3 Samaveda Parichayam సామవేద పరిచయం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 มิ.ย. 2024
  • సామవేదం ఇచ్చే సందేశం తత్వమసి - అది నేనై ఉన్నాను. ఏ పవిత్రమైన ఆత్మ చైతన్యం నాలో ఎలాగైతే నిండి ఉందో అది నీలోను, ఈ విశ్వమంతటా నిండిఉంది. నాలాగే నీవునూ పవిత్రుడవు. మనందరమూ విశ్వచైతన్య పురుషుని చైతన్యాన్ని ధరించి ఉన్న పవిత్రాత్ములము. సృణ్వంతు విశ్వే అమృతస్యపుత్రా, ఆయే దామాని దివ్యాని తస్తు - అమృతస్యపుత్రా ఎంతటి అద్భుత వాక్యం. వివేకానందులు ఈ వాక్యాన్నే చికాగో మహాసభలలో జలద గంభీర స్వరంతో గర్జించారు. నీవు పాపివి కాదు అమృత పుత్రుడవు. మనిషిని పాపి అనడమే అన్ని పాపాలలోకి పెద్దపాపం.
    #Madan Gupta
    #Vande Bharatham TV
    #BJP
    #RSS
    #Bharateeyulu
    #Rishi Jeevan Samaj
    నాలుగు వేదాలు క్రింది లింకులో యం.పి.3 లో అందిచబడ్డాయి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
    iish.org

ความคิดเห็น • 27

  • @vepurusuresh976
    @vepurusuresh976 6 วันที่ผ่านมา +1

    ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

  • @bejugamalatharamam5796
    @bejugamalatharamam5796 8 วันที่ผ่านมา +1

    ధన్యవాదాలు, నమోస్తు

  • @srinivast2793
    @srinivast2793 5 วันที่ผ่านมา +1

    అద్భుతంగా వివరించారు.. ధన్య వాదములు.. ఆర్య

  • @anuskadambamala6057
    @anuskadambamala6057 7 วันที่ผ่านมา +1

    ధన్యవాదముల!

  • @tulasiraokonathala2089
    @tulasiraokonathala2089 5 วันที่ผ่านมา +1

    మీరు వేదాలను చక్కగా వివరిస్తున్నారు

  • @dinesh93d
    @dinesh93d 9 วันที่ผ่านมา +1

    🙏

  • @laxnalaxna5424
    @laxnalaxna5424 6 วันที่ผ่านมา +1

    ఆర్యా నేను నాస్తి కు డి నీ అయినా మీ వివరణ అమోఘం అద్భుతం

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 4 วันที่ผ่านมา

      నమస్కారం సర్.మీరు నాస్తికులుగానే ఉంటే మంచిది.ఎందుకంటే వేదాల గురించి తెలుసుకుని సందేహాలు వస్తే సరైన వివరణ దొరక్క మళ్ళీ నాస్తికులుగా మారాల్సి వస్తుంది.

  • @sm369
    @sm369 8 วันที่ผ่านมา +1

    Appreciate your efforts to educate a common man like us.

  • @anuskadambamala6057
    @anuskadambamala6057 7 วันที่ผ่านมา +1

    మహద్భాగ్యంగా భావిస్తాము🙏

    • @VandeBharatamTv
      @VandeBharatamTv  6 วันที่ผ่านมา

      ధన్యవాదములు

  • @komalarajshekar9352
    @komalarajshekar9352 4 วันที่ผ่านมา

    🙏This link is not opening pls give the another link

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 5 วันที่ผ่านมา

    సాంఖ్య యోగము
    శ్లో|| 45: త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భ ఽవార్జున! |
    నిర్ద్వంద్వో నిత్య సత్త్వ స్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్||
    (బ్రహ్మయోగము, కర్మయోగము)
    భావము:- మూడు గుణముల విషయములే వేదములు. వేద భూయిష్టమైన ఆ మూడు గుణములను పూర్తిగ వదలివేయుము. సుఖదుఃఖములు, లాభనష్టములు మొదలగు ద్వంద్వములను వదలి వేసినట్లే యోగక్షేమము అనుదానిని కూడ వదలి నిత్యమైన దైవమును చేరుము.
    వివరము:- ముందు శ్లోకములో చెప్పినట్లు భోగైశ్వర్యములను ఆశ్రయించక దైవమును తెలుసుకొమ్మని హితము చెప్పుచు భగవంతుడిట్లన్నాడు. ప్రతి మనిషికి తలలో ఎన్నో గుణములు మెదలుచుండును. ఆ గుణ సంకల్పముల వలననే మానవులందరు అనేక కార్యములు చేయుచున్నారు. అనేక కార్యములకు కారణమైన తలలోని గుణములను వివరించి చూచితే మూడు రకములుగ ఉన్నవి. 1) తామసము 2) రాజసము 3) సాత్వికము. ఈ మూడు గుణములనే భగవంతుడు మాయ అని విజ్ఞానయోగములో చెప్పాడు. మాయారూపమైన గుణముల విషయములే వేదములందున్నాయి. కావున వేదములలోని కార్యాచరణలైన యజ్ఞయాగాదులు, వ్రతక్రతువులు మొదలుకొని అన్నీ వదలి ఏ గుణసంకల్పము లేకుండ అనగా తలలో చిన్న యోచన కూడ రాకుండ చేసుకొని, బ్రహ్మయోగమాచరించి దైవమును తెలియుము.
    అట్లు బ్రహ్మయోగము వీలుకాక పోయినప్పటికి ద్వంద్వములైన లాభ నష్టములు, సుఖదుఃఖములు వదలి కర్మయోగమాచరించి దైవమును చేరుము. ఈ శ్లోకమునందు మరియు 44వ శ్లోకములో చెప్పినట్లు భోగైశ్వర్యములను ఆశించి, వాటికి సంబంధించిన వ్రతక్రతువులు మొదలైన పనులు చేయక దైవత్వమును చేరు రెండే రెండు మార్గములైన బ్రహ్మయోగము, కర్మయోగమును ఆశ్రయింపుమని హితము చెప్పడమైనది. ఇందులో మా మనవిగ చెప్పడమేమంటే, ఇంతవరకు ఆధ్యాత్మికములో అతిరథ మహారథులైన స్వాములెందరో గీతను గురించి వ్రాసినారు. అందులో ఈ శ్లోకమునందు ముందు వాక్యము బ్రహ్మయోగమునకు సంబంధించినదని, రెండవ వాక్యము కర్మయోగమునకు సంబంధించినదని గుర్తించి వ్రాయలేక పోయారు. కావున మేమిపుడు చెప్పిన వివరమును తప్పుగ తలువ కూడదని, యోచించితే గుణ సంకల్పములు లేనిది బ్రహ్మయోగమని, సుఖదుఃఖ, లాభనష్ట, యోగక్షేమముల ధ్యాస లేకుండ పనిచేయడము కర్మయోగమని వాటి ద్వార దైవమును తెలియుమని భగవంతుడు చెప్పినట్లు సులభముగ అర్థము కాగలదు. 44వ శ్లోకములో భోగైశ్వర్యముల గురించి చెప్పి 45వ శ్లోకములో వాటికి సంబంధములేని మార్గమును సూచించాడని తెలియాలి. ఇది దైవ విషయము కావున అర్ధశూణ్యము, భావశూణ్యము కాకుండ భగవంతుడు ఏ భావము తెల్పాడో, ఆ భావమునే మేము పొందుపరచుచున్నామని తెలుపు కొనుచున్నాము.

    • @VandeBharatamTv
      @VandeBharatamTv  5 วันที่ผ่านมา

      నమస్కారం ఆర్యా గీతా మకరందం లోని వ్యాఖ్యను అందించారు. ధన్యవాదాలు. మీ వంటి పెద్దల ఆశీస్సులు పొందినందుకు ధన్యులము.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 5 วันที่ผ่านมา

      ​@@VandeBharatamTv నమస్కారం.నేను ఆర్యుణ్ణి కాను.నేను అందించింది గీతా మకరందం నుంచి కాదు.ప్రధమ దైన గ్రంథం భగవద్గీత నుంచి స్వచ్ఛమైన ఏ కల్తీ లేని ఆత్మ జ్ఞానం.నేను ఎవరికీ ఆశిస్సులు ఇచ్చేంత గొప్ప వాణ్ణి కాదు.ఒక సామాన్య మనిషిని.ఇంతకీ వేదాల గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానం మీకు అర్థం అయిందో లేదో తెలియలేదు.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 5 วันที่ผ่านมา

      ​​@@VandeBharatamTvఇంతకు ముందు శ్లోకంలో వేదాలు మూడు గుణాల విషయాలే అని చెప్పి ఈ శ్లోకంలో గుణాలే నేను సృష్టించిన నా మాయ అని అటువంటి మాయని దాటడం దుర్లభం అని కూడా చెప్పారు చూడండి.
      విజ్ఞాన యోగము
      శ్లో|| 14: దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
      మామేవ యే ప్రపద్యన్తే మా యా మేతాం తరన్తి తే ||
      (పరమాత్మ)
      భావము:- దైవనిర్మితమైన గుణములతో కూడుకొన్న నా మాయ దుస్సాధ్యమైనది. ఎవరైతే నన్ను శరణుజొచ్చుదురో వారు మాయను దాటిపోగలరు.
      వివరము:- ఆదికర్త అయిన పరమాత్మ సర్వజగత్ కంతటికి అధిపతియై, సర్వమును తానే సృష్ఠించి అవి అన్ని నడుచుటకు కావలసిన పద్దతిని ఏర్పరిచాడు. తాను ఏర్పరిచిన పద్ధతికి సమస్తము కట్టుబడి ఉండునట్లు చేశాడు. సర్వప్రపంచమునకు తానే సృష్ఠికర్త, అధిపతియైనప్పటికి ప్రపంచముతో తాను ఏమాత్రము జోక్యము చేసుకోక, బంధము పెట్టుకోక, తాను నిర్మించిన పద్ధతిచే నడుచునట్లు నిర్మాణము చేశాడు. తాను నిర్మించిన పద్ధతికి సమస్తము ఆధీనమైయుండి, ఆ పద్ధతి ప్రకారమే నడుచుకొనుచున్నవి. ఈ లెక్క ప్రకారము సర్వప్రపంచమును ఆధీనపరుచుకొని ఆడించుచున్నది స్వయముగా పరమాత్మగాదు. పరమాత్మచే నిర్మింపబడిన ప్రత్యేకమైన విధానము. ఆ విధానమునకు లేక పద్ధతికి ముఖ్యమైన పేరు గలదు. దానినే మాయ అనుచున్నాము. మాయకు మరికొన్ని పేర్లు గలవు. ఏసుప్రభువు దానికి సాతాన్ అని పేరు పెట్టగ, ఇస్లాం ప్రవక్త సైతాన్ అను పేరుతో పిలిచాడు. పరమాత్మ నిర్మించినది మాయ కావున ఈ శ్లోకములో 'దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా' అని అన్నాడు.
      మాయ పరమాత్మచే నిర్మింపబడి ఆయన మొదట చెప్పిన ఆదేశానుసారము తన పనిని తాను చేస్తూపోతున్నది. ప్రపంచములో మాయకు లోబడనిది ఏదీలేదు. పుట్టినవన్నియు మాయకు లోబడిఉన్నాయి. మాయకు లోబడనిది మాయనే పుట్టించిన పరమాత్మ ఒక్కటే. మాయపద్ధతి ప్రకారము తన ఆధీనములో ఉండు వారిని సాధారణముగ నడిపించుచుండును. అలాకాక తనకు వ్యతిరేఖముగ నడువవలెననుకొను వారికి పూర్తి విరుద్ధముగ చేయుటకు ప్రయత్నించును. ప్రకృతిసిద్ధమైన జననము మరణము నుండి తప్పించుకోవలెనను వారందరు మాయ ఆధీనమునుండి తప్పించుకోవలెననుకొనెడివారే. కనుక మాయకు ముక్తి కావలెననువారు వ్యతిరిక్తులు, ముక్తి కావలెననుకొనువారికి మాయ వ్యతిరిక్తము. ముక్తికావలెను అనుకొనువాడు ప్రపంచాధినేతయైన మాయను ఏమిచేయలేడు. కాని మాయ అనుకొంటే ఎవరినైన ఏమైన చేయగలదు. దానిని జయించవలెనంటే దుస్సాధ్యముగా ఉండును. అందువలన 'మమమాయా దురత్యయా' అని పై శ్లోకములో చెప్పారు. అట్లయిన మోక్షమును ఎవరూ పొందలేరుకదాయను ప్రశ్నకూడ రాగలదు.
      (తర్వాత కామెట్లో కంటిన్యూ అయింది)

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 5 วันที่ผ่านมา

      @MadanGupta63
      (ముందు కామెంటుని కంటిన్యూ చేస్తూ)
      (2) ఎవరూ జయించలేని అతిబలమైన మాయను జయించి, దాని ఆధీనము నుండి బయటపడుటకు పరమాత్మను శరణుజొచ్చిన వారికే సాధ్యమగును. కనుక పై శ్లోకములో "మామేవ యేప్రపద్యన్తే' అన్నాడు. పరమాత్మ జ్ఞానము ఫలానాయని కొద్దిగైన తెలిస్తే కదా! ఆయనను శరణుజొచ్చవలెనను జ్ఞప్తి రాగలదు. దానికి పరమాత్మ ఒక ప్రత్యేకమైన విధానమును నిర్మించాడు. అవియే ధర్మములు (జ్ఞానము). పరమాత్మ ధర్మములను ఆచరించువారిని మాయ ఎంత ఆటంక పరచిన దానినుండి బయటపడి చివరకు పరమాత్మనే చేరగలరు. అలా ఆచరించుటకు పరమాత్మ ధర్మములు ఫలానా అని తెలియాలి గదా! అని కొందరడుగవచ్చును. దీనికీ జవాబేమనగా! ప్రపంచ సృష్ఠి ఆదిలో మాయను తయారు చేసిన పరమాత్మ, మాయకు ప్రత్యర్థిగ ఉండునట్లు సూత్రబద్దమైన జ్ఞానమును ధర్మములను కూడ తయారు చేసి పెట్టాడు. మాయపని మాయకు, ధర్మముల పని ధర్మములకు నిర్మించిపెట్టాడు. అప్పటినుండి అవి రెండు వాటి వాటి పనిని నిర్వర్తించుచునే ఉన్నవి. మాయ దానికి వ్యతిరిక్తమైన ధర్మములు ప్రపంచములోని జీవరాసుల కొరకే నిర్మించినప్పటికి, జీవరాసులన్ని మాయ ఎడలయే ఎక్కువగా ప్రభావితమగుచున్నవి. ధర్మముల ప్రక్క చేరలేక పోవుచున్నవి. దీనికి కొంత కారణముగలదు. పరమాత్మ మాయను మూడు విధములుగ జీవరాసుల మీద పనిచేయునట్లు నిర్మించాడు. దానికొరకు జీవరాసులను మూడు రకములుగ సృష్ఠించాడు అవి ఏమనగా! ఒకరకము పైకి పెరుగునవి, రెండవరకము అడ్డముగ పెరుగునవి, మూడవరకము క్రిందికి పెరుగునవి. మొదటి రకము పైకి పెరుగు వాటి మీద మాయ ప్రభావము తక్కువగ ఉండును. ఆ జాతి జీవరాసులు కర్మను చాలా తక్కువ సంపాదించుకొనునవై, మాయకు దూరముగ దేవునికి దగ్గరగ ఉన్నవి. రెండవ రకమైన జీవరాసులు మొదటి జాతికంటే కొంత ఎక్కువ కర్మ సంపాదించు కొనునవైవుంటు, మాయకు దేవునికి సమాన దూరములో ఉన్నాయి. మూడవరక జీవరాసులు ఎక్కువ కర్మను సంపాదించుకొనుచు, మాయకు దగ్గరగ దేవునికి దూరముగ ఉన్నవి. ఆ మూడు రకముల జీవరాసులు ఏవి అని పరిశీలించి చూచిన, భూమినుండి పుట్టుచున్న చెట్లు తీగలు మొదలగునవన్నియు మొదటి తరగతి జాతియని, వాటి శరీరములో ఆత్మ స్థానమైన మొదులు లేక వేర్లనుండి పైకి పెరుగుచున్నవని తెలియాలి. అట్లే అండజములుగ, పిండజములుగ పుట్టుచున్న అనేక విధ జంతు, క్రిమి, కీటక, చేపలు, పాములు మొదలగునవన్నియు రెండవ తరగతికి చెందినవనియు, అవి తమ శరీరములోని ఆత్మ స్థానమైన శిరస్సు నుండి ప్రక్కకు పెరుగుచున్నవని తెలియాలి. ఇక పిండోద్భవములైన ఒకే ఒక మానవజాతి మాత్రము మూడవ తరగతికి చెందినది. ఈ జాతి ఆత్మ స్థానమైన శిరో స్థానము నుండి క్రిందికి పెరుగునదై ఉన్నది. ఈ మూడు జాతులలో వాటివాటి అంతఃకరణములైన మనో, బుద్ధి, చిత్తముల పనిలోగాని, గుణముల చురుకుదనములో గాని చాలా తేడా ఉండును. అన్నిటికంటే ఎక్కువ చురుకుదనముగ పని చేయునవి మూడవ జాతియైన మనిషిలోని బుద్ధి, చిత్తము, అహము, మనస్సు. మానవునిలో అంతఃకరణములు బలమైనవిగ ఉన్నవి కనుక గుణములు బాగా పనిచేయుచున్నవి. మాయ గుణముల రూపములో శరీరమందుండి మనిషిని తన ప్రభావములోనే ఉంచుకొనుచున్నది. అందువలన పై శ్లోకములో కూడ 'గుణమయీ మమ మాయ' అన్నాడు. దేవుడు మాయను గుణములరూపములో మానవునియందు ప్రతిష్ఠించాడు. కావున మాయకు మానవుని మీద ఎక్కువ బలమున్నది. దేవుడు మానవునియందు మాయను, ధర్మములను రెండింటిని ప్రతిష్ఠించినప్పటికి, ధర్మము లేవో మనిషికి తెలియని కారణమున, మరియు దేవుడు తనకిచ్చిన అధికారము వలన, మాయ మానవులందరిని తనవైపుకు లాగుకొనుచున్నది. తన పక్షమే అందరికి మంచిగ కనిపించునట్లు చేయుచున్నది. మాయ మరియు దానికి వ్యతిరిక్తమైన జ్ఞానము వాటి వాటి ఉనికిని కోల్పోకుండ ఉండుటకు వాటి ప్రయత్నము అవి చేయుచునే ఉన్నవి. ఆ ప్రయత్నములలో మాయజ్ఞానము దైవధర్మములవలె నటిస్తు తన ప్రాబల్యమును పెంచుకొనుచున్నది. ఏది ఏమైన ప్రపంచములో దైవజ్ఞానముకంటే మాయ యొక్క ప్రాబల్యము అధికముగా ఉండుటకు ముఖ్యమైన కారణమొకటి కలదు. దైవజ్ఞానమునకు ఒకవంతు బలముండగా, మాయకు వేయివంతులు బలమెక్కువ ఉండునట్లు ముందే నిర్ణయించబడియున్నది. ఒకవంతు బలము కూడ జ్ఞానమునకు సరిగాలేదు. కనుక గీతలో భగవంతుడు మనుషులలో వేయింటికొకడు సిద్ధికొరకు ప్రయత్నించుట కూడ అరుదుగ ఉందురని తెలియజేశాడు
      (3 వ కామెంట్లో కంటిన్యూ అయింది)

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 5 วันที่ผ่านมา

      MadanGupta@63
      (2 వ కామెంట్ కంటిన్యూ చేస్తూ)
      (3 వ కామెంట్)
      భూమిమీద కొందరు గురువులుగ బయలుదేరి జ్ఞానమును బోధించుట, ఉపదేశములు ఇచ్చుట జరుగుచున్న పనియే. మాయ వారి మీదనే దృష్ఠిని సారించి, వారిని మంచి జ్ఞానులుగ బయటికి కనిపించునట్లు చేసి, వారిని చాలామంది ప్రజలు ఆశ్రయించునట్లు చేసి, ఆ గురువులు చెప్పిన విషయములు బాగా వినునట్లు చేయుచుండును. అంతేకాక బోధించునదంతయు పరమాత్మ జ్ఞానము ధర్మమేనన్నట్లు, జ్ఞానము దేవుడు అను పదములుపయోగించుచు, ఎంతో ఆకర్షణీయమైన బోధలు చేయుచుండును. ఆ బోధలలో ఒక్క శాతము దైవజ్ఞానము ఉండగ 99% మాయకు సంబంధించిన జ్ఞానమే ఇమిడివుండును. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమైనప్పటికి, ఇది మాయకు సంబంధించిన జ్ఞానమని, పరమాత్మలోనికి ఐక్యము చేయునదికాదని ఎవరూ గుర్తించలేరు. అదియే మాయయొక్క గొప్పతనము. ఎంతో పెద్ద ఆధ్యాత్మిక గురువున్నప్పటికి, స్వచ్ఛమైన ఆధ్యాత్మికమును బోధిస్తున్నప్పటికి వారియందు కూడ చివరికు 95% దైవధర్మములేని మాయ యొక్క బోధయేవుండును. ఇలా కనిపించు గురువులలో కూడ ఉండి వారిచేతనే దైవజ్ఞానమన్నట్లు దైవధర్మములన్నట్లు అధర్మములను బోధిస్తుండుట వలన, దేవుని తెలుసుకోవాలనుకొనువారు కూడ మాయలోనే చిక్కుకొని పరమాత్మవైపు ప్రయాణించలేకున్నారు. ఉన్న కోట్ల ప్రజలలో వేలసంఖ్యలో కొందరికి మాత్రమే జ్ఞానము మీద ఇచ్ఛ కలుగగా, వారిని కూడ మాయ గురువులరూపములో బోధిస్తూనే తన వైపుకు లాగుకొనుచున్నది. కావున గీత విజ్ఞానయోగములో మోక్షము కోరువారిలో చివరకు ఎవరో నన్ను తెలుసుకోగలిగేది అన్నాడు. మాయ అనేక స్థాయిలలో రకరకముల గురువులను ఆవహించి ఉండుట వలన, జ్ఞానము కోరువారు ఏదో ఒక గురువును ఆశ్రయించి మాయ ఆవరణములోనే చేరి పోవుచున్నారు. అందువలన నిజమైన పరమాత్మ జ్ఞానము దొరకాలంటే అనేక జన్మల సంస్కారము వలననే లభించునని గీతయందన్నాడు. అనేక అంటే వందలు కావచ్చు, వేలు కావచ్చు. ఇక్కడ కొందరికొక అనుమానమురావచ్చును. అది ఏమనగా! గురువులందరిని మాయ మభ్యపెట్టి భ్రమింపజేసి, తన బోధనే బోధిస్తున్నదన్నప్పుడు, ఎవరూ పరమాత్మ జ్ఞానము బోధించువారే లేరని చెప్పినపుడు, అనేక జన్మల తర్వాతైన వారికి పరమాత్మ జ్ఞానమెట్లు లభించును అని అడుగవచ్చును. దానికి మా సమాధానము పరమాత్మ యొక్క జ్ఞాన ధర్మములను నూటికి నూరుపాళ్ళు బోధించు గురువులు భూమిమీద ఉంటే పరమాత్మ పుట్టవలసిన అవసరమే లేదుకదా! అలా తన ధర్మములు తెలిసి బోధించువారు లేని దానివలన, పరమాత్మయే స్వయముగ భూమిమీద పుట్టి బోధించవలసి వస్తున్నది. అందువలన ధర్మములకు గ్లాని ఏర్పడినపుడు నేను జన్మించి, నా ధర్మములను తెలియజేస్తానని గీతయందు చెప్పాడు.
      దైవధర్మముల తరుపున పరమాత్మయే స్వయముగ ఉద్భవించి, తన ధర్మములను పూర్తిగ తెలుపుటవలన మాయకు ఇబ్బంది ఏర్పడి, గురువుల మీదనే తన పట్టు తప్పిపోవు పరిస్థితి ఏర్పడును. కనుక అటువంటి పరిస్థితి రాకుండ మాయ కూడ స్వయముగ జన్మ ఎత్తి, భగవంతునికంటే గొప్పగ కనిపించి, తనే భగవంతుడనని పేరుగాంచుచుండును. మాయ అవతార భగవంతుని ముందర అసలైన పరమాత్మ అవతారము కూడ తక్కువుగా ఉండును. అందువలన నిజమైన భగవంతుని జ్ఞానులు సహితము గుర్తించలేరు. కాని మాయా భగవంతుని అజ్ఞానులు సహితము గుర్తించగలరు. భూమి మీద ధర్మములు తెలియనపుడు, అనేక జన్మ సంస్కారపరులకు ధర్మములు అవసరమైనపుడు, వేల సంవత్సరములకో లేక లక్షల సంవత్సరములకో పరమాత్మ జన్మము ఎత్తవలసి వస్తున్నది. మాయ మాత్రము పరమాత్మ జన్మకు ముందు వెనుక అవతారమెత్తడమేకాక, పరమాత్మ భగవంతునిగ జన్మించినపుడు తాను కూడ మూడు నాలుగు చోట్ల జన్మించి, అందరిని తనవైపు ఆకర్షించుకొనుటకు ప్రయత్నించును. పరమాత్మ భగవంతునిగా ఏ దేశములో పుట్టునో మాయ కూడ అదే దేశములో పుట్టుచున్నది. పరమాత్మ ఏ ప్రదేశములో పుట్టునో, ఆ ప్రదేశమునకు చుట్టు ప్రక్కల మాయ మూడు లేక నాలుగు జన్మలు కలిగివుండును.
      (4 వ కామెంట్లో కంటిన్యూ అయింది)

  • @satyabangaru2236
    @satyabangaru2236 วันที่ผ่านมา

    ఓం నమో నారాయణాయ..