పల్లవి:- కాలమునెరిగి నిధురమేలుకో భారము కలిగి బ్రతుకు దిద్దుకో(2) దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో.. దేహముండగానే దేవుని మనసు తెలుసుకో.. ఇదే కదా అనుకూలసమయం సోదరా.. మరో దినం నీకుందోలేదో ఎరుగరా... కాలం ఎరిగి నిదుర మేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో..||కాలము|| చరణం1:- నేడు నీతో ఉందిలే-రేపు నీది కాదులే.. ఉన్న సమయమందే నిన్ను నీవు తెలుసుకో లోకామెంతో ఉందిలే-నిన్ను పిలుస్తుందిలే ఎండమావి నిజమా-ఎరిగి నీవు మసలుకో(2) కంటికింపుగా కనిపించే -రంగుల వలయం కాదా సొంత గూటినే మరిపించి-దేవునికే దూరం చేస్తుందా కాలం ఎరిగి నిదుర మేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో..||కాలము|| చరణం2:- శరీరాశ పుట్టగా-లొంగిపోకు సులువుగా పాపమంటే పామే-కాటువేస్తుందిగా దేహమందు మంచిగా-ఉన్నదేది లేదుగా అవయవాల దాహం-తీర్చ సాధ్యపడదుగా(2) శరీరాన్ని పాపం ఏలితే నరకంలో ఆత్మకు బాధ నీతి సాధనాలుగ దేవునికప్పగిస్తేనే గద మరియాద కాలం ఎరిగి నిదుర మేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో||కాలము||
పల్లవి:-
కాలమునెరిగి నిధురమేలుకో
భారము కలిగి బ్రతుకు దిద్దుకో(2)
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో..
దేహముండగానే దేవుని మనసు తెలుసుకో..
ఇదే కదా అనుకూలసమయం సోదరా..
మరో దినం నీకుందోలేదో ఎరుగరా...
కాలం ఎరిగి నిదుర మేలుకో
భారం కలిగి బ్రతుకు దిద్దుకో..||కాలము||
చరణం1:-
నేడు నీతో ఉందిలే-రేపు నీది కాదులే..
ఉన్న సమయమందే నిన్ను నీవు తెలుసుకో
లోకామెంతో ఉందిలే-నిన్ను పిలుస్తుందిలే
ఎండమావి నిజమా-ఎరిగి నీవు మసలుకో(2)
కంటికింపుగా కనిపించే -రంగుల వలయం కాదా
సొంత గూటినే మరిపించి-దేవునికే దూరం చేస్తుందా
కాలం ఎరిగి నిదుర మేలుకో
భారం కలిగి బ్రతుకు దిద్దుకో..||కాలము||
చరణం2:-
శరీరాశ పుట్టగా-లొంగిపోకు సులువుగా
పాపమంటే పామే-కాటువేస్తుందిగా
దేహమందు మంచిగా-ఉన్నదేది లేదుగా
అవయవాల దాహం-తీర్చ సాధ్యపడదుగా(2)
శరీరాన్ని పాపం ఏలితే
నరకంలో ఆత్మకు బాధ
నీతి సాధనాలుగ దేవునికప్పగిస్తేనే గద మరియాద
కాలం ఎరిగి నిదుర మేలుకో
భారం కలిగి బ్రతుకు దిద్దుకో||కాలము||
Tq
Tq
Super song
Super lyrics Vijay annaya
Wonderful
Song nu rayadaniki avakasam evvandi