ఆత్మతోను సత్యముతోను Aathmathonu Sathyamuthonu || Worship by church youth
ฝัง
- เผยแพร่เมื่อ 14 ม.ค. 2025
- ఆత్మతోను సత్యముతోను ఆది దేవుని ఆరాధించెదం
పరిశుద్ధ ఆలంకృతులై మనము పరిశుద్దుని పూజించెదం
1. నడిచెదము భయభక్తులతో దినదినము యేసుతో
ప్రభుని ముందు శిరము వంచి స్తుతి గీతం పాడెదం
ప్రభు పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధుడు
పరిశుద్ధునిలో పాపము లేదు - మరి పరిశుద్ధులెవరూ లేరు
||ఆత్మ||
2. ఆర్భాటముతో ఆనందముతో ఆయన సన్నిధి చేరెదం
దేవాది దేవుని రాజాధి రాజుని పాడి కీర్తించెదం
ప్రభు పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధుడు
స్తుతులాయన సింహాసనం - స్తుతి స్తోత్రముల్ చెల్లించెదం
||ఆత్మ||
3. మా పెదవులు తో మా హృదయముతో ప్రభుని ఘనపరచదమ్
ఏకముగా కూడి హోసన్నా పాడి సంతోషముతో సాగెదమ్
ప్రభు పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధుడు
మనమాయన వారలము - పరిశుద్ధులుగ నిలిచియుందుము
||ఆత్మ||