tabla tracks
ฝัง
- เผยแพร่เมื่อ 5 พ.ย. 2024
- For More Vedios Subscribe Our Channel
Contact : 9133201201,9390499279
Our Spiritual Messages : • Joseph sastry garu mes...
Our Songs : • నీ ప్రాణత్యాగం
• Tabala Tracks / Hosann...
telugu christian worship songs,
jesus songs telugu new 2023 good friday songs,
jesus new songs,
christmas new songs telugu,
yesanna swaramanna song,
nenu odiponaya christian song,
jesus songs telugu short videosz
jesus songs telugu trending,
telugu christian motivational messages,
christian songs telugu 2023,
best telugu christian messages,
jesus video songs,
telugu christian songs latest jukebox,
jesus songs telugu jukebox 2023,
chinny savarapu songs jukebox,
latest telugu hit video songs,
telugu christian short messages,
telugu worship message,
best telugu christian messages,
new year telugu christian messages,
old telugu christian messages,
telugu christian messages latest,
telugu christian messages,
sunday worship message telugu,
latest telugu hit video songs,
jesus telugu hit songs,
jesus songs telugu slow songs,
telugu christian songs latest jukebox,
jesus songs telugu non stop,
యేసు) రాజా నీ భవనములో
రేయి పగలు వేచియుందును (2)
(నిన్ను) స్తుతించి ఆనందింతును
చింతలు మరచెదను (2) ||రాజా||
నా బలమా నా కోట
ఆరాధన నీకే (2)
నా దుర్గమా ఆశ్రయమా
ఆరాధన నీకే (2)
ఆరాధనా ఆరాధనా
అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
అంతట నివసించు యెహోవా ఎలోహిం
ఆరాధన నీకే (2)
మా యొక్క నీతి యెహోవా సిద్కేను
ఆరాధన నీకే (2)
ఆరాధనా ఆరాధనా
అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||
పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్
ఆరాధన నీకే (2)
రూపించు దైవం యెహోవా హోషేను
ఆరాధన నీకే (2)
ఆరాధనా ఆరాధనా
అబ్బ తండ్రి నీకేనయ్యా
ఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి (2)
నిత్య జీవము నిచ్చిన దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక (2)
అంతము వరకు కాపాడు దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)
నన్ను నీవు మరువని దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
విశ్వనాధుడా విజయ వీరుడా
ఆపత్కాల మందున సర్వ లోకమందున్న
దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ..
ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా
ఆనందింతు నీలో జీవితాంతము (2)
నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2)
చరణం 1:
పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2)
ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే
ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 2 :
భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2)
బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
చరణం 3 :
నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో
నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2)
నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు
నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2)
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా
నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు||
నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు||
రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు||
ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు||
ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట ||నడిపించు||
లోటైన జలములలో లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు||
ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ||నడిపించు||
ముఖ దర్శనం చాలయ్యా
నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
సమీపించని తేజస్సులో
నివసించు నా దైవమా (2)
నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
అన్న పానములు మరచి నీతో గడుపుట
పరలోక అనుభవమే
నాకది ఉన్నత భాగ్యమే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది
మహిమలో చేరుటయే
అది నా హృదయ వాంఛయే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి
గానము చేసెదను
ప్రభువా నిత్యము స్తుతియింతును (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||
యేసయ్యా కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా (2)
నీవే నా సంతోష గానము
సర్వ సంపదలకు ఆధారము (2) ||యేసయ్యా||
నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2)
సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే (2) ||యేసయ్యా||
నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు
దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2)
అలసిన వారి ఆశను తృప్తిపరచితివి
అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము (2) ||యేసయ్యా||
నీ వలన బలమునొందిన వారే ధన్యులు
నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2)
నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు
నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు (2) ||యేసయ్యా||
ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4)
ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (4)
బంధము నీవే స్నేహము నీవే
అతిధివి నీవెనయ్యా ఆప్తుడ నీవెనయ్యా నా యేసయ్యా
ప్రేమించువాడా కృపఁచూపువాడా నాతోనే ఉండి నను నడుపువాడా
కాలాలు మారిన మారని వాడా విడువవు నను ఎప్పుడు
కాలాలు మారిన మారని వాడా విడువవు నను ఎప్పుడు
మరువని తండ్రివయా నాయేసయ్యా
1.కారు చీకటి నను కమ్ము వేళ వెలుగు నీవై ఉదయించినావా
నీ ఒడిలో నే నెమ్మదినిచ్చి కన్నీరు తుడిచావయ్యా
కౌగిల్లో దాచావయ్యా నా యేసయ్యా
2.మూగబోయిన నా గొంతులోన గానము నీవై నను చేరినావా
హృదయవీణవై మధురగానమై నాలోనే ఉన్నావయ్యా
నా ఊపిరి నీవేనయ్యా నా యేసయ్యా
3.యీలోకంలో యాత్రికూడను ఎవ్వరులేని ఒంటరినయ్యా
నీవె నాకు సర్వము దేవా చాలును చాలునయా
నీ సన్నిధి చాలునయా నా యేసయ్యా
4.మోడుబారిన నాబ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావా
సమీపించరాని తేజస్సులో నీవు
వసియించు వాడవైనా
మా సమీపమునకు దిగి వచ్చినావు
నీ ప్రేమ వర్ణింప తరమా (2)
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) ||సమీపించరాని||
ధరయందు నేనుండ చెరయందు పడియుండ
కరమందు దాచితివే
నన్నే పరమున చేర్చితివే (2)
ఖలునకు కరుణను నొసగితివి (2) ||యేసయ్యా||
మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి
నా స్థితి మార్చినది
నన్నే శ్రుతిగా చేసినది (2)
తులువకు విలువను ఇచ్చినది (2) ||యేసయ్యా||
ముఖ దర్శనం చాలయ్యా
నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
సమీపించని తేజస్సులో
నివసించు నా దైవమా (2)
నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
అన్న పానములు మరచి నీతో గడుపుట
పరలోక అనుభవమే
నాకది ఉన్నత భాగ్యమే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది
మహిమలో చేరుటయే
అది నా హృదయ వాంఛయే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి
గానము చేసెదను
ప్రభువా నిత్యము స్తుతియింతును (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||
ఎండిన నేలను దేవా వర్షముగా రావా
ఏడారినయ్య దేవా.. జీవనదిగా రావా
జారిపోతిని దేవా.. చల్లారిపోతిని దేవా
అగ్నిగా రావా నన్నభిషేకించవా
ఆత్మగా రావా.. నను నీలా మార్చవా..
రావా నా లోనికి రావయ్యా..
దేవా నను నింపు యేసయ్య
దారి తప్పితినయ్య మార్గమై రావా
చీకటైటిని దేవా నీతి సూర్యుడైరావా
పాపినైతిని దేవా.. పాడైపోతిని దేవా
రక్తమై రావా.. నాకు రక్షణనీయవా
అగ్నిగా రావా.. నన్నభిషేకించవా..
రావా నా లోనికి రావయ్యా..
దేవా నను నింపు యేసయ్య
వ్యాధితో వేడితినయ్య రాఫాగా రావా
వ్యధలో చిక్కితినయ్య షాలోముగా రావా
ఓడిపోతిని దేవా.. అణగారిపోతిని దేవా
నిస్సిగా రావా.. నాకు విజయమునీయవా
అగ్నిగా రావా.. నను అభిషేకించవా..
రావా నా లోనికి రావయ్యా..
దేవా నను నింపు యేసయ్య
సువార్త చాటాలయ్య వాక్యమై రావా
నీ రాజ్యము కట్టాలయ్యా శక్తిగా రావా..
ఆగిపోతిని దేవా.. వెనుదిరిగిపోతిని దేవా..
జీవమై రావా.. నను ఉజ్జీవించవా..
అగ్నిగా రావా.. నను అభిషేకించవా..
రావా నా లోనికి రావయ్యా..
దేవా నను నింపు యేసయ్య
నీవు లేకుండా నేనుండలేను
నాకున్నవన్నీ నీవే యేసయ్య
నా ప్రాణమా నా ధ్యానమా
నా ఊపిరి నీవే యేసయ్య
జాలిలేనిది ఈ మాయలోకము
కలతచెందెను నా దీన హృదయము
నను కాపాడుటకు నా దరి నిలచితివా
హస్తము చాపితివా నను బలపరచితివా
నను ప్రేమించేవారు ఎందరు ఉన్నను
అంతము వరుకు నాతో ఉండరు
నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా
నా ప్రాణము నీవే యేసయ్య
కన్నులు మూసిన కన్నులు తెరచిన
నా చూపులలో నీ రూపమే
కనికరించితివా కరుణామయుడా
కృప చూపించితివా నాకు చాలిన దేవుడా
రాజ జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మన బంధము - అనుబంధము
విడదీయగలరా - ఎవరైనను - మరి ఏదైనను ?
దీన స్థితియందున - సంపన్న స్థితియందున
నడచినను - ఎగిరినను - సంతృప్తి కలిగి యుందునే
నిత్యము ఆరాధనకు - నా ఆధారమా
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ ||
బలహీనతలయందున- అవమానములయందున
పడినను - కృంగినను - నీ కృపకలిగి యుందునే
నిత్యము ఆరాధనకు - నా ఆధారమా
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ ||
సీయోను షాలేము - మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము - ఈ ఆశ కలిగి యుందునే నిత్యము
ఆరాధనకు - నా ఆధారమా
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ ||
యూదా స్తుతి గోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2)
నీవే కదా నా ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన (2)
నీ ప్రజల నెమ్మదికై
రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను
అధముల చేసిన నీకు (2)
అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||
నీ నీతి కిరణాలకై
నా దిక్కు దెశలన్ని నీవేనని
ఆనతికాలాన ప్రధమ ఫలముగా
భద్రపరచిన నీకు (2)
అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||
నీ వారసత్వముకై
నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనమును
నాకిచ్చుఁటలో నీకు (2)
అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||
నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది } 2
నాప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా|| నిరంతరం ||
చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను } 2
నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని } 2
పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి
నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి
నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని (2)
పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై|| నిరంతరం
నే సాగెద యేసునితో
నా జీవిత కాలమంతా (2)
యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)
పరమును చేరగ నే వెళ్లెద (2)
హనోకు వలె సాగెదా ||నే సాగెద||
వెనుక శత్రువులు వెంటాడిననూ (2)
ముందు సముద్రము ఎదురొచ్చినా (2)
మోషె వలె సాగెదా ||నే సాగెద||
లోకపు శ్రమలు నన్నెదిరించినా (2)
కఠినులు రాళ్ళతో హింసించినా (2)
స్తెఫను వలె సాగెదా ||నే సాగెద||
బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2)
క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2)
పౌలు వలె సాగెదా ||నే సాగెద||
తల్లి మరచిన తండ్రి విడచిన (2)
బంధువులే నన్ను వెలివేసినా (2)
బలవంతుని వలె సాగెదా ||నే సాగెద||
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2)
నిత్యము నా కీర్తి నా నోట నుండును (2)
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా
చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా (2) ||నేనెల్లప్పుడు||
కలిమి చేజారి నను వంచినా
స్థితిని తలకిందులే చేసినా (2)
రెండింతలుగా దయచేసెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||
పరుల ఎగతాళి శృతి మించినా
కలవరము గుండెనే పిండినా (2)
నా మొఱ విని కృప చూపెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||
శ్రమలు చెలరేగి బెదిరించినా
ఎముకలకు చేటునే తెచ్చినా (2)
ఆపదలలో విడిపించెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||
Raajula raja jai yesu raja jai super set
పల్లవి:
అబ్రహాము దేవుడవు - ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X)
1.
అబ్రహాము విశ్వాసముతొ - స్వ దేశము విడచెను
పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను (2X)
అబ్రహాముకు చాలిన దేవుడు నీవే నయ్యా (2X)
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X)
...అబ్రహాము...
2.
ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను
వాగ్ధానాన్ని బట్టి మృతుడై లేచెను (2X)
ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2X)
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X)
...అబ్రహాము...
3.
యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను
యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను (2X)
యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2X)
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X)
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా (2)
నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ||
నాకు ఉన్న సామర్ధ్యం
నాకు ఉన్న సౌకర్యం
నాకు ఉన్న సౌభాగ్యం
నాకు ఉన్న సంతానం (2)
ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం (2)
కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ||
నాకు ఉన్న ఈ బలం
నాకు ఉన్న ఈ పొలం
త్రాగుచున్న ఈ జలం
నిలువ నీడ ఈ గృహం (2)
నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం (2)
కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ
ఎవరూ సమీపించలేని
తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటబడగానే (2)
ఏమౌదునో నేనేమౌదునో (2)
ఇహలోక బంధాలు మరచి
నీ యెదుటే నేను నిలిచి (2)
నీవీచుచు బహుమతులు నే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో||
పరలోక మహిమను తలచి
నీ పాద పద్మములపై ఒరిగి (2)
పరలోక సైన్య సమూహాలతో కలసి
నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో||
జయించిన వారితో కలిసి
నీ సింహాసనము నే చేరగా (2)
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||
సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును (2)
అబ్రామును అడిగెను ప్రభువప్పుడు
ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2)
నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ||
ప్రభుని ప్రేమించిన పేదరాలు
కాసులు రెండిచ్చెను కానుకగా (2)
జీవనమంతయు దేవునికిచ్చెను (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ||
నీ దేహము దేవుని ఆలయము
నీ దేవుడు మలిచిన మందిరము (2)
సజీవ యాగముగా నిచ్చెదవా (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ
నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ సమర్పణతో
సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే
కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ
నీవే నా ప్రాణము - నిను వీడి నేనుండలేను|| నూతన గీతము ||
కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ
నీవేనా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ|| నూతన గీతము ||
మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి
మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ
నీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ|| నూతన గీతము ||
Tags Manoharuda - మనోహరుడా#
Share This
onlinelyricslist.blogspot.com/2021/07/nuthana-geethamu-ne-padedha.html
Author Image
About Online Lyrics List
Nuthana geethamu ne padedha నూతన గీతము నే పాడెదా
Nallo Nivasinchey Na Yesayya నాలో నివసించే నా యేసయ్య
Anandham neelone aadharam neevega ఆనందం నీలోనే ఆధారం నీవేగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్పాత పోస్ట్
పేజీలు
హోమ్
AKK
Index
Andhra Kraisthava Keerthanalu
Christmas
Index
Jeeva Swaralu
📖✍🎤🎷🎹📀▤
Search / పాట లేదా నెంబర్ తో వెదుకు
అ │ ఆ │ ఇ │ ఈ │ ఉ │
ఎ │ ఏ │ ఐ │ ఒ │ ఓ │
క │ గ │ ఘ │ చ │ జ │
డ │ త │ ద │ ధ │ న │
ప │ బ │ భ │ మ │ జ │
య │ ర │ ల │ వ │ జ │
శ │ ష │ స │ హ │ క్ష │ ఱ │
WRITER ✍
ALBUMS 📀
SINGERS 🎤
Asher Andrew ✍
Budhala Laiman ✍
D.Chrisostam ✍
Darla Amshumathi Mary ✍
Doraswami Aarogyam ✍
John J ✍
Joshua.Shaik ✍
K. Raja Babu ✍
K. Raja Babu 🎤 ✍
Konduru Jyothi Isaac ✍
Kranthi Chepuri ✍
M.J Ramamjulu ✍
Mallela Dhaveedhu ✍
Mamuduri Syman ✍
Matthai Samooyelu ✍
Mikkili Samuyelu ✍
N Dhasu Babu ✍
N. Dasubabu ✍
N.D Yebell ✍
P.Naveen Kumar ✍
Pammi Daniel ✍
Panthagani Paradhesi ✍
Pasupuleti Daaveedu ✍
Prabhakar Indla ✍
Pulipaka Jagannadhamu ✍
Puroshottham Chwodari ✍
R. R. K. Murthy ✍
Saahus Prince ✍ 🎤
Satish Kumar P ✍
TK. Sundarrao ✍
Victor L Rampogu ✍
Yesepu Daniel ✍
Yeshaya Vaeeramartin ✍
HOME
ఆనంద కీర్తనలు 📖
Zion Songs 📖
Jeeva swaralu 📖
Andhra Kraisthava Keerthanalu 📖
Kraisthava Keerthanalu 📖
Christmas ▤
Good Friday ▤
Thalam Ragam
Ragam - కాంభోజి 🎷(2)
Ragam - నవరోజు 🎷(1)
Ragam - ముఖారి 🎷(1)
Ragam - శంకరాభరణమ 🎷(2)
Ragam - హిందుస్థానీ కాపీ 🎷(1)
Thalam - ఆట 🎹(1)
Thalam - ఆది 🎹(3)
Thalam - త్రిపుట 🎹(2)
Thalam - రూపకమ 🎹(1)
Comments
Anonymous
"చాలా మంచి పాట .. మీ సేకరణలకు వందనం "
NEKURI JOSEPH
"prayer for me"
NEKURI JOSEPH
"prayer for me 🙏"
Gousiyasetti
"yesuni rakshakuniga enduku oppukovali ane question..."
Gousiyasetti
"ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు."
Anonymous
"always lord is our filler and support "
Anonymous
"it is a very emotional song when we sing this song..."
Anonymous
"song lyrics lo mistakes unnay"
Anonymous
"manchi song"
Anonymous
"super song..."
అనుచరులు
Created By SoraTemplates | Distributed By Blogger Templates
00:0000:00
previousplaynextrepeatplaylist
jPlayer Jukebox
ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో (2)
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధనా
ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)
ఎబినేజరే ఎబినేజరే
ఇంత వరకు ఆదుకొన్నావే (2)
ఇంత వరకు ఆదుకొన్నావే|| నిన్ను పూర్ణ ||
ఎల్రోహి ఎల్రోహి
నన్ను చూచావే వందనమయ్యా (2)
నన్ను చూచావే వందనమయ్యా|| నిన్ను పూర్ణ ||
యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరిచావే వందనమయ్యా (2)
స్వస్థపరిచావే వందనమయ్యా|| నిన్ను పూర్ణ ||
నా జీవితాన కురిసెనే నీ కృపామృతం
నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం || 2 ||
నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను || 2 ||
1. నీ దయ నుండి దూరము కాగా
ప్రేమతో పిలిచి పలుకరించితివే || 2 ||
కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెను
నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను || 2 || || నా జీవితాన ||
2. నా యేసయ్యా - నీ నామమెంతో
ఘనమైనది - కొనియాడదగినది || 2 ||
కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను
నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది || 2 || || నా జీవితాన ||
3. నీ సన్నిధిని నివసించు నాకు
ఏ అపాయము దరిచేరనివ్వవు || 2 ||
కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను
నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను || 2 || || నా జీవితాన
దేవర నీ దీవెనలు
ధారాళముగను వీరలపై
బాగుగ వేగమే దిగనిమ్ము
పావన యేసుని ద్వారగను (2)
దంపతులు దండిగ నీ
ధాత్రిలో వెలయుచు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుచు
సహింపున వీరు సుఖించుటకై ||దేవర నీ||
ఈ కవను నీ కరుణన్
ఆకరు వరకును లోకములో
శోకము లేకయే ఏకముగా
బ్రాకటముగను జేకొనుము ||దేవర నీ||
ఇప్పగిది నెప్పుడును
గొప్పగు ప్రేమతో నొప్పుచు దా
మొప్పిన చొప్పున దప్పకను
మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ||దేవర నీ||
తాపములు పాపములు
మోపుగ వీరిపై రాకుండగా
గాపుగ బ్రాపుగ దాపునుండి
యాపదలన్నియు బాపుచును ||దేవర నీ||
సాధులుగన్ జేయుటకై
శోధనలచే నీవు శోధింపగా
కదలక వదలక ముదమున నీ
పాదము దాపున బాదుకొనన్ ||దేవర నీ||
మెండుగ భూమండలపు
గండములలో వీరుండగను
తండ్రిగ దండిగ నండనుండి
వెండియు వానిని ఖండించావే ||దేవర నీ||
యిద్దరు వీరిద్దరును
శుద్ధులై నిన్ను సేవించుటకై
శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్
దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర నీ||
వాసిగ నీ దాసులము
చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుడ
యేసుని పేరిట బ్రోవుమామేన్ ||దేవర నీ||
పల్లవి
కరుణాసాగర యేసయ్యా
కనుపాపగా నను కాచితివి
ఉన్నతమైన ప్రేమ తో
మనసున మహిమగా నిలిచితివి (2)
చరణం 1 :
మరణపు లోయలో దిగులు చెందక
అభయము నొందితిని నిన్ను చూచి (2)
దాహము తీర్చిన జీవ నది
జీవ మార్గము చుపితివి (2) " కరుణా "
చరణం 2 :
యోగ్యత లేని పాత్రను నేను
శాశ్వత ప్రేమ తో నింపితివి (2)
ఒదిగితిని నీ కౌగిలి లో
ఓదార్చితివి వాక్యముతో (2) " కరుణా "
చరణం 3 :
అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు
సర్వ సత్యము లో నడిపితివి (2)
సంపూర్ణ పరచి జ్వేష్టుల తో
ప్రేమ నగరి లో చేర్చుమయా (2)
స్నేహితుడా నా స్నేహితుడా
నా ప్రాణ స్నేహితుడా
ఆపదలో నన్నాదుకొనే
నిజమైన స్నేహితుడా (2)
నన్నెంతో ప్రేమించినావు
నాకోసం మరణించినావు (2)
మరువగలనా నీ స్నేహము
మరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా||
నా ప్రాణ ప్రియుడా నీ కోసమే
నే వేచానే నిరతం నీ తోడుకై (2)
ఇచ్చెదన్ నా సర్వస్వము
నాకున్న ఆశలు ఈడేర్చుము (2) ||స్నేహితుడా||
కన్నీటితో ఉన్న నన్ను
కరుణించి నను పలుకరించావు (2)
మండిన ఎడారిలోన
మమత వెల్లువ కురిపించినావు (2) ||స్నేహితు
యేసయ్యా నీవే నాకని- వేరెవ్వరు నాకులేరని (2)
వేనోళ్ళకొనియాడిన- నాఆశలుతీరవే
కృపవెంబడికృపనుపొందుచూ
కృపలోజయగీతమేపాడుచూ-
కృపలోజయగీతమేపాడుచూ “యేసయ్యా“
1.ఉన్నతఉపదేశమందున- సత్తువగలసంఘమందున(2)
కంచెగలతోటలోనా- నన్నుస్థిరపరిచినందున(2) ”కృప“
2.సృష్టికర్తవునీవేనని- దైవికస్వస్థతనీలోనని(2)
నాజనులుఇకఎన్నడు- సిగ్గుపడరంటివే(2) ”కృప
నీ కృప నిత్యముండును
నీ కృప నిత్య జీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము (2) ||నీ కృప||
శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)
కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2) ||నీ కృప||
ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)
ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2) ||నీ కృప||
అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2)
రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2) ||నీ కృప||
స్తుతి పాడుటకే బ్రతికించిన - జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నను పోషించిన - తల్లివలె నను ఓదార్చిన
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2)
జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా
నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును ||స్తుతి పాడుటకే||
ప్రాణభయమును తొలగించినావు - ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు (2)
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను ||స్తుతి పాడుటకే||
నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు - కనుమరుగాయెను నా దుఖ:దినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు (2)
నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను ||స్తుతి పాడుటకే||
హేతువులేకయే ప్రేమించినావు - వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు (2)
నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై
నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై ||స్తుతి పాడుటకే
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)
ఈ వార్త వినరండే
యేసయ్యను నమ్ముకొండే (2)
మానవ జాతి పాపము కొరకై (2)
కన్నీరు విడుస్తుండు
ప్రభు రమ్మని పిలుస్తుండు (2) ||అమ్మల్లారా||
లోకమంతటా యేసు రక్తము (2)
ఎరువుగ జల్లిండే
మరణపు ముల్లును విరిచిండే (2)
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)
ఓ పల్లె చెల్లెల్లారా
ఓ పట్నం అక్కల్లారా (2)
బట్టలు మార్చితే బ్రతుకు మారదు
గుండు కొడితే నీ గుణం మారదు
బతుకు మారడం బట్టల్ల లేదు
గుణం మారడం గుండుల లేదు
నీ మనసు మారాలన్నా
నీ బుద్ది మారాలన్నా
నీ మనసు మారాలక్కా
నీ బుద్ది మారాలక్కా ||అమ్మల్లారా||
పాపం లేని యేసు దేవుణ్ణి
నమ్ముకుందామమ్మా
దేవుడు మంచి దేవుడమ్మా (2)
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)
ఈ సత్యమినరండే
ఇది కల్ల కాదు చెల్లె
ఇది కల్ల కాదు తమ్మి
ఇది కల్ల కాదు తాత
ఇది కల్ల కాదు అవ్వ
ఇది కల్ల కాదు అన్న
ఇది కల్ల కాదు అక్క
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయా - నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా (2)
దావీదు కుమారుడా నను దాటిపొకయా - నజరేతువాడా నను విడిచిపోకయా (2) || నీవు ||
1. గ్రుడ్డి వాడినయ్యా నా కనులు తెరువవా - మూగవాడినయ్యా నా స్వరము నియ్యవా (2)
కుంటి వాడినయ్య నా తోడు నడువవా (2) || దావీదు ||
2. లోకమంత చూసి నను ఏడిపించినా - జాలితో నన్ను నీవు చేరదీయవా (2)
ఒంటరినయ్యా నాతోడు నిలువవా (2) || దావీదు ||
3. నా తల్లి నన్ను మరచిపోయిన - నా తండ్రి నన్ను విడిచిపోయిన (2)
తల్లి తండ్రి నీవై నను లాలించవా (2) || దావీదు ||
నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలొనే
శాశ్వతమైనది ఎంతో మధురమైనదీ
నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ
1. అతికాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా
శిధిలమైయుండగా నేను నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా
// నిజమైన//
2. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వమూనీకే అర్పణగా
వాడిపోనీవ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా
// నిజమైన//
3. షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో
అలసీ పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆదరణకర్తవై నను చేర్చుము నీ రాజ్యములో
// నిజమైన//
ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని (2)
ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2)
ఒక్కరినైనా ఒక ఆత్మనైనా
రక్షించానా నీకై వెలిగించానా (2) ||ఏం చేసానయ్యా||
ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా
మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా
నిన్నే ఎదిరించానా (2)
ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2)
నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) ||ఏం చేసానయ్యా||
ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా
శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా
నా కడుపు నింపుకున్నానా (2) ||ఇప్పటికైనా ||
ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా
భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా
సోమరినైపోయానా (2) ||ఇప్పటికైనా ||
స్తుతి పాడనా నేను
నన్ను కాచే యేసయ్యా
నా జీవాన్నదాతకు
నను నడిపే ప్రభువుకు
పాపములో పడియున్న వేళ
వదలకనే దరి చేర్చిన దాత
నీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్యా ||స్తుతి||
సోలిపోయి తూలుతున్న వేళ
జాలితో నను పిలచిన నా దేవా
నా హృదయ ధ్యానము నీకే అర్పింతును ||స్తుతి||
భూమినేలే రారాజు నీవని
ధరణిలోని నీ మహిమను ప్రకటించ
నీ రెక్కల చాటున నను దాచే నీడవని ||స్తుతి
ఎవరూ సమీపించలేని
తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటబడగానే (2)
ఏమౌదునో నేనేమౌదునో (2)
ఇహలోక బంధాలు మరచి
నీ యెదుటే నేను నిలిచి (2)
నీవీచుచు బహుమతులు నే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో||
పరలోక మహిమను తలచి
నీ పాద పద్మములపై ఒరిగి (2)
పరలోక సైన్య సమూహాలతో కలసి
నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో||
జయించిన వారితో కలిసి
నీ సింహాసనము నే చేరగా (2)
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||
అందరు నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)
లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే
నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)
వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)
నేను నిన్ను నమ్ముకొంటిని
నీవు నన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||
అగ్ని మండించు - నాలో అగ్ని మండించు (2)
పరిశుద్ధాత్ముడా - నాలో అగ్ని మండించు (2)
అగ్ని మండుచుండెనే - పొద కాలిపోలేదుగా (2)
ఆ అగ్ని లో నుండే - నీవు మోషేను దర్శించినావే (2) ||అగ్ని||
అగ్ని కాల్చి వేసెనే - సిద్ధం చేసిన అర్పణను (2)
ఆ అగ్ని ద్వారానే - నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2) ||అగ్ని||
అగ్ని కాన రానందునా - వారు సిగ్గు పడిపోయిరే (2)
నీ అగ్ని దిగిరాగా - నీవు ఏలియాను ఘన పరచినావే (2) ||అగ్ని||
ప్రాణ ఆత్మ శరీరము - నీకే అర్పించు చున్నానయ్యా (2)
నీ ఆత్మ వరములతో - నను అలంకరించుమయా (2) ||అగ్ని||
కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును - రాగ భావాలతో నిన్ను ధ్యానింతును
గాత్రవీణ నే మీటి నేను పాడనా - స్తోత్రగీతమే బ్రతుకంత నేపాడనా
1. రాగాల నేను కూర్చనా - స్తుతిగీత గానాలు నేపాడనా
హృదయమే నీ ఆలయం - నాలోనవసియించు నాయేసువా
2. యాగంబునై నేను వేడనా - సనుతించు గీతాలు నే పాడనా
జీవితం నీ కంకితం - స్తుతియాగమై నేను కీర్తించెదన్
3. సువార్త నేను చాటనా - నీ సాక్షిగా నేను జీవించనా
ప్రాణార్పణముగా పోయ బడినా - నన్నిలలో నడిపించు నా యేసువా
కళ్యాణం కమనీయం
ఈ సమయం అతి మధురం (2)
దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) ||కళ్యాణం||
ఏదెను వనమున యెహోవ దేవా
మొదటి వివాహము చేసితివే (2)
ఈ శుభ దినమున
నవ దంపతులను (2)
నీ దీవెనలతో నింపుమయ్యా ||దేవా రావయ్యా||
కానా విందులో ఆక్కరనెరిగి
నీళ్ళను రసముగ మార్చితివే (2)
కష్టములలో నీవే
అండగా నుండి (2)
కొరతలు తీర్చి నడుపుమయ్యా ||దేవా రావయ్యా||
బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు
గుప్తమైయున్నవి నీయందే (2)
ఇహ పర సుఖములు
మెండుగ నొసగి (2)
ఇల వర్ధిల్లగ చేయుమయ్యా ||దేవా రావయ్యా||
:
నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరనానికైనా వెనుతిరుగ లేదు
మనలేను నే నిన్ను చూడక
మహా ఘనుడా నా యేసయ్యా " నీకే "
చరణం 1 :
సంతోష గానాల స్తోత్ర సంపద
నీకే చెల్లింతును ఎల్ల వేళలా
అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా (2)
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే "
చరణం 2 :
నీతో సమమైన బలమైన వారెవ్వరూ
లేరే జగమందు నే ఎందు వెదకినను
నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
నా మది లోన మహా రాజు నీవేనయ్యా
ఇహపరమందు నన్నేలు తేజోమయా (2)
నీ నామం కీర్తించి అరాధింతును .. " నీకే "
చరణం 3 :
నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకే అంకితం (4)
నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2)
నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
నీ కృప లేని క్షణము - నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా (2)
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప||
మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా||
ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||
విజయ గీతము మనసార నేను పాడెద
నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)
పునరుత్తానుడ నీవే
నా ఆలాపన నీకే నా ఆరాధన (2)
ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే
పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2)
యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది
నీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ||
ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి
నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2)
యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము
నీ పరిశుద్ధులలో చూపినది (2) ||విజయ||
నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు
ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో (2)
యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె
నీ ప్రసన్న వదనమును ఆరాధించ (2) ||విజయ||
ప. దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని
దారులలో.. ఏడారులలో..
సెలయేరులై ప్రవహించుమయా..
చీకటిలో.. కారు చీకటిలో..
అగ్ని స్తంభమై నను నడుపుమయా..
||దీవించావే సమృద్ధిగా||
1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
ఊహలలో.. నా ఊసులలో..
నా ధ్యాస బాసవైనావే..
శుద్ధతలో.. పరిశుద్ధతలో..
నిను పోలి నన్నిల సాగమని..
||దీవించావే సమృద్ధిగా||
2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
ఆశలలో.. నిరాశలలో..
నేనున్నా నీకని అన్నావే..
పోరులలో.. పోరాటములో..
నా పక్షముగానే నిలిచావే..
||దీవించావే సమృద్ధిగా||
నడిపిస్తాడు నా దేవుడు - శ్రమలోనైనా నను విడువడు (2)
అడుగులు తడబడినా - అలసట పైబడినా (2)
చేయి పట్టి వెన్నుతట్టి - చక్కని ఆలొచన చెప్పి (2) ||నడిపిస్తాడు||
అంధకారమే దారి మూసినా - నిందలే నను కృంగదీసినా (2)
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు||
కష్టాల కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను చీల్చివేసినా (2)
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు||
నాకున్న కలిమి కరిగిపోయిన - నాకున్న బలిమి తరిగిపోయిన (2)
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు
దయగల హృదయుడవు
నీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవు
ఎడారిలో ఊటలను
జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు
సర్వలోకము నీకు నమస్కరించి
నిన్ను కొనియాడును
"దయగల"
1. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము
సారము వెదజల్లు నీ జాడలె నాకు జీవన గమనము 2
శ్రేష్టమైన ఉపదేశముతో జీవముగలిగిన సంఘములో
నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్దితో 2
2. పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము
పరిశుద్దుల సహవాసమై నాకు క్షేమధారాము 2
విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా
విసుగక నిత్యము ప్రార్ధింతును నిను నిశ్చలమైన నిరీక్షణతో 2
3. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము
పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము 2
ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే
ఆరాధింతును నా యేసయ్యా నిను నిత్యము కీర్తించి ఘనపరతును
ప్రార్థన వలనే పయనము - ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము - ప్రార్థన లేనిదే పరాజయం (2)
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా (2) ||ప్రార్థన||
ప్రార్ధనలో నాటునది - పెల్లగించుట అసాధ్యము
ప్రార్ధనలో పోరాడునది - పొందకపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో ప్రాకులాడినది - పతనమవ్వుట అసాధ్యము (2)
ప్రార్ధనలో పదునైనది - పనిచేయకపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||
ప్రార్ధనలో కనీళ్లు - కరిగిపోవుట అసాధ్యము
ప్రార్ధనలో మూల్గునది - మరుగైపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో నలిగితే - నష్టపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో పెనుగులాడితే - పడిపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||
జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా
(ఇవి) మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా - (2) ||జీవితమంటే||
నమ్ముకున్నాడు యోసేపు - అమ్ముకున్నారు అన్నలు
నమ్ముకున్నాడు ఏశావు - మోసగించాడు యాకోబు (2)
ఈ అన్నల నమ్మే కంటే…
ఈ అన్నల నమ్మే కంటే
అన్న యేసుని నమ్ముకో
రాజ్యం నీదే మేలుకో
పరలోకం నీదే ఏలుకో ||జీవితమంటే||
నమ్ముకున్నాడు యేసయ్యా - అమ్ముకున్నాడు శిష్యుడు
పాపుల కొరకై వచ్చాడమ్మా - ప్రాణాలే తీసారమ్మా (2)
ఈ మనుషులలోనే…
ఈ మనుషులలోనే - మమతలు లేవు
మంచితనానికి రోజులు కావు
సమయం మనకు లేదమ్మా
ఇక త్వరపడి యేసుని చేరమ్మా ||జీవితమంటే||
నమ్మకమైన వాడు - ఉన్నాడు మన దేవుడు
నమ్మదగినవాడు - వస్తాడు త్వరలోనే (2)
యేసుని రాకకు ముందే…
యేసుని రాకకు ముందే
మారు మనస్సును పొందుమా
ప్రభుని చెంతకు చేరుమా
రక్షణ భాగ్యం పొందుమా ||జీవితమంటే||
జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే .....
నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే
నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే..... - 2 " జ్యోతి"
నా పరలోకపు తండ్రీ - వ్యవసాయకుడా
నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా
నా పరలోకపు తండ్రీ - నా మంచి కుమ్మరి
నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా
నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా
త్రీయేక దేవా - ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద
సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా/2/
1. ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే/2/శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా /2/సర్వ/
2. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే /2/
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా /2/సర్వ/
3. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు క్షోభాతిశయముగా చేసితివి నన్ను /2/నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా /2/సర్వ/
Thak you sir
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని||
ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)
ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)
ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)
స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
సన్న తంతుల సితారతోను (2)
చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
తంబురతోను నాట్యముతోను (2)
తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
పిల్లనగ్రోవుల చల్లగనూది (2)
ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2)
గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2)
హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||
ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను } 2||ఎంతో||
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు } 2
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు } 2
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు - } 2
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు } 2
అవలీలగా నతని గురితింపగలనమ్మా } 2||ఎంతో||
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు } 2
మరులు మనసున నింపు మహనీయుడాతండు } 2
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు - } 2
సిరులు కురిపించేను వర దేవ తనయుండు } 2
విరబూయు పరలోక షారోను విరజాజి } 2||ఎంతో||
పాలతో కడిగిన నయనాలు గలవాడు } 2
విలువగు రతనాల వలె పొదిగిన కనులు } 2
పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు - } 2
కలుషము కడిగిన కమలాల కనుదోయి } 2
విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు } 2||ఎంతో||
మేలిమి బంగారు స్థలమందు నిలిపిన } 2
చలువ రాతిని బోలు బలమైన పాదాలు } 2
మేలిమి బంగారు స్థలమందు నిలిచినా చలువ రాతిని బోలు బలమైన పాదాలు - } 2
ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. } 2
బలవంతుడగువాడు బహుప్రియుడాతండు } 2||ఎంతో||
అతడతికాంక్షానీయుండు తనయుండు } 2
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు } 2
అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు - } 2
ఆతని నొరతి మధురంబు మధురంబు } 2
ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస } 2
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)
విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా||
1. నీవు కనిపించని రోజున
ఒక క్షణమొక యుగముగా మారెనే (2)
నీవు నడిపించిన రోజున
యుగయుగాల తలపు మది నిండెనే (2)
యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా||
2. నీవు మాట్లాడని రోజున
నా కనులకు నిద్దుర కరువాయెనే (2)
నీవు పెదవిప్పిన రోజున
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా||
3. నీవు వరునిగా విచ్చేయి వేళ
నా తలపుల పంట పండునే (2)
వధువునై నేను నిను చేరగా
యుగయుగాలు నన్నేలు కొందువనే (2)
యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||
RAJA NEE SANNIDHILO LYRICS IN TELUGU
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
Ameen
నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా
నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2)
నీ వాక్యమే నా పరవశము
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2)
నీ వాక్యమే నా పాదములకు దీపము (3) ||నా స్తుతి పాత్రుడా||
నీ కృపయే నా ఆశ్రయము
నీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2)
నీ కృపయే నా జీవన ఆధారము (3) ||నా స్తుతి పాత్రుడా||
నీ సౌందర్యము యెరూషలేము
నీ పరిపూర్ణత సీయోను శిఖరము (2)
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (3) ||నా స్తుతి పాత్రుడా||
నా కృప నీకు చాలని
నా దయ నీపై ఉన్నదని
నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని
నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని
నాతో మాట్లాడిన మహోన్నతుడా
నన్నాదరించిన నజరేయ (2) ||నా కృప||
నేను నీకు తోడైయున్నానని
పొంగే జలములు నిన్నేమి చేయలేవని (2)
నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును (2)
పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని (2) ||నాతో||
పరిశుద్ధాత్మను నాయందు ఉంచానని
ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని (2)
నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని (2)
జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని (2) ||నాతో||
స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా (2) ||స్తుతియు||
మా దేవుడవై మాకిచ్చితివి
ఎంతో గొప్ప శుభ దినము (2)
మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2)
కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) ||స్తుతియు||
నీవొక్కడవే గొప్ప దేవుడవు
ఘనకార్యములు చేయుదువు (2)
నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2)
నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2) ||స్తుతియు||
నీవే మాకు పరమ ప్రభుడవై
నీ చిత్తము నెరవేర్చితివి (2)
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2)
నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2) ||స్తుతియు||
భరియించితివి శ్రమలు నిందలు
ఓర్చితివన్ని మా కొరకు (2)
మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2)
పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2) ||
శ్రీమంతుడా యేసయ్యా
నా ఆత్మకు అభిషేకమా
నా అభినయ సంగీతమా } 2
సిలువధారి నా బలిపీఠమా
నీ రక్తపు కోట నాకు నివాసమా } 2
నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా
ఇదియే నీ త్యాగ సంకేతమా } 2|| శ్రీమంతుడా ||
మహిమగల పరిచర్య పొందినందున
అధైర్యపడను కృప పొందినందున } 2
మహిమతో నీవు దిగి వచ్చువేళ
మార్పునొందెద నీ పోలికగా } 2|| శ్రీమంతుడా ||
సీయోను శిఖరము సింహాసనము
వరపుత్రులకే వారసత్వము } 2
వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా
వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా } 2
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది -1
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట -3
నా జీవిత ధన్యతై యున్నది -1
మోడుబారిన జీవితాలను
చిగురింప చేయగలవు నీవు -2
మారా అనుభవం మధురముగా
మార్చగలవు నీవు } 2|| మహో ||
ఆకు వాడక ఆత్మఫలములు
ఆనందముతో ఫలియించనా -2
జీవజలముల ఊటయైన
నీ యోరను నను నాటితివా } 2|| మహో ||
వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచియుంచితివా -2
వాగ్దానా ఫలము అనుభవింప
నీ కృపలో నన్ను పిలచితివా } 2
ను కూడా ఉన్నానయ్యా
నన్ను వాడుకో యేసయ్యా (2)
పనికిరాని పాత్రనని
నను పారవేయకు యేసయ్యా (2)
జ్ఞానమేమి లేదుగాని
నీ సేవ చేయ ఆశ ఉన్నది (2)
నీవే నా జ్ఞానమని (2)
నీ సేవ చేయ వచ్చినానయ్య (2) ||నేను||
ఘనతలొద్దు మెప్పులొద్దు
ధనము నాకు వద్దే వద్దు (2)
నీవే నాకు ఉంటే చాలు (2)
నా బ్రతుకులోన ఎంతో మేలు (2) ||నేను||
రాళ్లతో నన్ను కొట్టిన గాని
రక్తము కారిన మరువలేనయ్యా (2)
ఊపిరి నాలో ఉన్నంత వరకు (2)
నీ సేవలో నేను సాగిపోదునయా (2) ||నేను||
మోషే యెహోషువాను పిలిచావు
ఏలీయా ఎలీషాను నిలిపావు (2)
పేతురు యోహాను యాకోబులను (2)
అభిషేకించి వాడుకున్నావు (2) ||నేను||
చాలా బాగుంది thanks brother melantivaru ma kentho avasaram God bless you
రాజాధిరాజ రవి కోటి తేజ
రమణీయ సామ్రాజ్య పరిపాలకా } 2
విడువని కృప నాలో స్థాపించేనే
సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును } 2|| రాజాధి రాజా ||
వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును నాకొరకే త్యాగముచేసి } 2
కృపాసత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేద } 2|| రాజాధి రాజా ||
ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశ్యములను నా యెడల సఫల పరిచి } 2
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరనిలో|| రాజాధి రాజా ||
మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచితివి } 2
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే } 2|| రాజాధి రాజా
ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2)
నే పాడెదన్ - కొనియాడెదన్ (3)
నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4) ||ప్రేమా||
లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2)
యేసుని ప్రేమ వెల యెంతో
ఇహమందైనా పరమందైనా (2)
వెల కట్టలేని కలువరిలో ప్రేమ
వెలియైన ప్రేమ నాకై బలియైన ప్రేమ - (2) ||ప్రేమా||
మరణముకంటె బలమైనది - పునరుత్ధాన ప్రేమ
మరణపు ముల్లును విరచినది - బలమైన ప్రేమ (2)
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2)
గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ - (2) ||ప్రేమా||
ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను
నా బలమా ఆలకించుమా
నా బలమా ఆదరించుమా
ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేనూ
కన్నీటితో కృంగిపోతున్నాను
నా యేసయ్యా నా బలమా
నాదీన ప్రార్ధన ఆలకించుమా ॥ఇంటి॥
1॰
వేటగాని బాణములు చేయుచుండె గాయములు
అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును
నీ బలిపీఠముచెంత నాకు చోటునీయుమా
ఆలకించుమా ఆదరించుమా ॥ఇంటి॥
2॰
తెలిసి తెలిసి చేసితినీ ఎన్నెన్నో పాపములు
తరచి తరచి చూచినా తరగవు నా దోషములు
నీ ఆత్మను కోల్పోయిన హీనుడను నేను
ఆలకించుమా ఆదరించుమా ॥ఇంటి॥
శృతి చేసి నే పాడనా - స్తోత్రగీతం
భజియించి నే పొగడనా - స్వామీ = 2
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2
1. దానియేలును సింహపుబోనులో - కాపాడినది నీవే కదా - 2
జలప్రళయములో నోవాహును కాచిన - బలవంతుడవు నీవే కదా - 2
నీవే కదా - నీవే కదా - నీవే కదా..
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2
2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవే కదా - 2
పాపులకొరకై ప్రాణమునిచ్చిన - కరుణామయుడవు నీవే కదా - 2
నీవే కదా - నీవే కదా - నీవే కదా..
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2
నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా
నీలో నేనుండుటే అదే నా ధన్యతయే (2)
నాకెంతో ఆనందం…
ఏ అపాయము నను సమీపించక
ఏ రోగమైనను నా దరికి చేరక (2)
నీవు నడువు మార్గములో నా పాదము జారక
నీ దూతలే నన్ను కాపాడితిరా (2) ||నాకెంతో||
నా వేదనలో నిన్ను వేడుకొంటిని
నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని (2)
నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా
నా కన్న తండ్రివై కాపాడుచుంటివా (2) ||నాకెంతో||
నూతన యెరూషలేం నా గమ్యమేనని
నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా (2)
నీవుండు స్థలములో నేనుండ గోరెదను
నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా (2) ||నాకెంతో||
అమరుడవు నీవు నా యేసయ్యా -
ఆదియు అ౦తము నీవేనయ్యా ॥2॥
ఆదిలోనున్న నీ వాక్యమే -
ఆదరించెను శ్రమకొలిమిలో ॥2॥
సొమ్మసిల్లక సాగిపోదును - సీయోను మార్గములో
స్తోత్రగీతము ఆలకి౦తును - నీ దివ్య సన్నిధిలో
॥అమరుడవు నీవు॥
1) శక్తికి మి౦చిన సమరములో -
నేర్పితివి నాకు నీ చిత్తమే
శిక్షకు కావే శోధనలన్నీ -
ఉన్నత కృపతో నను ని౦పుటకే ॥2॥
ప్రతి విజయము నీక౦కిత౦ -
నా బ్రతుకే నీ మహిమార్థ౦
లోకమంతయు దూరమైనను - నను చేరదీసెదవు
దేహమ౦తయు ధూళియైనను - జీవి౦పజేసెదవు
॥అమరుడవు నీవు॥
2) వేకువ కురిసిన చిరుజల్లులో -
నీ కృప నాలో ప్రవహించగా
పొందితినెన్నో ఉపకారములు -
నవనూతనమే ప్రతిదినము ॥2॥
తీర్చగలనా నీ ఋణమును -
మరువగలనా నీ ప్రేమను
కన్నత౦డ్రిగ నన్ను కాచి - కన్నీరు తుడిచితివే
కమ్మనైన ప్రేమ చూపి - కనువిందు చేసితివే
॥అమరుడవు నీవు॥
3) జల్దరువృక్షమును పోలిన -
గుణశీలుడవు నీవేనయ్యా
మరణము గెలచిన పరిశుద్ధుడవు -
పునరుత్థానుడవు నీవయ్యా ॥2॥
జయశీలుడవు నీవేనని -
ఆరాధింతును ప్రతినిత్యము
గు౦డెగుడిలో ని౦డినావు - నీకే ఆరాధన
ఆత్మదీపము వెలిగించినావు - నీకే ఆరాధన
॥అమరుడవు నీవు॥
GOD bless you bro
🙏praise the lord ఇంకా స్లో పాటలకి స్పీడుగా పడే పాటలకి కూడా ట్రాయక్ పేటండి బ్రదర్ దేవుడు మిమ్మల్ని మెండుగాడివించ్చునుగాక
ప్రభువా నీ కలువరి త్యాగము
చూపెనే నీ పరిపూర్ణతను
నాలో సత్ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే|| ప్రభువా ||
నీ రక్షణయే ప్రాకారములని
ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి - 2
లోకములోనుండి ననువేరు చేసినది
నీదయా సంకల్పమే - 2|| ప్రభువా ||
జీవపు వెలుగుగ నను మార్చుటకే
పరిశుద్ధాత్మను నాకొసగితివే - 2
శాశ్వత రాజ్యముకై నను నియమించినది
నీ అనాది సంకల్పమే - 2|| ప్రభువా ||
సంపూర్ణునిగా నను మార్చుటకే
శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే - 2
పరిపూర్ణ శాంతితో నను కాచుటయే
నీ నిత్యసంకల్పమే - 2|| ప్రభువా |
నా మహారాజు నివసించు ఆ సీయోనులో
మేలు చేయక నీవు ఉండలేవయ్య - ఆరాధించక నేను ఉండలేనయ్య || 2 ||
యేసయ్యా యేసయ్యా || 2 || || మేలు చేయక ||
1.నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండలేక
నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా
నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా
క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది || యేసయ్యా ||
2.ఆరాధించే వేళలందు - నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపము కలిగే నాలో - నేను పాపినని గ్రహింయిన్చగానే
నీ మేళ్లకు అలవాటయ్యి - నీ పాదముల్ వదలకుంటిన్
నీ మేళ్లకు అలవాటయ్యి - నీ పాదముల్ వదలకుంటిన్
నీ కిష్టమైన దారి - కనుగొంటిని నీతో చేరి || యేసయ్యా ||
3.పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించగల్గే నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో
నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని
నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని
అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగి ఉన్నందుకు || యేసయ్యా ||
పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను
స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు
నీ కృప చేతనే నాకు నీ రక్షణ బాగ్యము కలిగిందని
పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు
నా విమోచాకుడవు రక్షనానందం నీ ద్వారా కలిగిందని
నే ముందెన్నడూ వెళ్ళనీ తెలియని మార్గము నాకు ఎదురాయెనె
సాగిపో నా సన్నిది తోడుగా వచ్చుననిన
నీ వాగ్ధానమే నన్ను బలపరిచినే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే
చెరలోనైనా స్తుతి పాడుచూ మరణము వరకు నిను ప్రకటించెద
ప్రాణమా క్రుంగిపోకే ఇంకొంత కాలం
యేసు మేఘాలపై త్వరగా రానుండగా నీరీక్షణ కోల్పోకు నా ప్రాణమా
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేను వుంటా నేసయ్యా } 2
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా } 2|| నీవుంటే నాకు చాలు ||
ఎన్ని భాదలున్నను యిబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన నిష్టూర మైనను|| నీ మాట చాలయ్యా ||
బ్రతుకు నావ పగిలినా కడలి పారైనను
అలలు ముంచి వేసినా ఆశలు అనగారిన } 2|| నీ మాట చాలయ్యా ||
ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా } 2|| నీ మాట చాలయ్యా ||
నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు నాకిల సమానము } 2|| నీ మాట చాలయ్యా
భజియింతుము నిను జగదీశా శ్రీ
యేసా మా రక్షణ కర్తా (2)
శరణు శరణు మా దేవా యెహోవా
మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతుము||
విమల సెరాపులు దూత గణంబులు
చూడగ లేని తేజోనిధివే (2)
మా యధములకై సిలువ మ్రానుపై
దీనుడవై మరణించితివే (2) ||శరణు||
ప్రప్రధముడ మరి కడపటి వాడా
మృతుడై బ్రతికిన నిరత నివాసి (2)
నీ భజనలు మా జీవనాధారం
చేకొనవే మా స్తుతి గీతం (2) ||శరణు||
ప్రభు మొర వినవా
ప్రభు మొర వినవా
నీ కొరకే నేను వెదకేను దేవా
నాకొకసారి కనిపించ రావా - (2) ||ప్రభు||
నాదు ప్రాణము తల్లడిల్లాగా
భూదిగంతముల నుండియేగా (2)
మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా (2) ||నీ కొరకే||
ఎక్కలేని ఎత్తైన కొండ
ఎక్కించుము నను పరిశుద్ధ కొండ (2)
చక్కని ప్రభు నీ మోము జూడ (2) ||నీ కొరకే||
మిత్రుడా నా ఆశ్రయ నీవే
శత్రువుల యెడ నా కోట నీవే (2)
స్తుతికి కారణభూతుడా నీవే (2) ||నీ కొరకే||
Song no:
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును (2)
ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన||
వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా (2)
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని
నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది||
మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో (2)
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది||
విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును (2)
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను (2) ||ఏడాది||
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నీకేమి చెల్లింతును (2)
కపట నటనాలు లేనట్టి హృదయాన్ని
అర్పించినా చాలునా (2) ||ఏడాది|
శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె కాచిన కృప
నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో || శాశ్వత ||
తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే
నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే || శాశ్వత ||
పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే || శాశ్వత ||
వెదకుడి మీకు దొరికేదను తట్టుడి మీకు తెరిచేదను
అడుగుడి ప్రతివానికి ఆత్మను ఇచ్చెదనంటివే || శాశ్వత ||
జీవప్రదాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు
జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవే ప్రభు
జగములనేలే మహిమాన్వితుడా - నాయెడ నీకృపను
జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను
ఏమనిపాడెదనూ - ఏమని పొగడెదను
శుభకరమైన తొలిప్రేమనునే - మరువకజీవింప కృపనీయ్యవా
కోవెలలోనికానుకనేనై - కోరికలోని వేడుక నీవై జతకలిసినిలిచి - జీవింపదలచి కార్చితివి నీరుధిరమే
నీత్యాగ ఫలితం నీప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా
నేనేమైయున్న నీకృపకాదా - నాతోనీసన్నిధిని పంపవా
ప్రతికూలతలు శృతిమించినను - సంధ్యాకాంతులు నిదురించినను
తొలివెలుగు నీవై - ఉదయించినాపై నడిపించినది నీవయ్యా
నీకృపకునన్ను పాత్రునిగాచేసి బలపరచిన యేసయ్యా
మహిమనుధరించిన యోధులతోకలసి - దిగివచ్చెదవు నాకోసమే
వేల్పులలోన బహుఘనుడవు నీవు - విజయవిహారుల ఆరాధ్యుడవు
విజయోత్సవముతో - ఆరాధించెదను అభిషక్తుడవు నీవని
ఏనాడూపొందని ఆత్మాభిషేకముతో నింపుమునాయేసయ్యా
నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీ కోసమే
ఆశ్రయమైన నా యేసయ్యా
" అతి పరిశుద్ధుడా "
సర్వోన్నతమైన స్థలముల యందు
నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము
ఎన్నడూ ఆశ్చర్యమే
ముందెన్నడూ చవి చూడని
సరిక్రొత్తదైన ప్రేమా మృతం
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణము తీరదు ఏనాటికీ. " అతి పరిశుద్ధుడా "
సద్గుణ రాశి నీ జాడలను
నా ఎదుటే నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం
నీ కృపకు సంకేతమే
కృప వెంబడి కృప పొందగా
మారాను మధురముగా నే పొందగా
నాలోన ఏ మంచి చూశావయ్యా
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా " అతి పరిశుద్ధుడా "
సారెపై నున్న పాత్రగ నన్ను
చేజారి పోనియ్యక
శోధనలెన్నో ఎదిరించినను
నను సోలి పోనియ్యక
ఉన్నావులే ప్రతి క్షణమునా
కలిసున్నావులె ప్రతి అడుగునా
నీవేగా యేసయ్య నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి
పల్లవి : నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య
తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి
ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే
1.నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు
నీ మార్గములలో నన్ను నడిపించెనే
నా నిత్యరక్షణకు కారణజన్ముడా
నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య
|| నిత్యా ||
2.నా అభిషిక్తుడా నీ కృపావరములు
సర్వోత్తమమైన మార్గము చూపెనే
మర్మములన్నియు బయలుపరుచువాడా
అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య
|| నిత్యా ||
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
స్తుతి గానమే పాడనా
జయగీతమే పాడనా (2)
నా ఆధారమైయున్న
యేసయ్యా నీకు - కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి||
1. నమ్మదగినవి నీ న్యాయ విధులు
మేలిమి బంగారు కంటే - ఎంతో కోరతగినవి (2)
నీ ధర్మాసనము - నా హృదయములో
స్థాపించబడియున్నది - పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి||
2. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
లౌకిక జ్ఞానము కంటే - ఎంతో ఉపయుక్తమైనవి (2)
నీ శ్రేష్టమైన - పరిచర్యలకై
కృపావరములతో నను - అలంకరించితివే (2) ||స్తుతి||
3. నూతనమైనది నీ జీవ మార్గము
విశాల మార్గము కంటే - ఎంతో ఆశించదగినది (2)
నీ సింహాసనము - నను చేర్చుటకై
నాతో నీవుంటివే - నా గురి నీవైతివే (2) ||స్తుతి||
నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా
ఆరాధ్య దైవమా - నా స్తోత్ర గీతమా
నా స్తోత్ర గీతమా - ఆరాధ్య దైవమా
నా యేసు రాజా - రాజా - రాజా - రాజా
నీ రథ అశ్వముగా
నీ త్యాగ బంధము - నన్ను బంధించేనా
నీ ఆత్మ సారధిచే - నన్ను నడిపించుమా ॥ నా యేసు ॥
వేటగాని ఉరినుండి
నన్ను విడిపించినా - కనికర స్వరూపుడా
నా కన్నీటిని - నాట్యముగా మార్చితివా ॥ నా యేసు ॥
అరణ్య యాత్రలోన
నా దాగుచోటు నీవే - నా నీటి ఊట నీవే
అతికాంక్షణీయుడా - ఆనుకొనెద నీ మీద ॥ నా యేసు ॥
నేను ఓడిపోనయ
Useful track bro
Song no:
నిత్యం నిలిచేది - నీ ప్రేమే యేసయ్య
నిలకడగా ఉండేది - నీ మాటే యేసయ్య (2)
నాతో ఉండేది - నీ స్నేహం యేసయా
నాలో ఉండేది - నీ పాటే యేసయ్యా (2) "నిత్యం"
మంటిపురుగునైనా నన్ను ఎన్నుకుంటివి
విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2)
నీకెవరూ సాటే రారయ్యా
నీకంటే లోకంలో గనుడెవరేసయ్యా. (2) "నిత్యం"
ఈ లోక స్నేహాలన్నీ - మోసమేకదా
అలరించే అందాలన్నీ - వ్యర్థమే కదా (2)
నిజమైన స్నేహం నీదయ్యా
నీ స్నేహం లేకుంటే నా బ్రతుకె వ్యర్ధమయ్యా (2) "నిత్యం"
Amen
పశువుల పాకలో - మరియమ్మ గర్భాన } 2
ప్రభుయేసు జన్మించె - ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా } 2|| పశువుల ||
ఐదు రొట్టెలు రెండు చేపలు
ఐదువేలకు పెట్టేనురో } 2
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా } 2|| పశువుల ||
కుంటోళ్ళు గుడ్డోళ్ళు - చెవిటోళ్ళు మూగోళ్ళు
స్వస్థతను ఇచ్చేనురో - ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా } 2|| పశువుల ||
చచ్చినోళ్ళను లేపినాడు - గాలి తుఫాను ఆపినాడు } 2
నీటిమీద నడిచ్చేనురో ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా } 2
VERY VERY GOOD CREATIVITY, GLORY TO GOD.
GOD BLESS
ఆదరణ కర్తవు ఆనాధునిగ విడువవు
నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు -2
అల్పుడనైయున్న నన్ను చెరదీసితివా
అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే
ఆనంద భరితుడనై వేచియుందును నీరాకకై -2 II ఆదరణ II
నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే
నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే
నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు -2 II ఆదరణ II
యేసయ్య! యేసయ్య!
యేసయ్య! యేసయ్య!!
Wonderful your this kind of ministry. GOD blessed you my bro.
కృపా సత్య సంపూర్ణుడా
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా -2
నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా ...
మహనీయుడవు నీవేనయా ...
1. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
దాటిరే నీ జనులు బహు క్షేమముగా -2
ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే -2
2. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా -2
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే -2
3. నైవేద్యములు, దహన బలులు నీ కోరవుగా
నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా -2
నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ మారిపోయెనే -
Bro. D. Sundar Rao Ghatkesar praise lord 🙏💐💐💐💐🎹👍
TQ YOU BRO
సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2
ఎవ్వరులేరు - నాకు ఇలలో -2
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2
నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2
వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥
నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2
సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥
నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥
పాడెద స్తుతి గానము - కొనియాడెద నీ నామము || 2 ||
నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువని స్నేహం
అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా || 2 ||
|| పాడేద ||
1. ఇల నాకెవ్వరు లేరనుకొనగా - నా దరి చేరితివే
నే నమ్మినవారే నను మరచినను - మరువని దేవుడవు || 2 ||
నీ ఆశాలే నాలో చిగురించెను - నీ వాక్యమే నన్ను బ్రతికించెను || 2 ||
నీ అనుబంధము నాకానందమే ||2|| || పాడేద ||
2. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను - నీ రుధిదారాలే
నీ దర్శనమే నను నిలిపినది - ధరణిలో నీ కొరకే || 2 ||
నీ చేతులే నను నిర్మించెను - నీ రూపమే నాలో కలిగెను || 2 ||
నీ అభిషేకము పరమానందమే || 2 || || పాడేద ||
3. బలహీనతలో నను బలపరచి - ధైర్యము నింపితివే
నా కార్యములు సఫలముచేసి - ఆత్మతో నడిపితివి || 2 ||
యూదగోత్రపు కొదమ సింహమా - నీతో నిత్యము విజయహసమే || 2 ||
నీ పరిచర్యలో మహిమానందమే |
సాకి: యేసూ...నీ ప్రేమ ఒక్కటే... "2"
*మాటల్లో చెప్పలైనిది*
*స్వరములతో పాడలేనిది*
*కవితలతో రాయలేనిది*
*ఎవరువర్ణిచలేనిది*
*యేసూ....నీ ప్రేమ ఒక్కటే...* "2"
*"మాటల్లో"*
స్వార్ధముతో నిండిన ఈ లోక ప్రేమలోన
మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య "స్వార్ధము"
కల్మషమే లేనిది కరుణతో నిండినది "2"
కలవరమే తీసినది కన్నీటిని తుడుచినది "2"
*"యేసూ"* "4"
పాపముతోనిండిన ఈ లోక ప్రేమలోన
శాపముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య "పాపము"
లోకాన్ని ప్రేమించి రక్తాన్ని చిందించి "2"
సిలువలో మరణించినది శిక్షను భరియించినది "2"
*"యేసూ"* "4"
Love u bro
గుండెనిండా యేసు ఉంటే కన్నీలైన ముత్యాలు
గుండెగుడిలో యేసుఉంటే దు : ఖమైన సంతోషం | 2 |
గుండెనిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే ॥2 ॥
1.లోక స్నేహం వెలివేసిన
శోకంలో ముంచి వేసిన
నువ్వే నా నేస్తం
నా హృదయం చెప్పేదొక్కటే
గుండె నిండా నువ్వే ॥2 ॥ గుండె ॥
2. ఊపిరంతా శాపమైన గాలికూడా గేలి చేసిన నువ్వే నా చెలిమి
జాలిలేని ఇలలోన నువ్వే నా కలిమి | గుండె ||
3.చిరకాలం నీ ఒడిలో ఉండాలనే ఆశ చెమ్మగిల్లే కళ్ళతోనే పాడుతున్నా గీతం భాషకంరని ఊసులతో చేస్తున్న స్తోత్రం ॥ 2॥గుండె |
దేవునికే మహిమ కలుగును గాక..❤❤❤👌🏻👌🏻