kshaminchanu - Story by Kommuri Venugopala Rao - క్షమించాను - కొమ్మూరి వేణుగోపాలరావుగారు వ్రాసిన కథ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ย. 2022
  • #kiranprabha #telugu #kommuri
    అలనాటి సుప్రసిద్ధ కథా, నవలా రచయిత కొమ్మూరి వేణుగోపాలరావుగారు 1957 లో వ్రాసిన కథ 'క్షమించాను '. 65 సంవత్సరాల క్రిందట తన 22 సంవత్సరాల వయసులో కొమ్మూరి వేణుగోపాలరావు గారు వ్రాసిన మానసిక విశ్లేషణ అంతర్లీనంగా సాగే కథ ఇది. 35 సంవత్సరాలు కాపురం చేసిన ఓ జంట, ఆమె మరణశయ్య మీద ఉండగా అన్నేళ్ళూ తన మనసులో దాచుకున్న భావాల్ని భర్తకు చెప్పేసింది. అన్నేళ్ళు ఆయన కౄరత్వన్ని భరిస్తూ, ఆయనకు తెలీకుండానే ఆయన్ని క్షమిస్తూ జీవించానని చెప్పింది, ఆయనకదో షాక్..!! ఎలాగూ చనిపోతాను కదా అని అంత ధైర్యంగా చెప్పేసింది.. కానీ.. తర్వాతేం జరిగింది? కొమ్మూరి వేణుగోపాలరావుగారి కథకు కిరణ్ ప్రభ కథనం, విశ్లేషణ. మనసుల్ని కదిలించే కథ, మనసుల్ని కలవరపరిచే కథ కూడా.
    చదవడానికి లింక్ ఇదీః
    drive.google.com/file/d/1XBoI...
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 89

  • @commonman6304
    @commonman6304 ปีที่แล้ว +16

    ఓ వ్యక్తి తన 22వ ఏట.. సంక్లిష్టమైన భార్యాభర్తల మానసిక చిత్రణని ఇంత గొప్పగా ఆవిష్కరించటం.. చాలా అరుదైన విషయం..!!
    మీరు మాకు అందించిన తీరు అభినందనీయం..

  • @vedapanditaha
    @vedapanditaha หลายเดือนก่อน +1

    ❤ నిజం గా అద్భుతమైన కథను అందించారు ముఫై సంవత్సరాల క్రితమే నేను చదవి లేదా విని ఉంటే ఇంకా బాగుండేది అనే అభిప్రాయాన్ని దాచుకోలేక పోతున్నాను,🙏

  • @chandrasekhar1234
    @chandrasekhar1234 ปีที่แล้ว +2

    అద్భుతమైన కథలు వినిపిస్తున్న కిరణ్ ప్రభ గారికి శతకోటి వందనాలు.
    ఆనాటి పురుషాధిక్యతను ప్రస్తావిస్తూ కొడవటిగంటి కుటుంబరావు గారు ఒక కథలో "అవినీతి పరులైన అధికారులముందు చేతులు కట్టుకొని చిత్తం, చిత్తం, అనే పురుషులు కొందరు,
    ఇంటికి వచ్చాక పురుషాహంకారంతో నోరు లేని భార్యపై మాత్రం దౌర్జన్యం చేస్తుంటారు "అని వ్రాశారు.
    ఆభావాన్నే కొ :వే గారు స్త్రీ ఔన్నత్యాన్ని చక్కగా వివరించారు.
    కిరణ్ ప్రభ గారు!మీ పఠనా నైపుణ్యం మాత్రం అమోఘం.దైవదత్తం.🙏

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 ปีที่แล้ว +26

    22 సంవత్సారాలు వయస్సు లో ఇంత మెచ్యుర్డ్ గా ఆలోచించిన రచయితకి పాదభి వందనాలు ఈ కథను ఇంత బాగా వినిపించిన మీకు కూడా పాదాభివందనాలు మీ అభిమాని from Vizag

  • @user-cy1ce4iv3z
    @user-cy1ce4iv3z ปีที่แล้ว +8

    "అస్థిర స్థిరత్వం" అద్భుతమైన పద ప్రయోగం. అంత చిన్న వయసులో ఎంతో పరిణతి చూపిన కొమ్మూరి వారి రచనారీతి అద్భుతం. తాను మరణించినా జీవించినా ఆదిశేషయ్య మాత్రం జీవశ్చవంగా నే మిగిలి పోతాడు.

  • @subhakarraokanaparthi5311
    @subhakarraokanaparthi5311 ปีที่แล้ว +3

    ప్రభాకర్ గారు నమస్కారం. కార్ల్ మార్క్స్ గారి జీవిత చరిత్ర లాగానే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ను టాక్ షో చేయగలరని మనవి.

  • @chilakamarthisaiseshu4651
    @chilakamarthisaiseshu4651 ปีที่แล้ว +3

    ముందుగా శ్రీ కొమ్మూరి వేణుగోపాల్ గారి "క్షమించాను" ను అధ్భుతంగా ఆవిష్కరించిన శ్రీ కిరణ్ప్రభ గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు. ఆనాటి 22 సంవత్సరాల శ్రీ కొమ్మూరి వారికి ఈనాటి 57 సంత్సరాల నేను పాదాభివందనం చేస్తున్నాను.
    అలాగే వారి అబ్బాయి గారి గొంతు విని ఎంతో సంతోషించాను. అందుకు మరోసారి మీకు నమస్కారాలు.
    - చిలకమర్తి శేషు

  • @prasadart5898
    @prasadart5898 2 หลายเดือนก่อน

    కథలు చదివితే మంచి ఆలోచనలు వచ్చి, వేరే కథలు రాయటానికి ప్రేరణ కలుగుతుంది అనేవారు దాసరి గారు
    కూతురు కోణంలో నాకు వేరే కథ తట్టింది. కిరణ్ప్రభ. గారికి‌ ధన్యవాదాలు 🎉

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว +7

    చిన్న వయసులోనే ఇంత మంచి కథ రాసిన రచయితకి నా మనస్సులు🙏చదివిన మీకు ధన్యవాదాలు..

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 ปีที่แล้ว +2

    ఏం కథ!!అద్భుతం అనాలా,ఆలోచింపజేసే కథ అనాలా,మనసును మధించే కథ అనాలా ..?! అంత చిన్న వయసు లో ఇంతటి మానసిక పరిపక్వత ఎలా అబ్బిందో రచయితకు! ఒక స్త్రీ ఔన్నత్యాన్ని సరళమైన భాషలో ఎంతో లోతైన భావాలతో రచయిత పాఠకులకు పరిచయం చేసారు! అంత చిన్నవయసులోనే రచయిత తెలుసుకున్న కఠిన సత్యాలు-‘భార్య భర్తకు పెట్టిన భిక్ష భర్త దుర్మార్గాన్ని బయట పెట్టక పోవడం’. ఒక భర్త(తండ్రి) ‘పాపాలు చేస్తూ క్షమించబడుతూ వృద్ధుడయ్యాడు’ ,. ‘పాపానికి పరిధి వుంది,ప్రాయశ్చిత్తం లేదు’-ఇలా కథలో ఎన్నో అక్షర సత్యాలు వున్నాయి! ఒక్కటే బాధ-భర్త కు ,జీవితాంతం అతడు చేసిన దుర్మార్గాలను తాను ఏవిధంగా క్షమించిందో చెప్పి తన ఔన్నత్యాన్ని తెలియజెప్పిన భార్య-చివరికి అతని మనసు నొప్పించానేమో అని బాధపడి ఒక మామూలు భార్యగా మనసులోనే బాధపడుతూ చనిపోతుంది! రచయిత అంత చిన్న వయసు లోనే ఒక స్త్రీ భూదేవి లా పరమ సహనశీలి అని,పురుషుడు తన ఇంట్లో తాను సహజంగా పరమ దుర్మార్గుడు-అని గ్రహించిన రచయితకు పాదాభివందనాలు. ఇంత మంచి సహజమైన కథను గొప్పగా విశ్లేషించినందుకు, శ్రోతలకు అందించినందుకు కిరణ్ ప్రభ గారు ఎంతో వందనీయులు.

  • @satishganta8991
    @satishganta8991 ปีที่แล้ว +6

    "క్షమించడం" ఒక బలంగా అభివర్నించడం... 👏👌👍🙏

  • @raambabu7111
    @raambabu7111 ปีที่แล้ว +4

    ఈ కథలో నన్ను నేను చూసుకుంటున్నాను.. రచయితకు శతకోటి పాదభివందనాలు...

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 ปีที่แล้ว +2

    కిరంగారు నమస్తే క్షమించను కథను ఎంతచక్కగా విశ్లేషణ సినిమాలగా చూపించారు, s సాంబశివరావు 84ఇయర్స్, గుంటూరు......

  • @sucharithakotagiri3418
    @sucharithakotagiri3418 ปีที่แล้ว +4

    నమస్కారం ప్రభాకర్‌ సార్‌ నేను అనుకొనేదాన్ని ఆడవారి హృదయపు లోతులను ఒౌన్నతాన్ని శరత్‌ చూపించినంతగా ఇంకెవరూ చూపించలేరు
    అని కాని నా అభిప్రాయం తప్పని ఈకథ విన్నాక అనిపించింది ఇంకెంతకాలమయ్‌నా
    ఆడవారి జీవితాలు ఇంతేనా అనిపిస్‌తున్నది సార్‌

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 10 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది. 22 ఏళ్ల వయసులో వ్రాయడం గొప్ప విషయం... రచయిత కి మీకు ధన్యవాదాలు....🎉🎉🎉🎉

  • @k.z.s.kumarkarise8278
    @k.z.s.kumarkarise8278 2 หลายเดือนก่อน

    Excellent
    మేము స్వయంగా చదివినా ఇంత విశ్లేషాత్మకంగా ఆలోచించి అర్ధం చేసుకోగలమా అన్నట్టుగా ఉంది

  • @nemanisomayaji9568
    @nemanisomayaji9568 ปีที่แล้ว +1

    ఓం
    చాలా చక్కని కధ వినిపించారు. అభినందనలు. కొమ్మూరి వేణుగోపాల రావు గారి ఈ కధ నిజంగా జీవిత మధనం. అన్ని కాలాలలో ఎదో ఒక మూల కదులు తూనే ఉంటుంది.
    నా బుద్ధి కి తోచిన అన్వయం.
    1 ఆది శేషయ్య లో క్రమం గా మార్పు వచ్చింది.
    2 పార్వతమ్మ భర్త ప్రేమ చవి చూసింది.
    3 అమ్మ వారి వాక్కు వృధా కాలేదు. పార్వతమ్మ పసుపు, కుంకాలతో చల్లగానే వెళ్లి పోయింది.
    ఆది శేషయ్య ఎంత మారినా చివరి దశ లో శిక్ష అనుభవించక తప్పలేదు..... 🙏🏻

  • @rajinikatragadda1695
    @rajinikatragadda1695 ปีที่แล้ว +4

    కధ, కధ గురించి మీరు చెప్పటం రెండూ చాలా బాగున్నాయి , కిరణ్ ప్రభ గారు. అభినందనలు.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว +4

    మానసిక వ్యథ మనిషిని చాలా కృంగదీస్తుంది

  • @sistlakrishnamurty3822
    @sistlakrishnamurty3822 ปีที่แล้ว +1

    అద్భుతమైన కథను అద్భుతంగా పరిచయం చేసిన అద్భుతమైన వ్యక్తికి ...
    వందనాలు🙏🙏

  • @nag2447
    @nag2447 ปีที่แล้ว +1

    70 years experienced persons రాసే కత @22years లో రాశాడు అంటే k.venugopal rao గారు really great. Thanks kiran prabha garu. Great story. From eswar iit kanpur

  • @gayatrikosuru4741
    @gayatrikosuru4741 ปีที่แล้ว +4

    మంచి కథ,వింటున్నంత సేపు సమయం తెలియలేదు.హృదయం కదిలించి కన్నీరు పెట్టించే భావజాలం. 'క్షమ' యొక్క విలువ ఎంత గొప్పది.రచన అద్భుతం. యువ రచయితలకు ఎంతో స్ఫూర్తి. చక్కని వ్యాఖ్యానం చేసిన మీకు ధన్యవాదాలు.

  • @shankarshaharsid5766
    @shankarshaharsid5766 ปีที่แล้ว

    నాకు వివాహమై 31 సంవత్సరాలు దాటింది నిజం చెప్పాలంటే నేను కూడా ఈ ఆది శేషయ్య లాంటి వ్యక్తి నే., ఈ కథ వింటున్నంత సేపు నా గుండె దడ దడ లాడింది అక్కడ పార్వతమ్మ ఇక్కడ మా ఆవిడ బ్రతికి ఉంటే చాలు అనిపించింది. ఏది ఏమైనా మా లాంటి వాళ్ళు... ముఖ్యంగా నేను ఇప్పటికైనా మారి భార్యను అర్థం చేసుకుని ఒక మంచి భర్త గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. రచయితకు మరియు కిరణ్ ప్రభ గారికి నా కృతజ్ఞతలు.

  • @NAADESAM
    @NAADESAM ปีที่แล้ว +2

    పురుషాధిక్యత , మహిళ లసహనాన్ని గొప్పగా పరిచయం చేసిన రచయితకు దాన్ని అత్యంత ఆసక్తికరంగా విశ్లేషించిన కిరణ్ ప్రభగారికి అభినందనలు, ధన్యవాదాలు.

  • @muraligattupalli6607
    @muraligattupalli6607 ปีที่แล้ว +1

    కొమ్మురి వేణుగోపాలరావు గారి రచనలు చాలా బాగుంటాయి, అందునా మీ కధా వివరణ ఎంతో బాగుంది, కొంత ఉపోద్ఘాతం ఎక్కువయిందని నా అభిప్రాయం…👌

  • @DurgaPrasad-qo2rp
    @DurgaPrasad-qo2rp ปีที่แล้ว

    It is the most powerful scaning of mind vibrations presentations thanks for this wonderful story

  • @shaliviran9071
    @shaliviran9071 ปีที่แล้ว +1

    Great narration really heart touching story of a real human being.. this is the greatness of forgiveness

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 ปีที่แล้ว +3

    నా చిన్న తనం లో సినిమా హీరోల కున్నంత craze నవలా రచియితలకు ఉండేది ! పరిగెడు తున్న రైలు లో నుండి బయటి దృశ్యాలను వీక్షించినంత తేలికగా ఆ కధలను చదివే వాళ్ళం ! మీరే శ్రోతలకు చాలా సౌకర్యంగా వుండే విధం గా ఈ కధను చదివారు ! మేము అప్పట్లో అంత అర్ధవంతం గా చదవనూ లేదు ! 22 ఏండ్ల వయస్సులో ఇంత చిన్ని కధలో అంత పెద్ద ఆలోచనలు భావ గర్భితనగా రచన చేయ గలగటం, వారు ఆ వయస్సులోనే జీవితాలను అంత దగ్గరగా పరిశీలించి, తనదైన శైలిలో కధారూపం లో కి 'శిల్పి' లాగా మలచటం -- ఇవన్నీ అప్పుడు గ్రహించలేని పపసి మనస్సు ! ఇప్పుడైనా, మరిన్ని సార్లు పఠించితే గాని రచయిత కథలో మూలాంశము అర్ధం కాని స్థితి ! మీరు ఈ కధ మీద research చేసి thesis submit చేసినట్లుంది ! వారి కుటుంబ సభ్యులకు ఎంత ఆనందం కలుగజేశారో కదా ? మాకు కూడా ! మీకు ధన్యవాదములు !

  • @sundarib8346
    @sundarib8346 ปีที่แล้ว +1

    Chaalaa manchi kadha andincharu. Manasika visleshana chalaa baagaa chepparu.kommuri venugopal gaari novels naaku chaalaa ishtam

  • @umarani2159
    @umarani2159 ปีที่แล้ว +1

    Sir
    మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా
    సరిపోదు.

  • @Dur290
    @Dur290 ปีที่แล้ว +1

    Chaala klistamaidhi manassu.

  • @jyothigundabolu5532
    @jyothigundabolu5532 ปีที่แล้ว +3

    This story remains as an iconic story forever because writer narrated beautifully about the power of forgiveness and unconditional love. He has shown the power of forgiveness which is living peacefully with head high above water. She was portrayed as a powerful and great human being.
    A magnanimous story.
    Thank you for telling such a beautiful story to all of us , Kiran’s Prabha Garu
    All the best
    Jyothi

  • @suryapadmavatikotaru3519
    @suryapadmavatikotaru3519 ปีที่แล้ว +2

    కథ చాలా బావుంది సర్.
    చిన్న వయసులో మంచి గా రాశారు రైటర్.
    కిరణ్ ప్రభ గారి వ్యాఖ్యానం కూడా చాలా బావుంది.
    ఆ రోజుల్లో భార్యలు...భర్తకు ఎదురు చెప్పకుండా...
    అలాగే ఉండేది పరిస్తితి.
    కథ చాలా బావుంది సర్.
    సున్నితమైన కధ

  • @pushparao6922
    @pushparao6922 ปีที่แล้ว +3

    The writer was very intelligent/mature at that age/time. Your narration/story telling is very nice, by bringing old novel(s) and doing lot of research for the benefit of Telugu people all over the world. Great work by you Sir. Many many ThanQs. God bless you with all happiness and prosperity.

  • @narsimharao7400
    @narsimharao7400 ปีที่แล้ว +1

    కిరణ్ గారు నమస్తే. చాలా రోజుల తర్వాత మంచి కథను పరిచయం చేశారు. కొమ్మూరు గారి రచనలు చాలా బాగుంటాయి. మీకు ధన్యవాదములు. ఇలాంటి వి ఇంకా మీ నుంచి కోరుకుంటూ..... 🙏🏼

  • @vijayagopalpotukuchi2336
    @vijayagopalpotukuchi2336 ปีที่แล้ว +1

    అద్భుత రచయిత వేణుగోపాలరావుగారు

  • @pushpalatha3775
    @pushpalatha3775 ปีที่แล้ว +1

    Thank you sir for sharing excellent story 🙏🙏

  • @commonman6304
    @commonman6304 ปีที่แล้ว +3

    పెద్దలు చెప్పిన చతుర్విధ ఉపాయాలు..
    సామం, దానం, బేధం, దండం..!!
    పండితులు.. మరో రెండు చెప్పారు, రహస్యంగా..
    అవి.. క్షమ, ఉపేక్ష (క్షమించటం, ఉపేక్షించటం)
    పార్వతి భర్తని.. 'క్షమించింది'..
    భర్తలో మార్పుకోసం.. 'ఉపేక్షించింది'..!!
    భర్త ఆదిశేషయ్య.. భార్యని 'క్షమించింది'..
    తన కళ్ళు తెరిపించటానికి ఆమె చేసిన ఆలస్యానికి.. లేదా.. ఇంతదాకా ఉపేక్షించినందుకు..

  • @leelavathiminnakuru6061
    @leelavathiminnakuru6061 ปีที่แล้ว +1

    Kiran Prabha garu manchi Katha vinipinchru alaane appati rojulalo vinna purusha ahakaaram gurthu chesaaru 🙏🙏🙏

  • @kallesastry
    @kallesastry ปีที่แล้ว +2

    కిరణ్ ప్రభ గారు, మొదట మీకు కృతజ్ఞతలు.ఇంత మంచి కథ ను మాకు పరిచయం చేసినందుకు.
    కొమ్మూరి ేణుగోపాలరావు ఇటువంటి జీవిత సత్యాలను తెలిపే కథలు రాయడం లో నిష్ణాతులు. ఆ కాలంలో భార్య ల మనస్తితినీ చక్కగా రాశారు

    • @kallesastry
      @kallesastry ปีที่แล้ว

      కథ చివరన నా ప్రియ మిత్రుడు రవికిరణ్ వాళ్ల నాన్న గురించి మాట్లాడడం చాలా బాగుంది. వీలయితే ఆయన అన్నికథలు అందరూ చదవాలి.

  • @indranigodavarthi2783
    @indranigodavarthi2783 ปีที่แล้ว +3

    House surgeon బండ బట్టీ, ఆ inspiration తో నే నేను పట్టుదల గా డాక్టర్ అయ్యాను

  • @mahammadsadikpasha9000
    @mahammadsadikpasha9000 ปีที่แล้ว +1

    Me hard work Ku na Vandanam🙏

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 9 หลายเดือนก่อน

    ధన్యవాదాలు

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 ปีที่แล้ว +1

    Excellent and useful story in real life sir 👍🙏👍

  • @satyanarayanavilla1076
    @satyanarayanavilla1076 ปีที่แล้ว +1

    A great writer.

  • @prasanthparagati3604
    @prasanthparagati3604 ปีที่แล้ว +4

    Sir BuchiBabu garu rasina చివరికి మిగిలేది book gurinchi cheppandi

  • @mohanramprasadpotluri6410
    @mohanramprasadpotluri6410 ปีที่แล้ว +2

    మంచి కథ వినిపించారు.. మీకు నెనరులు

  • @tsnbabuji2612
    @tsnbabuji2612 ปีที่แล้ว +1

    Sir naa manassu moogapoyindi...mee narration vinnataruvata.namaste Sir!

  • @sknagulmeera9633
    @sknagulmeera9633 ปีที่แล้ว

    Thank you sir

  • @harshavision675
    @harshavision675 ปีที่แล้ว +1

    Excellent story and extraordinary narration thank you so much sir

  • @sudhasnr5065
    @sudhasnr5065 ปีที่แล้ว +2

    Great story and great narration Kiran Prabhagaru.
    Listening to your talk shows are just enthralling and addictive.
    Thank you for creating
    “Talk Show Encyclopedia “

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 ปีที่แล้ว +1

    మీకు హృదయపూర్వక నమస్కారములు 🌅🇮🇳🌻

  • @nagavenil7584
    @nagavenil7584 ปีที่แล้ว +1

    Thank u once again for the excellent story narration of Kommuri Venugopal Roa it was very heart touching waiting for the next week.

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri ปีที่แล้ว +1

    Guruvu gariki hrudyapurvaka namaskaralu🙏🏻🙏🏻🙏🏻

  • @rasoolshaik909
    @rasoolshaik909 ปีที่แล้ว +1

  • @nagamuni7461
    @nagamuni7461 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు సర్

  • @yogeshthota9806
    @yogeshthota9806 11 หลายเดือนก่อน

    Great work sir

  • @krishnak3033
    @krishnak3033 ปีที่แล้ว +1

    He was my family doctor when we were kids. I met him many times and still remember his face. He used to come to my house to check my grandfathers health🙂. He also treated scar on my face due to an injury. Such a great man and polite nature he had.

  • @subbaraosanaka6334
    @subbaraosanaka6334 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 ปีที่แล้ว

    Thank you sir kiran prabha garu. Vintunnanu sir.

  • @chbabyrani1170
    @chbabyrani1170 ปีที่แล้ว +1

    22years ki 62years experience kadha hatsup

  • @madhunlrr
    @madhunlrr ปีที่แล้ว +1

    👏👏👏👏👏 excellent

  • @jyothik4659
    @jyothik4659 ปีที่แล้ว

    Thank you so much

  • @user-fd3fe9kx3n
    @user-fd3fe9kx3n 7 หลายเดือนก่อน

    Story of our mothers seventy years ago

  • @rangamsetty6691
    @rangamsetty6691 ปีที่แล้ว +1

    22 వయస్సు ku medico. అయ్యుండాలి.

  • @rajeshpv6283
    @rajeshpv6283 ปีที่แล้ว

    A very good morning Kiranprabhagaru, It's Wednesday :)

  • @raghavuluvillupuram4319
    @raghavuluvillupuram4319 ปีที่แล้ว

    Nice 👍💐

  • @varalakshmikala440
    @varalakshmikala440 ปีที่แล้ว +1

    👌

  • @_VenkatC
    @_VenkatC ปีที่แล้ว +1

    😢

  • @konthamnarsaiah2543
    @konthamnarsaiah2543 ปีที่แล้ว

    🙏

  • @ananthapadmanabharao7015
    @ananthapadmanabharao7015 ปีที่แล้ว

    👏👏👏👏👏

  • @commonman6304
    @commonman6304 ปีที่แล้ว +6

    మానసిక పరిపక్వత కొంతమందికి చిన్న వయసులోనే వస్తే.. మరి కొంతమందికి ఆలస్యంగా వస్తుంది.. ఇంకొంతమందికి ఎప్పటికీ రాదు..!! ఎందుకూ..??!
    ఇదో జీవితసత్యం.. ఓ వింత కూడా..!!

    • @kelambala3730
      @kelambala3730 ปีที่แล้ว +1

      చాలా నిత్యమైన, శాశ్వతమైన సత్యం చెప్పారు, ఇది ఎంతో , బాధించే, వెంటనే కొందరిని గమనిస్తే ఆనందాన్ని ఇచ్చే సత్యం 🙏🙏🙏🌹

    • @cvrc1577
      @cvrc1577 ปีที่แล้ว

      ఇది పరమ సత్యం....డాక్టర్ సి వెంకటేశ్వర రావు విజయవాడ.

  • @chbabyrani1170
    @chbabyrani1170 ปีที่แล้ว +1

    Sir meku mundhu ga na namskarmulu ,e kada ma grand parents gurthukocharu sir

  • @rangamsetty6691
    @rangamsetty6691 ปีที่แล้ว

    పిచ్చెక్కింది. ఇప్పటి పరిస్థితులకు అసమందంగా ఉంధి.కానీ 70 ఎండ్లకిందట నేను కొన్ని సంఘటనలకు సాక్షి నీ. అంతే

  • @sathisuryanarayanareddy8647
    @sathisuryanarayanareddy8647 2 หลายเดือนก่อน

    Sir malladhi sravanthi cheppandi

  • @ramupodila5187
    @ramupodila5187 ปีที่แล้ว +1

    Andukuu????????🙏

  • @ramachandrarao5673
    @ramachandrarao5673 ปีที่แล้ว +1

    సాంబశివరావుగారి కధ హౌస్ సర్జెన్ చిన్నతనంలో చదివాను అప్పుడే ఈయన గొప్పరచయిత ఆని భావించాను ఈకధలో భర్త చనిపోయి భార్య బ్రతుకుతుంది కథను బట్టి అర్ధం అవుతోంది రచయిత బయట పెట్ట లేదు

  • @satyanandnuthii2196
    @satyanandnuthii2196 ปีที่แล้ว