనలు మాత్రమే అండీ. మీ వంటి వారు రీసెర్చ్ చేసి మాకు ఎన్నో కొత్త విషయాలు తెలియచేయాలి అవన్నీ మేము తెలుసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను . అన్వేషణ, పరిశోధన ఎల్లప్పుడూ మనిషిని మానసికంగా యవ్వనంగా ఉంచుతుంది.థాంక్యూ సో మచ్ అండీ . 🤗🙏😍

  • @navajyothit3042
    @navajyothit3042 หลายเดือนก่อน +1

    Bindu sis I am blessed with girl baby normal delivery

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน

      congratulations అండీ 🤗😍చాలా చాలా సంతోషం ...బుజ్జి బంగారు తల్లికి బిందూ ఆంటీ 😘😘😘😘😘😘😘 టేక్ రెస్ట్ అండీ .

  • @pangasivamma
    @pangasivamma หลายเดือนก่อน

    Bindu garu meru gopal narsary lo rose plant gurinchi chapparu daani
    Informetion ivvandi plz

  • @krishnasatishnuni6418
    @krishnasatishnuni6418 หลายเดือนก่อน

    సూర్యాస్తమయం❤❤

  • @sirisiri57575
    @sirisiri57575 หลายเดือนก่อน

    Hi madam me form lo medicinal values unna vishnukrantha mokka unda ..
    Me videos chala baguntai 🌺⚘️⚘️

  • @venkatreddy8829
    @venkatreddy8829 หลายเดือนก่อน +1

    యదాభావం తద్ భవతి

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน

      అంతే అండీ 🤗🙏

  • @boyinaanil3213
    @boyinaanil3213 หลายเดือนก่อน

    Bindu mam. Namaste Andi. Meru Edo video lo slow electric cooker gurinchi chepparu. Like milletes and . Brown rice low carb vudikinchu kotaniki bagundi one hour padthundi ani chepparu . Eee bigg billion days lo nenu konukundam anukuntunna . Mam Dani details and capacity gurinchi chinna ga information ivvara plaz .

  • @syamala2200
    @syamala2200 หลายเดือนก่อน

    What do you do with so many fruits. Do you sell or you keep them for your family. This plant looks very beautiful and gives very good shade . You can peel these red passion fruit and cook them with sugar . It makes a very good color syrup for deserts.

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน +1

      Avannee okesari pandavu kadandee every week konchem konchem panditayi. Vaatini konni memu konni maa friends and family members ki isthamu andi. Alage peels nenu kadigi endapetti just tea laa chesukuntu untamu andi. Adhi kudaa oksari pka video lo chupinachanu. Too much fruits okesari vachestue i mix the pulp with jaggery(as a preservative) and store in the refrigerator andi. 🤗🙏

  • @lakshmibandari4936
    @lakshmibandari4936 หลายเดือนก่อน +1

    Passion fruit in telugu Krishna phalam

  • @shriharidra
    @shriharidra หลายเดือนก่อน +1

    సూపర్ 👌👌👌

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf หลายเดือนก่อน +27

    Lunch ipoie mancham meda vali cell tiskogane ni video kanipinchindamma. Aha anandaniki antheledu. Nuvvu nammavra facelo pedda light veliginatle. Ok bye nenu video chudali. 😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน

      🤗😍🙏🙏🙏

  • @dhanalakshmik777
    @dhanalakshmik777 หลายเดือนก่อน +1

    Mokkalu vintaayi anedhi nooru saatham nijam
    Meeru speakers pettandi pl kudhirithe
    Sarada ganga shed ki koodaa pettandi pl
    Music kaani naamaalu gaani vinipisthu unte inkaa bhaavuntaayemo nandi

  • @KuppiliNagamani
    @KuppiliNagamani หลายเดือนก่อน +1

    Vaddu ante entha baaga apesindo tinadam good understanding ganga bujji 💋❤️❤️❤❤❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน +1

      Avunandi🤗🙏.. konchem allari chestundi kanee bangaru thalli andi chala manchidi Ganga❤

    • @KuppiliNagamani
      @KuppiliNagamani หลายเดือนก่อน

      @@BLikeBINDU Mee prema chala goppadi sis God bless you 🙏

  • @rupashivaram5138
    @rupashivaram5138 หลายเดือนก่อน +1

    Next time nenu ma village ki vellinapudu nenu kuda seed balls yevadaniki try chesta andi

    • @BLikeBINDU
      @BLikeBINDU  หลายเดือนก่อน

      🤗🙏

  • @SujathaPeesari
    @SujathaPeesari หลายเดือนก่อน

    Every year proone chestara bindu garu.maa intlo ee plant undi.last year baga crop vachindi. But ee year chettu antha healthy ga ledu. Adaina solution suggest cheyandi bindu garu pls.

  • @PadmavathiGurrala-j1e
    @PadmavathiGurrala-j1e หลายเดือนก่อน +1

    Bindu garu ela vunnaru ilane maaku inka manchi videos pettandi 29:22

  • @330deepu
    @330deepu หลายเดือนก่อน

    Meeru oka vigyaana bhandagaram andi bindu garu. Life lo okasaranna mimmalni kalavali .