YELO YELO (సంబరాలు-5) |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024
  • เพลง

ความคิดเห็น • 1.4K

  • @JoshuaShaik
    @JoshuaShaik  2 ปีที่แล้ว +730

    LYRICS Telugu & English:
    ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు
    సంతోషాలే పొంగేనండీ - హైలెస్సా
    దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే
    సంగీతాలే పాడాలండీ - హైలెస్సా
    అంధకారాన్ని తొలగించే మహనీయుడు
    పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు
    నిన్నే కోరి నిన్నే చేరి
    ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు
    1. లోకాలనేలేటి రారాజురా - ఉదయించె సూరీడై వచ్చాడురా
    ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒకతార మురిసిందిగా (2)
    దూతాళి పాడి - కొలిచారు చూడు
    ఘనమైన ఒక వేడుక
    ఆ గొల్లలేగా - దరువేసే చూడు
    మెస్సయ్య - పుట్టాడనీ
    మన మెస్సయ్య - పుట్టాడనీ
    2. వెన్నెల్లో పూసింది ఓ సందడీ - పలికింది ఊరంతా ఈ సంగతీ
    ఈ దీనుడంట - పసిబాలుడంట - వెలిసాడు మహరాజుగా (2)
    మనసున్న వాడు - దయ చూపువాడు
    అలనాటి అనుబంధమే
    కనులారా చూడు - మనసారా వేడు
    దిగి వచ్చే మనకోసమే
    ఇల దిగి వచ్చే మనకోసమే
    3. ఆ నింగి తారల్లా వెలగాలిరా - జగమంత చూసేలా బ్రతకాలిరా
    వెలిగించు వాడు - మనలోని వాడు - నిలిచాడు మన తోడుగా (2)
    సలిగాలి రాత్రి - పిలిసింది సూడు
    మనలోన ఒక పండగ
    భయమేల నీకు - దిగులేల నీకు
    యేసయ్య మనకుండగా
    మన యేసయ్య మనకుండగా
    Yelo Yelo Yelo Antu - Vachharandi Gollalu
    Santhoshaale Pongenandi Hilessa
    Daare Choope Devudochhe - Ullasanga Ooru Aade
    Sangeethaale Paadaalandi Hilessa
    Andhakaaraanni Tholaginche - Mahaneeyudu
    Puttinaadandi Yesayya - Mana Devudu
    Ninne Kori - Ninne Cheri
    Itta Rakshincha Vachhadu - Paramaathmudu
    1. Lokaalaneleti Raaraajura - Udayinche Sooreedai Vachhaduraa
    Aakaasa Veedhi - Meriseti Daari - Oka Thaara Murisindigaa (2)
    Doothaali Paadi - Kolichaaru Choodu
    Ghanamaina Oka Veduka
    Aa Gollalega - Daruvese Choodu
    Messayya Puttadani
    Mana Mesayya Puttadani
    2. Vennello Poosindi Oka Sandadi - Palikindi Oorantha Ee Sangathi
    Ee Deenudanta - Pasi Baaludanta - Velisadu Maharaajugaa. (2)
    Manasunnavaadu - Daya Choopuvaadu
    Alanaati Anubandhame
    Kanulaara Choodu - Manasaara Vedu
    Digivachhe Mana Kosame
    Ila Digivachhe Mana Kosame
    3. Aa Ningi Taaralla Velagaaliraa - Jagamantha Choosela Brathakaaliraa
    Veliginchuvaadu - Manalonivaadu - Nicichadu Mana Thodugaa (2)
    Saligaali Raatri - Pilisindi Choodu
    Manalona Oka Pandaga
    Bhayamela Neeku - Digulela Neeku
    Yesayya Manakundaga
    Mana Yesayya Manakundaga

    • @brather378
      @brather378 2 ปีที่แล้ว +10

      Devunike Mahima 🙌 amen 🙏

    • @ravikumarpalli9754
      @ravikumarpalli9754 2 ปีที่แล้ว +10

      Praise the lord anna🙏🙏Excellent song 💯music wonderful anna 🙏🙏🙏💯💯💯🎵🎶

    • @jhansimedabalimi4199
      @jhansimedabalimi4199 2 ปีที่แล้ว +4

      WOnerful.. చాలా చాలా బావుంది

    • @ravichandrakatta4158
      @ravichandrakatta4158 2 ปีที่แล้ว +2

      Glory to God super song annaya

    • @badgirltoammu6302
      @badgirltoammu6302 2 ปีที่แล้ว +5

      Wonderful 🎄🎄💐💐💐💐💐

  • @chukkalapadma9061
    @chukkalapadma9061 ปีที่แล้ว +26

    Ee song entha mandhiki nachindhi oka like cheyyandi

  • @chukkalapadma9061
    @chukkalapadma9061 ปีที่แล้ว +2

    So nice song but super very very very very nice naku chala chala nachindhi

  • @kunchesudheer5230
    @kunchesudheer5230 2 ปีที่แล้ว +80

    మీకిచ్చిన తలాంతును బట్టి ఆ గొప్ప దేవునికి మరింత మహిమ కలుగునుగాక..
    Praise the lord....🙏🙏🙏

  • @csichurchvempalliofficial2100
    @csichurchvempalliofficial2100 2 ปีที่แล้ว +75

    ఇంత మంచి సంగీతాన్ని అందించిన వారికి ఎంతో కృతజ్ఞతలు పాడిన వారికి ఈ పాటను మాకు అందించిన వారికి అందరికీ చాలా కృతజ్ఞతలు

  • @tentusundarkumar5469
    @tentusundarkumar5469 2 ปีที่แล้ว +31

    ఇంత మంది కళా కారులను ఒకే చోట చేరి దేవుని స్తుతించడం చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా పాడారు బ్రదర్

  • @AkashMattaCreations
    @AkashMattaCreations 2 ปีที่แล้ว +13

    అసలు సిసలైన క్రిస్మస్ సీజన్ వచ్చేసింది ఈ సంగీతంతో...✌️❤️

  • @RevPastornakkaprakash3456
    @RevPastornakkaprakash3456 2 ปีที่แล้ว +15

    హృదయ పూర్వక ధన్యవాదాలు అండి జాషువా గారు
    మిమ్మల్ని సృష్టికర్తయైన దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక

  • @realhappinessinjesus737
    @realhappinessinjesus737 2 ปีที่แล้ว +12

    నేను ఈ పాట ఒక 15 సార్లు+ విన్నాను. అయినా సరే ఎంతో అద్భుతoగా ఉంది .

    • @sarjenm77
      @sarjenm77 11 หลายเดือนก่อน

      yes

  • @seemonjada8642
    @seemonjada8642 10 หลายเดือนก่อน +2

    Very wonderful and gracious song

  • @salomisudharani4302
    @salomisudharani4302 ปีที่แล้ว +20

    ఎన్ని సార్లు విన్నా ఈ పాట మనసును ఆనందడోలికల్లో నింపుతోంది..వాయిద్యకారులు లీనం ఐపోయారు..డప్పు వాయించిన స్త్రీలు.💐👌👍all the team.💐 Gods blessings...kamalakar bro..jashua shaik bro..కారణ జన్ములు..💐మరెన్నో అద్భుతమైన ఆత్మీయ పాటలకోసం ఎదురు చూస్తున్నాం.. god bless u more and more..💞💕👏💫

  • @motapothula7
    @motapothula7 2 ปีที่แล้ว +40

    ఆనంద భరితమైన పదాలు + స్వరాలు = ఆత్మీయ సంభరాలు హల్లెలూయ జాషువా షేక్ మినిస్ట్రీస్ 😍 🙌🙌

  • @paralokapugavinimelodies
    @paralokapugavinimelodies 2 ปีที่แล้ว +6

    Congratulations one of the best Christmas song 👍👍👍
    క్రిస్మస్ పాటలు ఇష్టపడే వారు నా చానెల్లో కూడా ఒక క్రిస్మస్ పాట రిలీజ్ చేసాను వీలైతే ఆ పాట కూడా వినండి మీ సంఘం లో పాడి ప్రభువును మహిమ పరచండి Happy Christmas

  • @elishajesus4349
    @elishajesus4349 2 ปีที่แล้ว +24

    క్రిస్మస్ సందడి మీ సాంగ్ తో మొదలుపెట్టారు
    వందనాలు బ్రదర్ చాలా బాగుంది

  • @SajeevarajuChetla
    @SajeevarajuChetla 13 ชั่วโมงที่ผ่านมา +1

    One of my favourite song I Love this song ❤✝️🛐

  • @katepoguchinnakatepoguch-uz8wd
    @katepoguchinnakatepoguch-uz8wd ปีที่แล้ว +3

    Samastha mahima ghanatha prabhavamulu yuga yugamulu sarva yugamulu na yesayyakey chellunu gaaakaaa...AMEN✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏🤝

  • @anandmangap37
    @anandmangap37 2 ปีที่แล้ว +11

    మనస్సుని తాకే స్వచ్చమైన సంగీతం.

  • @jkchristopher
    @jkchristopher 2 ปีที่แล้ว +114

    Amazing and Historical congratulations to you all brother, Merry Christmas.

    • @JoshuaShaik
      @JoshuaShaik  2 ปีที่แล้ว +18

      Thank you so much brother 🙏🙏 All glory to God 🙌🙌

    • @chinnahero1
      @chinnahero1 2 ปีที่แล้ว +5

      JKC😍

    • @CHCMedia
      @CHCMedia 2 ปีที่แล้ว

      th-cam.com/video/qeipszsKdjg/w-d-xo.html

    • @katepoguchinnakatepoguch-uz8wd
      @katepoguchinnakatepoguch-uz8wd ปีที่แล้ว +4

      @@JoshuaShaik sir new song yeppudu release sir ???

    • @JoshuaShaik
      @JoshuaShaik  ปีที่แล้ว +2

      @@katepoguchinnakatepoguch-uz8wd th-cam.com/video/N8rv8pq2-yQ/w-d-xo.htmlsi=3QSibDsJ6jW4inW3

  • @peddasubbarayudu4962
    @peddasubbarayudu4962 2 ปีที่แล้ว +13

    అన్న ఏంది అన్నా ఇది music water తోటి
    అబ్బా.... వింటుంటే ఇప్పుడే ఈరోజే ప్రభువు పుట్టినట్టు ఉంది అన్నా
    కమలాకర్ అన్న వందనములు
    Jashuva అన్న వందనములు
    Thanks the lord

  • @allamsirisha9605
    @allamsirisha9605 2 ปีที่แล้ว +32

    దావీదు ఏ పాట కి నాట్యం చేసారో మాకు కళ్ళకి కట్టి నట్టు చూపించారు ....అదే దేవుని ఆత్మ శక్తి మీలో ఉండి మమ్మల్ని ముగ్దుల్ని చేస్తోంది.

  • @mvmmovevithme9913
    @mvmmovevithme9913 2 ปีที่แล้ว +9

    ఆరోగ్యమైన సంగీతం ఉల్లాసం కలిగించే పాట. దేవునికి మహిమ.

  • @Davidraju-y7s
    @Davidraju-y7s 2 ปีที่แล้ว +58

    Kamlakar అన్నాకి అలాగే క్రైస్తావ్యాని సంగీతం ద్వారా బలపరుస్తున్నా వారందిరికీ దేవుని కృప తోడైయుండును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్......

    • @devakumarkumar333
      @devakumarkumar333 2 ปีที่แล้ว +1

      ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @rajumendi222
    @rajumendi222 2 ปีที่แล้ว +7

    సంగీతానికే సందడి చేసింది. ఏలో ఏలో ఏలో అంటూ సాగింది. ఈ పాట చాలా బాగుంది.

  • @jayasriprakhya2601
    @jayasriprakhya2601 2 ปีที่แล้ว +148

    Excellent... ఇంత మంది కళాకారులను ఒకే చోట చేర్చి కళలను, కళాకారులను అవకాశం ఇవ్వటం చాలా హర్షించతగ్గ విషయం.. జాషువా గారికి కమలాకర్ గారికి అభినందనలు 🌹🌹

  • @rajasekharvaddi7620
    @rajasekharvaddi7620 24 วันที่ผ่านมา +1

    ⛑️⛑️⛑️PRAISE THE LORD JESUS BRO.KAMALAKAR,JOSHUA SHAIK,JAVED ALI EXCELLENT MUSIC HALLELUJAH 🙌

  • @buildthetrueth7132
    @buildthetrueth7132 2 ปีที่แล้ว +11

    మన మనసులో ఆయన ఉన్న ప్రతి దినం క్రిస్మస్ పండుగే 🕎🕎🕎🎉🎊🎉🎊🎆🎇🎁🎁🎄🎄🎄🎄

  • @manukondasomeswararao5057
    @manukondasomeswararao5057 2 ปีที่แล้ว +17

    మీ నిర్మాణ సామర్థ్యం,కమలాకర్ గారి మ్యాజిక్ లాంటి మ్యూజిక్,జావేద్ అలి గారి గాన మధురిమ అన్నిటికీ మించి దేవుని కృప మీ అందరి మీదా ఉంది నడిపిస్తున్న తీరు అద్భుతం అనిర్వచనీయం..అమోఘం... praise the lord అన్న గారు💐💐💐💐👌👌

  • @kishoreu5410
    @kishoreu5410 2 ปีที่แล้ว +36

    చాలా ఉత్సాహంగా ఉంది పాట,,, నిజంగా పాట వినినంత సేపు క్రీస్తు పుట్టిక కళ్ళకు ఎదురుగా ఉన్నట్లు ఉంది 👏👏👏👏🙏

    • @shobasr4868
      @shobasr4868 2 ปีที่แล้ว +1

      Mesmarinsg and too joyful song. Tanks to the entire Team. God bless you all

    • @sarithadm6507
      @sarithadm6507 2 ปีที่แล้ว +1

      Thankyou Joshua Shaik brother.

  • @prabhugunji
    @prabhugunji 2 ปีที่แล้ว +11

    సంగీతం, సాహిత్యం అద్భుతం అన్న 🌹🌹🙏👌👌

  • @vijayakumaar2309
    @vijayakumaar2309 2 ปีที่แล้ว +2

    Super super super super super super super sir.......no words to express my feelings......just went on listening.......wow what a great composition....... excellent 👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @christiansilas1955
    @christiansilas1955 2 ปีที่แล้ว +6

    పాట చాలా బాగుంది music 🎵🎶🎶🎵🎵 సూపర్ ❤️❤️❤️
    దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాకా 🙏🙏🙏

  • @sathishkumar1236
    @sathishkumar1236 ปีที่แล้ว +3

    దేవుని నామమునకు మహా మహిమ ఘనత కలుగును గాక..... జాషువా అన్నగారు, ప్రతీ బాష లో ఉన్న గాయకుల (పాత గాయకులు, గొప్పగాయకులు, మరియు నూతన గాయకులు)తో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పాటలు పాడించాలన్న మీ ఆలోచన చాలా ప్రశంసనీయం.....

  • @balabhadhraashokbhalabadhr3011
    @balabhadhraashokbhalabadhr3011 2 ปีที่แล้ว +8

    పాస్టర్ గారు పాట చాల బాగుంది ఇలాంటి పాటలు చాల రచించాలని కొరుకుకూంటూ ఆమేన్!👌👍💕👑🎅🏽🤶🎄🎇✨🎉🎊🙏🙏🙏🎵🎶

  • @neerajkumarpinagada4441
    @neerajkumarpinagada4441 2 ปีที่แล้ว +7

    నా దేవునిలో నిజమైన సంతోషం ఉంటాదని ఈ పాట ద్వారా తెలియచేశారు.... Music చాలా బాగుంది..సాంగ్ పాడిన అన్నకు, వెనుక e song కోసం కష్టపడిన వారందరికీ దేవుడు దీవించాలి.. ఇంకా అనేకమైన సాంగ్స్ తయారు చేసి ప్రజలలోకి తీసుకొని వెళ్ళాలి..దేవుని రాజ్య సువార్త వెదజల్లాలి

  • @ramisettichanti9406
    @ramisettichanti9406 2 ปีที่แล้ว +15

    థాంక్స్ సార్ మా కోసం ఈ సాంగ్ రాసినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @mahimasuvvada7316
    @mahimasuvvada7316 2 ปีที่แล้ว +2

    Manassunna vadu dhaya chupu vadu alanatye anubandhame oh what a lyrics hrudyanni kadhilinche padhalu avi 🥲🥲🥲 praise the lord 🙏 brother Joshua Sheikh

  • @iamindian8276
    @iamindian8276 2 ปีที่แล้ว +38

    జాషువాగారి రచన , కమలాకర్ గారి సంగీతం మహోన్నతుడైన దేవుని ఔన్నత్యాన్ని స్మరిస్తున్నది.
    టీమ్ అందరికీ వందనములు.

  • @rajasekhar4582
    @rajasekhar4582 2 ปีที่แล้ว +7

    దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక 🙏🙏🙏🙏

  • @sireeshasali1651
    @sireeshasali1651 2 ปีที่แล้ว +9

    దేవునికి మహిమకరంగా ఉండే అద్భుతమైన సంగీతాన్ని క్రైస్తవ ప్రపంచానికి అందిస్తున్న జాషువా గారికి, కమలాకర్ గారికి నా అభినందనలు. We are practicing and singing in our church 🎶🎶🎶🎶 Thank u all d musical team.

  • @cutebaby8455
    @cutebaby8455 2 ปีที่แล้ว +1

    Yesaya puttika pandaga antha. Yentha sambram ga ullasamga na yesaayya kosam yentho bagundi .....vintene yentho santhosham ga undi ....all glory to God ...all god bless you in Jesus name

  • @pongaaruna9153
    @pongaaruna9153 2 ปีที่แล้ว +13

    Super anna chalaa bagundi song 🤩🤩 Christmas sambaralu start,. దేవునికే మహిమ కలుగును amen 🙏.....

  • @paster.suresh6614
    @paster.suresh6614 2 ปีที่แล้ว +1

    దేవుని పనిలో మికున్న ఆసక్తి వివరించలెము అన్న వందనములు దేవుని కే మహిమ

  • @hariceravupalli9410
    @hariceravupalli9410 2 ปีที่แล้ว +5

    ఏలో ఏలో ఏలో అంటూ... ఈ పాట వింటుంటే గుండె పులకరించింది..., ముఖ్యంగా జాషువా సార్ ప్రొడక్షన్ కాస్ట్ చాలా హైప్, దానికి తగ్గటటుగానే కమలాకర్ సార్ మ్యూజిక్ .... ఇద్దరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తలియజేస్తున్నాను... Thank u for this lovely song

  • @adapa.nehemiah9054
    @adapa.nehemiah9054 2 ปีที่แล้ว +1

    Deviniki mahima kalugunu gakaa.samastha mahima yesuniky....tq .... glory to god

  • @goduguraju4044
    @goduguraju4044 2 ปีที่แล้ว +5

    చాలా చాలా అద్భుతంగా సాంగ్ ప్రదర్శించారు రెల్లి బ్యూటిఫుల్ సింగింగ్ గాడ్ బ్లెస్స్ యు బ్రో

  • @Veedhi.ChinnaRaju-kg3zz
    @Veedhi.ChinnaRaju-kg3zz 9 วันที่ผ่านมา +1

    🥰 lyrics 🎧.......✝️🛐....... Praise the lord 🙏

  • @Helpingothers1987
    @Helpingothers1987 2 ปีที่แล้ว +4

    చాలా అద్భుతమైన పాట సంగీతం ఇంక మాటలు లేవు చాలా బాగుంది స్వరం చెప్పనవసరం లేదు చాలా బాగుంది లిరిక్స్ అద్భుతం సమస్త మహిమ ఘనత దేవునికి కలుగును గాక ఆమెన్ may God bless you joshuva shaik garu entire team

  • @suvarthamannem6659
    @suvarthamannem6659 2 ปีที่แล้ว +8

    దేవుడు మీకు ఇచ్చిన తలాంతును బట్టి వందనాలు బ్రదర్

  • @jaladibonnke621
    @jaladibonnke621 2 ปีที่แล้ว +23

    సూపర్ సాంగ్ అన్న ఇలాంటి క్రిస్మస్ సాంగ్స్ ఇంకా చాలా చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక

    • @mrajakumari
      @mrajakumari 2 ปีที่แล้ว +2

      One more joyful song beautiful song brother. Glory to God 🙏🙌👌👌👌👌💐💐💐💐💯💯🙌🙌😍 God bless you 🙌🙌

  • @prasannasingh8090
    @prasannasingh8090 2 ปีที่แล้ว +1

    Wah! Javedji kitni acchhe se gayen aapne Telugu folk 👏👏👏👌👌

  • @bobbalacreations7774
    @bobbalacreations7774 2 ปีที่แล้ว +7

    అన్న goosebumps 😍😍😍😍😍😍😍ఒళ్ళంతా పులకరించి,, 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐💐happy christmas anna

  • @samuyelumylapalli5576
    @samuyelumylapalli5576 2 ปีที่แล้ว +2

    Beas insense wonderful song wonderful thank you brother thank you kamalakar brother

  • @ece-0417
    @ece-0417 2 ปีที่แล้ว +4

    Super song. Entha santhosam ga vundo e song vinte. Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @Sona-yh2jd
    @Sona-yh2jd 2 ปีที่แล้ว +1

    Anni vaiedhya parikaralaku swaranni jodinchi devunni mahima parachina goppa paata devuniki sthothramu 🙏 meku kruthagnathalu 🙏

  • @GT-Express
    @GT-Express ปีที่แล้ว +3

    Ultimate matallev..praise the lord🙏devudu goppa jnanam icharu .. wonderful team 👍🏻

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 2 ปีที่แล้ว +2

    Wonderful song super super ga padinaru god bless you brother family 🙏🙏

  • @bspaul5738
    @bspaul5738 2 ปีที่แล้ว +12

    Amazing , unbeatable music , arrangements it's next level , Glory to God, God bless Joshua garu, Kamala kar garu and Javed ji , All glory to God.

  • @charlessunderraj5703
    @charlessunderraj5703 2 ปีที่แล้ว +1

    Joshua Shaikh + Javed Ali + Kamalaker and his talented musicians = Christmas sandadi.
    Javed ali sang heartfully the holy spirit guided lyrics to to beautifully composed music. The result is even older people will dance. 👌🏼👍👏

  • @jaldirajakumar4378
    @jaldirajakumar4378 2 ปีที่แล้ว +5

    కేక అన్నగారు మీ పాటలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తాం దేవునికే మహిమ కలుగును గాక

  • @kavikasingaluri2961
    @kavikasingaluri2961 2 ปีที่แล้ว +2

    Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 praise the lord 🙏🙏👏🙌🙏👏🙌🙏 Amen

  • @sirivellagrace
    @sirivellagrace 2 ปีที่แล้ว +10

    All Glory, Honour worship and praise belongs to him Alone our Almighty God forever Amen Praise God dear loving Joshua Shaik sir and Kamlakar KKrao sir and everyone entire team members ministry Amen

  • @sarojastella9395
    @sarojastella9395 2 ปีที่แล้ว +1

    Am pastor.dr.prince angel superb mind blowing speech less.... Song Javed Ali garu praise god.all glory to god.

  • @devakumarjesusmelodys1184
    @devakumarjesusmelodys1184 2 ปีที่แล้ว +6

    అన్నా నువ్వు పాడుతుంటే దావీదే నృత్యం చేసినట్టు ఉంటుంది గాడ్ బ్లెస్స్ యు అన్న

  • @laxmikumari2200
    @laxmikumari2200 2 ปีที่แล้ว +2

    Price the Lord annya Garu songs super cute 🙌🙌🙌💒💒🌹🌹🌹🌹🌹💐💐💐💐🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶👨‍👩‍👧‍👦🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇 price the Lord ayyagaru amen

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 2 ปีที่แล้ว +11

    Happy Christmas 🎄☃️🎄🎄
    పరలోక తండ్రీ కి సమస్త మహిమ ఘనత కలుగును గాక.🛐✝️🛐
    లోకాలు ఏలేటి రారాజు. యేసయ్య నీకు స్తోత్రం.🙏🙏🙏🙏🙏

  • @sonyreddysonyreddy1545
    @sonyreddysonyreddy1545 2 ปีที่แล้ว +1

    SUPERB ANDHARU DEVUNIKE MAHIMAKALUGUGAKAA GOD BLESS YOU TOO ALL NICA SINGING 🎤🙏🙏🙏👌👌👌👏👏👏

  • @amithajampana146
    @amithajampana146 2 ปีที่แล้ว +5

    Wow superr wonderful singing and Lyrics also good ... superr superr 👌👌👌👏👏👏👏👏👏👏👏no words 🙌👌

  • @marthaganta1595
    @marthaganta1595 ปีที่แล้ว +1

    Oh my God..... nobody can say that Mr Javed Ali doesn't know Telugu..... excellent 👍

  • @peddasubbarayudu4962
    @peddasubbarayudu4962 2 ปีที่แล้ว +5

    జావిద్ అలీ అన్నా చాలా మంచిగా పాడారు

  • @sangeetharms1819
    @sangeetharms1819 ปีที่แล้ว +1

    God manchi swaranni echadanna tq Javid ali annayya jesus song padinanduku mi patadwara konni hrudayalu maruthai.....

  • @banavathvenkatesh6357
    @banavathvenkatesh6357 2 ปีที่แล้ว +4

    Kannula panduga laaga vundhi.🥰🤩
    Chala chala adbhuthamga vundhi mee rachana Joshua Shaik garu.👏
    And kamalakar gaari sangeetham Javed Ali gari swaram chala chakkaga kudhiraayi😉🔥.
    We want these wonderful and energetic songs and God bless this ministry more and more.❤
    AMEN😇

  • @priyasri1868
    @priyasri1868 2 ปีที่แล้ว +1

    Devuniki mahima kalugunu gaka amen halleluyah

  • @rojasanayila6322
    @rojasanayila6322 2 ปีที่แล้ว +3

    Very amazing song in christianity 👌👌👌👌👌ఎప్పుడు చూడని మ్యూజిక్ వాయుధ్యాలును ఈ పాట లో చూస్తున్నాం...... చాలా బాగున్నది 👍👍👍👍back ground లో ఎంత hardwork చేశారో........ హ్యాట్సాఫ్ to all team members.... Lyrics also very Nice

  • @chinnijangam3016
    @chinnijangam3016 2 ปีที่แล้ว +1

    Excellent excellent excellent………………song 💯💯💯💯💯💯💯💯💯💯 Highlight music ❤❤❤

  • @enarendranaik
    @enarendranaik 2 ปีที่แล้ว +6

    Great Congratulations sir.. Amazing Folk Flavour 🎾
    Javed Ali sir voice is very specific 🍿
    Pranam Kamalakar sir's Music Speaks Wholeheartedly with Peace.
    Joshua Shaik sir's Lyrics is a very very Depth in Spiritual ♥️

  • @sugandhis8824
    @sugandhis8824 2 ปีที่แล้ว +1

    Glory to God in the highest.
    Celebrate our Majesty, King of Kings, Lord of Lords .
    Adbuthamaina song .

  • @princehemla1750
    @princehemla1750 ปีที่แล้ว +5

    Praise The lord Annaa....
    What a music player....
    Reallly ....
    Amen .Hallelujahaaa....

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 ปีที่แล้ว +2

    God bless you all forever in the name of Jesus Christ... Amen....

  • @pechetticharita4768
    @pechetticharita4768 2 ปีที่แล้ว +5

    దేవునికి మహిమ కలుగును గాక...... ఆమెన్ 🙏🙏

  • @syamsarilla3104
    @syamsarilla3104 2 ปีที่แล้ว +1

    👌👌👌👌ఆమెన్ దేవుని కే మహిమ

  • @rajasekhark312
    @rajasekhark312 2 ปีที่แล้ว +3

    One more excellent song Bro. Joshua and Bro.Kamalakar. Very nice singing Javed sir. And Lord our god be with you and give more opportunities to sing and glorify the one and only Lord Jesus Christ. Amen

  • @crazykids7992
    @crazykids7992 ปีที่แล้ว +2

    Excellent ossume 🎶 musical items 👌its different I ever seen this type of music no word over the sky.

  • @majjianok2653
    @majjianok2653 2 ปีที่แล้ว +3

    ఆహ! పాట- అద్భుతం స్వరం- అమోఘం సంగీతం- బీభత్సం ఏది ఏమైనా నా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్...!

  • @pagillasumalatha5550
    @pagillasumalatha5550 2 ปีที่แล้ว +1

    Wow enni music 🎶🎵🎶🎵🎶🎵 instruments ooooh.....

  • @JohnMahesh.Official
    @JohnMahesh.Official 2 ปีที่แล้ว +7

    వెన్నెల్లో పూసింది ఓ సందడి... అద్భుతమైన రచన 🙏🏼🙏🏼🙏🏼👌👌👌

  • @bvsbnsp
    @bvsbnsp 17 วันที่ผ่านมา +1

    మీ పాటలు ఎంత మధురంగా ఉంటాయో మాటలలో చెప్పలేము. సాహిత్యం, సంగీతం, పాడేవారు, వాయిద్యకారులు ఎవరికీ వారే సాటి. పరలోకానికి ఆనందంతో పరుగులు తీస్తున్నట్లు ఉంది మీ పాటలు వింటుంటే💐🙏🕯️🧎🎊🎉

  • @kenguvaappalanaidu3181
    @kenguvaappalanaidu3181 2 ปีที่แล้ว +3

    Chinna nuv bhaleyga so sweetga paadav god bless you always ♥you all team

  • @rojagabriel4336
    @rojagabriel4336 11 หลายเดือนก่อน +1

    సూపర్ సూపర్ చాలా చాలా రోజుల తర్వాత మంచి పాటలు విన్నాము

  • @pabbathidevadanam4441
    @pabbathidevadanam4441 2 ปีที่แล้ว +4

    మీ నుండి వస్తున్న పాటల ద్వారా దేవునికే మహిమ కలుగునుగాక 🙏🙏🙏 కమలాకర్ అన్న గారికి మా నిండు వందనాలు 👏

  • @own-feeling
    @own-feeling 17 วันที่ผ่านมา +1

    What very beautiful song 🔥🙏🙏🙏

  • @Studiogsk1493
    @Studiogsk1493 2 ปีที่แล้ว +4

    దేవుని పుట్టుక పరమార్థం తెలియపరచారు అన్న

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 2 ปีที่แล้ว +1

    Powerful Confident Singing by Bro.Javed.Excellent.Ullasanga Uruvada.Yelo Yelo Yelo.

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 ปีที่แล้ว +3

    Wonderful and excellent and amazing and beautiful and lovely and cute and awesome and fantastic song forever in the name of Jesus Christ... Amen...

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 2 ปีที่แล้ว +1

    Amin Deva e vakyam echenaduku veladi vandanalu

  • @Saritha403
    @Saritha403 2 ปีที่แล้ว +4

    Thank you so much entha కష్టపడి ma kosam entha manchi song క్రిస్మస్ కూ maku dhayachesaru దేవుడు మిమ్మును దివించును గాక అమెన్

  • @sanjaydoraswamy1338
    @sanjaydoraswamy1338 ปีที่แล้ว +1

    Feel like listening again and again

  • @yasaswiannafanshivasai3081
    @yasaswiannafanshivasai3081 2 ปีที่แล้ว +3

    Wow beautiful ❣️❣️❣️ music 🎶🎶 that was wow superrr really ... Heart touching and ⭐smile...

  • @yasaswiannafanshivasai3081
    @yasaswiannafanshivasai3081 2 ปีที่แล้ว +2

    Javed Ali anna singing 🎙️🎶🎶🎶 was superrrrrrrrrrrrrrrr 💙💙💙

  • @msnmanikantamuthayal5224
    @msnmanikantamuthayal5224 2 ปีที่แล้ว +3

    Song 👌👌👌 sir devadi devuniki mahima kalugunu gaka amen
    Praise the lord

  • @Laxmigopalbarla
    @Laxmigopalbarla 7 หลายเดือนก่อน +1

    తనివి తీరని పాట మనసు పరితపించి పోయే పాట మళ్లీ మళ్లీ వినాలి వినాలి అనిపించే పాట ఎన్నిసార్లు విన్నా సరే బోరే అనిపించని పాట ఎప్పటికైనా హృదయాన్ని తాకే పాట ఎప్పటికప్పుడే కొత్త పాట అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే సరిపోలే సరిపోదు జీవితం ఐ లవ్ జీసస్ ఐ లవ్ జీసస్ ఐ లవ్ జీసస్ ఐ లవ్ జీసస్❤❤❤❤❤