జగన్మాతకు ఓ లేఖ | A letter to Goddess Parvathi | విజయదశమి | దేవీ నవరాత్రులు | Rajan PTSK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • ఇదిగో అమ్మా! ఇటూ.. ఈవైపు.. నావైపు చూడు!
    ఏంటమ్మా ఇది.. ఎప్పుడూ ఆ ఆదిశంకరుడు, కాళిదాసు, మూకశంకరులేనా. కొంచెం మావైపు కూడా చూడొచ్చుగా! “నేను మీవైపు చూడకుండానే మీరంతా పెద్దాళ్ళైపోతున్నార్రా!” అని మాత్రం ఉరమకు. చూడటం అంటే అలా ఇలా చూడమని కాదు. పామరుణ్ణి మహాకవిని చేయడానికి ఓ చూపు చూశావే అటువంటి చూపు చూడాలి, మూగవానితో అయిదొందల శ్లోకాలు చెప్పించడానికి మరొక చూపు చూశావే! అదీ, ఆ చూపు కావాలి. మేం కాళిదాసు, మూకశంకరుల పాటివాళ్ళం కాకపోయినా, అర్భకులమే అయినా, నీ పిల్లలమే కదమ్మా. మాకు కూడా కాసింత అక్షరజ్ఞానం ప్రసాదించమ్మా. అయినా అమ్మా! డమరుకాన్ని మ్రోగించి అక్షరాలను పుట్టించింది మీ ఆయనే అయినా, ఆ అక్షరాలు కూడా నీ చూపు పడకపోతే కదలనే కదలవేంటమ్మా. అవునులే నువ్వు వాగధీశ్వరివి కదా. వాక్కు నీ అధీనంలోనే ఉంటుంది. ఆ మాటకొస్తే సకల లోకేశ్వరేశ్వరుడైన నీ మగడు కూడా నీ అధీనంలోనే ఉంటాడు. నువ్వు స్వాధీనవల్లభవు. నీ అనుమతి లేనిదే ఆయన ఒక్కపనైనా చేస్తాడా? ఒక్కనాటికీ చెయ్యడు. అప్పట్లో హాలాహలం పుట్టి లోకాలను దహించి వేస్తుంటే.. పాపం ఆ దేవతలంతా మీ ఇంటిముందు బారులు తీరి.. “కుయ్యో! మొఱ్ఱో! విను మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపుము” అని ఏడుపులు, పెడబొబ్బలూ పెట్టారు. అప్పుడు కూడా అంతటి ఆ భోళాశంకరుడూ, పాపం పిల్లలు ఏడుస్తున్నారు నన్ను వెళ్ళిరమ్మంటావా పార్వతీ అంటూ నీవైపే చూశాడు కానీ, చెప్పకుండా ఒక్కడుగైనా ముందుకు వేశాడా? “మీ అన్నయ్య కూర్మావతారమెత్తి అక్కడ ఒక్కడే కష్టపడుతున్నాడు. నేను కూడా వెళ్ళి ఆ హాలాహలం సంగతేదో చూసొస్తాను. అతను ఆనందపడతాడు” అంటూ నీ పుట్టింటి వారి మాటలు చెప్పి మరీ, నిన్ను ఒప్పించి బయల్దేరాల్సి వచ్చింది...

ความคิดเห็น • 43

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 4 วันที่ผ่านมา +9

    అమ్మ కి ఇంత అద్భుతమైన లేఖ కొన్ని లాలితాసహస్రనామాలు చాలా అద్భుతంగా మిళితం చేసి మాకు వీనుల విందుగా, శ్రవణానందం కలుగచేసిన మీకు నా మనఃపూర్వక నమోవాకాలు🙏🙏

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 4 วันที่ผ่านมา +7

    అమ్మకి భక్తి ప్రేమ ఆర్తితో రాసిన లేఖ చాలా అధ్భుతంగావుంది. ఇంతవరకూ ఏ భక్తులూనరాయని విధంగా అమోఘంగారాశారు. ఈలేఖని చదివిన అమ్మ మీయందూ మాయందూ కూడా అపారమైన కరుణామృత వర్షంకురిపించాలని కోరుతున్నాను. వీడియో చాలాబాగుంది.

  • @hemamalini2815
    @hemamalini2815 4 วันที่ผ่านมา +6

    అద్భుతం
    లలితసాహస్రనామాలలో మాకు అమ్మను దర్శింపచేశారు 🙏🙏🙏
    వింటుంటేనే కళ్ళమ్మట కన్నీళ్లు ధారగా కారిపోతున్నాయి
    ధన్యోస్మి 🙏🙏🙏

  • @gollapallisreedevi7742
    @gollapallisreedevi7742 4 วันที่ผ่านมา +6

    జగన్మాతకు లేఖ అద్భుతంగా వుంది.అమ్మవారి నామాలు వుటంకిస్తూ వెంటనే వాటిని వివరిస్తూ ‌అబ్బ మనసు పులకించి పోయింది.నిజంగా జగదంబ తో మాట్లాడితే యిలానే కదా మాటలాడాలి అనిపించింది.అనేకానేక ధన్యవాదాలు.ఆయమ్మ కృప తో మీ సాహితీ సేవ నిరంతరం కొనసాగాలని మరీ ఆమెనే అడగాలి.

  • @anilkumar557
    @anilkumar557 4 วันที่ผ่านมา +9

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే...
    ఓం శ్రీ మాత్రే నమః

  • @srinivasraomedam709
    @srinivasraomedam709 4 วันที่ผ่านมา +5

    అద్భుతం... అమోఘమైన వీడియో.. ధన్యవాదాలు

  • @lakchanna8200
    @lakchanna8200 4 วันที่ผ่านมา +3

    Amma Mahima
    Kavitha goppadanam
    Telugu maadhuryam
    Potipaduthunnayi
    Adbhutaha❤

  • @satyanarayanaa7556
    @satyanarayanaa7556 4 วันที่ผ่านมา +3

    అత్యద్భుతమైన ప్రసంగం చాలా బాగుంది ధన్యవాదములు

  • @sreemathanirmala4549
    @sreemathanirmala4549 3 วันที่ผ่านมา +1

    అమ్మ లలితమ్మ తల్లి నా మీద కూడా నీ కరుణా పూరిత దృష్టి ప్రసరింప చెయ్యి తల్లి.🙏🙏🙏

  • @GunKri
    @GunKri 4 วันที่ผ่านมา +3

    అమ్మా... దుర్గ 🙏

  • @KavanakiranaluTelugusahithisam
    @KavanakiranaluTelugusahithisam 4 วันที่ผ่านมา +2

    మీ వీడియో లో చిత్రాలు చాల అందంగా ఉంటాయి. ఎక్కడ సేకరణ చేస్తారు. చిత్రాల రచన ఎవరు చేస్తారు.. చూడ ముచ్చటైన చిత్రాలను చూస్తుంటే కళ్ళు విప్పారి చూస్తాయి. మీరు చేసే వీడియో లు సూపర్. మీ మాటల తీరు వినసొంపుగా ఉంటాయి

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 4 วันที่ผ่านมา +2

    🙏🙏శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ గురవే నమః 🙏🙏

  • @asamardhudu8921
    @asamardhudu8921 3 วันที่ผ่านมา +3

    Jai Shree Ram...❤🎉

  • @వాసుదేవాయ
    @వాసుదేవాయ 4 วันที่ผ่านมา +2

    శ్రీ మాత్రే నమః 🙏

  • @prameeladontula9839
    @prameeladontula9839 4 วันที่ผ่านมา +3

    👌👌 👌 👌 👌
    ఓం శ్రీ మాత్రే నమః🙏🚩

  • @siddheswarichitturu9496
    @siddheswarichitturu9496 4 วันที่ผ่านมา +2

    చాలా స్ఫూర్తి దాయకం.మీకు మేం ఋణగ్రస్తులం.నమస్కారములు

  • @padmatata4084
    @padmatata4084 3 วันที่ผ่านมา +3

    Chalachala bavundi

  • @aryasomayajulavisalakshi6175
    @aryasomayajulavisalakshi6175 4 วันที่ผ่านมา +2

    అద్భుతం చాలా బాగుంది అమ్మకి లేఖ

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 4 วันที่ผ่านมา +2

    💐🙏

  • @dhanamjayuluputta3800
    @dhanamjayuluputta3800 18 ชั่วโมงที่ผ่านมา +1

    అమ్మకు నాన్నలకు లేఖ మేము చిన్నప్పుడు వ్రాసేవాళ్ళము.
    ఈ లేఖ అత్యంత ఆర్దతతో, తల్లి తన బిడ్డలమీద చూపే సహజప్రేమను మీ బిడ్డలమైన మా పై కూడా కురిపించామని ఎంత మృధువుగా, తర్ఖంగా మరియు ఆర్తి గా కవి వ్రాయడం ఎంతో బాగుంది.
    దీన్ని ఎవరు వ్రాసారో కూడా తెలిపితే బాగుండేది.

    • @Ajagava
      @Ajagava  17 ชั่วโมงที่ผ่านมา

      ఈ లేఖ వ్రాసింది నేనేనండి. ఇంతకుమునుపు శివుడికి కూడా ఒక లేఖ వ్రాశాను.

  • @sivaprasad8004
    @sivaprasad8004 4 วันที่ผ่านมา +2

    అద్భుతం గా ఉన్నది మీ వివరణ

  • @Umadevi-un6tc
    @Umadevi-un6tc 4 วันที่ผ่านมา +2

    🙏🙏🙏👏👏😊

  • @asamardhudu8921
    @asamardhudu8921 3 วันที่ผ่านมา +2

    Manasu pulakinchipoindi...❤

  • @barubhairavabhotla831
    @barubhairavabhotla831 4 วันที่ผ่านมา +3

    లలితా సహస్ర నామ్ స్తోత్రం లోవి

  • @swathikishore4948
    @swathikishore4948 4 วันที่ผ่านมา +3

    🙏🙏🙏

  • @sai4186
    @sai4186 4 วันที่ผ่านมา +2

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagabhushana1150
    @nagabhushana1150 4 วันที่ผ่านมา +2

    What a description of the divine mother! Pranams.

  • @varaprasadmtech
    @varaprasadmtech 4 วันที่ผ่านมา +2

    What a narration❤ Excellent.

  • @NarendraKumarAmbula
    @NarendraKumarAmbula 4 วันที่ผ่านมา +1

    అద్భుతం 🙏🙏🙏

  • @JanakiramayyaKoka
    @JanakiramayyaKoka 4 วันที่ผ่านมา +2

    దయ గల తల్లి 🪷🙏🪷

  • @bhanupriyagudugundlabhanup8408
    @bhanupriyagudugundlabhanup8408 4 วันที่ผ่านมา +2

    🙏🏻🙇🏻‍♀️

  • @rameshram5825
    @rameshram5825 3 วันที่ผ่านมา +1

    Aum namah shivayacha namah shivaya

  • @dattuavm5392
    @dattuavm5392 7 ชั่วโมงที่ผ่านมา

    Manchi vivarana Rajangaru

  • @rudraiahmurapala9452
    @rudraiahmurapala9452 2 วันที่ผ่านมา

    అలాగే అయ్యవారికి కూడా లేఖ రాయండి 😊

  • @dattuavm5392
    @dattuavm5392 7 ชั่วโมงที่ผ่านมา

    Srimatra namaha

  • @phanibabu-r5b
    @phanibabu-r5b 3 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suseelavarada2017
    @suseelavarada2017 21 ชั่วโมงที่ผ่านมา

    Abba amma 🙏🙏🙏🙏🙏

  • @jyothyg6653
    @jyothyg6653 วันที่ผ่านมา

    🙏🏻

  • @Lobster16763
    @Lobster16763 วันที่ผ่านมา

    విక్రమాదిత్యుడు, భోజుడు, సింహాసనం, సాలభంజికల కధలు చెప్పండి. జై శ్రీరాం.🌿

  • @SameerDharmasastha
    @SameerDharmasastha 3 วันที่ผ่านมา +1

    కైలాసమునకు లేఖలు 😊

  • @gayataridevi5516
    @gayataridevi5516 3 วันที่ผ่านมา +1

    Rajannuu ee lekha sivayyaku avariki vare vrasukonnattu ga ledhu idhi na lekha

  • @RaviBada-t7g
    @RaviBada-t7g 3 วันที่ผ่านมา +1

    అద్భుతం 🙏🙏